
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'పై ట్విటర్ ద్వారా స్పందించారు. పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై స్పందిస్తూ.. 'నేను కొంత మంది ఇడియట్స్ గురించి ఆలోచించను. ఇలాంటి ఇడియట్ పనులను చేయను' అంటూ వకీల్ సాబ్ పోస్టర్‌ను జతచేస్తూ వర్మ కామెంట్స్ చేశారు. అయితే.. ఆ పోస్టర్‌లో పవన్ కూర్చున్న స్టైల్‌లోనే కూర్చున్న వర్మ 'డైరెక్టర్ సాబ్' అంటూ టైటిల్ ఇవ్వడం గమనార్హం. కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: కిర్రాక్‌గా పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్