పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేడు(మార్చి29) హోలీ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వకీల్‌సాబ్ రిలీజ్ విషయంలో చిత్ర నిర్మాత దిల్‌రాజ్ భారీ ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల తేదికి ముందు రోజు అర్థరాత్రి వైజాగ్‌లోని కొన్ని థియేటర్లలో 12 గంట నుంచి మూడు మిడ్‌నైట్ షోలను ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో ఈ టికెట్ ధర విషయంలో భారీ మొత్తంలో ఫిక్స్ చేశాడు నిర్మాత.
ఈ నేపథ్యంలో మిడ్‌నైట్ షోకు సంబంధించి ఒక్కో టికెట్ ధర ఏకంగా 1500 రూపాయలు నిర్ణయించారు. అంతేగాక ఉదయం బెనిషిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో మొదటి వారం టికెట్ ధర 200గా ఫిక్స్ చేశారు. టికెట్ల రేట్లు అధికంగా పెంచడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వకీల్ సాబ్ రికార్డు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరోవైపు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచడంతో వకీల్ సాబ్ సామాన్య ప్రేక్షకులకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు పవన్ ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడు.
కాగా ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment