'ఫోటోలు,వీడియోలు తీసినచో సెల్‌ఫోన్‌ పగలగొట్టబడును' | Pushpa Team Not Controlled Leaks Of Pushpa shooting Spot | Sakshi
Sakshi News home page

Pushpa: ఆ ఫోటోను కూడా వదలని లీకు రాయుళ్లు..

Published Thu, Sep 16 2021 9:06 PM | Last Updated on Thu, Sep 16 2021 9:23 PM

Pushpa Team Not Controlled Leaks Of Pushpa shooting Spot   - Sakshi

Leaks From Pushpa Shooting Spot: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది.  ప్రస్తుతం అవుట్‌ డోర్‌ షూట్స్‌ ఉండటంతో లొకేషన్‌ స్పాట్‌కు వచ్చే ఫ్యాన్స్‌ రద్దీ కూడా ఎక్కువైందట. దీంతో వాళ్లను  కంట్రోల్‌ చేయడం మూవీ టీంకు పెద్ద తల నొప్పిగా మారింది. ఇక మొదటినుంచి ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్‌, ఫైటింగ్స్‌ సీన్స్‌ లీకవుతున్న సంగతి తెలిసిందే.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల పర్వాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇటీవలె అల్లు అర్జున్‌ రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో టిఫిన్‌ చేయడం దగ్గరి నుంచి వర్షం పడటంతో మూవీ టీం కాకినాడకు వెళ్లిన దృశ్యాలు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో లీక్స్‌ని అడ్డుకునేందుకు చిత్ర బృందం సరికొత్తగా ప్లాన్‌ చేసింది. షూటింగ్‌ స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు తీసినచో సెల్‌ఫోన్ పగలగొట్టబడును అంటూ బోర్డులు పెట్టారు.

అయినా సరే కొందరు మాత్రం​ వీటిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇక పుష్ప లీక్స్‌ని ఆపడం ఎవరి వల్లా కాదేమో అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ విడుదల కానుంది. 

చదవండి : అపోలో ఆసుపత్రికి హీరో అల్లు అర్జున్‌..

                         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement