leaks
-
జూన్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి. వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది. -
సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు!
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డి భద్ర తలో ఉన్నతాధికారులు మార్పులు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద కూడా కొనసాగుతున్న భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యకలాపాలకు సంబంధించిన ప్రతీ సమాచారం బయటకు పొక్కుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత సీఎం వద్ద పనిచేసిన వారిలో ఇదివరకు కొద్ది మందిని మాత్రమే మార్చగా, ఇంకా చాలా మంది అదే సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు సంబంధించిన కీలక సమావేశ వివరాలు బయటకు వెళ్లడం, ఆయన భద్రతకు, పరిపాలన, ప్రభుత్వానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డి ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెవెళ్లిన అనంతరం భద్రతా సిబ్బందిని మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం భద్రతను చూసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాండ్ క్రూయిజర్లతో కొత్త కాన్వాయ్.. భద్రతాధికారులు సీఎంకు కొత్త కాన్వాయ్‌ని కూడా సమకూర్చారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నల్లరంగు కారులో వెళ్తే, ఆయన భద్రతా సిబ్బంది వాహనాలు వేరే రంగులో ఉండేవి. ఇలా సీఎం ప్రయా ణించే వాహనాన్ని సులభంగా గుర్తించడానికి వీలవడంతో.. ముప్పు ఉంటుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయన కాన్వాయ్‌లోని వాహన శ్రేణిని మొత్తం నల్లరంగులోకి మార్చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెల్లరంగున్న వాహన శ్రేణని వినియోగించేవారు. గత ప్రభుత్వ హయాంలోనే సీఎం కోసం తెల్లరంగు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి విజయవాడలో బుల్లెట్‌ప్రూఫ్ చేయించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నల్లరంగు వాహనాలంటే ఇష్టం కావడంతో, వాటి కలర్‌ను అధికారులు మార్చేశారని తెలిసింది. -
Apple iPhone 15 ప్రో మ్యాక్స్ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు
సాక్షి, ముంబై: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేస్తోందటే చాలు.. మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న యాపిల్ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. దీంతో ఐఫోన్ సిరీస్ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్ ఐఫోన్ లవర్స్‌ను ఊరిస్తోంది. ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్‌ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్‌ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం) ఉంటుందని టిప్పర్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్‌లో కీలక మార్పులు ఉంటాయని అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్‌కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్‌తో పవర్ఫుల్ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. The iPhone's main camera is improving every year, which is commendable, with 15pm approaching 1 ". iPhone 15 Pro Max :IMX903,≈1” iPhone 14 Pro:48MP, IMX803,1/1.28 iPhone 13 Pro:12MP,IMX703,1/1.63 iPhone 12 Pro:12MP, IMX603,1/1.78 iPhone 11 Pro:12MP, IMX503, 1/2.55 — Ice universe (@UniverseIce) April 23, 2023 -
నీటి వృథాకు సెన్సర్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్ఆర్ ఫేజ్–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు. అలారం మోతతో అప్రమత్తం ఫిల్టర్బెడ్ల నుంచి రిజర్వాయర్లకు శుద్ధి చేసిన జలాలను పంపింగ్ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది. అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సంబంధిత మేనేజర్‌తోపాటు రిజర్వాయర్ ఇన్చార్జికి సైతం ఫోన్‌కాల్ వెళ్తుంది. రిజర్వాయర్ నిండింది అంటూ వాయిస్‌కాల్ వెళ్తుంది. వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అయ్యే వరకు వాల్వ్‌ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది. నీటి వృథాను అరికట్టండి నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్ క్లీనింగ్, గార్డెనింగ్ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు) -
'ఫోటోలు,వీడియోలు తీసినచో సెల్‌ఫోన్ పగలగొట్టబడును'
Leaks From Pushpa Shooting Spot: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం అవుట్ డోర్ షూట్స్ ఉండటంతో లొకేషన్ స్పాట్‌కు వచ్చే ఫ్యాన్స్ రద్దీ కూడా ఎక్కువైందట. దీంతో వాళ్లను కంట్రోల్ చేయడం మూవీ టీంకు పెద్ద తల నొప్పిగా మారింది. ఇక మొదటినుంచి ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్, ఫైటింగ్స్ సీన్స్ లీకవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల పర్వాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇటీవలె అల్లు అర్జున్ రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో టిఫిన్ చేయడం దగ్గరి నుంచి వర్షం పడటంతో మూవీ టీం కాకినాడకు వెళ్లిన దృశ్యాలు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో లీక్స్‌ని అడ్డుకునేందుకు చిత్ర బృందం సరికొత్తగా ప్లాన్ చేసింది. షూటింగ్ స్పాట్లో ఫోటోలు, వీడియోలు తీసినచో సెల్‌ఫోన్ పగలగొట్టబడును అంటూ బోర్డులు పెట్టారు. అయినా సరే కొందరు మాత్రం వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇక పుష్ప లీక్స్‌ని ఆపడం ఎవరి వల్లా కాదేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. చదవండి : అపోలో ఆసుపత్రికి హీరో అల్లు అర్జున్.. Shooting at Kakinada Port Fight Scene🔥#Pushpa @alluarjun pic.twitter.com/jcE7MVv7IN — ALLU ARJUN ARMY MEDAK (@AAArmyMedak) September 14, 2021 #Pushpa Song Shoot 💥🔥🕺@AlluArjun #PushpaTheRise pic.twitter.com/e2Ag7wj8Pm — Rajesh Bunny™⛏️🥁💥 (@RajeshBunny654) September 14, 2021 -
పుష్ప నుంచి ఫైటింగ్ సీన్ లీక్..సినిమాకు ఇదే కీలకమట!
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా, మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా సినిమాలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడం చూస్తూనే ఉంటాం. ఇక పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్, పాటలు ముందే లీకైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప నుంచి దీని నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. ఇది ఆ సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందిస్తూ.. 'మా సినిమాలకు సంబంధించిన మెటీరియల్ ఒకదాని తర్వాత ఒకటి ఆన్లైన్లో లీక్ కావడం పట్ల చాలా నిరాశ చెందాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. త్వరలోనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు' అని ట్వీట్ చేసింది. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. We are deeply disturbed by the recent leaks of our movie material online. We condemn it and have lodged a complaint against the same in the cyber crime department. The culprits would soon be booked by the law. Please do not encourage piracy. - Team @MythriOfficial pic.twitter.com/FelB6ih0TD — Mythri Movie Makers (@MythriOfficial) August 15, 2021 -
పవన్ ‘వకీల్ సాబ్’: మరో లీక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. (త్రివిక్రమ్‌తో మరో సినిమా.. పవన్ ఆసక్తి?) ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యాయవాది గెటప్‌లో న్యాయం కోసం కోర్టులో గట్టిగా వాదిస్తున్నట్టు కనిపించాడు. ఎంతో ఇంట్రెస్ట్‌గా ఉన్న ఆ ఫోటో చూపరులను ముఖ్యంగా పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పవన్ స్టిల్ లీకవడం పట్ల చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా షూటింగ్ స్పాట్లో పవన్‌కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో చిత్ర బృందం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా లీకుల బెడద తప్పడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్) -
పైప్‌లైన్ లీక్,ఎగసిపడుతోన్న నీరు
-
పనామా దోషులకు శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీకైన పనామా పత్రాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజాల పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి. ఆ పేర్లను చూసి అరే! వీళ్లున్నారే అంటూ మనం ఆశ్చర్యపడుతున్నాం. చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పేర్లు వెలుగులోకి వచ్చిన వారు సమర్థించుకుంటున్నారు. ఇంతవరకు సరే! భారత్‌లో పన్నులు ఎగవేస్తూ పనామాలో నకిలీ కంపెనీల పేరిట కోట్లాది రూపాయలు దాచుకున్న బిగ్ షాట్స్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఆ అక్రమ డబ్బును వెనక్కి తీసుకొస్తుందా? అన్నది ప్రస్తుతం కోటానుకోట్ల రూపాయల ప్రశ్న. పనామా అంత పెద్ద సంఖ్యలో కాకపోయినప్పటికీ ఇంతకుముందు స్విస్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల జాబితాలు వెలువడ్డాయి. వాటి విషయంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కనీసం విచారణ ఏ దశలో ఉందన్న వార్తలు కూడా రావడం లేదే! అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల 70 వేలకోట్ల రూపాయలను భారత్‌కు రప్పిస్తామని బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ దిశగా ఇసుమంతా విజయం సాధించలేదే! అలాంటి బీజేపీ ప్రభుత్వం పనామా విషయంలో ముందుకు కదులుతుందా? అంబానీ, అదానీ లాంటి పెద్దల జోలికి వెళ్లే సాహసం చేస్తుందా ? కార్పొరేట్ దిగ్గజాలకు, ప్రభుత్వ పెద్దలకు మధ్యన సాన్నిహిత్యం సాగినంతకాలం, నీరా రాడియాలాంటి లాబీయిస్టుల కారణంగా కార్పొరేట్ సానుకూల చట్టాలు రూపొందినంతకాలం ఎన్ని అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా వ్యవస్థలో ఎలాంటి మార్పు కనిపించదు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తే పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుని అవినీతిపై చర్యలు తీసుకున్నామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. పనామా లీక్స్ విషయంలో కూడా సరిగ్గా స్పందిస్తామని, ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ట్రీటి అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగస్వామి అవడం మాట అటుంచి, కనీసం ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా కూడా స్పందించని పనామా ప్రభుత్వం పట్ల ఈ ట్రీటీ కింద ఎలా చర్యలు తీసుకుంటారో అరుణ్ జైట్లీకే తెలియాలి. పైగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ రూపొందించిన ఈ ఒప్పందంలోనే ఎన్నో లొసుగులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చర్యలు ఉంటాయో ఊహించవచ్చు. పనామాలాంటి అవినీతి కేసుల్లో దర్యాప్తు చాలావరకు అంతర్జాతీయ లేఖలు, ప్రత్యుత్తరాల వరకే పరిమితం అవుతుంది. తాము ఎంత చిత్తశుద్ధితో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా పని జరగడం లేదని, అందుకు అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డు వస్తున్నాయని భారత్ లాంటి దేశాలు సాకులు చెప్పి తప్పించుకోవడమూ సహజమే. అడ్డం పడుతున్న ఒప్పందాలు సవరించుకోవచ్చుగదా, వాటి కోసం చిత్తశుద్ధితో కృషి చేయవచ్చుగదా! పనామా చిట్టాల్లో బయటపడ్డ వారిలో ఎక్కువ మంది చట్ట నిబంధనల ప్రకారమే విదేశాల్లో వ్యాపార లావాదేవీలు నెరుపుతుండవచ్చు. చట్టప్రకారమే అయినప్పటికీ వాటిల్లో నైతికతపాలు ఎంతన్నది మనకు ముఖ్యం. నైతికత ఆధారంగా చట్టాలు రూపొందించినప్పుడు, దాని ఆధారంగానే న్యాయవ్యవస్థ తీర్పులు వెలువరించినప్పుడు మాత్రమే ఇలాంటి అంశాల్లో న్యాయం జరుగుతుంది. నైతికత మూలసూత్రంగానే చట్టాలు, శాసనాలతోపాటు ఆర్బీఐ నియంత్రణా వ్యవస్థలో మార్పులు వస్తేగానీ పనామా దోషులకు శిక్ష పడదు. చెట్టాపట్టాలేసుకొని నడుస్తున్న రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను విడదీసి సరైన చట్టాల రూపకల్పనకు మార్గం పడాలంటే, ప్రభుత్వ తీరులో పారదర్శకత కనిపించాలంటే ప్రజల్లో చైతన్యం రావడమే తక్షణ అవసరం. పనామా స్కామ్‌లోనే ఐస్లాండ్ ప్రధాన మంత్రిని గద్దె దించిన అక్కడి ప్రజల చైతన్యమే ప్రస్తుతం మనకు స్ఫూర్తికావాలి. -
శామ్ సంగ్ జెయింట్ టాబ్లెట్ టీజర్ లీక్!
మొబైల్ ఫోన్ల విభాగంలో దుమ్ము రేపుతున్న శామ్ సంగ్ మార్కెట్లోకి మరో సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించనుంది. యాపిల్ ప్రో ఐ-పాడ్ 12.9 ఇంచెస్ స్క్రీన్ కు దీటుగా.. శామ్ సంగ్ గెలాక్సీ 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో టాబ్లెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు గత సంవత్సర కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్ లైన్ లో లీక్ అయిన ఓ టీజర్... ఆ విషయాన్ని రూఢి చేస్తూ.. స్మార్ట్ ఫోన్ అభిమానులను ఉవ్విళ్ళూరిస్తోంది. ఆన్ లైన్ లో ఇప్పటికే లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే... 18.5 అంగుళాల జెయింట్ స్క్రీన్ తో గెలాక్సీ ట్యాబ్ అందర్నీ ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ అభిమానుల మనసు దోచుకుంటుండగా వారిని తనవైపు తిప్పుకొనేందుకు శామ్ సంగ్ కంపెనీ మార్కెట్లోకి అతి పెద్ద స్క్రీన్ తో జెయింట్ టాబ్లెట్ ను తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎఫ్ఏ బెర్లిన్ లో శామ్ సంగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీజర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆన్ లైన్ లో విడుదలైన టీజర్ ప్రకారం ఆ జెయింట్ టాబ్లెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తే... సుమారుగా లాప్ టాప్ ను తలపిస్తున్న టాబ్లెట్.. ఆకట్టుకునే నల్లని రంగులో ఉంది. దీనికి ఫోల్డబుల్ స్టాండ్ ను కూడ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టాబ్లెట్ పూర్తి వివరాలను అక్టోబర్ నెలలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కొన్ని సంస్థలు కూడ చెప్తున్నాయి. ఆన్ లైన్ టీజర్ ప్రకారం 451.8 మి.మీ. వెడల్పు, 275.8 మి.మీ పొడవు తోపాటు 11.9 మందంగా ఈ బ్లాక్ టాబ్లెట్ ఉంది. 18.4 అంగుళాల టీఎఫ్ టి ఎల్సీడీ స్క్రీన్, 1920x1080 రిజల్యూషన్ తో 8 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఈ పరికరంలో 2.1 మెగా పిక్సెల్ తో మరో కెమెరా ఉంది. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్జినోస్ 7 ప్రాసెసర్, 1.6 గిగాహెట్జ్ రన్నింగ్ కెపాసిటీ తోపాటు.. 2 జీబీ రాం కలిగి ఉంది. ఆ మెగా టాబ్లెట్ మార్కెట్లో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ సాంసంగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
ఇండస్ట్రీలో లీక్!