న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి.
వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది.
దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment