‘వకీల్‌ సాబ్‌’‌ నుంచి మరో సాంగ్‌ విడుదల | Vakeel Saab Song Kanti Papa Released | Sakshi
Sakshi News home page

‘వకీల్‌ సాబ్‌’‌ నుంచి మరో సాంగ్‌ విడుదల

Published Wed, Mar 17 2021 5:37 PM | Last Updated on Wed, Mar 17 2021 6:25 PM

Vakeel Saab Song Kanti Papa Released - Sakshi

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’‌. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఎస్‌.ఎస్‌ తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం​ నుంచి కంటి పాప..కంటి పాప అనే పాట విడుదలయ్యింది.రామ జోగయ్యశాస్ర్తి రచించిన ఈ పాటను బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ పాడారు. సాంగ్‌ రిలీజ్‌ అయిన కాసేపట్లోనే వేలసంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించిన సమయం కాకుండా కొంచెం ఆలస్యంగా ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. టెక్నికల్‌ కారణాల వ‍ల్ల సాంగ్‌ రిలీజ్‌ కొంచెం ఆలస్యమవుతుందని చిత్ర బృందం ఇది వరకే  ప్రకటించింది. 


ఇక బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.  శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

చదవండి :  (పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌.. ఫొటో వైరల్‌)
(ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా : హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement