Vakeel Saab Teaser Heighlights | Power Star Pawan Kalyan Vakeel Saab Teaser - Sakshi
Sakshi News home page

కేక పుట్టిస్తోన్న ‘వకీల్‌ సాబ్’‌ టీజర్‌.. ఆ డైలాగ్‌లో..

Published Thu, Jan 14 2021 7:02 PM | Last Updated on Fri, Jan 15 2021 9:07 AM

Power Star Pawan Kalyan Teaser Released On Sankranthi - Sakshi

పవర్‌ స్టార్‌ అభిమానులంతా ఎడాదిన్నరగా ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్‌ సాబ్’‌ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసి వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తమ అభిమాన నటుడి సినిమాను వెండితెరపై చూసేందుకు ఉత్సుకతతో ఉన్న వపన్‌ అభిమానులు ఈ టీజర్‌తో పండుగా చేసుకుంటున్నారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వకీల్‌ సాబ్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇందులో పవర్‌ స్టార్‌ తొలిసారిగా వకీల్‌గా భిన్న పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌లకు విశేషన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇందులో అడ్వకేట్‌ సూట్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో పవన కల్యాణ్‌ పెన్నుతో టిక్‌ టిక్‌ మనే శబ్ధం చేస్తూ.. చేతి వాచ్‌ను ఆయుధంగా వాడి కోర్టు సీరియస్‌గా వాదిస్తున్న సీన్‌ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొవచ్చు. ఇక మెట్రో రైల్‌లో.. కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే డైలాగ్‌ కేక పెట్టించేలా ఉంది. ఇళ్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుకెళ్తున్న వ్యాన్‌లో కుర్చుని పవన్‌ బుక్‌ చదవుతున్న సీన్‌తో టీజర్‌కు ఎండ్‌ పడింది. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమాపై పెరిగిన అంచనాలు టీజర్‌తో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. మొత్తానికి అజ్ఞాతవాసితో నిరుత్సాహపరిచిన పవర్ స్టార్‌ ‘వకీల్‌ సాబ్’‌తో కేవ్వు కేక పుట్టించనున్నాడంటూ ఆయన అభిమానులంతా కాలర్‌ ఎగిరేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement