fans fighting
-
విశాఖలో రెచ్చిపోయిన పవన్ అభిమానులు.. నడిరోడ్డుపై కొట్లాట
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఏకంగా ముష్టి యుద్దానికి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి సినిమా స్టైల్లో దాడికి దిగారు. గోపాలపట్నం బాజీ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు అభిమానుల మధ్య గొడవకు కారణాలు తెలియలేదు కానీ.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒక్కసారిగా రోడ్డు మీద జరుగుతున్న కొట్లాటతో స్థానికులు విస్తుపోయారు. వీరిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా.. పట్టించుకోకుండా రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. విద్యార్ధుల కొట్లాట కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.విశాఖపట్నంలో నడిరోడ్డుపై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు. pic.twitter.com/ujyKm8CA4D— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024 -
‘ఇదేం అభిమానం!’ బిగ్‌బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
'మీకేమైనా పిచ్చా.. ఎందుకలా కొట్టుకుంటారు'
ఢిల్లీ : భారత క్రికెట్ అభిమానుల మధ్య గొడవలు జరగడం అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా కొల్హాపూర్‌లో ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ పెద్దగా మారి ఒక వ్యక్తిని చెరుకుతోటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ గొడవలో గాయపడిన వ్యక్తి ధోని అభిమానా లేక రోహిత్ అభిమానా అనేది తెలియదు. తాజాగా దీనిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. Kya karte rehte ho paagalon. Aapas mein players are either fond of each other or just don't talk much, kaam se kaam rakhte hain. But kuchh fans alag hi level ke pagle hain. Jhagda Jhagdi mat karo, Team India ko- as one yaad karo. pic.twitter.com/i2ZpcDVogE — Virender Sehwag (@virendersehwag) August 23, 2020 'మీకు ఏమైనా పిచ్చా.. మేమంతా జట్టుగా కలిసి ఉండి దేశం కోసం ఆడతాం.. ఒకరికి ఒకరం పెద్దగా మాట్లాడకపోయినా.. ఎవరిపని వారు చేసుకుంటూనే గెలుపుకోసం ఎదురుచూస్తుంటాం. కొందరు అభిమానులు మాత్రం ఇలా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆటగాళ్లను వేరుగా చూడొద్దు.. టీమిండియాను మాత్రమే చూడండి..ఇక మీదట అభిమానుల మధ్య ఇలాంటి గొడవలు జరగొద్దు ' అంటూ వీరు సీరియస్‌గా చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెహ్వాగ్ చెప్పింది నిజం.. ఎందుకలా కొట్టుకుంటారు.. వారు దేశం కోసం ఆడుతుంటే మధ్యలో మీ లొల్లేందిరా అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి : కోహ్లికి కితాబిచ్చిన సునీల్ గావస్కర్ అభిమానుల మనసు గెలుచుకున్న ధోని -
స్టేడియంలో గొడవ; ఛీకొట్టేలా ఫ్యాన్స్ ఘర్షణ
లీడ్స్ : అఫ్గాన్, పాక్ అభిమానుల చేష్టలతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆటను ఆస్వాదిస్తూ తమవాళ్లకు మద్దతుగా నిలవాల్సిందిపోయి.. వీధిరౌడిల్లా కొట్టుకోవడంతో ఆయా దేశాలకు తలవంపులు తెచ్చారని క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. స్థానిక మైదానంలో శనివారం అఫ్గాన్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని పాక్ 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, మ్యాచ్‌కు ముందు ఇరుదేశాల అభిమానుల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం అనంతరం కూడా కొనసాగింది. మ్యాచ్ జరగుతున్న క్రమంలో రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో స్టేడియం బయట కూడా ఘర్షణ చెలరేగింది. అక్కడా అభిమానులు పరస్పర దాడులకు దిగారు. స్టేడియం వెలుపల ఉన్న ఆస్తులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. వరల్డ్‌కప్ మిగతా మ్యాచ్‌లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్ మద్దతుదారు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అభిమాని కుటుంబం కోసం తిరుపతికి పవన్!
హైదరాబాద్: కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం పరామర్శించనున్నారు. సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్ ఆదివారం హత్యకు గురయ్యాడు. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వినోద్‌కుమార్ స్వస్థలం తిరుపతి. వినోద్ హత్య గురించి తెలియడంతో ఆవేదన చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు. గురువారం తిరుపతి వెళ్లి వినోద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న గొడవలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్ కుమార్ (24) హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆదివారం కోలారు నగరంలో నిర్వహించిన అవయవదానం కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి వినోద్ కుమార్ తన మిత్రుడు త్రినాథ్‌తో కలసి కారులో కోలారు వచ్చాడు. ఈ సందర్భంగా అవయవ దానం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరిస్తామని వినోద్‌కుమార్ చెప్తూ.. తన అభిమాన నటుడికి జై కొట్టాడు. దీనికి మరో హీరో అభిమాని అయిన సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. అనంతరం మిత్రులంతా నరసాపురం వద్ద ఉన్న హోటల్ గేట్స్ గ్రాండ్‌కు వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో సునీల్ వెంట వచ్చిన అక్షయ్‌కుమార్ తన వద్ద ఉన్న కత్తితో వినోద్‌కుమార్‌ను పొడిచాడు. మిత్రులు వినోద్‌ను కారులో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోలీసులు నిందితుడు అక్షయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.