Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చి న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పవన్ సత్తా ఏంటో నిరూపించింది. అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని ప్రకటించింది.
దీంతో థియేటర్లు అన్ని మూతపడటంతో మూడు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో కూడా ఎక్కువ వ్యూస్‌ని సాధించి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లలో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానుల కరోనా వైరస్ మాత్రం బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ని ప్రకటిస్తున్నాయి. 50 శాతం అక్యుపెన్షీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనున్నాయి.దీంతో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీని దాదాపు 300 థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదే ఇదే కనుగా నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కి పండగనే చెప్పొచ్చు.
చదవండి:
‘శాకుంతలం’ అప్‌డేట్స్ : సెట్స్‌పైకి ఎప్పుడంటే..
ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment