‘పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో టికెట్ దొరికాలి కానీ నా కంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండదు’ పవర్ స్టార్ అభిమానుల అందరి ఫీలింగ్ ఇది. పవన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది చాలా మంది అభిమానుల కలలు కంటుంటారు. టికెట్ దొరికితే చాలు.. ఆస్కార్ అవార్డు్ గెలిచినంత పొంగిపోతారు. నా అభిమానా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికింది అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఆ టికెట్‌ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ప్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజీ అది. పవన్ అన్న, ఆయన సినిమాలన్న పడి చచ్చేవారు లక్షల్లో ఉన్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల తర్వాత సినిమా వస్తే తొలి రోజు టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఒక వేళ వేలల్లో ఉన్నా కూడా ఫ్యాన్స్ కొనక ఊరుకుంటారా? చాన్సే లేదు. డబ్బులు ఎంతైనా టికెట్ కొనడం ఖాయం.
ఈ విషయం వకీల్ సాబ్ నిర్మాతలకు కూడా తెసులు. అందుకే తొలి మూడు రోజుల్లోనే వీలైనంత పిండుకోవాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమాటికెట్ ధరలను అమాంతం పెంచారని ప్రచారం జరుగుతుంది. నార్మల్ టికెట్ ధర రూ.200గా ఫిక్స్ చేశారట. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో వకీల్ సాబ్ బెనిఫిట్ షో వేయాలని చిత్ర బృందం భావిస్తుందట. ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడతాయి. దీని కోసం టికెట్ ధరను రూ.1500గా ఫిక్స్ చేశారని సమాచారం. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ టికెట్ ధరను ఎంత పెంచినా ఆలోచించరు. రూ.200 కాదు..2000 అయినా థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు.
ఇక వకీల్ సాబ్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినా పింక్ మూవీకి రీమేక్ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
చదవండి:
వకీల్ సాబ్ ట్రైలర్‌పై రామ్ చరణ్ కామెంట్
నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు
Comments
Please login to add a commentAdd a comment