వకీల్ సాబ్‌తో మూడేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పింక్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్‌లో మొదటగా పవన్ కల్యాణ్‌ను హీరోగా అనుకోలేదట. నందమూరి బాలకృష్ణ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించారట. దీంతో ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరకు తీసుకువెళ్తే బాలయ్య దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పేరును సూచించాడని, అలా దిల్ రాజు పవన్‌ను కలిసి వకీల్‌సాబ్‌కు ఒప్పించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌తోపాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం వకీల్‌సాబ్ టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' సినిమా చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. మరోవైపు పవన్.. క్రిష్ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment