వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ లాంఛ్‌.. ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ | Pawan Kalyans Fans Chaos At Vakeel Saab Trailer Launch Many Of Them Injured | Sakshi
Sakshi News home page

అద్దాలు పగలకొట్టుకొని లోపలికి తోసుకెళ్తూ.. వీడియో వైరల్‌

Published Tue, Mar 30 2021 10:55 AM | Last Updated on Tue, Mar 30 2021 1:45 PM

Pawan Kalyans Fans Chaos At Vakeel Saab Trailer Launch Many Of Them Injured - Sakshi

విశాఖపట్నం : పవన్‌  కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అ‍ంచనాలు నెలకొన్నాయి. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది.


ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో థియేటర్‌లో ట్రైలర్‌ను చూసేందుకు పవన్‌ ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ, అద్దాలు పగలకొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో పలువురు పవన్‌ అబిమానులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి మీరు వర్జినా?: వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌
‘వకీల్‌ సాబ్’‌ హవా.. అంబరాన్నంటిన టికెట్ల ధరలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement