
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఏకంగా ముష్టి యుద్దానికి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి సినిమా స్టైల్లో దాడికి దిగారు. గోపాలపట్నం బాజీ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలు అభిమానుల మధ్య గొడవకు కారణాలు తెలియలేదు కానీ.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒక్కసారిగా రోడ్డు మీద జరుగుతున్న కొట్లాటతో స్థానికులు విస్తుపోయారు. వీరిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా.. పట్టించుకోకుండా రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. విద్యార్ధుల కొట్లాట కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.
విశాఖపట్నంలో నడిరోడ్డుపై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు. pic.twitter.com/ujyKm8CA4D
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024