
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘మగువా.. మగువా’ వీడియో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, మోహన భోగరాజు ఆలపించారు. తమన్ సంగీతం అందించారు.





Comments
Please login to add a commentAdd a comment