SAJJANAR
-
ఆ గాత్ర మధురం!
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే చూపులేని ఓ బాలుడి పాటకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంత్రముగ్ధుడయ్యారు. ఓ బస్సులో కూర్చుని చేతులతో దరువేస్తూ ఆ బాలుడు పాడిన పాట ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో బాలుడి పాట వీడియోను పోస్టు చేసి.. తెలుగు సినిమా పరిశ్రమలో అతడికి ఎవరైనా అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. ఆ బాలుడికి ఆహా ఇండియన్ ఐడల్ 4వ సీజన్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. బాలుడితో కలిసి తాను ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆహా టీంను ఆదేశించారు. బాలుడికి అద్భుతమైన ప్రతిభ ఉందని కితాబిచ్చారు. దేవుడు అప్పుడప్పుడూ కఠినంగా వ్యవహరించినా.. ఇలాంటి వారిని ఎంతో ప్రత్యేకంగా చూసుకునేందుకు మంచి మనుషులు ఉండనే ఉన్నారని పేర్కొన్నారు. -
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
సజ్జనార్ సార్.. ఆ స్టూడెంట్స్ బాధ చూడుండ్రి
-
TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.ఈ విషయమై సోమవారం(అక్టోబర్14) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. టికెట్ ధరలు పెంచారన్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ‘ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోంది. జీవో నెంబర్ 16 ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించింది.రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు లేదు.స్పెషల్ బస్సుల్లో డీజిల్ ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు జీవో నెంబర్ 16 ప్రకారం’ఉంది అని సజ్జనార్ తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణ గ్రూప్1పై హైకోర్టు తీర్పు రేపు -
చిన్నారికి జీవితకాలం ఉచిత బస్సు పాస్
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి స్టాఫ్‌నర్సు సహాయంతో కండక్టర్ సుఖ ప్రసవం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న ఈ చిన్నారికి జీవితకాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గద్వాల మండలంలోని కొండపల్లికి చెందిన గర్భిణి సంధ్య సోమవారం రాఖీ పండుగ కోసం ఆర్టీసీ బస్సులో వనపర్తికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో మార్గమధ్యలోనే కండక్టర్ భారతి స్టాఫ్‌నర్సు అలివేలు సహాయంతో సుఖ ప్రసవం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో కండక్టర్ భారతి, స్టాఫ్‌నర్సు అలివేలు, బస్సు డ్రైవర్ అంజిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళకు ప్రసవం చేసేందుకు సహకరించిన స్టాఫ్‌నర్సు అలివేలుకు ఏడాదిపాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో రవీందర్, సిబ్బంది మునిశేఖర్, కృష్ణకాంత్, శ్రీదేవి, జ్యోతి, గద్వాల డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ భారతి.. కండక్టర్‌కు సజ్జనార్ అభినందనలు
మహబూబ్ నగర్, సాక్షి: రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిజేశారు. ‘ కండక్టర్ సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం’అని ఎక్స్‌లో పేర్కొన్నారు.రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసి బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024 -
గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీలను హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే. గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు. శిశువుకు బర్త్ సర్టిఫికెట్ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకోవాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్ ద్వారా బేబీ ఆఫ్ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ ఇప్పించారు. -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
Hyderabad: బస్సులు లేక హైదరాబాద్ లో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు నరకం
-
Sajjanar: ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగటం దురదృష్టకరం
సాక్షి, హైదరాబాద్: పదే పదే హెచ్చరిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని, ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అన్నారు. ‘తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఇద్దరు ఫరూక్నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్‌పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్‌తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగింది. డ్రైవర్ షేక్ అబ్దుల్‌కి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని సజ్జనార్ తెలిపారు. పదే పదే హెచ్చరిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరం. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా #Hyderabad ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్… pic.twitter.com/qSgAk4zTYy — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 5, 2024 -
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: ► సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్‌ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి. ► మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్ లేబర్ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్ సేవింగ్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్ సేవింగ్ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్‌గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. బ్యాంకుల మధ్య పోటీతో పెంపు బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో.. ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు. -
TSRTC: అలాంటి వారిని సహించం.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024 ఇదీ చదవండి: నాంపల్లి: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ -
‘ఒరిజినల్ ఆధార్’ తప్పనిసరి..
సాక్షి హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించు కోవాలంటే ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గుర్తింపుకార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ‘ఎక్స్’వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్‌కార్డు మాత్రం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పాన్‌కార్డుపై అడ్రస్ ఉండదని, అందువల్ల ఆ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫొటో కాపీలు, కలర్ జీరాక్స్ చూపిస్తున్నారన్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపుకార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. వాదనలకు దిగొద్దు... ’ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం’అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని ఇది సరికాదని ఆయన తెలిపారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వారవుతారని వివరించారు. అందువల్ల ప్రతి మహిళ జీరోటికెట్ తీసుకోవాలని. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే సదరు మహిళ నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని తట్టుకునేందుకు అదనంగా 4,484 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇది గతేడాది సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే దాదాపు 200 అదనం. కానీ, తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,500 ప్రత్యేక బస్సులు అవసరమని గుర్తించినప్పటికీ, కేవలం 600 సర్వీసులను మాత్రమే తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉండటంతో బస్సులో విపరీతమైన రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఉన్న బస్సులు సరిపోవటం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు అందే అవకాశం లేకపోవటంతో పండగ ప్రత్యేక బస్సుల్లో సింహభాగం తెలంగాణ ప్రాంతంలోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీకి నడిపేందుకు చాలినన్ని బస్సులు లేకపోవటంతో, డిమాండులో సగానికంటే తక్కువ బస్సులతోనే సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. 626 సర్విసులకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పుడు నడిపే 4,484 ప్రత్యేక బస్సుల్లో 626 సర్విసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి నేపథ్యంలో, సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో కూడా రద్దీ విపరీతంగా ఉండనున్నందున.. ఎక్కువ ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రత్యేక బస్సుల నిర్వహణ, ‘మహాలక్ష్మి’రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నందున ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా జమయ్యే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో నీడ కోసం షామియానాలు, మంచినీటి వసతి, కుర్చిలను సిద్ధం చేయాలని, ప్రయాణికుల సందేహాలను తీర్చే వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రద్దీ ప్రాంతంలో ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఎలాంటి చార్జీ ఉండదని, సాధారణ టికెట్ చార్జీలే వర్తిస్తాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 1,450 సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ సర్విసులకు అదనంగా 1,450 బస్సులు తిప్పుతున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 10 నుంచి 13 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇవి తిరుగుతాయని పేర్కొన్నారు. వీటిల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తారని, ఎలాంటి అదనపు చార్జీలుండవని తెలిపారు. రద్దీ నేపథ్యంలో 11వ తేదీ నుంచి 13 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు , మాచర్ల వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌కు బదులు, దాని ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఎస్ (గౌలిగూడ బస్టాండు)లో ఆగుతాయని వెల్లడించారు. -
‘అద్దె బస్సు’ డిమాండ్లు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వారం రోజుల్లో నివేదికను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక రద్దీ విపరీతంగా పెరగటంతో ఐదు రకాల సమస్యలు ఎదురవుతు న్నాయని, వాటిని పరిష్కరించాలంటూ కొద్దిరోజులుగా అద్దె బస్సు యజ మానులు కోరుతున్నారు. అయినా ఆర్టీసీ స్పందించటం లేదని ఆరో పిస్తూ శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గురువారం ఉదయం అద్దె బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే ఎండీతో మాట్లాడి, సంఘం ప్రతినిధులతో చర్చించాలని స్పష్టం చేశారు. చర్చలు జరిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంత్రి ఆదేశాల మేరకు బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి సంఘం ప్రతినిధులతో చర్చించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువై డీజిల్ వినియోగం పెరిగినందున కేఎంపీల్ను జిల్లా సర్వీసుల్లో 4.50కి, సిటీలో 4కు మార్చాలని, టైర్లు ఎక్కువగా అరుగుతున్నందున ఆర్టీసీకి అందించే బల్క్ ధరలకే తమకూ కొత్త టైర్లు కేటాయించాలని, ఓవర్ లోడింగ్‌తో నిర్వహణ ఖర్చులు పెరిగినందున అద్దె మొత్తాన్ని రూ.3 చొప్పున పెంచాలని వారు కోరారు. దీనిపై కమిటీ వేసి అమలు సాధ్యాసాధ్యా లపై నిర్ణయం తీసుకుంటామని ఎండీ సజ్జనార్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు సమ్మె ప్రతిపాదనను సంఘం ప్రతినిధులు విరమించుకున్నట్టు సమావేశానంతరం ఎండీ ప్రకటించారు. యధావిధిగా బస్సులు నడుస్తాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్, అధికారులు మైపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహా పలువురు బస్సు యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
TSRTC: రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ పరామర్శ -
టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జనవరి 1) వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేయనునట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది.. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’’ అని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023 -
మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి
-
TS: ఉచిత ప్రయాణం ఎఫెక్ట్.. ఆర్టీసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం పడింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిలళకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. TSRTC is inviting applications from entrepreneurs for the supply of various types of city buses under the Hire Scheme in the Greater Hyderabad zone. Prospective entrepreneurs may visit our website at https://t.co/r7jl9XZYI0 for details or contact 9100998230. @TSRTCHQ @PROTSRTC pic.twitter.com/oTbFhTndxE — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 22, 2023 దీంతో స్పందించిన టీఎస్ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అసక్తి ఉన్న వారు http://tsrtc.telangana.gov. లేదా మొబైల్ నంబర్: 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలర్, సీట్లు, తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మీ పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభించిందని.. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసి ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్లలో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. చదవండి: TS: ఉదయం 4.30 నుంచే ప్రజావాణి.. ఫిర్యాదుల్లో ఎక్కువగా ఏమున్నాయంటే -
‘ఇదేం అభిమానం!’ బిగ్‌బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
TS: రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రేపటి(శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు టీఎస్ఆర్టీసీ సీఎండీ సజ్జనార్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ‘మహాలక్ష్మీ స్కీమ్’ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా జీరో అమౌంట్ టికెట్‌తో ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాలుగైదు రోజులు గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చుని తెలిపారు. ప్రయాణీకుల సంక్షేమం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ ప్రయాణం మంచి స్కీమ్ అని కొనియాడారు. స్కీమ్‌తో ఆర్టీసీకి ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారని వెల్లడించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతం 7290 బస్సులు ఉన్నాయని, రోజు ఆదాయం 14 కోట్ల వరకు వస్తోందని తెలిపారు. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో 50 శాతం ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు. తగ్గే ఆదాయంపై ప్రభుత్వ సహాయంకై విజ్ఞప్తి చేశామని చెప్పారు. -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
TSRTC Gamyam App: ఇక టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్
హైదరాబాద్: సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో ముందుడుగు వేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్ ట్రాకింగ్ యాప్‌నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రారంభించారు. యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారికి కూడా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందన్నారు. రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని, ప్రతి రోజు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థ మార్కెట్ లోని పోటీని దీటుగా ఎదుర్కోనేందుకు ఈ మధ్యకాలంలో అత్యాధునిక హంగులతో కూడిన 776 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఆపై యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. “ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడింది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం. ‘గమ్యం’ యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ఏఏ బస్సులు ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. సిటీ బస్సులకు రూట్ నంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో పసిగట్టొచ్చు. దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ నంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేయొచ్చు. ఈ యాప్ ద్వారా సమీపంలోని బస్టాప్ లను తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తెలిపారు. మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఏ బస్’ ఫీచర్ మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న టీఎస్ఆర్టీసీ.. వారి సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేయడం జరిగింది. ఈ సదుపాయంతో యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండిలా.. 'TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గమ్యం యాప్ ను ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్ స్టాల్ చేసుకుంటే అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ తీసుకువచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆదరించి, ప్రోత్సహించారు. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ ను అలానే ఆదరించాలని సంస్థ కోరుతోంది. ఈ యాప్ పై ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. గమ్యం యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఇ.డి (హైదరాబాద్ జోన్) శ్రీ ఎ.పురుషోత్తం, ఇ.డి (ఎ) కె.కృష్ణకాంత్, ఇ.డి (గ్రేటర్ హైదరాబాద్) వి.వెంకటేశ్వర్లు, జెడి (వి అండ్ ఎస్) సంగ్రామ్ సింగ్ పాటిల్, డిజిటల్ ఐటీ కన్సల్టెంట్ శ్రీమతి దీపా కోడూర్, మ్యాప్ మై ఇండియా (ఎం.ఎం.ఐ) హర్మన్ సింగ్ అరోరా, చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ శ్రీమతి విజయ పుష్ప, సి.ఇ (ఐటీ) శ్రీ రాజశేఖర్, రంగారెడ్డి ఆర్.ఎం. శ్రీధర్, తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
పల్లెవెలుగు బస్సుల్లో టీ9 టికెట్
సాక్షి, హైదరాబాద్: పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా టీ9 పేరుతో కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణ చార్జీ భారాన్ని కొంతమేర తగ్గించే ఈ టికెట్లను ఆదివారం నుంచి అమలులోకి రానుంది. పల్లె వెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివి ప్రయాణించేవారు రూ.100 చెల్లించి ఈ టీ9 టికెట్ కొంటే, అప్ అండ్ డౌన్‌కు అదే వర్తిస్తుంది. విడిగా మరో టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. 60 కి.మీ. పరిధి దాటితే మాత్రం ఇది వర్తించదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ వెసులుబాటు ఉంటుంది. పల్లెవెలుగు బస్సుల్లో 60 కి.మీ. నిడివికి రెండువైపులా (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి దాదాపు రూ.120 టికెట్ చార్జి అవుతుంది. ఒకేసారి టీ9 టికెట్ కొంటే రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కనీసం రూ.20 ఆదా అవుతుంది. ఆ ప్రయాణ మార్గంలో టోల్గేట్ ఉంటే టికెట్‌పై రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టీ9 టికెట్‌తో టోల్ చార్జి భారం కూడా ఉండదు. మొత్తంగా రూ.40 ఆదా అయినట్టవుతుంది. ఆటోల దూకుడుకు కళ్లెం చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు విపరీతంగా పెరిగిపోయి, బస్సు ప్రయాణికులను ఎగరేసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ టికెట్ రూపంలో కనీసం రూ.20 ఆదాతో ఆటో తాకిడి నుంచి బయటపడేందుకు యత్నించనుంది. వెళ్లేప్పుడు ఓ పల్లెవెలుగు బస్సులో ఈ టీ9 టికెట్ కొంటే, వచ్చేప్పుడు మరో పల్లెవెలుగు బస్సులో దాన్ని విని యోగించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దాన్ని ఆ మార్గంలో ఒకే ప్రయాణానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది. మహిళలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం చూపి ఈ వెసులుబాటు పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 6తో ఈ అవకాశం ముగియనున్నందున కండక్టర్లు సాయంత్రం 4 వరకు మాత్ర మే ఆ టికెట్లు జారీ చేస్తారు. కాగా, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వృద్ధులు, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పిం చేలా ఈ కొత్త టికెట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో ఈ టికెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టికెట్‌కు సంబంధించిన సమాచారం కావాలనుకునేవారు ఆర్టీసీ కాల్‌సెంటర్ (ఫోన్ నెంబర్లు 040–6944 0000, 040–23450033)ను సంప్రదించొచ్చని సజ్జనార్ తెలిపారు. -
ఆర్టీసీ.. టార్గెట్ మండే
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారాల్లో వివిధ పనులపై వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రతి సోమవారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వారా టికెట్ ఆదాయం అధికంగా వచ్చేలా చర్యలు ప్రారంభించింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేసిన కసరత్తు సత్ఫలితం ఇవ్వడంతో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రత్యేక కసరత్తు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. దీంతో ఈ సోమవారానికి సంబంధించి కూడా ఆదివారం నుంచే కసరత్తు ప్రారంభించారు. డిపోల్లోని స్పేర్ బస్సులన్నింటినీ రోడెక్కించడంతోపాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు. ఇక సర్వీసులను అటూఇటూ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో ఎక్కువ బస్సులు తిప్పేందుకు రూట్లను మారుస్తున్నారు. గత సోమవారం 73 డిపోల లాభార్జన గత సోమవారం అంటే.. మే 15న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రూ. 20 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో సమకూరింది. గత సంవత్సర కాలంలో సంక్రాంతి ముగిసిన మర్నాడు, హోలీ రోజుల్లోనే ఇలా రూ. 20 కోట్లు చొప్పున ఆదాయం లభించింది. కానీ ఇప్పుడు ఎలాంటి పండుగలు లేకున్నా సాధారణ రోజునే అలా రూ. 20 కోట్ల ఆదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో రికార్డే. మే 15న ట్రాఫిక్ రెవెన్యూకు ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్, టోల్ సెస్‌లను కలపడం ద్వారా ఈ మొత్తం రికార్డయింది. టార్గెట్‌ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతంగా నమోదైంది. అధికారులు చేసిన ప్రత్యేక కసరత్తు వల్ల సాధారణ సోమవారాల్లో వచ్చే ఆదాయం కంటే దాదాపు రూ. 3 కోట్లు అదనంగా వచ్చింది. 96 డిపోలకుగాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జించాయి. -
పర్యావరణ హితం, సౌకర్యవంతం.. ఈ–గరుడ ఎలక్ట్రిక్ వాహనాల ముఖ్య ఉద్దేశం ఇదే
మియాపూర్: కాలుష్య నివారణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే ఈ– గరుడ ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ– గరుడ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ.. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని బస్టాప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం కోసం ఎలక్ట్రికల్ వాహనాలను టీఎస్ఆర్టీసీ విస్తరిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 1300 బస్సులు హైదరాబాద్ సీటీలో, 550 సదూర ప్రాంతాలలో నడుపుతామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలకు సంబంధించిన యూనిట్లకు అమర్‌రాజా సంస్థతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో శంఖుస్థాపన చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించామని, అందులో ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించామని, విడతల వారీగా మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా.. కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు వాహనాలను తట్టుకోవడం ఆర్టీసీకి కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ వాహనాలను తట్టుకోవడం ప్రైవేటుకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆర్టీసీ నడుస్తోందని తెలిపారు. కొత్త కారులలో ఉండే ఆధునిక సదుపాయాలు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగిందని, నియంత్రించేదుకు బస్సు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వీడియో: ఇది సజ్జనార్ మార్క్.. యువకుడికి మంచి చెబుతూనే.. ఆర్టీసీ ఎండీగా వార్నింగ్ కూడా
-
Hyderabad: ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఆర్టీసీ టి–24 టికెట్లపై మరో రాయితీని ప్రకటించింది. గ్రేటర్లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రూ.100 ఉన్న టి–24 టికెట్ ధరలను రూ.90కు తగ్గించింది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు టికెట్లు రూ.80కే లభిస్తాయి. వారికి 20 శాతం రాయితీ వర్తించనుంది. వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గురువారం నుంచే ఈ రాయితీలు అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. టి–24 టికెట్లపై సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించవచ్చు. మొదట్లో ఆ టికెట్ ధర రూ.120 వరకు ఉండేది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 100కి తగ్గించారు. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి–24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎండాకాలంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ రాయితీని కల్పిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ టికెట్లకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం రూ.50కే లభించే టి–6 (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు) టికెట్లకు కూడా మంచి ఆదరణ ఉందన్నారు. -
ప్రయాణికులతో మర్యాదగా మెలగండి ! ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హితవు
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు సజ్జనర్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా.. ఈ శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. "మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి." అని కండక్టర్లకు సజ్జనర్ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి." అని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు. ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కాగా, టాక్ట్ పేరుతో తమకు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, ఓఎస్డీ(ఐటీ అండ్ డీ) యుగంధర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్రం మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. వర్షాలకు అవకాశం) -
ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటీ పోటీని తట్టుకునేలా, సంస్థను లాభాలబాట పట్టించేలా ఆర్టీసీ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అనువైన విధానాల కోసం వెతుకుతోంది. అందులో భాగంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. గురువారం ఇక్కడి బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్విసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్‌ను త్వరలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్విస్‌లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సర్విస్ ప్రారంభమయ్యే గంటముందు వరకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్నరోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తుచేశారు. సంస్థ అధికారిక వెబ్సైట్ www. tsrtconline. in లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు గోవర్దన్, సజ్జనార్ తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ అంటే... ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణచార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్డ్ డేటా అనాలసిస్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు. ఈ విధానంవల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణచార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది. -
అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష.. జేడీ సంగ్రామ్‌కు సజ్జనార్ అభినందన
హైదరాబాద్: 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ప్రశంసించారు. కెరిర్ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు. "పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్‌గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చొరవ ప్రశంసనీయం." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు. చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్, రాజేంద్ర కుమార్, హరిగోపాల్, కానిస్టేబుల్ హనుమంతరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ (ఐటీ) రాజశేఖర్, సీటీఎం(ఎం అండ్ సీ) విజయ్ కుమార్, చీఫ్ మేనేజర్(ఫైనాన్స్) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఆర్టీసీ సమస్త సమాచారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఓ బోల్టు కొనాలన్నా, దానికి బిల్లు చెల్లించాలన్నా.. బస్సుల నిర్వహణ, రూట్ మ్యాప్, తిరిగిన కి.మీ.లు, వచ్చిన ఆదాయం, బ్యాంకులో జమ, సిబ్బంది హాజరు, పనితీరుపై జాబితా తయారీ, కొత్త బస్సుల కొనుగోలు, సొంత వర్క్‌షాప్‌లో బస్ బాడీల తయారీ.. ఇలా ఆర్టీసీకి సంబంధించిన సమస్త సమాచారం ఓ మీట నొక్కగానే ప్రత్యక్షమయ్యేలా యాజమాన్యం ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోనుంది. ఒరాకిల్ ఆధారిత ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్ ప్రోగ్రాంతో ఇది సాధ్యం కానుంది. ఈ తరహా ప్రోగ్రామ్స్ తయారీ, సేవలు అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నల్సాఫ్ట్ అనే సంస్థతో ఆర్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్ సీఈఓ వెంకట నల్లూరిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ)విజయ పుష్ప, ఐటీ సీఓ రాజశేఖర్, నల్సాఫ్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. తొమ్మిది నెలల్లో ప్రోగ్రాంను సిద్ధం చేసి ఆ సంస్థ ఆర్టీసీకి అందించనుంది. -
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్ ఆర్టీసీ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడం చాలా దురదృష్టకర సంఘటనగా టీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టీఎస్ ఆర్టీసీ పీఆర్వో పేర్కొన్నారు. ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. -
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో " స్ట్రెయిట్ టాక్ "
-
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్‌బీ/బీహెచ్ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. పండగ రద్దీ దష్ట్యా నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని, స్పెషల్ చార్జీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆర్టీసీకి సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ఇతర ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ భవన్లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్‌బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని సజ్జనార్ తెలిపారు. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లి ముందస్తు రిజర్వేష¯Œన్ చేసుకోవాలని కోరారు. పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా భద్రంగా గమ్యం చేరేందుకు వీలుంటుందన్నారు. రోడ్లపై రద్దీ అధికంగా ఉండే సమయం అయినందున, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ప్రజలకు తెలపాలని కోరారు. సమావేశానికి హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్, టి.శ్రీనివాస రావు, డి.శ్రీనివాస్‌లతో పాటు రవాణా శాఖ రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ రావు, ఆర్టీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రామచందర్‌లను ఆయన సన్మానించారు. -
TSRTC: ఏపీకి స్పెషల్ స్లీపర్ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులను హైదరాబాద్ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది. ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మొదలైన సంక్రాంతి పండుగ
-
ప్రైవేట్ ట్రావెల్స్ కు ధీటుగా టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు
-
ప్రయాణికుల ఆదరణతో ప్రగతిరథం పరుగులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): ప్రయాణికుల ఆదరణతో టీఎస్ఆర్టీసీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థికంగా పటిష్టంగా తయారవుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల వల్లే ప్రగతిరథ చక్రం పరుగులు పెడుతోందని, 2022లో ప్రయాణిక దేవుళ్లు టీఎస్ఆర్టీసీని ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించారని పేర్కొ న్నారు. బుధవారం కూకట్పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీలోని బస్‌స్టాప్‌లో కొత్త స్లీపర్, స్లీపర్ కమ్ సీట్ బస్సులను ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొ న్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. గత 15 రోజుల క్రితం సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించామని, ఈ నెలాఖరులో కొత్త ఏసీ బస్సులను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్లీపర్ బస్సులు హైదరాబాద్–విజయవాడ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. సీఎం సహకారంతో ఆర్టీసీ అభివృద్ధి: బాజిరెడ్డి ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను ప్రారంభించామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్థలోని 50 వేల మంది ఉద్యోగుల కృషి వల్లే రోజు రోజుకూ రెవెన్యూ మెరుగుపడుతోందని చెప్పారు. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు. దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల డీజిల్ సెస్‌ను మాత్రమే సవరించామని, టికెట్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలారం, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్ ట్రాకింగ్ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్‌కుమార్, జీవన్‌ప్రసాద్, మోహన్(అశోక్ లేలాండ్), ఎంజీ ఆటోమోటివ్స్ ఎండీ అనిల్ ఎం కామత్ పాల్గొన్నారు. -
నెక్లెస్ రోడ్డు : ఉత్సాహంగా ప్యూరథాన్ 5కే, 2 కే రన్ (ఫోటోలు)
-
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్‌లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్‌లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరలో కొనే కొత్త బస్సులకు పేర్లు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిసారి స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ ... ప్రయాణికులకు చేరువయ్యేందుకు వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఏడాది చివరికి మొత్తం 630 కొత్త బస్సుల రాక మొదలువుతుంది. డిసెంబరులో వీటి సరఫరా ప్రారంభమై మార్చి వరకు పూర్తిగా అందుతాయి. వీటి ల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. మిగతావి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు. అద్దె రూపంలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీమియం కేటగిరీలో గరుడ, గరుడప్లస్, రాజధాని పేరుతో బస్సులున్నాయి. ఇప్పుడు ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ కేటగిరీ సర్వీసులకు పేర్లు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. బస్సులకు ఆకర్షణీయమైన పేర్లు సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పేర్లు సూచించటం మొదలైంది. ఇటీవలే భారత్‌కు ఆఫ్రికా చీతాలు రావటంతో వాటి పేరు జనం నోళ్లలో బాగా నానుతోంది. దీంతో ఏసీ స్లీపర్ సర్వీసుకు చీతా పేరు పెట్టాలని కొందరు, ప్యారడైజ్ ఆన్ వీల్స్, డెక్కన్ ప్రైడ్, స్వర్ణ రథం, మయూఖా, జాగ్వార్, విహారీ, షీతల శయన, శాతవాహన, కాకతీయ, రుద్రమ, జనతాబస్, విహంగ, హరివిల్లు, రోడ్ ఫ్లైట్, మయూర, రాజహంస, అంబారీ, ఉయ్యాల.. ఇలా చాలా పేర్లు సూచించారు. మరిన్ని సూచనలు రానున్నాయి. వీటిల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆయా సరీ్వసులకు పెట్టనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఆరంభంలో బ్యాటరీ నాన్ ఏసీ బస్సులు కూడా సమకూరనున్నాయి. వాటికి కూడా పేర్లు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్నాయి. నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు పేర్లు పెట్టాల్సి ఉంది. కొనసాగుతున్న దసరా ప్రత్యేక బస్సులు.. బతుకమ్మ, దసరా పండుగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు నగరం నుంచి మూడు వేల బస్సులు ప్రయాణికులను గమ్యానికి చేర్చాయి. రెండో శనివారం, ఆదివారం సెలవురోజులు కావటంతో భారీగా జనం ఊళ్లకు తరలివెళ్లారు. శనివారం షెడ్యూల్ ప్రకారం 560 బస్సులు నడపాల్సి ఉండగా, రద్దీ ఎక్కువగా ఉండటంతో 820 బస్సులు నడిపారు. ఆదివారం 565 బస్సులు నడపాల్సి ఉండగా, 765 బస్సులు తిప్పారు. మంగళవారం మళ్లీ రద్దీ ఎక్కువగా ఉండనున్నందున వేయి బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
ఈరోజు పుట్టినవారికి 12 ఏళ్ల వరకు ఉచిత ప్రయాణం
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నేడు (పంద్రాగస్టు) జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు నేడు(సోమవారం) బస్సులో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గోలో కిలోబరువు ఉన్న వస్తువులను ఉచితంగా 75 కిలోమీటర్ల దూరం వరకు పంపించడానికి అవకాశం కలిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి 22 వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్లో ఉచిత మెడికల్ చెకప్‌లతోపాటు 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేస్తామన్నారు. 16 నుంచి 21 వరకు టీటీడీ ప్యాకేజీలపై రూ.75 రాయితీ అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న 75 చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించి 7,500 యూనిట్ల రక్తం సేకరిస్తామని తెలిపారు. హైదారాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్‌లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
చటాన్ పల్లి మిస్టరీ..!
-
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
సిర్పూర్కర్ కమీషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ ఎన్ కౌంటర్ కేసులో లాయర్ సంచలన నిజాలు..!!
-
దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం
-
దిశ కేసు హైకోర్టుకు బదిలీ
-
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్...కట్టుకథే..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పది మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది. కమిషన్ జనవరి 28నే సీల్డు కవర్లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ సెక్రటేరియట్ శుక్రవారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ తమ నివేదికలో ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలివీ.. ‘‘పోలీసులపై దాడి కట్టుకథ! పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్ రికార్డులో, మెడికో లీగల్ సర్టిఫికెట్లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్లో వారిని కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంది. కేర్ ఆస్పత్రిలో చికిత్స విషయానికొస్తే.. ఒరిజినల్ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయనేది, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనేది అబద్ధం. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు అపహరించారనేది కట్టుకథ, నమ్మశక్యం కానిది. తుపాకీలను అపహరించారనడానికి ఆధారాలను రూపొందించారు. ఇద్దరు అధికారుల నుంచి తుపాకీలు అపహరించారని ఒకసారి.. ఒక అధికారి నుంచే అపహరించారని పోలీసుల తరఫు సాక్షి వేర్వేరుగా చెప్పారు. నిందితులు కాల్పులు జరిపే అవకాశమే లేదు పోలీసుల నుంచి నిందితులు తుపాకీ అపహరించారనే అంశంలోనూ అనుమానాలు ఉన్నాయి. పోలీసు బెల్టుకు ఉండే పౌచ్ బటన్ తీసి 9ఎంఎం పిస్టల్ ఎలా అపహరించగలిగారు? నిందితులకు ఆయుధాల నిర్వహణ తెలుసనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ సమయంలో సదరు పిస్టల్‌ను ఎలా నిర్వహిస్తారనేది అధికారులు చూపారు. ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. తుపాకీలను ఉపయోగించడం తెలియని వ్యక్తి అంత సులభంగా వాడటం చాలా కష్టం. నిందితులు వాటిని వాడటం సాధ్యం కాదు. తుపాకీలో మేగజీన్ (బుల్లెట్లు ఉండే చాంబర్) లోడ్ పొజిషన్లో ఉందని అధికారులు చెప్తున్నారు. తుపాకీ కాల్చాలంటే పైభాగాన ఉన్న స్లయిడ్‌ను లాగడం ద్వారా చాంబర్లోకి బుల్లెట్ క్యాట్రిడ్జ్ వెళ్లేలా చేయాలి. సేఫ్టీ స్విచ్ ఎక్కడ అనేది సూచించే ఆధారాలు రికార్డుల్లో లేవు. శిక్షణ లేని వ్యక్తి సేఫ్టీ స్విచ్‌ను గుర్తించి తుపాకీ కాల్చడం సాధ్యం కాదని బాలిస్టిక్ నిపుణులు చెప్తున్నారు. నిందితులు ఆయుధాలు లాక్కొని వెంటనే కాల్పులు ప్రారంభించారన్న పోలీసుల ఆరోపణలు ఊహకు కూడా అందడం లేదు. పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారా? ఆత్మరక్షణ కోసమా? నిందితులను పట్టుకోవడానికి ప్రతీకార కాల్పులు ప్రారంభించారా అనేది అస్పష్టంగా ఉంది. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనేది తేలలేదు. కాల్పులు నిజంగానే జరిగాయని చెప్తుండటంపై అనుమానం తలెత్తుతోంది. మృతి చెందిన నలుగురి మొండెం, తలపై తుపాకీ గాయాలున్నాయి. అవి పరిశీలిస్తే పోలీసులు స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్టుగా విశ్వసించాల్సి వస్తోంది. ఎన్నో అంశాల్లో వ్యత్యాసాలు.. ఘటన ప్రాంతానికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు కమిటీకి అందాయి. అవి ఒక ఆర్డర్లో లేవు. పైగా నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్‌లు. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయి. కమిషన్ ముందు పూర్తి ఫుటేజీ ఎందుకు ప్రవేశపెట్టలేదో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. సెక్షన్ 161 సీఆర్పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనాస్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది. కస్టడీ అనుమతిలోనూ చట్ట ఉల్లంఘన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించే సమయంలోనూ తీవ్రమైన చట్ట ఉల్లంఘన జరిగినట్టు తేలింది. ఎలాంటి పత్రాలను పరిశీలించకుండానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు ప్రొసీడింగ్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గానీ, పోలీసు అధికారిగానీ లేరు. ఏసీపీ వి.సురేందర్ స్థానంలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా అజ్మల్ కసబ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనలను గుర్తుంచుకోవాలి. బెయిల్ కోసం దరఖాస్తు/పోలీసు రిమాండ్‌ను వ్యతిరేకించడం/జ్యుడీషియల్ కస్టడీని వ్యతిరేకించడం వంటి అంశాల్లో నిందితులకు న్యాయ సలహా అవసరం. ఘటన నాటికి ముగ్గురూ మైనర్లే.. జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ మైనర్లు.. పాఠశాల రికార్డులను పరిశీలించినప్పటికీ పోలీసులు వారి వయసును నమోదు చేయలేదు. మరణించే నాటికి ముగ్గురు మైనర్లేనని వారి బంధువులు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డుల్లోనూ వారి పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. ఆధార్‌కార్డు పుట్టినతేదీకి అధికారిక రుజువు కాదు. ఈ నేపథ్యంలో పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన విధంగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉండాల్సింది.’’ నిందితులను చంపే ఉద్దేశంతోనే.. రికార్డుల్లోని అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. నిందితులు 6.12.2019 నాటి ఘటనలో ఆయుధాలను లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడి, కాల్పులు జరపడం వంటివి చేయలేదని నిర్ధారించాం. రెండో విషయం ఏమిటంటే నిందితులు 9ఎంఎం పిస్టల్‌తో కాల్చడమనే సందర్భమే తలెత్తలేదు. నిందితులంతా బుల్లెట్ల గాయాల కారణంగానే మరణించారు. వారిపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారుల చర్యలను సమర్థించడానికి వీల్లేదు. షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను 302 ఐపీసీ కింద విచారణ చేయాలి. ఈ అధికారులు ఐపీసీ సెక్షన్ 76, సెక్షన్ 300 ఐపీసీ (3) నుంచి మినహాయింపు పొందలేరు. ఎందుకంటే వారు నిందితులపై కావాలనే కాల్పులు జరిపారనే వాదన నమ్మదగినది. దీని ప్రకారం.. వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్.. ఈ పది మందినీ కూడా ‘సెక్షన్ 302 రెడ్ విత్ 34 ఐపీసీ, 201 రెడ్ విత్ 302 ఐపీసీ, 34 ఐపీసీ’ల కింద విచారించాలి. వేర్వేరు చర్యలు చేసినప్పటికీ నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే వారు ఉన్నారు. ఆ పది మంది పోలీసులు కూడా నలుగురు నిందితులను సురక్షితంగా ఉంచే బాధ్యత కలిగిన వారే. ఏవైనా చర్యలు లేదా లోపాలు ద్వారా ఆ బాధ్యతలో విఫలమైతే.. నిందితుల మృతి పట్ల ఉమ్మడి ఉద్దేశం ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాదు ఎన్కౌంటర్ తర్వాత రికార్డులు తారుమారు చేయడంలో వారి ప్రవర్తన, నిందితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన తీరు చూస్తే వారి ఉమ్మడి ఉద్దేశం స్పష్టమవుతోంది. మాబ్ లించింగ్ (మూక దాడి) ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా తక్షణ న్యాయం వంటి ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ సమయంలోనైనా చట్టం నియమాలు బలంగా ఉండాలి. నేరానికి శిక్ష అనేది చట్టం ఏర్పాటు చేసిన విధానం ద్వారానే ఉండాలి. పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టాలి విచారణ సమయంలో గమనించిన అంశాల మేరకు పలు సాధారణ సిఫార్సులు చేయాల ని నిర్ణయించినట్టు కమిషన్ నివేదికలో పే ర్కొంది. ఈ మేరకు 15 సిఫార్సులు చేసింది. ∙మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ∙ శాంతిభద్రతల నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలి. ∙అరెస్టు సమయంలో రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ∙దర్యాప్తు మొత్తం వీడియో రికార్డు చేయాలి. ∙ పోలీసుల శరీరానికి కెమెరాలు పెట్టాలి. ∙ అన్ని కేసుల్లోనూ సీసీ టీవీ ఫుటేజీని తప్పనిసరిగా సేకరించాలి. ∙సాక్షుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. ∙క్రైం సీన్‌పై ఫోరెన్సిక్ నిపుణులకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ∙అన్ని ఫోరెన్సిక్ ఆధారాలను వరుస క్రమంలో భద్రపర్చాలి. ∙ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్వహించడాన్ని నివారించాలి. ∙పోలీసు కస్టడీకి దరఖాస్తు చేసిన ప్రతీసారి నిందితుడిని హాజరుపర్చేలా మేజిస్ట్రేట్ ఆదేశించడాన్ని తప్పనిసరి చేయాలి. ∙పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నిందితులకు నోటీసులు జారీ చేయాలి. ∙ సెక్షన్ 176(1–ఏ) కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 కింద మేజిస్టీరియల్ విచారణ చేయాలి. ∙దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు మీడియా సమావేశాలు నిర్వహించాలి. ∙అసత్య సాక్ష్యాలకు సంబంధించి చర్యలను సరళీకృతం చేయాలి. ఇది కూడా చదవండి: దిశ కేసు హైకోర్టుకు బదిలీ -
దిశ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దోషులెవరో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ గుర్తించిందని, ఇందులో దాపరికానికి తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టుకే అప్పగిస్తున్నట్టు తెలిపింది. నివేదిక సాఫ్ట్ కాపీలను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ పంపాలని కమిషన్ సెక్రటేరియట్‌ను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తామని.. నివేదికపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకొనే స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపింది. ఆయా అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో ఈ విచారణను ముగిస్తున్నామని ప్రకటించింది. నివేదికపై గోప్యత అవసరమేంటి? దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల బంధువులు, న్యాయవాది జీఎస్ మణి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. కేసు తీవ్రత దృష్ట్యా సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని, బహిర్గతం చేసేందుకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిర్గతం చేయకూడదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో కొన్ని కేసుల్లో నివేదికలను సీల్డు కవర్లోనే ఉంచిందని దివాన్ గుర్తుచేయగా.. ‘‘ఏదైనా దేశ భద్రతకు సంబంధించిన అంశాలుంటే పరిశీలిస్తాం. కానీ ఇది ఎన్కౌంటర్ కేసు. కమిటీ నివేదిక ఇచ్చింది. అంతిమంగా ముగింపు ఉండాలి కదా.. నివేదికను చూడకుండా మీరు వాదించలేరు కదా.. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. అలాంటిది గోప్యత అవసరం ఏముంది?’’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. కేసు రోజువారీ విచారణ సుప్రీంకోర్టులో సాధ్యం కాదని, కమిషన్ నివేదిక అనంతరం చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా ఉందని గుర్తుచేశారు. ఇక సుప్రీంనియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచరాదో చెప్పాలని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. నివేదికను సీల్డు కవర్లోనే ఉంచాలని శ్యాం దివాన్ మరోసారి అభ్యర్థించినా జస్టిస్ ఎన్వీ రమణ తిరస్కరించారు. దేశంలో ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కేసును పర్యవేక్షించలేం కాబట్టి హైకోర్టుకు తిరిగి పంపాల్సి ఉంటుంది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వివరణాత్మక నివేదిక సమర్పించింది. అయితే సరైన చర్య ఏమిటన్నదే ప్రశ్నగా ఉంది. కమిషన్ కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఈ కేసును హైకోర్టుకు పంపుతాం’’ అని పేర్కొంటూ విచారణను ముగించారు. నిష్పక్షపాతంగా నివేదిక సిర్పూర్కర్ కమిషన్ నివేదిక నిష్పక్ష పాతంగా ఉంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించింది. నివేదిక అంశాలను చూస్తే బాధిత కుటుంబాలకు సగం న్యాయం అందినట్టే ఉంది. హైకోర్టు మీద నమ్మకంతో పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. – పీవీ కృష్ణమాచారి, మృతుల కుటుంబాల తరఫు న్యాయవాది, ఇండిపెండెంట్ కౌన్సిల్ నిందితుల కుటుంబాలకుసమాచారమే లేదు శుక్రవారం సుప్రీంకోర్టులో దిశ కేసు విచారణ జరగనుందన్న విషయంపై తమకు సమాచారం లేదని నిందితుల కుటుంబ సభ్యులుతెలిపారు. మరోవైపు దిశ కేసు విచారణ పూర్తయ్యే వరకూ మృతుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా తమ ఇళ్ల ముందు పోలీసు భద్రతేదీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్య మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వచ్చి కాసేపు ఉండి వెళుతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: తుది దశకు ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు -
ఇంటికెళ్లి.. మామిడిపండ్లు అందించి..
నిజాంపేట్: విశ్వసనీయతకు మారుపేరైన టీఎస్ ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ సేవలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదటి మ్యాంగో ప్యాకెట్‌ను బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎన్‌జేఆర్ సుఖీ–9లో నివాసముంటున్న మల్లిపూడి కిరణ్‌రాజ్, హేమలత దంపతుల గృహానికి సజ్జనార్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రసిద్ధి చెందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను అందిస్తున్నామని, కొనుగోలు దారులు 5 కిలోలకు తక్కువ కాకుండా ఆన్లైన్ (tsrtcparcel.in)లో బుక్ చేసుకుంటే 4 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కార్గో మ్యాంగో ఎక్స్‌ప్రెస్‌లో 12 వేల మంది మామిడి పండ్లను బుక్ చేసుకున్నారని చెప్పారు. -
RCB VS LSG: కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన సజ్జనార్
TSRTC MD Sajjanar Tweet Over Kohli Golden Duck Expression: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే డకౌట్) అయిన విషయం తెలిసిందే. కోహ్లి ఇలా ఔటయ్యాక పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. చాలాకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లి లక్నోతో మ్యాచ్‌లోనైనా తిరిగి గాడిలో పడాలని భావించి, అది సాధ్యపడక నిర్వేదంతో పెట్టిన ఆ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌ను ట్రోల్ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. చాలామంది నెటిజన్ల లాగే కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్‌ప్రెషన్స్‌పై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించాడు. Share your experiences with us#RCBvsLSG #ViratKohli𓃵 #Virat #IPL20222 #CricketTwitter pic.twitter.com/5J92QzFFtT — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 20, 2022 సజ్జనార్.. కోహ్లి హావభావాలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కోసం వాడేసుకున్నాడు. కోహ్లి ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన ఫొటోను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కండక్టర్ గారు వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. ఇదిలా ఉంటే, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్ అయినా, కెప్టెన్ డుప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ హేజిల్‌వుడ్ (4/25) చెలరేగడంతో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. Wes there in your success and will be there in your failures too..... You'll be back soon King💗#ViratKohli𓃵 #KingKohli pic.twitter.com/lcpIua75n1 — 𝒫𝓇𝒶𝒿𝒶𝓀𝓉𝒶✿ RCB❤️(Virat stan) (@PrajaktaSharma8) April 20, 2022 చదవండి: ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇకపై అలా కుదరదు.. ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: పనిచేసే ప్రాంతంలో అధి కారులు, సిబ్బంది నివాసం ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీచేశారు. ఇంతకాలం ఆర్టీసీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటూ పనిచేసే ఇతర ప్రాంతానికి నిత్యం వస్తూ పోతుండేవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా ఫిర్యాదులున్నా పట్టించుకోలేదు. దీనిపై ఎండీ సజ్జనార్‌కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన తీవ్రంగా పరిగణించారు. స్థానికంగా ఉంటున్న ఇంటి చిరునామాలను వెంటనే అందజేయాలని ఆదేశించటం విశేషం. ఇటీవలే ఈడీ స్థాయి మొదలు డిపో మేనేజర్ వరకు మూకుమ్మడి బదిలీలు జరి గాయి. అయితే, నలుగురైదుగురు రాజీనామా చేయగా, పదిమంది వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో కొందరు వేరే ప్రాంతాల్లో ఉంటూ పనిచేసే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. దీన్ని సజ్జనార్ గమనించి తప్పని పరిస్థితిలో మినహా, కుటుంబాలతో కలసి పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలంటూ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీచేశారు. -
యాదాద్రికి స్పెషల్ బస్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలు మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. యాదాద్రికి భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు, 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వద్దకు బస్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బస్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని చెప్పారు. అలాగే, జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఛార్జ్ ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌకర్యవంతంగా యాదాద్రి చేరుకోవచ్చని అన్నారు. కాగా, శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనం నిన్న ప్రారంభమైంది. నిన్న ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.8,17,580 ఆదాయం వచ్చింది. -
భక్తుల వద్దకే మేడారం బస్సులు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం 51 ప్రాంతాల నుంచి 3,845 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులు అమ్మవారి గద్దెలకు చేరువగా వెళతాయని చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఐదారు కిలోమీటర్ల దూరంలో వాటిని నిలిపి ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో శుక్రవారం ఆయన బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చదవండి: మేడారంలో ‘గుడిమెలిగె’ 30 మంది భక్తులు ఒకేచోట ఉంటే.. వారి చెంతకే బస్సును పంపుతామని, కావాల్సిన వారు 040–30102829 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్, క్యూలైన్లు, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్ల వసతి ఏర్పాటు చేశామని వివరించారు. మేడారం జాతర వివరాలు, బస్సుల సమగ్ర సమాచారం, సమీపంలో ఉండేందుకు హోటల్ వసతి, చార్జీలు, ఇతర విభాగాల వివరాలతో.. కిట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. -
అనాథ వృద్ధురాళ్లకు రాములోరి దర్శనం.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యం
భద్రాచలం: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఔదార్యంతో కొందరు అనాథ వృద్ధురాళ్లు భద్రాచలం రామయ్య దర్శనం చేసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలస గ్రామానికి చెందిన పాలూరు సిద్ధార్థ తన భార్య సుధారాణితో కలిసి ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అనాథలు, దివ్యాంగ మహిళలకు అండగా ఉంటూ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న కొందరు వృద్ధురాళ్లకు భద్రాచలం రామయ్యను దర్శించుకోవాలనేది చిరకాల కోరిక. దీంతో సిద్ధార్థ తన పరిచయస్తుల ద్వారా విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సజ్జనార్ విశాఖపట్నం నుంచి భద్రాచలం, భద్రాచలం నుంచి పర్ణశాల, తిరిగి విశాఖపట్నం వరకు పూర్తిగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈమేరకు 20 మంది వృద్ధురాళ్లు గురువారం ఉదయం భద్రాచలం చేరుకుని పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాక రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం పర్ణశాలను కూడా సందర్శించారు. వీరికి భద్రాచలం పట్టణ సీఐ టి.స్వామి భోజన, వసతి, ఆలయ ఈవో శివాజీ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమ చిరకాల కోరిక తీర్చిన ఎండీ సజ్జనార్, ఏర్పాట్లు చేసిన అధికారులకు వృద్ధురాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి విశాఖ తిరుగు పయనమయ్యారు. -
టైర్ రీట్రెడింగా.. ఆర్టీసీ వర్క్‌షాపు ఉందిగా
టైర్ రీట్రెడింగ్.. టైర్ల జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. కొత్త టైరును కొనేబదులు మరికొంతకాలం పాతదాన్నే వినియోగించేలా దాని జీవిత కాలాన్ని పెంచే ప్రక్రియ. భారీ వాహనాలున్న వారికి ఇది సుపరిచితమే. ఇప్పుడు ఆర్టీసీ వర్క్‌షాపులో ప్రైవేటు వాహనాల టైర్లనూ రీట్రెడింగ్ చేసేలా కసరత్తు జరుగుతోంది. తార్నాకలో 200 పడకల ఆర్టీసీ ఆసుపత్రి.. నిత్యం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలపై ఇక్కడికి వస్తుంటారు. ఇన్‌పేషెంట్‌గా కొందరు, ఔట్ పేషెంట్‌గా మరికొందరు వైద్యం పొందుతుంటారు. పెద్ద ల్యాబ్, 24 గంటలూ సేవలందించే ఫార్మసీ ఇక్కడ ఉన్నాయి. త్వరలో సాధారణ వ్యక్తులూ ఇక్కడ వైద్య సేవలు, పరీక్షలు పొందే అవకాశం ఉంది. సాక్షి, హైదరాబాద్: నష్టాల ఊబి నుంచి గట్టేందుకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ఆర్టీసీ కొత్త దారులు వెదుకుతోంది. తనకున్న వనరులనే పెట్టుబడిగా పెట్టి ప్రైవేటు వ్యక్తులకు సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగా ఉప్పల్‌లో ఉన్న వర్క్‌షాపు, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని వినియోగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై మరింత కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే పలుమార్లు తార్నాక ఆసుపత్రిని సందర్శించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. దాని స్థాయిని పెంచి సాధారణ వ్యక్తులకూ వైద్యాన్ని అందించడం ద్వారా ఫీజుల రూపంలో ఆదాయాన్ని పొందాలని నిర్ణయించారు. వీలైతే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 200 పడకలను 300కు పెంచాలనీ యోచిస్తున్నారు. ముందుగా ల్యాబ్‌లో పరీక్షలతో శ్ర్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే ల్యాబ్‌ను కొంత విస్తరించారు. అలాగే ఫార్మసీలో కూడా బయటి వ్యక్తులకు 24 గంటలూ మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా వైద్యాన్ని కూడా అందిస్తారు. ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూర్చుకుంటారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నారు. వర్క్‌షాప్.. బస్‌బాడీ యూనిట్ ఆర్టీసీకి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ వర్క్‌షాప్ ఉంది. ఇక్కడ బస్సులకు రంగులు వేయటం, ప్యాచ్ వర్క్‌తోపాటు కీలకమైన టైర్ రీట్రెడింగ్ నిర్వహిస్తున్నారు. మియాపూర్‌లో బస్బాడీలను రూపొందించే వర్క్‌షాప్ ఉంది. అక్కడి భూములకు మంచి డిమాండ్ ఉన్నందున దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి బస్‌బాడీ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలనే యోచన ఉంది. దీంతో భారీ వాహనాలకు సంబంధించిన సమస్త సర్వీసులు ఇక్కడ అందే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకుని దీన్ని పటిష్టపరిచి ప్రైవేటు వాహనాలకు సేవలు అందించడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇటీవలే ఆ వర్క్‌షాపును పరిశీలించిన సజ్జనార్ .. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమత మవుతోంది. మూడు నాలుగు నెలలుగా టికెట్ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అయినా సంస్థ ఖర్చులను మించిన ఆదాయం పెద్దగా ఉండటం లేదు. దీనికితోడు కరోనా ఉధృతి వల్ల 20 రోజులుగా టికెట్ ఆదాయం బాగా తగ్గుముఖం పట్టింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆదాయం సమకూర్చుకోవడం అనివార్యమైంది. -
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో TSRTC MD సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
-
అదనపు ఛార్జీలు లేకుండా బస్సు సర్వీసులు: సజ్జనార్
-
ప్రజా రవాణాతోనే సురక్షిత ప్రయాణం
అఫ్జల్‌గంజ్/సాక్షి, హైదరాబాద్: సురక్షితమైన ప్రయాణానికి ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేశారు. వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల సౌకర్యార్థం సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాంల వరకు ప్రయాణికులను చేరవేసేందుకు వీలుగా నూతన బగ్గి వాహన సేవల్ని ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రధాన బస్స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్ ఉన్న తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. -
అక్షరం.. సాక్షి!
30 ఏళ్ల క్రితం వెలసిన ఆ ఊళ్లో 13 కుటుంబాలుండేవి.. అయితే ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆ ఊరినే అమ్మేశాడు.. ఇంకో ఊళ్లో 200 మంది విద్యార్థులు.. బడికి వెళ్లాలంటే ఒకటే బస్సు.. వాళ్లు పనికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా పొంగుతున్న వాగును దాటాలి.. అప్పుడే వారికి బతుకుదెరువు దొరుకుతుంది.. రేషన్ మాఫియాతో అధికారులు కుమ్మక్కై పేదలకు అందాల్సిన బియ్యాన్ని మేశారు.. కరోనాతో ఛిద్రమైన ఓ కుటుంబం రోడ్డున పడగా.. వారికి శ్మశానమే ఆవాసమైంది.. ►ఇలాంటి ఎన్నో వెతలు, వేదనలు, అక్రమాలను ‘సాక్షి’ అక్షరీకరించి వెలుగులోకి తెచ్చింది. వారి ఇబ్బందులకు ప్రభుత్వం స్పందించింది.. అధికారులను కదిలించింది. ప్రజలు, విద్యార్థులు పడుతున్న కష్టాలను తీర్చింది. బాధితులకు సాంత్వన చేకూర్చింది. అక్రమార్కుల ఆటకట్టించింది. ప్రభుత్వంతోపాటు పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా 2021వ సంవత్సరంలో సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిన కథనాల్లో మచ్చుకు కొన్నింటిని చూద్దాం! యాతన తీర్చగా చెన్నూరుకు కోటపల్లి ప్రభుత్వ పాఠశాల 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 200 మంది విద్యార్ధులకు ఒకటే బస్.. 2021 నవంబర్ 15న ప్రచురితమైన ఈ కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ఆ ఊరికి బాసటగా.. 30 ఏళ్ల కిందట కామారెడ్డి–ఎల్లారెడ్డి రాష్ట్ర రహదారి పక్కన ఓ చర్చి ఫాదర్ అక్కడ పేదల వెతలనుచూసి చలించారు. పూరి గుడిసెల్లో ఉన్న వారికి ఇళ్లు కట్టించాలని భావించి 29 గుంటల భూమిని కొని తెల్ల కాగితం (సాదాబైనామా)పై రాసుకున్నారు. వారికి ఇళ్లు కూడా కట్టించారు. ఈ భూమిని ఓ ఘనుడు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని వారి ఇళ్లు కూల్చడానికి యత్నించాడు. దీనిపై సాక్షి గత డిసెంబర్ 21న ‘ఊరినే అమ్మేశారు’ అన్న శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపారు. సాక్షి తమ కష్టాన్ని తీర్చిందని గ్రామస్తులు డిసెంబర్ 25న హైదరాబాద్‌లో సాక్షి కార్యాలయానికి వచ్చి ఎడిటర్ మురళిని కలిసి కతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తాకథనాన్ని డిగ్రీ మూడో సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో చేర్చారు. అండగా నిలిచి.. కరోనాతో కొడుకు, కోడలు చనిపోయి ఇద్దరు మనవరాళ్లతో తల్లి పడుతున్న వేదనపై ‘కొడుకు కోడల్ని పొట్టనపెట్టుకుంది’ శీర్షికన మే 30న ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. చనిపోయిన రాజేశ్ ఇంటిపై తీసుకున్న రూ.18 లక్షల అప్పును తీర్చేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రూ.8 లక్షలు తగ్గించారు. మిగతా రూ.10 లక్షలను దాతల ద్వారా సేకరించి బ్యాంక్ రుణాన్ని క్లియర్ చేయించి ఇంటి పత్రాలను ఆ తల్లికి అప్పగించి రుణవిముక్తి చేశారు. దీనిపై ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’...అప్పు తీర్చి ఇళ్లు నిలబెట్టారు అన్న కథనం సెప్టెంబర్ 1న ప్రచురితమైంది. ►ఫిబ్రవరి 15న ‘ముగ్గురు పిల్లలు, నాయినమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనంపై అప్పటి జిల్లా కలెక్టర్ శరత్ స్పందించి గంగవ్వకు రూ.50 వేల నగదు సాయం అందించారు. మనవరాలికి ఉద్యోగమిచ్చారు. సొంత ఇళ్లు కట్టించి ఇచ్చారు. దీనిపై సెప్టెంబర్ 1న ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అనాథల బంధువై.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గామానికి చెందిన భీమయ్య కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత ఆయన భార్య గర్భంతో ఉండగానే కరోనాతో చనిపోయింది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల బంధువే వీరిని సాకుతున్న వైనంపై సాక్షి 2021, మే 29న కథనాన్ని ప్రచురించగా, మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని ఆ చిన్నారులను ఆదుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం నడిమిగూడెం మధ్య కిన్నెరసాని వాగు ప్రవాహాన్ని కర్రలను ఆసరాగా చేసుకుని కూలీలు దాటుతున్న వైనంపై ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన జూలై 13న కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు ఇనుప రాడ్లు, షీట్లతో తాత్కాలిక వంతెన ఏర్పాటుచేశారు. అక్రమార్కులు పరేషాన్ జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాల్లో ఉన్నతాధికారి లీలలు, బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ.. శీర్షికన ప్రచురితమైన కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ‘సాక్షి’ కథనాలతో స్పందించిన అధికారులు రేఖ రైస్‌మిల్లు యజమానిని అరెస్టు చేశారు. అలాగే రేషన్ దందాతోపాటు ఇతర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది. కష్టం తీరింది.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జడ్పీ పాఠశాలలో 298 మంది విద్యార్థులుండగా, వీరిలో 174 మంది బాలికలున్నారు. వీరందరికీ ఒకటే మూత్రశాల ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘174 మంది విద్యార్థినులకు ఒక్కటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి భారీగా స్పందన లభించింది. పలువురు అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమెకు అండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక కాలికి ఆపరేషన్ జరిగింది. ఏడాది కాలంగా భర్త పట్టించుకోకపోవడంతో స్టీలు రాడ్లతో ఇబ్బందితోనే యాచిస్తూ జీవనం సాగిస్తోంది. దీనిపై ‘ఏడాదిగా కాళ్లకు స్టీల్రాడ్లతో’ శీర్షికన జూలై 23న కథనం ప్రచురితమైంది. దీంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి సొంత ఖర్చులతో శస్త్రచికిత్స చేయించి రాడ్లు తీయించగా, 15 రోజుల తర్వాత ఇంటికి చేర్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఐసీడీఎస్ అధికారుల ద్వారా ట్రైసైకిల్ మంజూరు చేయించారు. ఆవాసమై.. కరోనా కారణంగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ పెద్ద మరణించగా ఆ కుటుంబం మొత్తం వీధిన పడి, శ్మశానంలో నివసిస్తున్న కథనం మే 29న ప్రచురితమైంది. దీనిపై మంత్రి హరీశ్ స్పందించి ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, నిత్యావసర సరుకులు అందించారు. పట్టా దక్కింది.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన రైతుల 5 వేల ఎకరాల పట్టా భూమిని అధికారులు అసైన్డ్గా మార్చారు. దీనిపై జూలైలో వచ్చిన కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య స్పందించారు. ఈ భూములపై కమిటీ వేసి తిరిగి పట్టా భూమిగా మార్చారు. ఆ ఊరికి నయమైంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడుకు చెందిన పలువురు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా.. ‘ఆ ఊరికి ఏమైంది’ శీర్షికన అక్టోబర్ 10న ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థ బృందం కూడా పర్యటించి వివరాలు ఆరా తీసింది. పోషకాహార లోపం, దురలవాట్లే కారణమని తేల్చి, అవసరమైన ఏర్పాట్లు చేసి బాధితులకు ఉపశమనం కలిగించారు. శుభ్రమై‘నది’ ‘గోదావరి తీరం చెత్తాచెదారంతో నిండిపోయినది’ అన్న శీర్షికన ప్రచురితమైన ఫొటో ఇది. దీనిపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. జేసీబీతో చెత్తను తొలగించే పనులను చేపట్టింది. -
అందరికీ ‘ఆర్టీసీ’ వైద్యం!
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిలో సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. తాజాగా దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు వసతులు మెరుగుపరచాలని, ఇతరులకు కూడా వైద్యం అందించేలా రూపొందించాలని భావిస్తోంది. విశాలమైన ప్రాం గణం, పెద్ద భవనాలు అందుబాటులో ఉన్నందున, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిస్తే.. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, అదే సమ యంలో ఆర్టీసీకి ఆదాయం కూడా సమకూరుతుందనేది ఆలోచన. కాగా ఈ ప్రక్రియను క్రమంగా పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించారు. సరిపడ నిధులు, పర్యవేక్షణ లేక పడక ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించిన ఈ ఆసుపత్రి ఆ తర్వాత పర్యవేక్షణ లేక పడకేసింది. చాలినన్ని నిధులు లేక వసతులు కూడా మృగ్యమయ్యాయి. క్రమంగా వైద్యుల కొరత ఏర్పడింది. కావాల్సిన మందుల సరఫరా లేక బయట కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం అందక రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వచ్చింది. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. ఒక్క సంవత్సరంలో చెల్లించే రెఫరల్ బిల్లులను ఆసుపత్రిపై వెచ్చిస్తే అది మెరుగ్గా మారుతుందన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వంపై ఆధార పడకుండా.. తాజాగా దీనావస్థలో ఉన్న ఆసుపత్రికి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను విస్తరించటం ద్వారా వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తేవాలని నిర్ణయించారు. దీనికి భారీగా నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విధానం ద్వారా నిధులు సమకూర్చు కోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధమైంది. ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు. ఇటీవలే డయాలసిస్ కేంద్రాన్ని మొదలుపెట్టారు. త్వరలో సహాయ సిబ్బంది నియామకం ఆస్పత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించుకుని, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోబోతున్నారు. ఇందులో నర్సులు, డయాలిసిస్ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. సంస్థ ఎండీ సజ్జనార్ బుధవా రం వరకు సెలవులో ఉన్నారు. గురువారం ఆయన అనుమతితో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఆధునిక వైద్య పరికరాలు, బెడ్లకు కావాల్సిన నిధుల సమీకరణ జరుగుతోంది. కోవిడ్ సెంటర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. విశ్రాంత సర్జన్ ఆధ్వర్యంలో.. గతంలో గాంధీ ఆసుపత్రిలో కీలక పోస్టులో కొన సాగి పదవీ విరమణ పొందిన ఓ సర్జన్‌కు తార్నాక ఆసుపత్రి విస్తరణ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన కొద్ది రోజులుగా దగ్గరుండి దీనిని నిర్వహిస్తున్నారు. కన్సల్టెన్సీ తరహాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సూచనలు అందిస్తోంది. -
టికెట్ చిక్కు.. టిమ్స్‌తో చెక్!
►రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అత్యవసరంగా విజయవాడకు వెళ్లాల్సి వచ్చి, ఆన్లైన్లో ఆర్టీసీ గరుడ ప్లస్ బస్ రిజర్వేషన్ కోసం యత్నించాడు. తాను ఎంచుకున్న సమయానికి ఉన్న బస్సు అప్పుడే కూకట్పల్లి నుంచి బయలుదేరింది. దీంతో ఆన్లైన్ రిజర్వేషన్ మూసుకుపోయింది. తదుపరి గరుడ బస్సు మరో రెండు గంటల తర్వాతకానీ లేదు. దీంతో ప్రైవేటు బస్సెక్కి వెళ్లిపోయాడు. కానీ కూకట్‌పల్లిలో బయలుదేరిన బస్సు పది ఖాళీ సీట్లతో విజయవాడకు వెళ్లింది. ►నగరానికి పనిమీద వచ్చిన బెంగళూరు వాసి దత్త తిరుగుప్రయాణంలో ఆరాంఘర్ కూడలి వద్ద ఆర్టీసీ బస్కెక్కాడు. కానీ టికెట్‌కు చాలినంత డబ్బులు జేబులో లేకపోవటం, గూగుల్‌పే లాంటి వాటితో టికెట్ ఇచ్చే వీలులేక బస్సు దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇకపై ఇలాంటి కష్టాలకు ఆర్టీసీ చెక్ పెట్టనుంది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషీన్స్ (ఐ–టిమ్స్) అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్, జీపీఎస్‌తో అనుసంధానమయ్యే ఈ యంత్రాలతో.. ప్రస్తుతం నెలకొన్న ఎన్నో సమస్యలు తొలగిపోనున్నాయి. ప్రస్తు తం ప్రయాణికుడు నగదు చెల్లిస్తేనే టికెట్ జారీ అవుతోంది. కానీ ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ చెల్లింపుల విధానం అందుబాటులో లేదు. టికెట్‌కు సరిపడా డబ్బులు జేబులో లేని వారు బస్సు దిగిపోవటం మినహా మరో మార్గం లేదు. ఈ ఐ–టిమ్స్ యంత్రాలు అందుబాటులోకి వస్తే, అన్ని రకాల పద్ధతుల్లో చెల్లింపులు జరపొచ్చు. ప్రస్తుతం చాలా మంది ఫోన్లలో గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ఆప్షన్స్ ఉంటు న్నాయి. ఇక డెబిట్ కార్డుతో స్వైప్ చేయటం ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనేందుకు ఈ విధానం ఇంతకాలం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లటంతో ఇటీవల ఆయన అధికారులతో చర్చించి ఇంటెలిజెన్స్ టికెట్ జారీ యంత్రాలు సమకూర్చాలని నిర్ణయించారు. ఒక్కక్కటి రూ. 16 వేలు ఖరీదుచేసే వేయి యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. మరో నాలుగైదు రోజుల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ముందు వాటిని దూరప్రాంత సర్వీసుల్లో అందుబాటులో ఉంచి, ఆ తర్వాత అన్ని బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు. తీరనున్న రిజర్వేషన్ సమస్య.. దూర ప్రాంత సర్వీసుల టికెట్లను ఆన్లైన్లో, ఫోన్లో యాప్ ద్వారా ప్రయాణికులే బుక్ చేసుకుని సమయానికి ఆ ప్రాంతానికి వెళ్లి బస్సు ఎక్కుతున్నారు. ప్రస్తుత విధానం లోపభూయిష్టంగా ఉంది. ఆ బస్సు పాయింట్లో బయలుదేరగానే ఆన్లైన్ రిజర్వేషన్ ఆగిపోతుంది. బస్సులో నేరుగా డ్రైవర్‌కు డబ్బులిచ్చి టికెట్ కొనడమే తప్ప రిజర్వ్ చేసుకునే వీల్లేదు. కొత్తగా వచ్చే ఐ–టిమ్స్ వల్ల బస్సు బయలుదేరాక కూడా రిజర్వేషన్‌కు వీలుంటుంది. ఉదాహరణకు బీహెచ్ఈఎల్ పాయింట్ నుంచి బయలుదేరిన బస్సు ఆ తర్వాత కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. బస్సు ఎక్కడ ఉందో యాప్‌లో కనిపిస్తుంది. దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన వారు అప్పటికప్పుడు సీట్ రిజర్వ్ చేసుకుని ఆ బస్సును అందుకోవచ్చు. ఇంతకాలం ఈ విధానం లేక చాలా బస్సులు ఖాళీ సీట్లతోనే పరుగులు పెడుతున్నాయి. దీన్ని గుర్తించి బస్సులు ప్రయాణంలో ఉన్నా ఆన్లైన్ రిజర్వేషన్ చార్టులో అది కనిపించేలా టిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. జీపీఎస్ అనుసంధానంతో బస్సును ట్రాక్ చేసే వెసులుబాటు కలగనుంది. -
TSRTC: ఆర్టీసీ బస్సు.. అదరహో!
సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు. సొంత డిపోల్లోనే.. ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పట్లో రూ.4 కోట్ల దుబారా.. మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది. -
తిప్పినా.. తిప్పలే!
సాక్షి, హైదరాబాద్: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందాన ఉంది ఆర్టీసీ వజ్ర ఏసీ బస్సుల పరిస్థితి. పొట్టి బస్సులుగా పిలిచే ఈ వంద బస్సులు కొన్నప్పటి నుంచి ప్రయాణికుల ఆదరణ చూరగొనలేక ఆర్టీసీని తీవ్ర నష్టాల పాల్జేయడం తెలిసిందే. దీంతో విసుగొచ్చి వాటిని వదిలించుకునేందుకు గత ఏడాది వేలం వేసి విక్రయించాలని నిర్ణయించారు. అప్పటి ఎండీ సునీల్‌శర్మ ఆమోదంతో అధికారులు 60 బస్సులను వేలానికి ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. ఎలా నడపాలి? మరో 40 బస్సులు 2 లక్షల కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగాయి. ఇవి మంచి కండిషన్లో ఉండటంతో వాటిని వేలంలో అమ్మటం సరికాదని తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయం అధికారుల్ని అయోమయానికి గురి చేస్తోంది. కొన్నప్పటి నుంచి సమస్యలు వేధిస్తుండటం, ఏ రకంగానూ అనుకూలంగా లేని ఈ బస్సుల్ని ఎలా తిప్పాలోనని భావిస్తున్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశం మేరకు వాటిని తిరిగి నగరంలో వినియోగించాలని నిర్ణయించి కొన్ని డిపోలకు అప్పగించారు. ♦ఈ బస్సుల్లో 18 సీట్లే ఉంటాయి. ఇంత చిన్న బస్సులకు ఓ డ్రైవరు, కండక్టర్.. ఇలా రెండు షిఫ్టుల్లో నలుగురిని నియమిస్తే.. వాటితో వచ్చే ఆదాయం కనీసం ఇద్దరి జీతాలకు కూడా సరిపోదు. కేవలం టిమ్ యంత్రం ద్వారా డ్రైవరే టికెట్లు ఇచ్చే పద్ధతికే ఇవి సరిపోతాయి. కానీ సిటీలో కండక్టర్ లేకుండా డ్రైవర్ ఒక్కడితో బస్సు నడపటం సాధ్యం కాదు. దీంతో స్టేజీ క్యారియర్‌గా అది పనికి రాదని తేల్చేశారు. ♦నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు నడపాలని భావించారు. కానీ, ఇంజిన్ వరకు ఈ బస్సు కండిషన్లో ఉన్నా.. ఏసీ విషయంలో తయారీనే నాసికరంగా ఉంది. సాధారణంగా ఛాసిస్‌కే ఏసీ బిగించేలా ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో ఛాసిస్‌తో సంబంధం లేకుండా అది తయారైన తర్వాత ఏసీని విడిగా ఫ్యాబ్రికేట్ చేశారు. దీంతో చిన్న తేడా వచ్చినా ఏసీ ఆగిపోతోంది. ఇవి ఏసీ బస్సులు అయినందున ఏసీ లేకుండా నడపటం కష్టం. కిటికీలు తెరుచుకునే అవకాశం ఉండనందున గాలి లేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతారు. దూర ప్రాంతాలకు ఏసీ సమస్యతో తిప్పలేక అది కూడా కుదరదని తేల్చేశారు. ♦ఇక నగరంలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకివ్వాలని నిర్ణయించి.. పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతినే అవలంబిస్తున్నాయి. అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు దీంతో కంపెనీలు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా లేవు. వర్క్ ఫ్రం హోం పద్ధతిని తొలగించే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ♦ఇక మిగిలిన అవకాశం.. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు, యాత్రలకు అద్దెకివ్వటం. దీంతో వాటి బుకింగ్ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ఆర్డర్లు కొంత మెరుగ్గానే వస్తున్నాయి. ఇక యాత్రలకు వీలుగా తాత్కాలికంగా ఏసీ సమస్య లేకుండా చేసి అద్దెకిచ్చే యోచనలో ఉన్నారు. వెరసి అడ్డగోలు ధరకు వేలంలో అమ్మలేక.. ఉంచుకుని లాభాలు తెచ్చుకునేలా నడుపుకోలేక వజ్ర బస్సులతో ఆర్టీసీ అధికారులు తంటాలు పడుతున్నారు. -
ఆర్టీసీని కించపరిచే ప్రకటన తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సును కించపరిచేలా సినీ హీరో అల్లు అర్జున్‌తో ఓ యాప్ ఆధారిత బైక్ టాక్సీ అగ్రిగేటర్ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రదర్శన నుంచి తొలగించాల్సిందిగా నాంపల్లిలోని సిటీసివిల్ కోర్టు ఆదేశించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆ బైక్ టాక్సీ సంస్థ పనితీరు ఉత్తమంగా ఉంటుందని చూపించే క్రమంలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసేలా ప్రచార చిత్రాన్ని రూపొందించి యూట్యూబ్‌లో ప్రసారం చేస్తుండటాన్ని తప్పుపడుతూ ఇటీవల ఆర్టీసీ ఎండీ పరువునష్టం దావా హెచ్చరికలతో ఆ సంస్థకు, నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రసారాలను నిలిపివేయకపోవటంతో ఆర్టీసీ నాంపల్లి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సజ్జనార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసుల అనంతరం స్వల్పంగా ప్రచార చిత్రంలో మార్పు చేసినా.. ఆర్టీసీ బస్సును అలాగే చూపించటాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ ప్రచార చిత్రాన్ని ప్రసారం నుంచి తొలగించాలని, వీడియో అసలు, సవరించిన యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని గూగుల్ ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ని కోర్టు ఆదేశించినట్టు వెల్లడించారు. -
ట్వీట్ చేస్తే.. బస్సొచ్చె.. భలె భలె!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. డిపాజిట్ కూడా రద్దు చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణికులు ఇటీవల ట్వీట్ చేసిన సమస్యలపై అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన సమస్యలివీ... సమయానికి బస్సు రావడం లేదంటూ ఓ ప్రయాణికుడి ఫిర్యాదు.. మా ఊరికి బస్సు రాక ఏళ్లు అయితుంది.. మీరు బస్సు వేయిస్తారా?.. ఓ గ్రామ యువకుడి ప్రశ్న.. బస్సు సమయానికి రాక కాలేజీకి టైంకు చేరుకోలేకపోతున్నం.. పాఠ్యాంశాలు నష్టపోతున్నం.. ఓ విద్యార్థి వినతి.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.. మెస్సేజ్ రావడమే ఆలస్యం అన్నట్లు.. వెంటనే ఆయన స్పందించి రిప్లయ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సాక్షి,నెన్నెల(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్ 16 నుంచి బస్సు ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్‌ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది. కష్టాలు దూరమయ్యాయి మా ఊరికి 30ఏళ్ల కిందట సర్కార్ బస్సు వచ్చేది. అప్పట్లో రాకపోకలకు సౌలత్ ఉండేది. అధికారులు బస్సు బంద్ చేయడంతో ఇబ్బంది పడ్డాం. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడక, ఎడ్లబండే దిక్కయ్యేది. ప్రస్తుతం మా ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి. – చాపిడి పెంటక్క, కోనంపేట చదువులు మానొద్దని.. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర బస్సు ప్రారంభించారు. దీంతో 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంతోషంగా ఉంది దాదాపు 26 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు బాగాలేక ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 108 వాహనం కూడా వస్తోంది. పోలీసులకు రుణపడి ఉంటాం. – బోజ్జిరావు, ఉప సర్పంచ్, మంగి రెండ్రోజుల్లోనే.. సిరికొండ(బోథ్): మండల కేంద్రంతోపా టు చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇక్కట్లకు గురయ్యేవాళ్లం. మండల కేంద్రం నుంచి నిత్యం దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఉన్నత చదువులకోసం వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులేక పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సామాజిక కర్యకర్త రాథోడ్ మౌనిక సమస్యను ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేసింది. సజ్జనార్ రెండు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించారు. నిర్మల్ నుంచి బోథ్‌కు లింక్బస్సు బోథ్: హైదరాబాద్ నుంచి బోథ్‌కు రాత్రి సమయంలో నడిచే బస్సును లాభాలు రావడం లేదని గతంలో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ప్రజల ఇబ్బందులు గమనించిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్‌కుమార్ బస్సు పునరుద్ధరించాలని అక్టోబర్ 29న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ నిర్మల్ నుంచి బోథ్‌కు ఉదయం 5 గంటలకు లింక్ బస్సును ఏర్పాటు చేశారు. గిరి గ్రామాలకు ఆర్టీసీ బస్సు పెంచికల్పేట్: మండలంలోని గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ గ్రామాలకు గతేడాది మే నుంచి ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలు లేక పడుతున్న ఇబ్బందులపై నవంబరు 16న ‘సాక్షి’లో ‘అందని ఆర్టీసీ సేవలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన యువకులు కథనాన్ని ఎండీ సజ్జనా ర్కు ట్వీట్ చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత అధికారులు నవంబరు 19 నుంచి గిరి గ్రామాలకు బస్సు పునరుద్ధరించారు. హైదరాబాద్ బస్సు పునరుద్ధరణ ఖానాపూర్: ప్రతీరోజు ఉదయం 5 గంటలకు కడెం, ఖానాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోయింది. బస్సు సేవలు పునరుద్ధరించాలని గత నెల 19న ఖానాపూర్‌కు చెందిన బీసీ యువజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోట సుమీత్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్ చేశాడు. స్పందించిన ఆర్టీసీ అధికారులు ఈ నెల 22 నుంచి బస్సు పునరుద్ధరించారు. చదవండి: డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి.. -
VC Sajjanar: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రజాసేవలో నిమగ్నమైన ఆర్టీసీ ఎన్నటికీ జనంపై భారం మోపడానికి ఇష్టపడదని సమస్యలన్నింటినీ అధిగమించాలంటే పెంపు అనివార్యమైందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కోవిడ్ సమయంలో భారీగా పెరిగన నష్టాలు, భారీగా పెరిగిన డీజిల్ ఛార్జీలు, ఫలితంగా పెరిగిన విడిభాగాల ధరలతో తప్పడంలేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా పల్లెవెలుగు, ఆర్డినరీ సర్వీసులపై కి.మీ.కు 25 పైసలు, మిగతా సర్వీసులపై 30 పైసలు చొప్పున టికెట్ ధరలను పెంచాలని ప్రతిపాదించామని, పెరిగిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాల ఆర్టీసీల కంటే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువేనని వెల్లడించారు. (చదవండి: నేనేం చేశాను నాన్నా! ) -
Sajjanar: ట్విట్టర్‌తో సిరికొండకు బస్సు
సాక్షి, సిరికొండ(ఆదిలాబాద్): ట్విట్టర్లో పోస్టు చేయగానే సిరికొండకు బస్సు వచ్చింది. ఆర్టీసీ అధికారులు కొంతకాలంగా మండల కేంద్రానికి బస్సు నిలిపివేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ మౌనిక, సిరికొండకు చెందిన గుగ్గిళ్ల స్వామి ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పోస్టు చేశారు. స్పందించిన సజ్జనార్ బస్సు నడిపించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం మండల కేంద్రానికి బస్సు పునరుద్ధరించారు. -
ట్విట్టర్ పోస్టు.. సజ్జనార్ స్పందన
దండేపల్లి(మంచిర్యాల): టీఎస్ఆర్టీసీ ఎండీగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రయాణికులు సమస్యలపై దృష్టిపెట్టారు సజ్జనార్. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు. తాజాగా మరొక ట్వీట్‌కు సజ్జనార్ స్పందించారు. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వరకు రాత్రి 9గంటల తర్వాత ఆర్టీసీ బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దండేపల్లి మండలం గూడెంకు చెంది తోట పవన్‌వర్మ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మంగళవారం ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీనికి ఆయన స్పందించి, ఆర్టీసీ అధి కారి పద్మావతికి పవన్‌వర్మ నంబర్ ఇచ్చి సమస్య తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె పవన్‌వర్మకు ఫోన్ చేసి సమస్య తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ పోస్టుకు స్పందించిన సజ్జనార్‌కు పవన్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు. -
బిగ్‌బాస్ 5: శ్రీరామచంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే..
TSRTC MD Sajjanar Support Bigg Boss 5 Telugu Contestants Sreerama Chandra: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5వ సీజన్ 10వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ బిగ్‌బాస్ టైటిల్ గెలవాలంటూ శ్రీరామ్‌కు తన మద్దతు ప్రకటించగా తాజాగా ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా అతడికి సపోర్టుగా నిలవడం విశేషం. చదవండి: కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో.. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్ అండ్ టీం అతడిగా మద్దుతుగా నిలిచినందుకు సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్ కాగా సోనుసూద్, సజ్జనార్‌తో పాటు మరికొందరూ సెలబ్రెటీలు సైతం శ్రీరామ్‌కు సపోర్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య పాయల్ రాజ్‌పుత్ శ్రీరామచంద్రకు తన సపోర్ట్ ఉందని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామచంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. Honoured to receive blessings from IPS VC Sajjanar Sir. He created history nobody can forget! Thank you so much Real Superhero!! . . . #TeamSreeramaChandra #Sreeram #SreeramaChandra #SRC #biggboss5telugu #biggbosstelugu5 #GameChanger pic.twitter.com/hHyug07Nf2 — Sreerama Chandra (@Sreeram_singer) November 13, 2021 -
సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో
-
Sajjanar: ఓ ట్విటర్ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది
సాక్షి, హైదరాబాద్: అసలే నష్టాలు.. అప్పులు, కోవిడ్ సమస్యతో అతలాకుతలం.. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో పెట్టిన పోస్టుకు స్పందించిన ఆర్టీసీ.. రోజూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమైంది. గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది. ఇప్పుడు నష్టం ఎదురైనా.. ఆర్టీసీ ప్రతిష్ట మెరుగుపడి భవిష్యత్తులో సంస్థ వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. చిల్లర సమస్య పేరిట.. ఇటీవల ఓ ప్రయాణికుడు బెంగుళూరు బస్సు ఎక్కాడు. టికెట్‌పై వివరాలు చూసి కంగుతిన్నాడు. టికెట్ అసలు ధర రూ.841 అని.. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను నిలదీశారు. అసలు ధరను మించి రూ.9 వసూలు చేయడం ఏమిటని, ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నిస్తూ.. ట్విటర్లో పోస్టు పెట్టారు. ఇది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు వెళ్లింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దీనిపై స్పష్టత లేక.. అధికారులను వాకబు చేశారు. టికెట్ ధరలు సవరించినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్ ఆఫ్ చేసే విధానం ఉందని, దాని ప్రకారమే ఆ రూ.9 వసూలు చేశామని పేర్కొన్నారు. ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన ఆయన.. వెంటనే ఈ రేట్లను సవరించాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్ ఆఫ్ సొమ్మును సవరించారు. దీని ప్రకారం.. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగుళూరు టికెట్ ధరను.. ఇప్పుడు రూ.840కి మార్చారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బందిపేరిట రూ.20గా రౌండ్ ఆఫ్ చేసి, వసూలు చేస్తూ వచ్చా రు. తాజాగా దీనిని రూ.15కు తగ్గించారు. ఇలా అన్నిస్థాయిల్లో మార్చారు. దీనివల్ల రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్ ఆదాయం తగ్గిపోవడానికి కారణమైనట్టు అధికారులు చెప్తున్నారు. లక్ష్యాన్ని మించి వసూళ్లు: కొద్దిరోజులుగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా టికెట్ ఆదాయం సమకూరుతోంది. గత సోమవారం ఆర్టీసీ రూ.12.89 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.13.99 కోట్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. -
అల్లు అర్జున్, ర్యాపిడోకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటన సంచలనమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకనట ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్ నిన్న అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సజ్జనార్ దీనిపై మాట్లాడుతూ.. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. చదవండి: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిసులకు సమాధానం రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపరచకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలియజేశారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను పెంచుతామని, నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.