సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదేం అభిమానం!
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
Comments
Please login to add a commentAdd a comment