సాయంత్రం వకీల్‌ సాబ్‌ బిగ్ అప్‌డేట్‌: రెడీయా? | Pawan Kalyan Vakeel Saab Release Date Doubtful | Sakshi
Sakshi News home page

సాయంత్రం వకీల్‌ సాబ్‌ బిగ్ అప్‌డేట్‌

Published Wed, Mar 24 2021 1:14 PM | Last Updated on Wed, Mar 24 2021 3:34 PM

Pawan Kalyan Vakeel Saab  Release Date Doubtful - Sakshi

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ మూవీతో బిగ్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ రానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తన ట్విటర్ ఖాతా‌లో పోస్ట్‌ చేసింది. 

ఈ రోజు సాయంత్రం (మార్చి 24న ) 5 గంటలకు ఓ‌ అప్‌డేట్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు పేర్కొంటూ ‘ది బిగ్గెస్ట్‌ అప్‌డేట్ ఈజ్‌ ఆన్‌ ది వే’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ అయ్యుంటుందంటూ అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవన్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరి ఆ అప్‌డేట్‌‌ ఏంటో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే మరి.

ఈ సమయంలో విడుదల చేస్తారా ? 
రాష్ట్రంలో కరోనా మళ్లీ  తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతోంది. దీంతో రద్దీ ప్రాంతాలలో ఒకటైన సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని, ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇటువంటి సమయంలో వకీల్‌ సాబ్ లాంటి భారీ సినిమాల విడుదలంటే వసూళ్ల పరంగా సినిమా కలెక్షన్ల పై పడే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాను అనుకున్న తేదీన విడుదల చేస్తారో లేక కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేస్తారో అన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు యథాతథంగా నడుస్తాయని క్లారిటీ ఇవ్వడంతో పవన్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement