
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. (త్రివిక్రమ్‌తో మరో సినిమా.. పవన్ ఆసక్తి?)
ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యాయవాది గెటప్‌లో న్యాయం కోసం కోర్టులో గట్టిగా వాదిస్తున్నట్టు కనిపించాడు. ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉన్న ఆ ఫోటో చూపరులను ముఖ్యంగా పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పవన్ స్టిల్ లీకవడం పట్ల చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా షూటింగ్ స్పాట్‌లో పవన్‌కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో చిత్ర బృందం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా లీకుల బెడద తప్పడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్)
Comments
Please login to add a commentAdd a comment