
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా, మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా సినిమాలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడం చూస్తూనే ఉంటాం. ఇక పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది.
పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్, పాటలు ముందే లీకైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప నుంచి దీని నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. ఇది ఆ సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందిస్తూ.. 'మా సినిమాలకు సంబంధించిన మెటీరియల్ ఒకదాని తర్వాత ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ కావడం పట్ల చాలా నిరాశ చెందాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. త్వరలోనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు' అని ట్వీట్ చేసింది. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
We are deeply disturbed by the recent leaks of our movie material online. We condemn it and have lodged a complaint against the same in the cyber crime department. The culprits would soon be booked by the law. Please do not encourage piracy.
— Mythri Movie Makers (@MythriOfficial) August 15, 2021
- Team @MythriOfficial pic.twitter.com/FelB6ih0TD
Comments
Please login to add a commentAdd a comment