మార్చి8న ‘వకీల్‌ సాబ్‌’ సర్‌ప్రైజ్‌! | Pawar Star Vakeel Saab Movie Unit Release Song Promo | Sakshi
Sakshi News home page

‘వకీల్‌ సాబ్‌’ నుంచి చక్కని మెలొడీ ప్రోమో

Published Fri, Mar 6 2020 5:51 PM | Last Updated on Fri, Mar 6 2020 6:28 PM

Pawar Star Vakeel Saab Movie Unit Release Song Promo - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘వకీల్‌ సాబ్‌’ చిత్ర యూనిట్‌ స్త్రీమూర్తులకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వనుంది. మహిళల గొప్పదనాన్ని తెలియజెప్పే..  ‘మగువా మగువా’ పాటను మార్చి 8 న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం శుక్రవారం తెలిపింది. ఈమేరకు ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ చరణాలతో సాగే పాట ప్రోమోను విడుదల చేసింది. కాగా, ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం 'పింక్‌' చిత్రానికి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. 
(కిర్రాక్‌గా పవన్‌ 'వకీల్‌ సాబ్‌' ఫస్ట్‌ లుక్‌)

ఇక చాలా కాలం తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’గా వస్తుండటంతో అంచానాలు భారీగా నెలకొన్నాయి. గత సోమవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. పవన్‌కు ఇది 26వ సినిమా  కావడం విశేషం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై వకీల్‌ సాబ్‌ను నిర్మిస్తున్నాడు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సంగీతం తమన్‌ అందిస్తున్నాడు.
(వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌ లుక్‌పై స్పందించిన వర్మ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement