Apple iPhone 15 Pro Max making use of Sony's new 48MP Camera: Report - Sakshi
Sakshi News home page

Apple iPhone 15 ప్రో మ్యాక్స్‌ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు

Published Mon, Apr 24 2023 2:58 PM | Last Updated on Mon, Apr 24 2023 4:17 PM

Apple iPhone 15 Pro Max making use of Sony new 48MP Camera report - Sakshi

సాక్షి, ముంబై:   టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ కొత్త ఐఫోన్‌ను లాంచ్‌ చేస్తోందటే చాలు.. మార్కెట్‌లో సందడి మామూలుగా ఉండదు.  ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో  కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ఐఫోన్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న యాపిల్‌ త్వరలోనే ఐఫోన్‌ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. దీంతో  ఐఫోన్‌ సిరీస్‌ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్‌ ఐఫోన్‌ లవర్స్‌ను  ఊరిస్తోంది.

ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్‌ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్‌ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్‌ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం)  ఉంటుందని టిప్పర్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. 

కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్‌లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్‌లో కీలక మార్పులు ఉంటాయని  అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్‌కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్‌తో పవర్‌ఫుల్‌ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్‌ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న  ఐఫోన్‌ 15 సిరీస్‌  ఈ ఏడాది  చివర్లో లాంచ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement