Bigg Boss 5 Telugu: IPS Sajjanar Support to BB5 Contestants Srirama Chandra - Sakshi
Sakshi News home page

Bigg Boss 5: శ్రీరామచంద్రకు సజ్జనార్‌ మద్దతు, ఏమన్నారంటే..

Published Sun, Nov 14 2021 11:25 AM | Last Updated on Mon, Nov 15 2021 12:50 AM

IPS Officer Sajjanar Support Bigg Boss 5 Telugu Contestants Sreerama Chandra - Sakshi

TSRTC MD Sajjanar Support Bigg Boss 5 Telugu Contestants Sreerama Chandra: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ 10వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చిన‌ట్టు తెలుస్తుంది. దీంతో హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు, రియల్‌ హీరో సోనూ సూద్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవాలంటూ శ్రీరామ్‌కు తన మద్దతు ప్రకటించగా తాజాగా ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా అతడికి సపోర్టుగా నిలవడం విశేషం.

చదవండి: కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..

ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్‌ హౌజ్‌లో  శ్రీరామ్‌ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్‌ గెలుస్తాడని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్‌ అండ్‌ టీం అతడిగా మద్దుతుగా నిలిచినందుకు సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

చదవండి: ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్‌

కాగా సోనుసూద్‌, సజ్జనార్‌తో పాటు మరికొందరూ సెలబ్రెటీలు సైతం శ్రీరామ్‌కు సపోర్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ‌ధ్య పాయల్ రాజ్‌పుత్ శ్రీరామచంద్రకు తన సపోర్ట్ ఉంద‌ని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామచంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement