
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పవన్ కల్యాణ్ అభిమానులు అరాచకం సృష్టించారు. బ్రో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తమ నాయకుడిలానే ఊగిపోతూ రచ్చరచ్చ చేశారు. జగదాంబ థియేటర్‌లో అద్దాలు పగుల గొట్టి బీభత్సం సృష్టించారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే.
కాగా, గత నెలలో తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయత్నించగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో పవన్ అభిమానులు రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారు.
చదవండి: ‘పవన్.. ఈ తరహా చర్యల వల్ల మీ టీచర్లు కూడా సిగ్గు పడతారు’