
హైదరాబాద్ : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉగాదికి అసలైన పండగను ఆస్వాదించే వార్తను వకీల్‌సాబ్ చిత్రబృందం అందిస్తోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న వకీల్ సాబ్ ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ మూవీ ఫస్ట్‌లుక్‌కు పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ఫస్ట్‌లుక్‌లో పవర్‌స్టార్ లుక్ అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ కావడంతో పవర్‌స్టార్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్ బచన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ రీమేక్‌గా వకీల్‌సాబ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment