
పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ అనుకోలేదని సినిమా కథకు తగ్గట్టుగా “మగువ” అని అనుకున్నామని తెలిపారు.
కానీ తర్వాత పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని “వకీల్ సాబ్” టైటిల్ ఫిక్స్ అయ్యామని తెలిపారు. ఇక ఈ టైటిల్‌తో వచ్చిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం చాలా సవాలుతో కూడుకున్న పని. అందులోనూ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్‌కి తగ్గట్టు, ఆయనకున్న విపరీతమైన ఫాలోయింగ్‌ని దృష్టలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని కమర్షియల్ అంశాలను జోడించినట్లు తెలిపారు. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఈ నెల 29న విడుదలయ్యే అవకావం ఉంది. ఏప్రిల్ 9న చిత్రం విడుదలకు సన్నాహాలు చేసున్నారు. అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 3న నిర్వహించనున్నారు.
( చదవండి : కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..! )
Comments
Please login to add a commentAdd a comment