సినిమా పరిశ్రమలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఒక సంచలనం. హిట్, ప్లాప్ అనే సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను అభిమానులను విపరీతంగా ఆదరిస్తారు. పవర్‌స్టార్ సినిమాల ఫ్లాప్ ఎఫెక్ట్ అనేది కేవలం ఆ సినిమా వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత చేయబోయే సినిమా మీద చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. పవర్ స్టార్ కెరీర్‌లో ఇలా చాలాసార్లు జరిగింది. అందుకే సినిమాతో సంబంధం లేకుండా పవన్ మీద పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. సినిమాకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా భారీ మొత్తంలో చెల్లిస్తారు.
గత సినిమా ఫ్లాప్ తర్వాత కొన్ని కారణాల నేపథ్యంలో గ్యాప్ తీసుకోని వచ్చిన కూడా పవన్ రెమ్యూనరేషన్ మీద ఎలాంటి ప్రభావం పడకపోవడం మనం గమనించవచ్చు. గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే 5 నుంచి 10 కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న "వకీల్ సాబ్" సినిమాకు సుమారు రూ.50-55 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా లైన్ లో ఉండగానే క్రిష్ సినిమా మొదలుపెట్టేశాడు. అలాగే త్వరలో 'అయ్యప్పన్ కొషియమ్' రీమేక్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాను ఓకే చేసేసాడు. ఇలా పవన్ వరుసగా ఆరు సినిమాలు ఓకే చేసినట్లు సమాచారం. వీటిలో ప్రతి సినిమాకు రూ.50-60 కోట్లు చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతోపవన్ ఏకంగా రెమ్యూనరేషన్ రూపంలో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అందుకోనున్నారు. అభిమానులు మాత్రం తమ హీరో వరుసగా ఆరు సినిమాలు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment