పవన్‌ సినిమా.. నన్నెవరూ కలవలేదు | Pawan Kalyan Krish Telugu Movie Latest Update Viral In Social Media | Sakshi
Sakshi News home page

పవన్‌ సినిమాపై స్పందించిన కోలీవుడ్‌ స్టార్‌

Published Sun, May 3 2020 10:22 PM | Last Updated on Sun, May 3 2020 10:28 PM

Pawan Kalyan Krish Telugu Movie Latest Update Viral In Social Media - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే15న విడుదలై క్రిష్‌ పీరియాడికల్‌ చిత్ర షూటింగ్‌ ప్రారంభమయ్యేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ పనులకోసం  వినియోగించుకుంటున్నారు. 

పవన్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీలో ఓ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం కోలీవుడ్‌ స్టార్‌ శివకార్తీకేయన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ కోలీవుడ్‌ హీరో సన్నిహితులు స్పందించారు. పవన్‌ సినిమా గురించి శివకార్తీకేయన్‌ను ఎవరు స్పందించలేదని, ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో అతడు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టతరావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఈ చిత్రంలో బందిపోటుగా పవన్‌ కనిపించనున్నారని లీకువీరులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్‌ పాత్ర పేరు వీరు అని అందుకే ‘విరూపాక్ష’ అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని క్రిష్‌ భావిస్తున్నారని మరో వార్త వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నట్లు సమాచారం. 

చదవండి:
రాజమౌళికి రిక్వెస్ట్‌.. ఏం చేస్తారో చూడాలి
భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement