Sreerama Chandra
-
శ్రీరామ చంద్ర అసహనం.. ఫ్లైట్ మిస్ అయ్యిందంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు
టాలీవుడ్ సింగర్, ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. ఓ పోలిటిషియన్ కారణంగా ఫ్లైట్ మిస్ అయ్యానంటూ మంత్రి కేటీఆర్‌కు శ్రీరామ చంద్ర ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. తన ఫ్లైట్ మిస్ అవ్వడానికి గల కారణం వెల్లడిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరామ చంద్ర ఏం అన్నాడేంట.. ‘‘ఓ రాజకీయనాయకుడి కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లైఓవర్ కింద నుంచి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దితో నా ప్రయాణం అరగంట ఆలస్యమైంది. చదవండి: అవతార్ 2ను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో ఆర్ఆర్ఆర్ దీంతో నేను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యాను. నేను కాదు నాతో పాటు మరో 15 మంది ఈ ఫ్లైట్ మిస్ అయ్యారు. గోవాలో నేను ఓ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు నేను వేరే ఫ్లైట్ పట్టుకోని గోవా చేరుకోవడమంటే కష్టమైన పని. కాబట్టి.. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన ట్వీట్‌కు మంత్రి కేటీర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేశాడు. ఇక శ్రీరామ చంద్ర ట్విట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో పెద్ద ఎత్తున శ్రీరామ చంద్రకు మద్దతు లభిస్తోంది. చదవండి: తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన చిరంజీవి 15 Memebers Including me missed our Flight to Goa 12.45pm today from Hyd, Reason the PV.Narsimharao Airport flyover was manually closed for General Public as there was a Ploitician Travelling to the Airport,Sir @KTR_News @KTRBRS Garu @KTRoffice Garu @TSwithKCR Garu,#inconvenience pic.twitter.com/qlabYTdi80 — Sreerama Chandra (@Sreeram_singer) January 30, 2023 -
బాలుకు ప్రేమతో.. 12 గంటలపాటు నాన్‌స్టాప్ సింగింగ్
తెలుగు వారికి పాటంటే బాలు, మాటంటే బాలు అనుకునేంత చనువు ఏర్పడటానికి కారణం దాదాపు 50 ఏళ్ల ఆయన సినిమా పాటల ప్రయాణం. జూన్ 4వ తేది బాలుగారి జయంతి (పుట్టినరోజు). ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్రభారతిలో ‘‘బాలుకి ప్రేమతో’’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘బాలు గారంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత విభావరిని చేస్తూ బాలు బర్త్‌డేని కన్నులపండుగగా సెలబ్రేట్ చేస్తున్నాం’’ అన్నారు. సినీ మ్యూజిషియన్స్యూనియన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘ 30ఏళ్ల చరిత్ర ఉన్న మా సినిమా మ్యూజిక్ యూనియన్‌లో 1500మంది సభ్యులకు పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా సింగర్స్ అవుదామనుకునేవారికి, మ్యూజిషియన్స్‌కి మా యూనియన్ తొలిమెట్టు. మా వద్ద సభ్యులై ఉంటే వారు సినిమా, టీవీ, ఓటిటి ఇలా ఎక్కడ పనిచేసినా వారికి మా సంస్థతరపునుండి పూర్తి సహాయ,సహకారాలను అందచేస్తాము అని చెప్తున్నాము. బాలుగారు మా కులదైవం. ఆయన దగ్గరుండి 2019లో మా యూనియన్ సభ్యులకోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ని కన్నులపండుగలా జరిపి మా అందరికీ మార్గదర్శకులుగా ఉండి మా వెన్నంటి నిలిచారు బాలుగారు. దురదృష్టవశాత్తు ఆయనను కోల్పోయాం. అప్పుడు ఆయనకు సరిగ్గా ట్రిబ్యూట్ కూడా ఇవ్వలేదే అన్న వెలితి మాలో ఉంది. జూన్ 4 ఆయన జయంతిని పురస్కరించుకుని యూనియన్ ప్రతినిధులుగా నేను, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, సెక్రటరీ రామాచారి, జాయింట్ సెక్రటరీ మాధవి రావూరి, ట్రెజరర్ రమణ శీలంలు మా యూనియన్‌లోని 1500మంది సభ్యులకు ప్రతినిధులుగా ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాటతో పాటు, బాలు గారి అభిమానులతోపాటు ఆయన మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే’’ అన్నారు. సి.యం.యు ట్రెజరర్ రమణ శీలం మాట్లాడుతూ–‘‘ తెలుగుపాటకు నిలువెత్తు సంతకం మా బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాతోపాటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారని అనుకుంటున్నాం’’ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు మాట్లాడుతూ– ‘‘బాలుగారి టీమ్‌లో మ్యూజిషియన్‌గా దాదాపు 25ఏళ్లపాటు పనిచేశాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉంది’’ అన్నారు. ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ–‘‘ బాలుగారంటే మా జనరేషన్ సింగర్స్ అందరకీ ఇన్స్పిరేషన్. ఆయనతో పాటు పాడే అవకాశం నాకు అనేకసార్లు వచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు. సింగర్ కౌసల్య మాట్లాడుతూ–‘‘మీరందరూ పాల్గొని ‘‘బాలుకి ప్రేమతో’’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. -
ఏద్దాం గాలం, సేసేద్దాం గందరగోళం.. ముగ్గురు సింగర్లు పాడిన ఈ పాట విన్నారా?
తాప్సీ ముఖ్య తారగా స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం.. లేసేలోగా ఏసేద్దాం రా ఊరిని వేలం..’ అంటూ సాగే మొదటి పాటను బుధవారం విడుదల చేశారు. మార్క్ కె. రాబిన్ స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు హసిత్ గోలీ సాహిత్యం అందించగా శ్రీరామ్ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర పాడారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్ యెరగరా, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఎన్ ఎం పాషా. -
శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?
Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్ సింగర్ గానే తెలుసు. కానీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొనడంతో మరింత పాపులర్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ 5వ సీజన్‌కు విన్నర్‌గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్‌బాస్ జర్నీకి బ్రేక్ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. అయితే ఈ విన్నర్ తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇదివరకు శ్రీరామచంద్ర 2013లో ఇండియన్ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్ ఐడల్' త్వరలోనే ప్రారంభం కానుంది. 🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ — ahavideoIN (@ahavideoIN) December 26, 2021 -
షణ్నూకి ఛాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ విన్నర్ సన్నీ
బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ అయిపోయింది ఇంక నామినేషన్స్ ఏంటి అనే కదా మీ డౌటు.. ఈ ఛాలెంజ్ బిగ్‌బాస్‌కి సంబంధించింది కాదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. -
శ్రీరామ్, సిరిల పరిస్థితి అత్యంత ఘోరం! బిగ్‌బాస్ టీమ్ఫై ఆగ్రహం!
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసింది. అందులో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లకు సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పాపులారిటీతో పాటు ఆఫర్లు కూడా తలుపు తడుతుండటం నిజంగానే శుభపరిణామం. మరీ ముఖ్యంగా టాప్ 5కి చేరుకున్న ఫైనలిస్టులు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారారు. ఈ క్రమంలో శ్రీరామచంద్ర, సిరి పాదాలను చూసి అభిమానులు షాకవుతున్నారు. పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. ఇంత బాధను పంటికింద భరించి బయటకు మాత్రం ఎలా నవ్వుతూ ఉన్నారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు. కాగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ వారి అనారోగ్యానికి కారణమైంది. ఎక్కువ సేపు ఐస్ వాటర్‌లో ఉండటం వల్ల సిరి కాళ్లు చెడిపోయి నడవలేని స్థితికి చేరుకుంది. మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రియాంక.. శ్రీరామ్ పాదాలకు వేడినీళ్లు పోసి బామ్ రాయడంతో అతడు మంచానికే పరిమితమయ్యాడు. వీళ్లు నడవలేకపోతున్నారని చూపించాడే కానీ పాదాలకు బొబ్బలు వచ్చిన దృశ్యాలను మాత్రం ప్రేక్షకుల కంటపడనీయలేదు బిగ్‌బాస్. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బిగ్‌బాస్ టీమ్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరామ్, సిరిల పాదాలకు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్కుల పేరుతో కంటెస్టెంట్లను మరీ ఇంతలా హింసిస్తారా? అని విమర్శిస్తున్నారు. సిరి, శ్రీరామ్‌ల పరిస్థితిని తలుచుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధను కళ్లకు కట్టినట్లు చూపించి ఉండుంటే సానుభూతి ఓట్లయినా పడేవి కదా అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
బిగ్‌బాస్ షోలో శ్రీరామచంద్ర సంపాదన ఎంతంటే?
Bigg Boss 5 Telugu Second Runner Up: ఎంతో ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19న అంగరంగ వైభవంగా ముగిసింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో మానస్, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టాప్ 5లో నిలిచారు. వీరిలో సన్నీ విజేతగా అవతరించగా షణ్ను రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానంలో చోటు దక్కించుకుంటాడనుకున్న శ్రీరామ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ట్రోఫీకన్నా, బిగ్‌బాస్ ఇచ్చే ప్రైజ్‌మనీ కన్నా తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడమే ముఖ్యమనుకున్నాడు శ్రీరామ్. తన గాత్రంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతడు వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు అందుకున్నాడట. అంటే బిగ్‌బాస్ షో ద్వారా అతడు మొత్తంగా రూ.35 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. -
షణ్ను లేకపోయుంటే సిరి టాప్ 5లో ఉండేదే కాదు: శ్రీరామ్
తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు శ్రీరామచంద్ర. తను కోరినట్లుగానే లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. షో నుంచి బయటకు వచ్చేసిన అతడు తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. షణ్ముఖ్, సిరి, జెస్సీతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చన్నాడు. నామినేషన్స్‌లో సన్నీ, తాను పిచ్చిపిచ్చిగా అరుచుకున్నప్పటికీ ఆ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లమని తెలిపాడు. నన్ను మొదటి వారం నుంచి నామినేట్ చేసిన ఏకైక వ్యక్తి యానీ మాస్టర్ అని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ సపోర్ట్ లేకపోతే సిరి టాప్ 5లోకి వచ్చేదా? అన్న ప్రశ్నకు లేదని ఆన్సరిచ్చాడు శ్రీరామ్. తనకు తెలిసినంతవరకు షణ్ను లేకపోయుంటే సిరి ఫినాలేలో అడుగుపెట్టేది కాదన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మానస్‌కు, తనకు మధ్య కోల్డ్‌వార్ జరిగేదని పేర్కొన్నాడు. -
అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: సింగర్ శ్రీరామ్
Bigg Boss Sreerama Chandra Comments About His Marriage And Future Wife: బిగ్‌బాస్ సీజన్-5 ముగిసింది. విన్నర్‌గా సన్నీ, రన్నరప్‌గా షణ్ముక్ నిలవగా, సింగర్ శ్రీరామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు. తన ఆటతీరుతోనే కాకుండా, పాటలతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీరామ్..తన పెళ్లి, కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయాలపై ఓపెన్ అప్ అయ్యాడు. 'గత మూడేళ్లుగా పెళ్లి గురించి ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎలాంటి అమ్మాయి కావాలి అన్న దానిపై పెద్ద సెలక్షన్స్ ఏం లేవు..కానీ అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్స్కి విలువ ఇచ్చే అమ్మాయై ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి. ఇలా ఉంటే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు. -
హమీదాతో నా రిలేషన్ అదే; ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు: శ్రీరామ్
Bigg Boss 5 Sreeram About Relationship With Hamida And His Journey: బిగ్‌బాస్ సీజన్-5లో సింగర్ శ్రీరామచంద్ర టాప్-3 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడెల్తో బాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకున్న శ్రీరామ్‌కు సోనూసూద్, శంకర్ మహదేవన్ సహా పలువురు హిందీ సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు. అయితే ఓటింగ్‌లో మాత్రం శ్రీరామ్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓటమికి కారణాలు ఇంకా తెలియదు.. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని తను అంగీకరిస్తాను. సన్నీ, షణ్నూ ఇద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్ కానీ టైటిల్ విన్నర్ ఒకరే కాబట్టి సన్నీ గెలవడం సంతోషంగా ఉంది. ఇండియన్ ఐడెల్ సీజన్-5లో తాను గెలిచాను, దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో కూడా గెలుస్తానని అనుకున్నాను. కానీ ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులు నేను మూడో స్థానంలో ఉండాలనుకున్నారు. వాళ్ల నిర్ణయానికి గౌరవిస్తా' అని పేర్కొన్నాడు. ఇక హమీదాతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. 'తను నాకు చాలా మంచి ఫ్రెండ్. క్లోజ్ అవుతున్న టైంలోనే బయటకు వెళ్లిపోయింది. ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలీదు. బిగ్‌బాస్‌లో కొంచెం ఉన్నా దాన్ని పెద్దగా చేసి చూపిస్తారుగా'.. అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. : -
రూ.20 లక్షలు చేజార్చుకున్న శ్రీరామచంద్ర
Bigg Boss 5 Telugu Grand Finale Highlights: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సిరి, మానస్ ఎలిమినేట్ కావడంతో శ్రీరామ్, షణ్ను, సన్నీ ముగ్గురు మాత్రమే మిగిలారు. వీళ్లకు మరోసారి క్యాష్ ఆఫర్ చేశారు. నాగచైతన్య గోల్డెన్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లాడు. కానీ ఎవరూ దానికి టెంప్ట్ కాలేదు. దీంతో నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహించాడు. శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం ఆ సూట్‌కేసులో రూ.20 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు నాగ్. ఇక స్టేజీపైకి వచ్చిన శ్రీరామచంద్ర తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఈ షోలో అడుగుపెట్టానని, చివరకు అది సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. హౌస్‌లో చాలా నేర్చుకున్నానన్న శ్రీరామ్ రేపటినుంచి నాలో కొత్త పర్సన్‌ను చూస్తానని తెలిపాడు. వెళ్లిపోయే ముందు చివరిసారిగా 'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..' అంటూ మెలోడీ సాంగ్ అందుకున్నాడు. ఈ పాట వింటూ శ్రీరామ్ తల్లితో పాటు హమీదా కంటతడి పెట్టుకున్నారు. -
శ్రీరామ్‌ను విన్నర్‌గా తేల్చిన కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరదించనుంది. ప్రేక్షకులు ఎవరిని గెలిపించారనే విషయం పక్కకు పెడితే హౌస్మేట్స్ మనసులు గెలుచుకుంది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ముచ్చటించారు. టాప్ 5లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్నకు హౌస్మేట్స్ వారి అభిప్రాయాలను వెల్లడించారు. రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్ ఇవ్వగా శ్వేత, నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రియాంక సింగ్ మాత్రం ఏకంగా ముగ్గురి పేర్లను వెల్లడించింది. మానస్, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు గెలిచినా ఓకే అని చెప్పింది. వీళ్ల అభిప్రాయం ప్రకారం శ్రీరామ్ విన్నర్ అయితే సన్నీ రన్నర్‌గా నిలుస్తాడన్నమాట. మరి వీరి అంచనా ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి! -
ఆడేసుకున్న మాజీ కంటెస్టెంట్లు, అంతా బిగ్‌బాస్ వరకే అన్న షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు. తర్వాత రెండో సీజన్ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్షిప్పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్, శ్రీరామ్ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్ అయినా బిగ్‌బాస్ హౌస్ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్ గురూ అయిపోతాడని కామెంట్ చేశాడు. అనంతరం నాలుగో సీజన్ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్మేట్స్ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సర్ప్రైజ్ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. వేరే కంటెస్టెంట్ టవల్ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్ టవల్ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్ప్రైజ్ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సరదా సరదాగా సాగింది. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే: డబ్బు తీసుకుని ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Bigg Boss Telugu 5 Final, Will Big Boss Offer 25 Lakhs and Who Has the Chance to Take in BB Housemates: వంద రోజుల సస్పెన్స్‌కు రేపటితో తెర పడనుంది. బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది రేపు(డిసెంబర్ 19) డిసైడ్ కానుంది. ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో గెలిచేది మావాడేనోయ్.. అంటూ ఫైనలిస్టుల ఫ్యాన్స్ నానారచ్చ చేస్తున్నారు. మరోపక్క అనఫీషియల్ ఓటింగ్‌లో సన్నీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటంతో అతడే విన్నర్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో షణ్ముఖ్, శ్రీరామ్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత సీజన్లోలాగా బిగ్‌బాస్ ఈసారి కూడా రూ.25 లక్షలు ఆఫర్ చేస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నాలుగో సీజన్లో బిగ్‌బాస్ రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో నుంచి పాతిక లక్షలను ఆఫర్ చేయగా సోహైల్ ఆ డబ్బును స్వీకరించి స్వతాహాగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు సీజన్లలో ఏ కంటెస్టెంట్ కూడా ఇలా డబ్బు తీసుకోకపోగా సోహైల్ ఆ ట్రెండ్‌ను మార్చేశాడు. మరి ఈ సీజన్లో డబ్బు ఆశ చూపిస్తే ఎవరైనా దాన్ని తీసుకుని స్వతాహాగా ఎలిమినేట్ అవుతారా? అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అయితే ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పుడు బిగ్‌బాస్ అసలు క్యాష్ ఆఫర్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేసినా మరీ ఇంత పెద్ద మొత్తాన్ని మాత్రం కచ్చితంగా ఆఫర్ చేయరు. కాకపోతే ఏదో కొద్ది మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినప్పటికీ సిరి దాన్ని స్వీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ గెలుస్తానని నమ్మకం పెట్టుకోలేదు, గెలవాలనుకోవడం లేదు కూడా! కేవలం షణ్నూనే విన్నర్‌గా చూడాలనుకుంటోంది. అలాంటప్పుడు తనకు డబ్బు ఆఫర్ చేస్తే తీసుకోకుండా ఉండే ప్రసక్తే లేదు. మానస్ ఇలా డబ్బు తీసుకుని ఎలిమినేట్ అవడానికి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు ఫైనలిస్టులకు ఇంలాంటి బంపర్ ఆఫర్ ఏమీ ఇవ్వకుండా బిగ్‌బాస్ నేరుగా ఎలిమినేట్ చేయనూ వచ్చు. టాప్ 3 కంటెస్టెంట్లకు మాత్రం బిగ్‌బాస్ డబ్బుతో కూడిన సూట్‌కేసును చూపించి టెంప్ట్ చేసే అవకాశాలున్నాయి. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా సూట్‌కేసు తీసుకోవడానికి వెనుకాడతారు. కానీ మీ కుటుంబంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు అని మెలిక పెడితే మాత్రం శ్రీరామ్ ఆ సూట్‌కేసు అందుకుని లాభపడతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే బిగ్‌బాస్ ఈసారి బంపర్ ఆఫర్ ఇస్తాడా? ఇస్తే దాన్ని ఎవరు గెలుచుకుంటారు? ఎంత గెలుచుకుంటారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రేపటి గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూడాల్సిందే! -
సిరి ఎలిమినేషన్‌తో సంబరపడ్డాం, కానీ మళ్లీ వచ్చింది: శ్రీరామ్
Bigg Boss Telugu 5 Promo, Ex Bigg Boss Housmates Fun: చప్పగా సాగుతున్నషోలో కొంత ఎనర్జీ నింపడానికి మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శివబాలాజీ, హరితేజ, అఖిల్ సార్థక్, రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి, రోల్ రైడా, అరియానా, గీతా మాధురి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. కాకపోతే గతేడాదిలాగే ఈసారి కూడా కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా కాకుండా ఓ రూమ్‌లో నుంచి సంభాషించారు. ఈ అతిథులు ఫైనలిస్టుల్లో మరింత ఎనర్జీ నింపగా హరితేజ మాత్రం వారిని రోస్ట్ చేస్తూ నవ్వించింది. ఇక రాహుల్ సిరికోసం పాట పాడి ఆకట్టుకున్నాడు. అంతేకాదు హౌస్‌మేట్స్‌తో గేమ్స్ కూడా ఆడించినట్లు కనిపిస్తోంది. సిరి, షణ్ను కలిసి డ్యాన్స్ చేస్తుంటే మానస్, సన్నీ, శ్రీరామ్ మాత్రం వాళ్లకు వాళ్లే స్టెప్పులేసుకున్నారు. వీరిని చూసి జాలిపడ్డ హరితేజ మీకు చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరూ లేరే అని సెటైర్లు వేసింది. మా బాధ అర్థం చేసుకుని బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అంటూ సిరిని పంపించేస్తే మేమంతా సంబరపడ్డాం. కానీ అంతలోనే కన్ఫెషన్ రూమ్ నుంచి షణ్నూ అంటూ పరిగెత్తుకొచ్చింది అని సరదాగా జోక్ చేశాడు. అయితే అతడి ఇన్నర్ ఫీలింగ్ కూడా అదేకానీ పైకి మాత్రం జోక్ చేసినట్లు చెబుతూ కవర్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా మొత్తానికి మానస్, సన్నీ, శ్రీరామ్ ఒకే దగ్గర కలిసి ఉంటుంటే చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు ఫ్యాన్స్! -
నొప్పితో నరకం అనుభవిస్తున్న శ్రీరామ్! కానీ అదే ప్లస్ అయ్యిందా?
Bigg Boss 5 Telugu: సిరి, షణ్ను, మానస్, సన్నీ, శ్రీరామ్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ టైటిల్ రేసులో ఉన్నారు. అయితే పోటీ మాత్రం సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ ఎఫెక్ట్ ఇంకా తగ్గనట్లు కనిపిస్తోంది. ఐస్ టాస్క్‌లో అందరికంటే ఎక్కువగా సిరి, శ్రీరామ్ గాయపడ్డారు. కొద్దిరోజుల వరకు లేచి నడవలేకపోయారు. సిరి అంతో ఇంతో కోలుకున్నా శ్రీరామ్ ఇప్పటికీ ఆ బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఐస్ టాస్క్ తర్వాత ప్రియాంక అతడి కాళ్లపై వేడినీళ్లు పోసి బామ్ రాయడంతో అతడి నొప్పి మరింత తీవ్రతరమైంది. దీంతో వెంటనే వైద్యులు అతడికి చికిత్స చేయడమే కాకుండా పింకీని హెచ్చరించిన విషయం తెలిసిందే! పింకీ తెలియకుండా చేసిన తప్పు వల్ల శ్రీరామ్ ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాడు. కానీ బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అతడు చెప్పులు వేసుకోకుండా వాటిపై నిల్చున్నాడు. అప్పుడు అతడి కాళ్లపై చర్మం మొత్తం ఊడిపోయినట్లు కనిపించింది. ఇది బ్యాండేజా? లేదా చర్మం ఊడిపోయిందా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మెజారిటీ నెటిజన్లు, మాజీ కంటెస్టెంట్లు సైతం అతడి పాదాల చర్మం ఊడిపోయిందంటూ, అయినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా టాస్కులు ఆడుతున్నాడంటూ శ్రీరామ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కల్మషం లేని మనస్తత్వం తనదంటూ శ్రీరామ్‌కు ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అయితే శ్రీరామ్ గాయాలపై అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి క్లారిటీ ఇస్తూ పోస్ట్ వదిలాడు అడ్మిన్. శ్రీరామ్ పాదాలపై ఉంది బ్యాండేజీ మాత్రమేనని, అతడి ఆరోగ్యం గురించి కంగారుపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు అడ్మిన్, శ్రీరామ్ కాలి చర్మం నిజంగానే ఊడిపోయిందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ గాయం వల్ల అతడిపై సింపతీ పెరగడంతో పాటు అవి ఓట్లుగా మారడం కలిసొచ్చే అంశం. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి సింగర్ శ్రీరామ్‌కు ఊహించని సర్ప్రైజ్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-5 అతి త్వరలోనే ముగియనుంది. దీంతో కంటెస్టెంట్లకు మద్దతు ప్రకటిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల నుంచి గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే సోనూసూద్, శంకర్ మహదేవన్,ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి తన మద్ధతు ప్రకటించారు. వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాయ్ శ్రీరామ్. బిగ్‌బాస్ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్. ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. ఆల్ ది బెస్ట్' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. శ్రీరామచంద్రకు స్వయంగా కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించడంతో శ్రీరామ్ ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
ఎప్పుడూ చెప్పలేదు, హమీదాను చాలా మిస్సవుతున్నా: శ్రీరామ్ ఎమోషనల్
Bigg Boss 5 Telugu Promo: రోజులు గడిచేకొద్దీ కంటెస్టెంట్లలో టెన్షన్ పెరుగుతోంది. టైటిల్ గెలిచేదెవరని ఇటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజుల్లో ఎన్నో టాస్కులు ఆడించిన బిగ్‌బాస్ హౌస్మేట్స్ గడిచిన జ్ఞాపకాలను తడిమి చూసుకునేందుకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. అందులో భాగంగా వారి సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఫైనలిస్టులు. 'టెడ్డీబేర్ టాస్కులో నేను, యానీ మాస్టర్, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్గిచ్చుకున్నాం..' అంటూ తను చూపిస్తున్న ఫొటో వెనకాల స్టోరీ చెప్పుకొచ్చాడు మానస్. జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అది అమ్మ రాసిన లెటర్ కళ్లముందే ముక్కలవడం.. అని బాధపడ్డాడు షణ్ను. బ్రిక్స్ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఈ టాస్క్‌కు ముందే షణ్నును ఫేక్ ఫ్రెండ్ అన్నాను. కానీ అది తప్పని బ్రిక్స్ ఛాలెంజ్‌లో నిరూపించాడు అని పేర్కొంది సిరి. నేనెప్పుడూ చెప్పలేదు కానీ హమీదాను చాలా మిస్సవుతున్నా, ఆమె ఉండుంటే లోన్ రేంజర్ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెను మిస్సయ్యాను అన్నాడు శ్రీరామ్. -
బరాబర్ కప్పు గెలుస్తా, అమ్మకు ఇస్తా: సన్నీ ధీమా
Bigg Boss Telugu 5, Episode 100: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ నేటితో సెంచరీ కొట్టింది. ప్రస్తుతం ఉన్న సిరి, మానస్, శ్రీరామ్, షణ్ను, సన్నీలు గ్రాండ్ ఫినాలే కోసం రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మానస్- సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ.. 'టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్ గెలవాలి, మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ.. బరాబర్ కప్పు ఇస్తా..' అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు. మొదటగా ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్ప్రైజ్ చేశాడు. అతడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు. అనంతరం బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్నకొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్ రేంజర్ అన్నా మీరు వన్ మ్యాన్ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. ఇది చూసి శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు. తర్వాత మానస్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే చెల్లింది. మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు, స్వీట్ అండ్ సాడ్ మెమొరీస్ చూసి మానస్ కదిలిపోయాడు. తర్వాత ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు. ఇది చూసిన శ్రీరామ్ తానూ రెండు ఫొటోలు తెచ్చుకోవాల్సిందని నిరాశ చెందాడు. -
శ్రీరామ్ గెలుపు కోసం రంగంలోకి యాంకర్ రవి!
Bigg Boss 5 Telugu, Anchor Ravi Supports To Sreerama Chandra: బిగ్‌బాస్ జర్నీ.. 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు. అదెలాగంటారా? మరేం లేదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్ రవి సింగర్ శ్రీరామ్ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురూ డిజర్వింగ్ అంటూనే ఆ టైటిల్ మాత్రం శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. 'అన్నపూర్ణ స్టూడియో హౌస్, బిగ్‌బాస్ హౌస్.. బిగ్‌బాస్ హౌస్..' అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. 'బిగ్‌బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి' అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్ కూడా ఉంది. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి అభిమానులు యాంకర్ రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా' అన్న మాటను రవి నిజం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: షణ్ముఖ్‌లో ఆ విషయం నచ్చేది కాదు, అతడే పక్కా గెలుస్తాడు.. కాజల్) View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
అలా ఆడటం మానస్ వల్లే సాధ్యం!
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీ.. హౌస్‌లో ఉన్న అందరి కళ్లు ఇప్పుడు దాని మీదే ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అని కసిమీదున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటిదాకా టాప్ 5లో చోటు సంపాదించడం కోసం కష్టపడ్డ హౌస్మేట్స్.. తమకు టైటిల్‌ను సొంతం చేసే బాధ్యతను అభిమానుల భుజాలపై వేశారు. ఈ వారం ప్రేక్షకులు వేసే ఓట్లతో విన్నర్ ఎవరనేది డిసైడ్ కానుంది. ఇదిలా ఉంటే ఫైనలిస్టులకు బిగ్‌బాస్ వారి జర్నీ వీడియోలు చూపించాడు. ఆనందపు క్షణాలతో పాటు మర్చిపోలేని మధురానుభూతులను బాధాకరమైన సంఘటలను, పోట్లాటలను.. ఇలా అన్నింటినీ ఏవీ వేసి చూపించడంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. 'ఈ ఇంట్లో మీ ప్రయాణం గాయకుడిగా మొదలైంది. ఒక్కోవారం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆటలో మీరు చూపించిన పటిమ, స్నేహితుల కోసం నిలబడ్డ తీరు ప్రపంచానికి ఒక కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ముంచే కెరటాలు ఎన్ని ఉన్నా వాటిపై ఈదుకుంటూ వచ్చి ఉదయించే సూర్యుడు ఒక్కడే..' అంటూ శ్రీరామ్‌ను మెచ్చుకున్నాడు బిగ్‌బాస్. 'స్నేహం కోసం మీరు నిలబడ్డ తీరు ప్రతిఒక్కరినీ హత్తుకుంది. కొందరు తెలివితో మరికొందరు మనసుతో ఆడతారు. కానీ మీరు మనసు, తెలివిని సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమైంది' అని మానస్‌పై ప్రశంసలు కురిపించాడు బిగ్‌బాస్. -
ఎమోషనల్ కనెక్షన్, లైట్ తీస్కోమన్న శ్రీరామ్.. ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu, Episode 96: కంటెస్టెంట్లు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగేందుకు బిగ్‌బాస్ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలను రీక్రియేట్ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరూ గెలిచినట్లు నేటి(డిసెంబర్ 9) ఎపిసోడ్లో వెల్లడైంది. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్ మానస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు. హౌస్‌లో శ్రీరామ్, కాజల్‌కు మరోసారి గొడవ జరిగింది. తిట్టుకుంటున్న క్రమంలోనే కాజల్ అతడిని బ్రో అనేసింది. అది నచ్చని శ్రీరామ్.. నువ్వు నాకు సిస్టర్ కాదు, బ్రో అని పిలవకు అని ముఖం మీదే చెప్పాడు. దీంతో హర్టైన కాజల్ బోరుమని ఏడ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను, అతడు అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోయానంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పింది. అటు నుంచి కనెక్షన్ లేనప్పుడు నిన్ను లైట్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటూ హితవు పలికాడు సన్నీ. ఇక వోట్ అప్పీల్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్, మాస్ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్ వల్ల హౌస్మేట్స్ అంతా కలిసిపోయారు. ఇంతలో షణ్ను సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది. అలా వీళ్ల గొడవ చప్పున చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. -
అతడే బిగ్‌బాస్ 5 విన్నర్, వాళ్లే టాప్‌లో ఉంటారు
Syed Sohel Ryan Predicted About Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సి ఉంది. కానీ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది ముందుగానే జోస్యం చెప్తున్నాడు సోహైల్. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన సోహైల్ ఈ సీజన్‌పై మాట్లాడటానికి చాలావరకు తటపటాయించాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకరికి సపోర్ట్ చేసి మిగతావారి ఫ్యాన్స్ నుంచి విమర్శలు మూటగట్టుకోవడం ఎందుకని ఎవరికీ మద్దతు పలకకుండా వెనకడుగు వేశాడు. కానీ హౌస్‌లో ఉన్న సన్నీని చూసి తనను తాను చూసుకున్నట్లు ఉందంటూ మురిసిపోయాడు సోహైల్. ఆ మధ్య సన్నీ విన్నర్ అవుతాడంటూ ఏకంగా పోస్ట్ కూడా పెట్టాడు. సన్నీతో పాటు కాజల్, మానస్ కూడా ఫినాలేలో ఉంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కానీ మిగతా కంటెస్టెంట్ల ఫ్యాన్స్ తన మీద యుద్ధానికి రావడంతో ఆ పోస్ట్‌నే డిలీట్ చేశాడు. అప్పటినుంచి ఈ షో గురించి మాట్లాడాలంటేనే జంకుతున్నాడు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. 'ఎవరికి సపోర్ట్ చేసినా.. మావాడు ఏం చేశిండు? మా పిల్ల ఏం చేసింది? అని నన్ను వేసుకుంటున్నారు. కాజల్, మానస్, సన్నీ టాప్‌లో ఉంటారనిపిస్తుందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోతారంటూ అందరూ నన్ను గట్టిగా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకులే అని భయం వేసింది. పోస్ట్ డిలీట్ చేశా. ఈ వారమైతే సిరి, కాజల్ డేంజర్ జోన్లో ఉన్నాడు. నాకు నచ్చిన కంటెస్టెంట్లు శ్రీరామ్, సన్నీ. వీళ్లిద్దరిలో ఒకరు టైటిల్ గెలుస్తారు' అని సోహైల్ జోస్యం పలికాడు. -
సిరి - సన్నీకి లింకు, భరించలేకపోయిన షణ్ను
Bigg Boss 5 Telugu 14th Week Nominations, Episode 93: కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్ అవద్దని సిరికి సూచించాడు షణ్ను. ఆ వెంటనే ఫ్రెండ్షిప్ హగ్ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. రాత్రవగానే కాజల్ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. మరోవైపు ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్ ఒంటరిగా కూర్చుంటే కాజల్, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్‌ను పాడుతూ మానస్‌ను టీజ్ చేశారు. మాది ఫ్రెండ్షిప్రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఆ తర్వాత మానస్, కాజల్... సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని హెచ్చరించాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్ తీసుకోవడంతో మరింత ఉడికెత్తిపోయిన షణ్ను ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో సిరి ఏడ్చేసింది. తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్ ప్లే చేయడంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అటు షణ్ను మాత్రం మళ్లీ.. ఈ హౌస్‌లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు. 'నేను మోస్ట్ బోరింగ్ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్ ఇంతే.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్' అని కెమెరాలతో తన గోడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని అభిప్రాయపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్‌లో నేను, సెకండ్ ప్లేస్‌లో శ్రీరామ్, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్, కాజల్ ఉంటారన్నాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్ 2, షణ్ముఖ్ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్, సిరి 2, సన్నీ 3, కాజల్ 4, మానస్ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు. తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్ 1, మానస్ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు అన్‌ఫిట్ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్ 4, మానస్, కాజల్ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది. అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్ 3, శ్రీరామ్ 4, మానస్ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్ శ్రీరామ్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారని ప్రకటించాడు. ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్ మధ్య మరోసారి ఫైట్ నడిచింది. దీంతో కాజల్ చాలా యాటిట్యూడ్ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంది సెటైర్ వేసిం సిరి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది! -
నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పటికీ కావాలి మానస్!
Bigg Boss Telugu 5, Priyanka Singh Eliminated From BB5 Show: టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ వెరైటీ గేమ్ ఆడించాడు. బాగా ఫేమస్ అయిన పాత్రలు స్క్రీన్‌పై చూపించి అది ఎవరికి సెట్టవుతుందో చెప్పాలన్నాడు. దీంతో సన్నీ.. మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరణ్ మరెవరో కాదు షణ్నునే అని చెప్పుకొచ్చింది సిరి. అందరినీ డామినేట్ చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని ఫీలయ్యారు. నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి మాత్రమే కాక వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి.. ఇవన్నీ పాత్రలూ సిరికే నప్పుతాయని చెప్పుకొచ్చారు. సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య ట్యాగ్‌లిచ్చారు. శ్రీరామ్ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని తెలిపారు. శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్, కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో లూడో గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో మానస్ పిల్లోతో రొమాన్స్ చేయాలని నాగ్ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్ విఫలమయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్. దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు. టాప్ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్ పేరు చెప్పాడు. ఈ కాజల్ హౌస్‌లో సింపతీ కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్. హౌస్‌లో కామన్‌సెన్స్‌లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్ గెలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ. ఆమెతో చివరిసారిగా గేమ్ ఆడించాడు నాగ్. ఇప్పుడున్న టాప్ 6 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ.. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అసూయపడ్డాను. కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది. తను ఈ హౌస్‌కు చాలా అవసరమని నొక్కి చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్ ఒకేలా ఉందని తెలిపింది. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా కానీ అతడు రాముడిలాగే ఉండిపోయాడంది. షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి ఊరుకున్నానని చెప్పింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్ చెప్తే అతడు స్పందించలేదు.. ఇతడికి ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కుదిరింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ. ఆమె వెళ్లిపోతున్న బాధను బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డ మానస్.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకుని తన భావాలను అభివ్యక్తీకరించాడు. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా అంటూ పాట రూపంలో ఆమె మీదున్న ప్రేమను ప్రకటించాడు. అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అలాగే సింగర్ శ్రీరామ్... ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్ పాడాడు. అనంతరం ప్రియాంక భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
బిగ్‌బాస్: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే!
Bigg Boss 5 Telugu, Top 5 Finalists: టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమోకానీ సిరి, శ్రీరామ్ ఇప్పటికీ తమంతట తాము నడవలేక నానా అవస్థ పడుతున్నారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప సరిగ్గా నిలబడలేకపోతున్నారు. రెండుమూడురోజులుగా కాళ్లకు కట్లు కట్టుకుని కుర్చీల్లోనే కూర్చుండిపోయారు. అలా అని టికెట్ టు ఫినాలేను గాలికి వదిలేయలేదు. కూర్చుని ఆడే గేమ్స్ స్వయంగా వాళ్లే ఆడారు కానీ ఫిజికల్ టాస్కుల్లో మాత్రం ఇతరుల సాయం తీసుకున్నారు. అలా సిరి రెండుసార్లు షణ్ను హెల్ప్ తీసుకోగా శ్రీరామ్.. షణ్ను, సన్నీ ఇద్దరి సాయం తీసుకున్నాడు. వాళ్లిద్దరి సాయంతో చివరి రౌండ్‌కు చేరుకున్న శ్రీరామ్ ఫైనల్లో మాత్రం అతడే ఆడి టికెట్ టు ఫినాలే గెలిచాడు. అలా ఈ సీజన్లో టాప్ 5లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే శ్రీరామ్‌తో పాటు ఎవరెవరు ఫినాలేలో అడుగు పెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ టాప్ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి మానస్ టాప్ 3లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. లేదంటే అతడు నాలుగో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. చివరి స్థానంలో లేడీ కంటెస్టెంట్ నిలిచేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ స్థానాన్ని సిరి, కాజల్‌లో ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ రెండు వారాలు ఎలిమినేషన్‌ను తప్పించుకునే కంటెస్టెంట్ ఫినాలేకు వెళ్తుంది. ఒకవేళ సిరి ఎలిమినేట్ అయితే మాత్రం ఫినాలేలో అడుగుపెట్టాలన్న కాజల్ కోరిక నెరవేరుతుంది. మరోపక్క ఈ వారం పింకీ వెళ్లిపోతుందని అనఫీషియల్ ఓటింగ్స్ చెప్తున్నాయి. ఒకవేళ అది నిజం కాకపోతే కాజల్ బయటకు వచ్చేస్తుందంటున్నారు. ఈ వారం జరగనున్న ఎలిమినేషన్‌తో టాప్ 5లో ఎవరుంటారనేదానిపై ఓ స్పష్టత రానుంది. -
ప్రియాంకకు బిగ్‌బాస్ వార్నింగ్, సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరిక!
Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్ పోలింగ్ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇంటిసభ్యులు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు. గేమ్‌లో సన్నీని డిస్టర్బ్ చేసినందుకు కాజల్ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్ ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు. సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది. ఆఖరి రౌండ్లో శ్రీరామ్, మానస్ పోటీపడగా శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. -
ఫినాలేలో అడుగుపెట్టిన శ్రీరామ్, సన్నీ గెలిపించాడా?
Bigg Boss 5 Telugu, Ticket To Finale Winner Sreerama Chandra: బిగ్‌బాస్ హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు కొనసాగిన గేమ్‌లో కాజల్, ప్రియాంక సింగ్, షణ్ముఖ్ అవుట్ అవగా సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్ టాప్ 5లో బెర్తు దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నారు. అయితే సిరి ఫినాలే టికెట్ సొంతం చేసుకుని ఫైనల్లో అడుగు పెట్టిందంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ ప్రచారం జరిగింది. అయితే ఇంకా టాస్క్ పూర్తవలేదని, అది కేవలం ఊహాగానాలేనని పలువురూ పేర్కొన్నారు. కానీ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే కంటెస్టెంట్ గెలుస్తున్నారంటూ క్లూ ఇచ్చారు. దీంతో సిరి, శ్రీరామ్, సన్నీలలో ఒకరు ఫినాలేకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో టికెట్ టు ఫినాలే పోటీ ముగిసిందంటూ, విన్నర్ ఎవరో తెలిసిపోయిందంటూ నెట్టింట లీకువీరులు హల్చల్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా సిరి కాకుండా శ్రీరామ్ గెలిచాడని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవేవీ నిజం కాకుండా పోలేదు, దీంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందంటూ శ్రీరామ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐస్ క్యూబ్స్‌లో నిలబడాల్సిన టాస్క్‌లో శ్రీరామ్ పాదాలు స్పర్శ కోల్పోయిన విషయం తెలిసిందే కదా! దీంతో ఫిజికల్ టాస్క్‌లో శ్రీరామ్‌కు బదులు సన్నీ ఆడి అతడిని గెలిపించాడు. తన ఆటలో వెనకబడిపోయినా సరే శ్రీరామ్‌ను మాత్రం గేమ్‌లో ముందు వరుసలో ఉంచాడు. అలా అతడు శ్రీరామ్‌ను గెలిపించాడంటూ ఫ్యాన్స్ సన్నీని ఆకాశానికెత్తుతున్నారు. కానీ నేటి ఆటలో శ్రీరామ్ కోసం సన్నీ ఆడాడా? షణ్ను ఆడాడా? అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్!
Bigg Boss Telugu 5, Episode 87: బిగ్‌బాస్ షోలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవల్లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను లేపేయాలి. ఈ గేమ్‌లో సన్నీ, సిరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. నన్ను కావాలనే టార్గెట్ చేసి బ్యాడ్ చేస్తోందంటూ సిరిపై చిర్రుబుర్రులాడాడు సన్నీ. అతడు తన బాల్స్ తీయడానికి కాచుకుని కూర్చుండటంతో ఐస్ వాటర్‌లో నుంచి అడుగు బయట పెట్టలేదు సిరి. ఈ క్రమంలో రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. సన్నీ తనను టార్గెట్ చేయడంతో ఐస్ బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసుకున్నాయి. దీంతో గేమ్ ముగియగానే మానస్ ఆమెకు సాయం అందించాడు. మరోపక్క బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు మెడికల్ రూమ్‌లోకి వైద్యం అందించారు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది. ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని వార్నింగ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేమీ పట్టించుకోని ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ భామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. ఐస్ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని చెప్పినప్పటికీ పింకీ శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్, కాజల్ అసహనానికి లోనయ్యారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక అడుగు కూడా వేయలేకపోతున్న కంటెస్టెంట్ల బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. తర్వాతి రోజు శ్రీరామ్ పాడిన 'గెలుపు తలుపులే తీసే ఆకాశమే..' సాంగ్ ప్లే చేయడంతో అతడు మనసారా ఏడ్చాడు. ఫైనల్‌గా తొలి రౌండ్లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ప్రియాంక సింగ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్ అనే రెండో లెవల్లో బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో సన్నీకి మానస్ సాయం కోరగా అతడు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సన్నీ మానస్ లెక్కపెడుతున్నాడని తాపీగా కూర్చోవడమే కాదు, పదేపదే అతడి వంకే చూడసాగాడు. దీంతో అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్‌కు వీరి మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమైపోయింది. చివరకు సన్నీ మానస్ సైగ చేసిన వెంటనే గంట కొట్టాడు. ఆ తర్వాత సన్నీ జోకర్లా రెడీ అయి శ్రీరామ్‌ను నవ్వించాడు. అతడు నడవలేని స్థితిలో ఉండటంతో బెడ్‌పైనే ఉండి గేమ్ ఆడగా మిగతా అందరు మాత్రం గార్డెన్ ఏరియాలో ఉండి ఆడారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఈ రౌండ్లో ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ను, మానస్ ఆధిక్యంలో ఉన్నారట! అంటే సాయం తీసుకుని కూడా సన్నీ ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. -
వాళ్ల కంట్రోల్లో పింకీ, వద్దన్నా హగ్గిచ్చిన సిరి!
Bigg Boss Telugu 5, Episode 86: ఇంటిసభ్యులంతా రవి ఎలిమినేషన్ గురించే చర్చించారు. టాప్ 3లో ఉంటాడనుకున్నా అని షణ్ను, టాప్ 2లో ఊహించానని శ్రీరామ్.. రవి గురించి అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. అటువైపు కాజల్ మాత్రం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కాకుండా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయ్యానని తెగ సంతోషపడిపోయింది. మరోపక్క మానస్.. తను టైటిల్‌ను లెక్క చేయనని తేల్చేశాడు. ప్రజల మనసులు గెలవడమే తనకు ముఖ్యమన్నాడు. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అన్న భయంతో హగ్ చేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు. పింకీ చాలా ఒంటరిగా ఫీల్ అవుతోందని, నన్ను తనతో ఉండమంటోందని షణ్నుతో చెప్పుకొచ్చింది సిరి. తర్వాత పింకీ దగ్గరకు వెళ్లి ఏమైంది డల్‌గా ఉన్నావంటూ ఆమె బాధను పోగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక రవి లేని లోటు గురించి చెప్పుకొచ్చింది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్షిప్ హగ్గంటూ షణ్నును హత్తుకుంది. ఎప్పటిలాగే కాజల్ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎవర్ని చేస్తారని లెక్కలు వేసుకుంటూ కూర్చుంది. సన్నీనెవరూ నామినేట్ చేయరని ఘంటాపథంగా చెప్పింది. చివరకు ఆమె అన్నదే నిజమైందనుకోండి, అది వేరే విషయం! మరోపక్క షణ్ముఖ్.. ప్రియాంకతో మాట్లాడుతూ.. సన్నీ, మానస్, కాజల్ ధైర్యం ఏంటంటే.. నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్లో ఉన్నావనుకుంటున్నారు అని ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నించాడు. అనంతరం 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిసభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి. కమ్యూనిటీ(ట్రాన్స్‌జెండర్) పేరు తీయడం తప్పంటూ కెప్టెన్ షణ్ముఖ్ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్ చేస్తూ ఆమె ఫేస్ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు. ప్రియాంక.. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కావట్లేదని సమయం వృథా చేయగా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్స్ తెలపకపోతే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్ చేసింది. శ్రీరామ్.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్, కాజల్‌ను నామినేట్ చేశాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవకుండా నీ గేమ్ నువ్వు ఆడంటూ సిరి.. పింకీ ఫేస్ ఉన్న బంతిని తన్నింది. కమ్యూనిటీ అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేసింది. సన్నీ, మానస్.. సిరి, శ్రీరామ్‌లను నామినేట్ చేశారు. నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు తప్పు అని భూతద్దంలో చూపిస్తున్నారంటూ కాజల్.. సిరి, ప్రియాంకను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
శ్రీరామ్‌కు దగ్గరైతే ఎలిమినేషన్ గండం తప్పదా!
Bigg Boss Telugu 5: తన గాత్రంతో ఇండియన్ ఐడల్ షోనే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులనూ గెలిచాడు సింగర్ శ్రీరామచంద్ర. అయితే ఆయనకు టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో ఎక్కువ పాపులారిటీ ఉంది. తను పుట్టిపెరిగింది తెలుగు నేలపైనే కాబట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని బిగ్‌బాస్ షోను ఎంచుకున్నాడు. ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అయితే ఎలిమినేషన్ వస్తుందంటే చాలు తను నామినేషన్స్‌లో ఉన్నా లేకపోయినా శ్రీరామ్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. శ్రీరామ్ సరదా మనిషి. కానీ అందరితో అంత ఈజీగా కలిసిపోలేడు. మనసు విప్పి మాట్లాడటానికి అతడికి కొంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు. విచిత్రంగా శ్రీరామ్‌కు దగ్గరవుతున్న వాళ్లందరూ ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో తనకంటూ ఒకరున్నారనుకులోపే వాళ్లు హౌస్‌ను వీడటంతో ఒంటరివాడవుతున్నాడు. మొదట్లో హమీదాతో శ్రీరామ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా చిటికెలో ఆమె ముందుండేవాడు. కన్నీళ్లు పెట్టుకుంటే చేరదీసి ఓదార్చేవాడు. ఆమెను ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకున్న అతడికి బిగ్బాగ్ షాకిస్తూ హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్ చేశారు. అప్పటి నుంచి శ్రీరామ్ బాగా డల్ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత యానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ ఆమెతో అప్పుడప్పుడే క్లోజ్ అవుతుండగా తనను కూడా ఎలిమినేట్ చేశారు. నాకు దగ్గరవుతున్నారనుకునేలోపు దూరమవుతున్నారంటూ ఎంతగానో బాధపడిపోయాడు శ్రీరామ్. ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్లలో శ్రీరామ్‌కు నచ్చిన వ్యక్తి, మనసుకు దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యాంకర్ రవియే! మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్ చేయకపోయినా శ్రీరామ్ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్‌కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్ అయిపోతే హౌస్‌లో శ్రీరామ్ నిజంగానే ఒంటరివాడవడం ఖాయం. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సన్నీ, మానస్, కాజల్, ప్రియాంక ఒక గ్రూపు కాగా షణ్ముఖ్, సిరి మరో గ్రూపు. మరి శ్రీరామ్ ఈ రెండింటిలో ఏదో ఒక గ్రూపులో చేరతాడా? లేదా ఒంటరిగా గేమ్ ఆడతాడా? అన్నది చూడాలి! -
అంతా కలిసి సన్నీని విన్నర్‌గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
హగ్గులు వద్దన్నందుకు తల్లిపై సిరి ఫైర్, ఏడ్చేసిన షణ్ను!
Bigg Boss Telugu 5, Episode 82: కుటుంబ సభ్యుల ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో ఆనందం తాండవం చేసింది. హౌస్మేట్స్ అందరూ వచ్చిన అతిథులను చూసి తెగ సంతోషపడ్డారు. నెక్స్ట్ ఎవరు వస్తారా? అని ఎవరికివారు ఆశగా గేట్ల వంక చూశారు. నిన్న కాజల్ ఫ్యామిలీ హౌస్‌లో సందడి చేయగా నేడు శ్రీరామ్, మానస్, సిరి ఇంటిసభ్యులు వచ్చారు. మరి వాళ్లేం అన్నారు? హౌస్‌లో ఎంత రచ్చ చేశారన్నది నేటి (నవంబర్ 25) ఎపిసోడ్లో చూసేద్దాం.. శ్రీరామ్ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు సూచనలు ఇచ్చింది. నీ పాయింట్ నువ్వు చెప్పు, కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినమని సూచించింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తర్వాత మానస్ తల్లి పద్మిని హౌస్‌లో అడుగు పెట్టింది. వచ్చీరావడంతోనే హౌస్ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది. మానస్‌తో పర్సనల్‌గా మాట్లాడుతూ.. నీ దృష్టంతా టాప్ 5లో చేరడంపైనే ఉండాలని నొక్కి చెప్పింది. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది. పక్కవాళ్లు డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. ఇక తనను హౌస్మేట్స్ ఆంటీ అని పిలవగా అక్క అని పిలవండని సూచించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది. శ్రీరామ్.. తనకు, మానస్‌కు మీలాంటి ఒక అమ్మాయిని చూడమని రిక్వెస్ట్ చేయగా శ్రీదేవి.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానంది. అంతలోనే హమీదా వెయిట్ చేస్తోందిలే అంటూ పంచ్ విసిరింది. ఆమె ఎనర్జీకి మంత్రముగ్ధుడైన శ్రీరామ్ నీవన్నీవే, నీవే.. అంటూ అందమైన పాట పాడాడు. తర్వాత ఆమె అందరికీ వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బీబీ ఎక్స్‌ప్రెస్ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్మేట్స్ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. అనంతరం సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని ఆగ్రహించింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి నొచ్చుకుంది. నువ్వెలాగో టాప్ 5లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు పట్టుకునే రావాలి అని సిరికి మరీమరీ చెప్పింది ఆమె తల్లి. తర్వాత తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది. 'సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా గేమ్ కూడా వదిలేసి ఇంత సపోర్ట్ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోయాడు. మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మానస్ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అనంతరం సన్నీ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోనుంది. ఆ సెలబ్రేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి. -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్: కూతుర్ని హత్తుకుని ఏడ్చేసిన కాజల్
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌లో గొడవలతో దద్దరిల్లిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకోనున్నాయి. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్. గతేడాది కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల గాజు అద్దంలో నుంచే చూసి మాట్లాడేలా షరతులు విధించారు. కానీ ఈసారి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు. బీబీ ఎక్స్‌ప్రెస్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్లను కదలకుండా ఆగుమన్న సమయంలో వారి కుటుంబ సభ్యులను లోనికి పంపించి సర్ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. ఈక్రమంలో నేడు కాజల్ భర్త, కూతురు ఇంట్లో అడుగుపెట్టారు. వారిని చూడగానే కాజల్ ఎమోషనల్ అయింది. తల్లీకూతుళ్లు ఒకరినొకరు హత్తుకుని ఏడ్చారు. ఇక కాజల్ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. 'మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా?' అని శ్రీరామ్ అడగ్గా అందుకు కాజల్ కూతురు అవునంటూ పవన్ కల్యాణ్ స్టైల్లో ఆన్సరిచ్చింది. తర్వాత శ్రీరామ్ కోసం ఆమె సోదరిని పంపించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్‌ను ప్రిపేర్ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు. అయితే నెట్టింట వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లోకి వస్తుండగా వీకెండ్ ఎపిసోడ్లో దీప్తి సునయనను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట! మరి ఇది నిజమేనా? ఇందులో ఏదైనా ట్విస్టు ఉంటుందా? అన్నది చూడాలి! -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై విశ్వక్ సేన్ సెటైర్లు!
Bigg Boss 5 Telugu, Vshwak Sen Supports VJ Sunny: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడిని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టి కౌంటర్లు విసురుతున్నాడు. హౌస్‌లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలుచుకుంటే ఎవరూ దాన్ని సెలబ్రేట్ చేయలేదని సెటైర్ విసిరాడు షణ్ను. దీనిపై విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మేము చేసుకుంటున్నాంలే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. తాజాగా నామినేషన్స్ జరిగిన తీరుపై కూడా రియాక్ట్ అయ్యాడు. నిన్నటి నామినేషన్స్‌లో సన్నీకి శ్రీరామచంద్ర, రవిలతో ఫైట్ జరిగింది. ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా రవి, శ్రీరామచంద్రలపై సెటైర్లు విసిరాడు. శ్రీరామచంద్ర అటూఇటూ తిరుగుతుంటే షుగర్ వచ్చిందేమోనని కౌంటర్ వేయగా రవికి ఓవర్ స్మార్ట్ షుగర్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. అయితే సపోర్ట్ చేయడం ఓకే కానీ మధ్యలో మా వాళ్లను ఎందుకు తిడుతున్నారని అటు శ్రీరామ్, ఇటు రవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాళ్లకన్నా ముందు నీకు షుగర్ వచ్చినట్లుందంటూ పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. -
ఉసురు పోసుకుంటున్నారు.. హీటెక్కించిన నామినేషన్స్
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ ఇంట్లో 12వ వారం నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా రవి వంతు రాగా.. విధులు సరిగా నిర్వర్తించట్లేదంటూ సన్నీని, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. గతవారం గేమ్ పెద్దగా ఆడలేదంటూ షణ్ను కుండ పగలగొట్టింది ప్రియాంక. సిరిని నామినేట్ చేసే క్రమంలో ఆమెతో పెద్ద గొడవే అయింది. కెప్టెన్‌గా, సంచాలకుడిగా పర్ఫెక్ట్గా లేడంటూ షణ్ను.. రవి దిష్టిబొమ్మపై కుండ పెట్టి పగలగొట్టాడు. సిరి-షణ్ను ప్లాన్ చేసుకుని వచ్చారా? అన్న ప్రశ్న వీకెండ్లో కాకుండా డైరెక్ట్‌గా అడుగుంటే బాగుండేదని కాజల్‌ను నామినేట్ చేశాడు. నీవల్ల కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయానంటూ సన్నీ కుండ బద్ధలకొట్టాడు శ్రీరామ్. ఎవిక్షన్ పాస్ యానీ మాస్టర్‌కు రాకుండా చేసి సన్నీకిచ్చిన కాజల్ కుండ ముక్కలు చేస్తూ ఆమెపై నిప్పులు చెరిగాడు శ్రీరామ్. యానీ మాస్టర్‌కు పాస్ రాకుండా చేయడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హౌస్‌లో అందరికంటే ఫేక్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్ కోసం సన్నీ, శ్రీరామ్ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు. అనంతరం సిరి.. నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, అలాగే రవిని నామినేట్ చేసింది. హౌస్‌లో నాకు ఇష్టం లేని వ్యక్తి, జెన్యున్‌గా లేనిది ఒక్కడేనంటూ రవిని నామినేట్ చేసింది కాజల్. యానీ మాస్టర్ ఉసురు పోసుకుంటున్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్ కుండ పగలగొట్టింది. తర్వాత కెప్టెన్ మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో కెప్టెన్ మానస్ మినహా మిగతా ఏడుగురూ నామినేట్ అయ్యారు. -
కాజల్‌పై భగ్గుమన్న శ్రీరామ్, దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన సన్నీ
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్. అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్.. నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు. తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్ మానస్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం! -
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ సీక్రెట్ రివీల్ చేసిన విశ్వ..
Bigg Boss Telugu 5, Vishwa Reveals BB5 Winner Name: బిగ్‌బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న విశ్వ గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తాను హౌస్ నుంచి బయటకు రావడం నమ్మలేకపోతున్నానని, అయితే ప్రేక్షకుల ఓటింగ్‌ను స్వాగతిస్తున్నా అని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వ..బిగ్‌బాస్ షో గురించి పలు ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఈ షో ద్వారా లోబో తనకు బెస్ట్‌ఫ్రెండ్‌గా మారిపోయాడని, బిగ్‌బాస్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదేనన్నాడు. ఇక అందరూ అనుకుంటున్నట్లుబిగ్బాస్ స్క్రిప్టెడ్ కాదని, అందులో జరిగేవన్నీ వాస్తవాలే అని తెలిపాడు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఈ సీజన్ విజేత శ్రీరామచంద్ర అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాని, మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. -
బిగ్‌బాస్ 5: శ్రీరామచంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే..
TSRTC MD Sajjanar Support Bigg Boss 5 Telugu Contestants Sreerama Chandra: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5వ సీజన్ 10వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ బిగ్‌బాస్ టైటిల్ గెలవాలంటూ శ్రీరామ్‌కు తన మద్దతు ప్రకటించగా తాజాగా ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా అతడికి సపోర్టుగా నిలవడం విశేషం. చదవండి: కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో.. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్ అండ్ టీం అతడిగా మద్దుతుగా నిలిచినందుకు సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: ఆ ఉత్తరాలు చదివితే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది: సోనూసూద్ కాగా సోనుసూద్, సజ్జనార్‌తో పాటు మరికొందరూ సెలబ్రెటీలు సైతం శ్రీరామ్‌కు సపోర్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మధ్య పాయల్ రాజ్‌పుత్ శ్రీరామచంద్రకు తన సపోర్ట్ ఉందని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామచంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. Honoured to receive blessings from IPS VC Sajjanar Sir. He created history nobody can forget! Thank you so much Real Superhero!! . . . #TeamSreeramaChandra #Sreeram #SreeramaChandra #SRC #biggboss5telugu #biggbosstelugu5 #GameChanger pic.twitter.com/hHyug07Nf2 — Sreerama Chandra (@Sreeram_singer) November 13, 2021 -
శ్రీరామచంద్రకు సూపర్ హీరో సపోర్ట్! ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Bigg Boss Telugu 5, Sonu Sood Supports Sreerama Chandra: సోనూసూద్.. లాక్డౌన్ ముందు వరకు ఈయన విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్డౌన్ తర్వాత సీన్ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండనిస్తూ పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు సూపర్ హీరో అయ్యాడీ యాక్టర్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను వేనోళ్ల కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్. తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్ షోపై స్పందించాడు. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హడావుడి చేస్తోంది. 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్' అని చెప్పుకొచ్చాడు. శ్రీరామచంద్ర ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వావ్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు 'హమ్మయ్య, ఇక బిగ్‌బాస్ కప్పు శ్రీరామ్‌దే'నని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) (చదవండి: శ్రీరామ్‌కే మద్దతిస్తానంటున్న ప్రముఖ కమెడియన్) (చదవండి: నా పాయింట్లో ఇదే కరెక్ట్, నేను అలానే చేస్తా.. పింకీపై షణ్ముఖ్ ఫైర్) -
శ్రీరామచంద్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్
Sri Reddy and Sreerama Chandra Whatsapp Chat: నటి శ్రీరెడ్డి టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు పెద్దమనుషుల భాగోతాలను బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను కూడా లీక్ చేసింది. 'చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్' అంటూ అతడి గుట్టు రట్టు చేసింది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా బయటపెట్టింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం శ్రీరామచంద్ర బిగ్‌బాస్ సీజన్-5లో కంటెస్టెంటుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ్ అంటే గొట్టని వాళ్లు, ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్లు ప్రస్తుతం దీన్ని ఆయుధంగా చేసుకొని శ్రీరామ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఇది శ్రీరామచంద్రుడి భాగోతం..అతడికి సపోర్ట్ చేయకండి అంటూ సోషల్ మీడియాలో అతనిపై విషం చిమ్ముతున్నారు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ చాట్ మరోసారి తెరమీదకి రావడం అతని ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందంటూ శ్రీరామ్ ఫాలోవర్స్ మండిపడుతున్నారు. మరోవైపు శ్రీరామచంద్రకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. -
విన్నర్, టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పేసిన విశ్వ
Bigg Boss 5 Telugu, 9th Week Vishwa Eliminated: విశ్వ ఎలిమినేషన్‌తో ఇంటిసభ్యులు డల్ అయిపోయారు. బెస్ట్ సంచాలకుడు, బెస్ట్ రేషన్ మేనేజర్, బెస్ట్ కెప్టెన్, బిగ్‌బాస్ హౌస్‌కు సూపర్ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు. నువ్వు స్ట్రాంగ్, కానీ గేమ్‌లో గివప్ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. యానీ ఫైటర్ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్‌కు సూచిస్తూ 6వ ర్యాంక్ ఇచ్చాడు. తర్వాత టాప్ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్ 5లో ఉండాలన్నాడు. సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్ అయ్యే షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు. -
విశ్వ ఎలిమినేటెడ్, శోకసంద్రంలో యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Vishwa Eliminated: సండేను ఫండేగా మార్చడానికి రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. హౌస్‌మేట్స్‌తో 'బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?' అనే గేమ్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. A టీమ్‌లో సన్నీ, విశ్వ, షణ్ముఖ్, కాజల్, ప్రియాంక ఉండగా మిగిలినవారంతా B టీమ్‌లో ఉంటారు. ఇక ఈ గేమ్‌లో విజువల్స్ చూసి సాంగ్ గెస్ చేయాలి. ఈ గేమ్‌లో రవి టీమ్(B టీమ్) గెలిచింది. తర్వాత శ్రీరామ్ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో 'నేను ఎవరిని?' గేమ్ ఆడించారు. ఇందులోని చీటీలలో కంటెస్టెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. టీమ్ నుంచి ఒక్కొక్కరు వస్తూ తము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్ చేయాలి. సదరు టీమ్ వాళ్లు గెస్ చేయాలి. ఇందులో ఒకరినొకరు బాగా ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. ఫైనల్‌గా ఈ గేమ్‌లో సన్నీ( A) టీమ్ గెలిచింది. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని నాగ్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో సన్నీ, మానస్.. షణ్ముఖ్‌ను, షణ్ముఖ్.. ప్రియాంక సిరిపై దాడి చేసిందంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియాంక.. విశ్వను; విశ్వ.. జెస్సీని; జెస్సీ, సిరి, శ్రీరామ్.. కాజల్; కాజల్.. సిరి; రవి.. మానస్‌ను; యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైంది. తర్వాత ప్రియాంక సింగ్ సేఫ్, కాజల్ సేఫ్ అవగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్గా గేమ్ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ కంటతడి పెట్టుకుంది. -
వాళ్లెవరూ కాదు, ఆ కంటెస్టెంటే సుందరి: శ్రీరామ్
Bigg Boss 5 Telugu Promo: నాగార్జున క్లాస్ పీకిన తర్వాత హౌస్‌లో చాలా మార్పులు వచ్చాయి. సన్నీ తన కోపాన్ని వదిలేసి చాలా కూల్ అయిపోయాడు. దీంతో అతడితో ఎప్పుడూ గొడవ పడే శ్రీరామ్, షణ్ముఖ్ కూడా సన్నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇందుకు తాజా ప్రోమోనే నిదర్శనం. ఒక పాట ప్లే చేసిన నాగ్.. దీనికి సరిపోయే సుందరి ఎవరని ప్రశ్నించాడు. హౌస్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నప్పటికీ శ్రీరామ్ మాత్రం వాళ్లందరినీ కాదని సన్నీ పేరు చెప్పాడు. దీంతో నవ్వాపుకోలేకపోయిన నాగ్ చివరికి సన్నీని సుందరిని చేశారని కామెంట్ చేస్తాడు. నేనెవర్ని గేమ్‌లో ఇంటిసభ్యులు ఒకరినొకరిని ఇమిటేట్ చేయడంతో పాటు డ్యాన్సులు చేశారు. ఈ క్రమంలో షణ్ను, సన్నీ కలిసి స్టెప్పులేశారు. ఇది చూసిన నెటిజన్లు మార్పు మంచిదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సన్నీ, మానస్ స్నేహాన్ని మిస్ అవుతున్నామంటున్నారు మరికొందరు. -
మీరు నా బేబీలు.. ఇద్దరూ చెరో ముద్దివ్వొచ్చుగా: జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్ ధ్యాసలో పడి గేమ్ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్లో ఉందని మానస్‌తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్‌ను తాను డిస్టర్బ్ చేయడం లేదన్నాడు మానస్. ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు. అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్స్ టీమ్‌గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్ హీరోస్ టీమ్‌గా విడిపోయారు. ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్‌లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది. మొదటి రౌండ్లో విలన్స్‌కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్ లభించినట్లైంది. తర్వాతి రౌండ్లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్ గ్లాస్‌ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు -
Bigg Boss 5 Telugu: ఆ 10 మందికి సూపర్ చాన్స్.. పాపం కాజల్!
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా..మిగిలిన సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు. అయితే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?) గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్‌లోకి తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని పరుగెత్తాలి. వీరిలో ఎవరైతే చివరిగా సేఫ్‌జోన్ డోర్‌లోకి వెళ్లారో.. ఆ సభ్యుడితో పాటు అతని చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్లోనే డేంజర్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లనట్లు తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి.. నామినేషన్స్ నుంచి బయటపడ్డారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే. -
జెస్సీకి అస్వస్థత, లెక్క చేయని షణ్ముఖ్, సిరి
Bigg Boss 5 Telugu, 9th Week Nominations: జెస్సీ పొద్దుటినుంచి వాంతింగ్ చేసుకుంటుంటే పక్కనే ఉండి కాసేపు అతడికి అండగా నిలబడ్డాడు. జెస్సీ ఆరోగ్యం బాగోలేకపోతే షణ్నూ, సిరి ఏమాత్రం పట్టించుకోవట్లేదేంటని సన్నీ మానస్‌తో వాపోయాడు. కానీ మానస్ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సలహా ఇచ్చాడు. మరోవైపు జెస్సీ లోపలికి వెళ్లి బెడ్‌పై కూర్చుని అవస్థ పడుతున్నాడు. అతడి పక్కనే ఉన్న షణ్ను చూసి వదిలేశాడే కానీ, కనీసం ఏమైందని కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. సీక్రెట్ టాస్క్ ఫెయిలయినప్పటి నుంచి జెస్సీని వాళ్లు దూరం పెడుతున్నారని మానస్ అభిప్రాయపడ్డాడు. అనంతరం 9వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరాఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్. తర్వాత సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్ చేశాడు. కాలేజీ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను నామినేట్ చేశాడు. 'అన్నీ గుడ్ క్వాలిటీస్, ఫెంటాస్టిక్ పర్సన్.. కానీ ధైర్యం కోల్పోతున్నావ్' అంటూ రవి.. మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. పింకీ.. స్ట్రాంగ్ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నానని అతడిని నామినేట్ చేసింది. సిరి.. సన్నీ, యానీని; జెస్సీ.. సన్నీ, మానస్‌ను; సన్నీ.. జెస్సీ, సిరిని నామినేట్ చేశారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్ చేసింది. యానీ.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. షణ్ను.. మానస్‌తో పాటు ప్రియాంకను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్ అనిపిస్తావు' అని సలహా ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. 'నామినేట్ చేసి వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?' అని చిర్రుబుర్రులాడింది. అయినా నేను ఏ గేమ్ సరిగా ఆడటం లేదో చెప్పాలి కదా! అని ఆవేశపడింది. షణ్ను ఫోమ్ పూయబోతే పింకీ ఆ ప్లేట్‌ను తన ముఖాన గట్టిగా కొట్టుకుంది. నామినేషన్ పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. హైలైట్ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా? -
బ్రహ్మ కాకుండా నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
Bigg Boss Telugu 5 Promo, 9th Week Nominations: బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ల కోపతాపాలతో భగ్గున మండుతోంది. అసలే నామినేషన్స్ డే. వారిని కూల్ చేయడం బిగ్‌బాస్ వల్ల కూడా కాదు. ఫైర్ మీదున్న హౌస్మేట్స్ మాస్క్ తీసి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రవి- మానస్‌కు, శ్రీరామ్- కాజల్‌కు, శ్రీరామ్- మానస్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. 'నీ ఇంటి పేరు పొగరా? నీ ఇంటిపేరు పొగరుబోతా?' అని కాజల్‌ను ప్రశ్నించాడు శ్రీరామ్. దీనికి కాజల్ స్పందిస్తూ.. నీ రియాక్షన్సే నచ్చడం లేదంటూ నామినేట్ చేసింది. తర్వాత రవిని నామినేట్ చేస్తూ.. నిన్ను ఎదగకుండా ఆపడానికి ట్రై చేయలేదని.. తనే కాదు, హౌస్‌లో ఎవరూ ఆ పని చేయలేరని చెప్పింది. ఇక పింకీ వంతు రాగా రవి అన్న కంటే ఎవరూ బాగా ఆలోచించలేరంటూ నామినేట్ చేసింది. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, వేరే గేమ్ ఆడొద్దు' అంటూ నామినేట్ చేశాడు షణ్ను. ఇలా అనేసి నామినేట్ చేసి బయటకు పంపించాక నా గేమ్ ఇంకెవరు ఆడతారు? అని ఫైర్ అయింది పింకీ. అతడు ఫోమ్ పూస్తుంటే అతడిని ఏమీ చేయలేక ఆ ప్లేటును గట్టిగా ముఖానికి కొట్టుకుంది. నువ్వు వెళ్లిపోతే నాకు ఫరాఖ్ పడదని శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా కూడా నాకు ఫరాఖ్ పడదని రివర్స్ కౌంటరిచ్చాడు రామ్. ఇక ఈ 9వ వారం నామినేషన్లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరూ నామినేట్ అయ్యారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే యానీ గత ఆదివారం సంపాదించిన స్పెషల్ పవర్‌తో నామినేషన్ నుంచి బయటపడుతుందా? లేదా ఆ పవర్‌ను ఇప్పుడెందుకులే! అని భద్రంగా దాచిపెట్టుకుంటుందా? అన్నది చూడాలి! -
రా, వచ్చి కొట్టు.. వెయిట్ చేస్తున్నా: సన్నీని రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీని ఆపడం ఎవరివల్లా కావట్లేదు. అతడి ఆవేశాన్ని చల్లార్చడం ఒక్క నాగార్జున వల్లే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇంటిసభ్యులను రెండుగా విభజించిన బిగ్‌బాస్ వారికి పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. దీనికి షణ్ముఖ్ సంచాకుడిగా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ 50 పూరీలు ముందుగా రెడీ చేసినప్పటికీ షణ్ను.. యానీ మాస్టర్ టీమ్ చేసిన పూరీలే పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ వారిని గెలిపించాడు. అయితే జైల్లో ఈ టాస్క్‌ను మొదటి నుంచీ గమనిస్తోన్న సన్నీ.. పాపం వాళ్లు కష్టపడి చేశారని పేర్కొన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? మాట్లాడేందుకైనా బుద్ధి ఉండాలి అని మండిపడింది. సన్నీ మీదకు ఫైర్ అవడంతో శ్రీరామ్, షణ్ముఖ్ నవ్వాపుకోలేకపోయారు. హౌస్‌లో కొంతమంది బాధపడుతుంటే నవ్వుతున్నావు, అది కరెక్ట్ కాదు, బయటకొస్తా ఆగు అని సూచించాడు. దీంతో షణ్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షణ్ను.. అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సవాల్ చేశాడు. మరి సన్నీ జైలు నుంచి బయటకొచ్చాక ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
షణ్ముఖ్ నా మీదకొస్తున్నాడు, మొగోడు ఆడే ఆటేనా: యానీ ఉగ్రరూపం
Bigg Boss 5 Telugu, Episode 54: యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొదటిరోజునుంచే గేమ్ ఆడటం మొదలు పెట్టాడని పింకీతో చెప్పుకొచ్చాడు మానస్. ఈ హౌస్‌లో అతడితో ఫ్రెండ్షిప్ చేయాలని, అతడిని దగ్గర చేసుకోవాలని ఎవరికీ లేదన్నాడు. మరోవైపు రవి అర్ధరాత్రి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ఇంకా మెలకువతోనే ఉన్న షణ్ను, సిరి కాలికి దండం పెట్టాడు. ముద్దు పెట్టి సైలెంట్‌గా వెళ్లిపోయిన సిరి, ఉక్కిరిబిక్కిరైన షణ్ను తర్వాతి రోజు ఏమైందో ఏమో కానీ సిరి సడన్‌గా షణ్నుకు ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా? నాకు ఉంటదిపుడు అని తనలో తానే సణుక్కున్నాడు. కాసేపటికే మళ్లీ వచ్చిన సిరి.. నీ వల్లే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పింది. నేను నీతో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అని షణ్నుని అడిగింది. వీటికి షణ్ను బదులిస్తూ.. నా వల్ల చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని సింగిల్ డైలాగ్‌లో తేల్చేశాడు. నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది. ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ సన్నీని రెచ్చగొట్టిన శ్రీరామ్ తర్వాత 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా థర్మాకోల్ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో శ్రీరామ్, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్ పోటీపడ్డారు. ఫస్ట్ బజర్ మోమగానే శ్రీరామ్, సన్నీ ఒకరినొకరు తోసుకుని కిందపడ్డారు. అయితే సన్నీ అవుట్ అయ్యాడని సంచాలకుడు జెస్సీ ప్రకటించాడు. కానీ అతడు గేమ్ నుంచి వెళ్లిపోతూ తన ఫ్రెండ్ మానస్‌ను గెలిపించాడంటూ చురకలంటించాడు శ్రీరామ్. ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ అతడిని రెచ్చగొట్టాడు. నోరు అదుపులో పెట్టుకో: శ్రీరామ్ వార్నింగ్ 'సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా.. ఓడిపోయినవ్, అందుకే బయటున్నవ్..' అని పదేపదే చెప్తూ అతడు మండిపోయేలా చేశాడు. గాల్లో ముద్దులు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. తర్వాతి రౌండ్లో శ్రీరామ్, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్ అని ప్రకటించాడు. అతడి నిర్ణయంతో ఏకీభవించని సన్నీ.. జెస్సీ ముందున్న బ్యాగును తంతూ రెచ్చిపోయాడు. మానస్ అవుట్ కాదంటూ వాదించాడు. కొరికిన యానీ! కత్తి అందుకున్న సిరి! తర్వాతి రౌండ్లో ముగ్గురు మిగలగా షణ్ను, సిరి యానీని టార్గెట్ చేశారు. దీంతో యానీ.. 'ఇండివిడ్యువల్ గేమ్ లేదు, నిజాయితీ లేదు' అంటూ సిరిని నెట్టేసింది. అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన ఇంటిసభ్యులు అది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. అయితే అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని, అలాంటప్పుడు తాను ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్ అవ్వగలనంటూ ఆవేదన చెందింది యానీ. దీంతో స్వచ్ఛందంగా గేమ్‌లో నుంచి తప్పుకుంది. నా ముందుకు రాకు: యానీ వార్నింగ్ ఈ ఇంట్లో ఉన్నంతవరకు తాను కెప్టెన్ అవ్వను అంటూ ఏడ్చేసింది. ఆమెను ఓదార్చేందుకు సన్నీ వెళ్లగా అతడిపై కూడా ఫైర్ అయింది. నా కళ్ల ముందుకు రాకంటూ వార్నింగ్ ఇచ్చింది. 'పందులే గుంపులుగా ఆడతాయి, సింహం సింగిల్‌గా ఆడుతుంది' అంటూ డైలాగులు వదిలింది. 'గేమ్‌లో షణ్ముఖ్ నా దగ్గరకు వస్తున్నాడు, మొగోడు ఆడే ఆట ఇదేనా' అని మండిపడిపోయింది. చివరి రౌండ్లో సిరిపై షణ్ముఖ్ విజయం సాధించి కెప్టెన్‌గా అవతరించాడు. దీంతో అతడికి హగ్గుల మీద హగ్గులిచ్చింది సిరి. మరోవైపు మానస్.. ఎవరెవరిని టార్గెట్ చేయాలో ఫిక్సయ్యానని సన్నీతో చెప్పుకొచ్చాడు. కానీ పేర్లు మాత్రం వెల్లడించలేదు. చేతులు కట్టుకుని కూచున్నా అంటున్నారు కదా! అటాక్ అంటే ఏంటో చూపిస్తానని ఫిక్సయ్యాడు మానస్. -
కెప్టెన్‌గా అవతరించిన షణ్ముఖ్, ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
Bigg Boss 5 Telugu Promo, Shannu New Captain Of BB House: బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ కోసం ఫైట్ నడుస్తోంది. 'అభయహస్తం' టాస్క్‌లో పెట్టిన పలు ఛాలెంజ్‌లను సమర్థవంతంగా పూర్తి చేసిన షణ్ను, మానస్, సన్నీ, సిరి, యానీ, శ్రీరామ్ 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పోరాడనున్నారు. ఈ గేమ్‌లో పోటీదారులు ఇతరుల థర్మాకోల్ బస్తాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆటలో భాగంగా శ్రీరామ్ సన్నీని నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు. నన్నే నెట్టేస్తాడా? అని ఆవేశపడ్డ సన్నీ.. శ్రీరామ్ బస్తాను ఖాళీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఈ గేమ్‌లో మొదటగా సన్నీ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఒక పక్క కోపం, మరోపక్క ఓటమి బాధతో రగిలిపోయిన ఈ కెప్టెన్ 'అటాక్ చేయండి' అని ఆదేశాలిచ్చాడు. దీంతో శ్రీరామ్ అతడిని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. 'సన్నీ ఇండింపెండెంట్ ప్లేయర్ అనుకున్నా, ఆడి ఓడిపోయినవ్.. గొంతు అదుపులో పెట్టుకో' అని వార్నింగ్ ఇస్తూనే గాల్లో ముద్దులు పంపాడు. ఈ గేమ్‌కు జెస్సీ సంచాలకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ గేమ్‌లో షణ్ముఖ్ విజయం సాధించి బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు షణ్ను కెప్టెన్ అయ్యాడోచ్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. షణ్ను.. రేషన్ మేనేజర్ పోస్టును యానీకి ఇచ్చినట్లు సమాచారం! మరి కెప్టెన్‌గా షణ్ను బిగ్‌బాస్ హౌస్‌ను ఎలా చక్కబెడతాడు? తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్: శ్రీరామ్ కోసం రంగంలోకి టాప్ కమెడియన్
Comedian Bharti Singh Supports Sreerama Chandra: సింగర్ శ్రీరామచంద్ర.. తెలుగువాడే కానీ తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం లేదు. హిందీలో ఇండియన్ ఐడల్ షో విన్నర్‌గా నిలిచిన తర్వాత అంతా అతడిని గుర్తుపట్టడం ప్రారంభించారు. ఉత్తరాదిలో కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడికి తెలుగువారికి చేరువకావాలన్న ఆశ అలాగే ఉండిపోయింది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి బిగ్‌బాస్ షోను సాధనంగా మార్చుకున్నాడీ సింగర్. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అనవసరంగా తగాదాలు పెట్టుకోకుండా, ఒకవేళ ఎవరైనా కావాలని తగవు పెట్టుకున్నా చిరునవ్వుతోనే సమాధానమిస్తూ మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తనను తాను నిరూపించుకుంటున్నాడు. తాజాగా శ్రీరామ్ కోసం రంగంలోకి దిగిందో పాపులర్ కమెడియన్. శ్రీరామచంద్రకే ఓటేయండంటూ వీడియో చేసింది. 'నా ఫ్రెండ్ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అతడికి ఇదే నా బెస్ట్ విషెస్.. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి' అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన శ్రీరామ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అతడికి సపోర్ట్ చేసినందుకు భారతీ సింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ మధ్యే బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా శ్రీరామ్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
Bigg Boss 5 Telugu: ప్రియాంక.. ముద్దుల బావలు వీళ్లే
బిగ్‌బాస్-5లో ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్‌గా పరిచయం అయినా ప్రియాంక... తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. మానస్‌తో ఆమె నడిపే లవ్‌ట్రాక్.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వారిద్దరిపై మిగతా సభ్యులు వేసే పంచ్‌లు, జోకులు బాగా పేలుతున్నాయి. తాజా ఎపిసోడ్లో ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూయించాయి. శ్రీరామ్‌ను పెద్ద బావ, మానస్‌ను చిన్నబావ అని, జెస్సీని బుల్లి బావ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. పెద్ద బావ ఒప్పుకోవడం లేదన్న.. కట్నం కావాలని అంటున్నాడు అన్నయ్య అంటూ యాంకర్ రవితో అంటే.. రెండో అన్నయను అడుగు అంటూ లోబో వద్దకు పంపించాడు రవి. లోబో మాట్లాడుతూ పింకికి బుల్లి బావ ఎవరు అనగా.. జెస్సీ అని రవి సమాధానం ఇచ్చాడు. అయితే వాడు కూడా క్యారెక్టర్లో ఉన్నాడా అంటూ లోబో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో జెస్పీ గాడికి నేనంటే చాలా ఇష్టం అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’లోబో అంటే ‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’అని ప్రియాంక రిక్వెస్ట్ చేసింది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్ అవుతాడు.. వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాఅని లోబో చెప్పాడు. ‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’అని రవి కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించింది. (చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్) -
నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి
Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క! నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్: షణ్ముఖ్ తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్‌కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్‌కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు. -
ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు
Bigg Boss 5 Telugu, Pride Of BB5 Sreeram Trending In Twitter:బిగ్‌బాస్ షోలో మిస్టర్ కూల్ ఎవరు అనగానే రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి మానస్, మరొకటి శ్రీరామచంద్ర. ఏదైనా గొడవ జరిగినప్పుడు మానస్ ముఖం కోపంతో ఎర్రబడుతుంది కానీ శ్రీరామ్ ఫేస్‌లో మాత్రం స్మైలే కనిపిస్తుంది. టాస్క్ అయినా, గొడవైనా, మరేదైనా సరే తన ముఖం మీద చిరునవ్వు చెదరనీయడీ సింగర్. తనకు బిగ్‌బాస్ ట్రోఫీ, ప్రైజ్‌మనీ కన్నా తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వడమే ముఖ్యమని చెప్పిన వ్యక్తి ఈయన. ఈ సీజన్లో టాప్ 5కి చేరుకునేవారిలో శ్రీరామ్ తప్పకుండా ఉంటాడని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. టైటిల్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే గెలిచే అవకాశాలు కాదు, గెలవడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. తాజాగా శ్రీరామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి #PrideOfBB5Sreeram అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌కు శ్రీరామ్ కింగ్ అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం 24 గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌తో లక్షకు పైగా ట్వీట్లు చేయడం విశేషం. మొన్నటివరకు ఓ రేంజ్లో ఆడి రెచ్చిపోయిన శ్రీరామ్ ఈమధ్య కాస్త డల్ అయ్యాడు. హమీదా వెళ్లిపోయినప్పటి నుంచి అతడి స్క్రీన్ స్పేస్ బాగా తగ్గిపోయింది. అయితే అతడు వీలైనంత త్వరగా మామూలైపోయి ఎప్పటిలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. 'తిరిగి ఫామ్‌లోకి రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో కానీ విన్ అవ్వడం మాత్రం పక్కా, రాసిపెట్టుకోండి', 'అతడు హౌస్‌లో ఒంటరివాడయ్యాడేమో కానీ బయటకు వచ్చాక మాత్రం కాదు' అంటూ పంచ్ డైలాగులు విసురుతున్నారు. వీరికి తోడుగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా శ్రీరామ్‌కు అండగా నిలబడ్డ విషయం తెలిసిందే. Like a Cakewalk 💥💥💥#PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/Oz3vayOvav — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 Some of the major Achievements of @Sreeram_singer#PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/3YGcDDgyKP — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 Transformation of our #PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/HcgIrMwQVF — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 -
బిగ్‌బాస్: ఆ కంటెస్టెంట్ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్!
19 మందితో కళకళలాడిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు ఆరుగురు వెళ్లిపోగా అందులో ఐదుగురు ఆడవాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ వారం ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఈసారి కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో.. ఇలా 8 మంది నామిషన్‌లో ఉన్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈపాటికే ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే! అయితే ఓ కంటెస్టెంట్ కోసం ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్‌కు ఓటేయమంటూ జనాలను అభ్యర్థిస్తోంది. ఆమె మరెవరో కాదు 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపిందీ భామ. 'నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి ఓ మై గాడ్ అనుకున్నాను. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్‌కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చింది. -
Bigg Boss Telugu 5: ఆ కంటెస్టెంట్ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్!
-
శ్రీరామ్‌పై ప్రేమను బయటపెట్టిన హమీదా!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఐదో ఎలిమినేషన్ ఊహించినట్లుగానే జరిగింది. ముందు నుంచీ అనుకున్నట్లే హమీదా హౌస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఆమె లేని లోటు అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్‌ను వెంటాడనుంది. నిరంతంరం అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అటు పనుల్లోనూ, ఇటు టాస్కుల్లోనూ శ్రీరామ్ చేయి విడవలేదు హమీదా. అలాంటిది సడన్‌గా అతడికి దూరం కావాల్సిరావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేముందు శ్రీరామ్‌ను కళ్లారా చూసుకుని మనసారా ఏడ్చేసింది. అతడి మీదున్న ప్రేమను తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో బయటపెట్టిందీ బ్యూటీ. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైన హమీదా కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. షణ్ముఖ్ హౌస్‌లో పెదరాయుడు అని చెప్పుకొచ్చింది. సిరి.. గ్రూప్‌లో ఉందని, ఆమె చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేయడానికి ఆలోచిస్తుందని పేర్కొంది. శ్రీరామ్, మానస్ రెండు కళ్లు అన్న ప్రియాంక సింగ్ రిలేషన్‌షిప్‌ను ఫేక్ చేస్తుందని ఆరోపించింది. హౌస్ నుంచి ఏం తీసుకువెళ్తున్నావ్? అన్న అరియానా ప్రశ్నకు హమీదా క్షణం ఆలోచించకుండా శ్రీరామ్ అని సమాధానమిచ్చింది. అంతేకాకుండా శ్రీరామ్ ఫొటో చూడగానే సిగ్గుతో ముడుచుకుపోతూనే ఎమోషనల్ అవుతూ లవ్ సింబల్ చూపిస్తూ మనసులోని ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్యాయంగా శ్రీరామ్-హమీదాలను విడదీసారంటూ కామెంట్లు పెడుతున్నారు. -
మీరు ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటా: సన్నీ వార్నింగ్
Bigg Boss Telugu 5, Sixth Week Nominations: వారమంతా కలిసే ఉంటారు. కానీ సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడలేని కోపాలు ప్రదర్శిస్తుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ నానారభస చేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య వైరం పెరిగేది, మిత్రువులు కూడా శత్రువులుగా మారేది ఈ 'మండే' రోజే. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్‌తో భగభగ మండిపోతోంది బిగ్‌బాస్ హౌస్. ప్రతిసారి ఎధవ రీజన్లతో నామినేట్ చేస్తారంటూ తెగ చిరాకు పడింది ప్రియాంక సింగ్. టాస్క్‌లో నా జేబులో నుంచి కాయిన్లు దొంగతనం చేశాడంటూ లోబో జెస్సీని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణం విన్న జెస్సీ వెటకారంగా నవ్వుతూ తాను గేమ ఆడటానికి వచ్చానని, నమ్మకంతో పని లేదంటూ కౌంటరిచ్చాడు. అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్ చేశాడు శ్రీరామ్. అలాగే షణ్ముఖ్‌ను సైతం నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నామినేషన్‌ను జీర్ణించుకోలేకపోయిన షణ్ను... బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వో దేవుడివి, నువ్వేది చెప్తే అదే మేం పాటించాలి! అంతేనా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వీరిద్దమరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ప్రియ ఉన్నన్ని రోజులు తప్పకుండా ఆమెనే నామినేట్ చేస్తానన్నాడు సన్నీ. అతడి మాట విని అవాక్కైన ప్రియ.. వార్నింగ్ ఇస్తున్నావా? అంటూనే అతడి ఫొటోను మంటల్లో వేసింది. మొత్తానికి వాడివేడిగా సాగనున్న ఈ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. -
ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించిన తండ్రి
Bigg Boss Telugu 5, Episode 32: బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'రాజ్యానికి ఒక్కడే రాజు' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి లెవల్లో ఇచ్చిన కుస్తీపోటీలో విశ్వ మానస్‌ను ఓడించి పైచేయి సాధించాడు. తర్వాత తనతో పోటీలోకి దిగిన యానీ మాస్టర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు జెస్సీ. అనంతరం ప్రియాంక సింగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది శ్వేత. మొత్తంగా ఈ టాస్క్‌లో యాంకర్ రవి రెండు పాయింట్ల ఆధిక్యంతో గెలిచాడు. దీంతో అతడికి 150 నాణాలు వచ్చాయి. అయితే ఖజానాలో నుంచి నాణాలు దొంగిలిస్తున్నారంటూ విశ్వ చిర్రుబుర్రులాడాడు. కానీ విశ్వ పేరు పెట్టి ఎవరినీ తిట్టకపోవడంతో మానస్ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. సైగలతో సంభాషించుకున్న శ్రీరామ్, హమీదా ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్ నాణాలు పంచుకున్నారు మరోపక్క హమీదా శ్రీరామ్‌ను తన కౌగిలిలో బంధించింది. తర్వాత వీళ్లిద్దరూ ఎప్పటిలాగే సైగలతో సంభాషించుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'రాజుగారి గోడ' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్మేట్స్ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క! శ్రీరామ్ గాలి తీసేశారు..: షణ్ను దీంతో సన్నీకి సపోర్ట్‌గా మానస్, జెస్సీ బరిలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్ తీవ్రంగా ప్రయత్నించాడు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని ఆవేశపడ్డాడు సన్నీ. దీంతో చిర్రెత్తిపోయిన శ్రీరామ్.. ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను.. ఇప్పటిదాకా స్ట్రాంగ్ అనుకున్న శ్రీరామ్ గాలి తీసేశారంటూ సెటైర్ వేశాడు. ఆ అవార్డు ఉంటే అది కాజల్‌కే చెల్లుతుంది: యానీ ఇంతలో కాజల్ నాణాలు దొంగతనం చేయడం చూశాడు రవి. అయితే అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ బుకాయించింది కాజల్. అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్ యవ్వారంతో ఇరకాటంలో పడ్డాడు రవి.. ఆమెతో పెట్టుకుంటే పనులు అయినట్లేనని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్.. నిజానికి ప్రోవోక్ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలంది. ఇంతలో సిరి.. సడన్‌గా రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి షిఫ్ట్ అయింది. మళ్లీ గెలిచిన సన్నీ.. అనంతరం బిగ్‌బాస్.. 'లాక్కో లాక్కో తాడు' టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే గెలిచినట్లు లెక్క! ఈ టాస్క్‌లో మరోసారి యువరాజు సన్నీ గెలుపు సాధించడంతో అతడి ప్రజానీకం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఆమెగా మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పింకీ ఎంతో భావోద్వేగానికి లోనవగా హౌస్ మొత్తం కూడా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది. -
శ్రీరామ్‌ను ఎత్తిపడేసిన జెస్సీ, ఇది కదా అసలైన కొట్లాట!
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హింసకు తావు లేదని బిగ్‌బాస్ గతంలోనే హెచ్చరించినా కంటెస్టెంట్లు మరోమారు ఆ మాటను పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో హౌస్మేట్స్ దెబ్బలు తాకినా, రక్తాలు కారినా తగ్గేదేలే అన్న రీతిలో పోరాడుతున్నారు. ఈ వారం బిగ్‌బాస్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా.. యువరాజులుగా ఉన్న రవి, సన్నీ సింహాసనాన్ని అధిష్టించేందుకు పోటీపడతారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాస్కులు కొనసాగేకొద్దీ కొందరు ప్రజలు తమ యువరాజుకు మద్దతును ఉపసంహరించుకునేందు ప్రయత్నిస్తుండగా మరికొందరు పట్టపగలే ఖజానాను దొంగిలించేందుకు యత్నించారు. ఇది చూసిన శ్వేత.. 'ఇంకా గేమ్ ఎందుకు ఆడటమో' అని సెటైర్ వేసింది. మరోవైపు సన్నీ వర్సెస్ రవి అని రాసి ఉన్న బోర్డులపై యువరాజుల ఫొటోలు పెట్టి ఉండగా హౌస్మేట్స్ దాన్ని విసిరి పారేసేందుకు తీవ్రంగా శ్రమించారు. బోర్డులను కింద పడేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేసినట్లు కనిపించింది. మరీ ఇంత అరాచకంగా మారిన ఈ గేమ్‌లో ఏ యువరాజును ఎవరెవరు గెలిపించారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది! -
కెప్టెన్‌తో కొట్లాట.. సిగ్గు, శరం ఉండాలంటూ యానీ మాస్టర్ ఫైర్
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: నామినేషన్స్ వచ్చాయంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోతుంటాయి. అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నవారు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోవచ్చు. ఆల్రెడీ శత్రువులైన వారి మధ్య మరింత దూరాన్ని పెంచవచ్చు. మొత్తంగా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టే నామినేషన్ పర్వం నేడు స్టార్ట్ అయింది. దీంతో ఎవరెవర్ని నామినేట్ చేయాలా? అని హౌస్మేట్స్ పరిపరివిధాలుగా ఆలోచించారు. మరి నేటి గేమ్‌లో ఎవరు నామినేట్ అయ్యాడు? ఏమేం గొడవలు జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే.. గేమ్‌లో గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఒకరిని తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిడివాళ్లు ఎవరూ ఉండరు అని జెస్సీ యాంకర్ రవి మీద పరోక్షంగా మండిపడ్డాడు. ఇక్కడ హౌస్‌లో విశ్వ, రవి, లోబో, సన్నీ, మానస్ ఒక గ్రూప్ అయ్యారని షణ్నుతో చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే కిచెన్‌లో పనులు పంచుకోండని కెప్టెన్ శ్రీరామ్ సన్నీకి సలహా ఇచ్చాడు. అయితే ఇంతలో సిరి వచ్చి.. కిచెన్‌లో ఆల్రెడీ మనం పనులు పంచేసుకున్నాం కదా అని చిర్రుబుర్రులాడింది. అయినా ఇక్కడ కెప్టెన్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడంటూ తన గ్యాంగ్‌తో కూర్చున్నప్పుడు శ్రీరామ్ మీద జోకులు పేల్చింది. లోబో వల్లే నాకా శిక్ష, అందుకే నామినేట్: జెస్సీ తర్వాత ఐదోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఇంటిసభ్యులు ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన జెస్సీ... తన మాటలే వినాలి, తను చెప్పినట్లే ఆడాలని రవి మానిప్యులేట్ చేస్తున్నాడంటూ అతడిని నామినేట్ చేశాడు. లోబో వల్లే కెప్టెన్సీ టాస్క్‌లో శిక్ష పడిందని అతడిని నామినేట్ చేశాడు. తర్వాత సన్నీ.. షణ్ముఖ్, సిరితో కనెక్ట్ కాలేకపోయానంటూ వారిద్దరినీ నామినేట్ చేశాడు. ఆమె ఏది మాట్లాడినా సీరియస్‌గా తీసుకుంటుంది..: పింకీ విశ్వ.. జెస్సీ చాలాసార్లు నోరు జారాడని, షణ్ముఖ్ రేషన్ మేనేజర్ అయ్యాక అతడి ప్రవర్తన మారిపోయిందంటూ వారిని నామినేట్ చేశాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన రవి, సన్నీని నామిట్ చేస్తున్నానని తెలిపింది. అనంతరం లోబో.. 'గతవారం ప్రియ మీద అరిచినప్పుడు మానస్, షణ్ముఖ్ సడన్‌గా నా మీద పడి నామినేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నా'నని వెల్లడించాడు. ప్రియాంక సింగ్.. సరదాగా మాట్లాడినా హమీదా సీరియస్‌గా తీసుకుంటుందని, లోబో టాస్కుల్లోనూ స్ట్రాంగ్‌గా అవ్వాలని నామినేట్ చేస్తున్నానని తెలిపింది. షణ్ముఖ్ నన్ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడు: రవి సిరి మాట్లాడుతూ.. పక్కవాళ్ల గేమ్‌లో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్న రవిని, రేషన్ మేనేజర్ అయ్యాక హమీదా ప్రవర్తనలో తేడా వచ్చిందంటూ ఆమెను నామినేట్ చేసింది. రవి.. జెస్సీది ఇమ్మెచ్యూర్ బిహేవియర్డ్ అనిపిస్తుందన్నాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని తన పేరు ట్యాగ్చేయడం చాలా నెగెటివిటీగా అనిపించిందని పేర్కొన్నాడు. గతవారం అకారణంగా తనను నామినేట్ చేసిన షణ్ముఖ్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. అతడు వేరేవాళ్ల గురించి తన దగ్గర చెప్తూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడనిపించిందని అభిప్రాయపడ్డాడు. విశ్వ సొంతంగా గేమ్ ఆడట్లేదు: షణ్ను యానీ మాస్టర్.. తనకు టఫ్ కాంపిటీటర్స్ అయిన రవి, విశ్వను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అనంతరం షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ చూసిన విశ్వ వేరు, ఇప్పుడు చూస్తున్న విశ్వ వేరు.. పక్కవాళ్ల ఇన్ఫ్లూయెన్స్ వల్లో, మరింకేదైనా కారణమో తెలీదు కానీ ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపిస్తోందని తెలిపాడు. తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. హమీదా వంతు రాగా.. ప్రియ తనతో సరిగా ఉండదని, షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండనుకున్నా, కానీ అతడు వేరే జోన్లో ఉంటున్నాడంటూ వారిద్దరినీ నామినేట్ చేసింది. జెస్సీ హైపర్ అయిపోతుంటే, షణ్ను వేరే ప్రపంచంలో ఉంటున్నాడు.. శ్వేత.. తనకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని కాజల్, మానస్‌ను నామినేట్ చేసింది. ప్రియ.. ఎవరి గేమ్ వారు ఆడాలని చెప్పే షణ్ముఖ్ అతడిదాకా వచ్చేసరికి మాత్రం పాటించడం లేదంది. ఇక సన్నీ తనను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తోందంటూ అతడిని నామినేషన్లోకి పంపింది. మానస్.. జెస్సీ, షణ్ముఖ్‌ను నామినేట్ చేశాడు. కెప్టెన్ శ్రీరామ్.. జెస్సీ హైపర్ అవుతున్నాడని, షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉండిపోతున్నాడంటూ వాళ్లిద్దరినీ నామినేట్ చేశాడు. ఆ ఒక్కరు తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌కు వ్యతిరేకమే! తర్వాత ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారన్న విషయాన్ని బిగ్‌బాస్ పేర్లతో సహా వెల్లడించాడు. అత్యధికంగా షణ్ముఖ్‌ను ఎక్కువమంది నామినేట్ చేశారు. మరీ ముఖ్యంగా జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. మొత్తంగా ఈ ఐదోవారంలో షణ్ముఖ్, రవి, హమీదా, లోబో, మానస్, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా హార్ష్‌గా మాట్లాడకురా.. : షణ్నును అభ్యర్థించిన రవి ఈ ప్రక్రియ అనంతరం కిచెన్‌లో మరోసారి చిచ్చు చెలరేగింది. మానస్‌ను నామినేట్ చేసినందుకు అతడు ఇంత యాటిట్యూడ్ చూపించాలా అని శ్వేత మండిపడింది. అతడితో మాట్లాడటమే అనవసరం అని ఫీలైంది. మరో పక్క శ్రీరామ్.. షణ్ముఖ్, జెస్సీ, సిరి రెండు రోజుల నుంచి డిఫరెంట్‌గా ఉంటున్నారని అభిప్రాయపడ్డాడు. మరోవైపు షణ్ముఖ్-రవిల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. నీతో దూరంగా ఉంటున్నంత మాత్రాన నేను సరిగా పర్ఫామ్ చేయనట్లు కాదని ముఖం పట్టకుని మాట్లాడాడు షణ్ను. దీంతో రవి.. అంత హార్ష్‌గా మాట్లాడకురా అని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జెస్సీ ఫుడ్ తనే వండుకుని తినాలి: కెప్టెన్ కొత్త రూల్ ఇక కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్ అయిన జెస్సీ.. నాకు ఫుడ్ పెట్టరంట, నా ఫుడ్ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్ అయిపోయారు. 'ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కెప్టెన్ మీద విరుచుకుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్. ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్ కెప్టెన్‌వి అంతే! అని అగ్గి మీద గుగ్గిలమైంది సిరి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. వాళ్లు తినకపోతే నేనూ తినను: కెప్టెన్ ఇక ఈ గొడవతో చిర్రెత్తిపోయిన యానీ మాస్టర్ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌ను వేసుకుని రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్ అయినట్లు కనిపించింది. కానీ కొద్ది సేపటికే సిరి, షణ్ను, జెస్సీ తినకుండా కూర్చోవడంతో యానీ వారి దగ్గరకు వెళ్లి తినమని బుజ్జగించింది. ఆకలేస్తే తింటారు, లేకపోతే వదిలేయండి అంటూ కెప్టెన్ శ్రీరామ్ ఓపక్క చిరాకు పడుతూనే వాళ్లు తినకపోతే తాను కూడా తిననని శపథం చేశాడు. వెంటనే జెస్సీ, షణ్ముఖ్‌లకు ప్లేటులో భోజనం పట్టుకెళ్లి తినిపించడం విశేషం. -
ఇది నీ ఇల్లు కాదన్న షణ్ను, మధ్యలోకి రాకంటూ శ్రీరామ్ వార్నింగ్!
Bigg Boss Telugu 5 Promo, Shanmukh Vs Sreeram బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు ఏర్పడ్డాయా? అన్న ప్రశ్నకు మెజారిటీగా అవునని కొద్దిమంది మాత్రం కాదని సమాధానాలిస్తారు. అయితే తాజా ప్రోమోతో హౌస్‌లో గ్రూపులు ఉన్నాయన్న విషయం బట్టబయలైంది. గ్రూపులో ఉన్న ఏ ఒక్కరితో పెట్టుకున్నా మిగతా వాళ్లు గయ్యిమని లేస్తారని తేట తెల్లమైంది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగింది? ఎవరు ఏ గ్రూప్‌తో ఏరికోరి గొడవ పెట్టుకున్నారు? వీటికి సమాధానాలు తెలియలాంటే తాజాగా వచ్చిన ప్రోమో చూసి తీరాల్సిందే! షణ్ముఖ్‌ను నామినేట్ చేసింది వీళ్లే అంటూ బిగ్‌బాస్ 8 మంది కంటెస్టెంట్ల ఫొటోలను టీవీలో వేసి చూపించాడు. అందులో యాంకర్ రవి, లోబో, శ్రీరామ్, ప్రియ, హమీదా, సన్నీ, విశ్వ, మానస్ ఉన్నారు. తన మీద అంతమంది పగపట్టారా? అని ఒక్క క్షణం పాటు షాకైన షణ్ను తనను నామినేట్ చేసినందుకు థాంక్యూ చెబుతూ ఓ స్మైల్ విసిరాడు. ఇక కిచెన్‌లో పెద్ద యుద్ధమే జరిగినట్లు కనిపిస్తోంది. ఇలా ఉంటే ఎవరి తిండి వాళ్లు వండుకోవాలని రూల్ పెడతాను అని కెప్టెన్ శ్రీరామ్ జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జెస్సీ ఫుడ్ ఇవ్వను, ఫుడ్ పెట్టను అనడం ఏంటని అసహనానికి లోనయ్యాడు. తన ఫ్రెండ్ జెస్సీ మీదకు శ్రీరామ్ ఫైర్ అవడం చూసిన సిరి, షణ్ను.. కెప్టెన్ మీద అరిచినంత పనిచేశారు. 'నీ ఇష్టం వచ్చినట్లు రూల్ పెట్టుకోవడానికి ఇది నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కౌంటరిచ్చాడు షణ్ను. విషయం తెలియకుండా మధ్యలోకి రావద్దని హెచ్చరించాడు శ్రీరామ్. అయినా నువ్వెవరు మాకు చెప్పడానికి అని సిరి సీరియస్ అవగా.. నువ్వొచ్చి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. మొత్తంగా నేడు జరిగిన పరిణామాలను బాగా సీరియస్‌గా తీసుకున్న షణ్ను ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ హౌస్‌మేట్స్‌కు సవాలు విసిరాడు. మరి ఇప్పటికైనా షణ్ను గేమ్ ఆడటం మొదలు పెడతాడో? లేదో? చూడాలి! -
బిగ్‌బాస్: ఐదో వారం నామినేషన్లో 9 మంది!
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే నామినేషన్స్ ఉన్న మండేనే అసలైన ఫండే అంటారు బిగ్‌బాస్ వీక్షకులు. ఎప్పటిలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియకు రెడీ అయిపోయారు. గేమ్ సరిగా ఆడలేకపోతున్నవారితో పాటు, గ్రూపిజం చేస్తూ తమ మీద ప్రతాపాన్ని చూపిస్తున్న కంటెస్టెంట్లను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అయితే ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను భిన్నంగా నిర్వహించాడు. ముఖాముఖిగా నామినేషన్స్ జరపకుండా సీక్రెట్ రూమ్‌కి పిలిచి నామినేట్ చేయాలనుకుంటున్నవారి పేర్లు, అందుకు తగిన కారణాలను చెప్పమని ఆదేశించాడు. అయితే సన్నీ.. ఇలా సీక్రెట్‌గా కాకపోయినా, బయట నామినేషన్స్ జరిగినా ఈ రెండు పేర్లే చెప్దామని డిసైడ్ అయ్యాను అని పేర్కొన్నాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం.. తనను నామినేట్ చేసినవాళ్లనే నామినేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. లోబో.. ఇంటిసభ్యుల్లోని కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. నేనా రోజు సైలెంట్‌గా మాట్లాడుంటే షణ్ముఖ్ ఎవరిని నామినేట్ చేసేవాడని ప్రశ్నించాడు. ఇక రవి.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని జెస్సీ నా పేరు ట్యాగ్ చేయడం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనిపిస్తుందంటూ అతడిని నామినేట్ చేశాడు. సింగర్ శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్, జెస్సీ గ్రూపిజం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇలా అందరూ వారివారి కారణాలు చెప్తూ నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్ అయ్యారనే లిస్టు సోషల్ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో యాంకర్ రవి, మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియ, విశ్వ, లోబో, హమీదా, జెస్సీ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సారి నామినేషన్లో ఊహించని కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ మరింత ఆసక్తికరంగా మారింది! -
హమీదాను ఎత్తుకున్న శ్రీరామ్, ముఖం మాడ్చుకున్న ప్రియాంక!
Bigg Boss Telugu 5, Episode 27: హౌస్మేట్స్ రూల్స్ సరిగా పాటించనందుకు జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ కెప్టెన్‌గా అది నీ వైఫల్యమే అంటూ హౌస్మేట్స్ అతడిని చెత్త ఆటగాడిగా నిర్ణయించారు. మరోపక్క సింగర్ శ్రీరామ్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా హమీదా కోసం లవ్ సాంగ్ పాడుతూ, ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇక సన్నీ కూడా తన యాంకరింగ్‌తో దుమ్ము దులిపేశాడు. మరి నేటి (అక్టోబర్ 1) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. అర్ధరాత్రి సైగలు, గాల్లో ముద్దులు కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని, అలాంటి కెప్టెన్సీ తనకు దక్కకుండా చేసిందని కాజల్ మీద మండిపడింది శ్వేత. నువ్వు నీ మైండ్‌ను ఎక్కువగా వాడుతున్నావు, కానీ మనసును కాదని కాజల్‌ను విమర్శించింది. దీనిపై కాజల్ స్పందిస్తూ.. శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా, అంతే తప్ప నీ ఫీలింగ్స్ నాకు మ్యాటరే కాదని శ్వేత ముఖం మీదే చెప్పింది. ఇదిలా వుంటే రాత్రి అందరూ పడుకున్నాక శ్రీరామ్, హమీదా సైగలు చేసుకుంటూ గాల్లో ముద్దులు పంపుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. వయ్యారాలు ఒలకబోసిన ప్రియాంక సింగ్ తర్వాతి రోజు నటరాజ్ మాస్టర్ మరోసారి రవి మీద పడ్డాడు. రవి టాస్క్ చేస్తున్నంతసేపు నత్తలా అనిపించాడని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడని చిరాకు పడ్డాడు. అసలు తన పేరు కూడా ఎత్తొద్దని ఆయనకు చెప్పంటూ లోబోకు సూచించాడు. ఇక నల్లచీర కట్టుకుని ప్రియాంక సింగ్ వయ్యారాలు పోతుంటే శ్రీరామ్ పాటతో ఆమె వెనకాల పడ్డాడు. మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్.. అనంతరం బిగ్‌బాస్.. బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోమని ఆదేశించాడు. దీంతో శ్రీరామ్-హమీదా జంట.. లోబోను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. యానీ మాస్టర్-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్, కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్-సిరి.. మానస్ బెస్ట్, లోబో వరస్ట్ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్ మాస్టర్- లోబో... మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తెలిపారు. కాజల్-జెస్సీ.. మానస్‌ను బెస్ట్, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్, లోబో వరస్ట్ అని తెలిపారు. సన్నీ- మానస్.. లోబోను బెస్ట్ అని పేర్కొంటూ వేరేవాళ్ల నుంచి ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నావని జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తేల్చారు. మొత్తంగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు. దీంతో జెస్సీ రెండోసారి జైల్లోకి వెళ్లాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్పెషల్ షో జరిగింది. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కాజల్ మైక్ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్ టైమ్‌లో సిరి, డిన్నర్ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. మరి టిఫిన్ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్ అన్నావు, ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్ వేయగా శ్రీరామ్.. సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని కౌంటరిచ్చాడు. గుండెల్లో ఏ అమ్మాయైనా ఉందా? అన్న ప్రశ్నకు.. గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ ఓ ప్రియా.. ప్రియా.. పాటందుకుని ఊహల్లో తేలిపోయాడు. ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారన్న ప్రశ్నకు సింగర్.. హమీదా పేరు చెప్తూ పాటందుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్ చేశాడు. అయితే శ్రీరామ్ హమీదాకు క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది పింకీ. ఆమెను ఎత్తుకుని తిరగడం అవసరమా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత లోబో, సన్నీ కలిసి హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. -
కమిటెడ్ కాకపోతే సిరికి ట్రై చేసేవాడిని: శ్రీరామచంద్ర
బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేది కొట్లాటలు, టాస్క్‌లు మాత్రమే కాదు, లవ్ ట్రాకులు కూడా! హౌస్‌లో ప్రేమాయణం నడిపే కంటెస్టెంట్లు షో ముగిశాక మాత్రం అబ్బే, మా మధ్య అలాంటిదేమీ లేదంటారు. కేవలం ఫ్రెండ్షిప్ అని పుకార్లకు చెక్ పెడుతుంటారు. ఇది ప్రతి సీజన్‌కు సర్వసాధారణమైపోయింది. ఈ సారి బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాకులు అనగానే మొదటగా గుర్తొచ్చే జంట శ్రీరామ్- హమీదా. వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడమే కాక హమీదాకు మసాజ్‌లు కూడా చేశాడు శ్రీరామ్. తమ మధ్య ఉన్నది రిలేషన్‌కు ఏ పేరు పెట్టాలో అర్థం కాక సతమతమయ్యారిద్దరూ! కానీ ప్రేక్షకులు మాత్రం వీళ్లను క్యూట్ కపుల్‌గా పేర్కొంటున్నారు. అయితే శ్రీరామ్ తాజా ప్రోమోలో చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని ప్రియ ప్రశ్నించగా.. 'సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడిని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పా'నని మనసులోని మాటను బయటపెట్టాడు శ్రీరామ్. ఒక అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావని ప్రశ్నించగా అతడు హమీదాను సూటిగా చూడటంతో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇక సన్నీ తన యాంకరింగ్, ఇమిటేషన్‌తో మిగతా కంటెస్టెంట్లను కడుపుబ్బా నవ్వించాడు. -
అర్హత లేదంటూ 7 కత్తిపోట్లు, బాధతో విలవిల్లాడిపోయిన సన్నీ
Bigg Boss 5 Telugu, Episode 26: కెప్టెన్సీ అంటే కంటెస్టెంట్లకు ఓ వరంలాంటిది. నామినేషన్స్ నుంచి తప్పించే ఓ ఆయుధం వంటిది. అలాంటి కెప్టెన్సీ చాన్స్‌ను దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు హోరాహోరీగా పోరాడారు. చివరికి ముగ్గురు బరిలో నిలిచారు. కానీ హౌస్మేట్స్ మద్దతుతో శ్రీరామచంద్ర గెలిచాడు. మరి హౌస్మేట్స్ ఎవరెవరికి సపోర్ట్ చేశారు? నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. పిజ్జాలు ఆరగించిన కంటెస్టెంట్లు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నేడు కూడా కొనసాగింది. మెరుపుల శబ్ధం రాగానే బజర్ నొక్కిన శ్వేత.. సిరి-షణ్ముఖ్‌లను తమకు పోటీదారులుగా ఎంచుకున్నారు. వీరికి బిగ్‌బాస్ 'చిక్కులో చిక్కుకోకు' అనే టాస్క్ ఇచ్చాడు. చిక్కులు పడి ఉన్న తాళ్లను విడదీసే ఈ టాస్కులో శ్వేత టీమ్ గెలిచింది. ఇంతటితో గేమ్ ముగిసిందన్న బిగ్‌బాస్ ఏ జంటలు ఎక్కువగా బరువు తగ్గాయో చెక్ చేసుకోమన్నాడు. ఈ క్రమంలో మానస్ రెండు రోజుల్లోనే ఆరు కిలోల బరువు తగ్గి అందరితో ఔరా అనిపించుకున్నాడు. మొత్తానికి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగియడంతో అప్పటిదాకా ఆకలితో నకనకలాడుతున్న ఇంటిసభ్యులకు రుచికరమైన పిజ్జాలు పంపించాడు. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చిన కంటెస్టెంట్లు ఆవురావురుమని తిన్నారు. నిన్ను రేషన్ మేనేజర్ చేస్తా: హమీదాకు శ్రీరామ్ ఆఫర్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో.. సన్నీ-మానస్, హమీదా- శ్రీరామచంద్ర, యానీ మాస్టర్- శ్వేత జంటలు ఎక్కువ బరువు కోల్పోయాయి. ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీకి పోటీదా చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఈ మూడు జంటలు తమలో ఎవర్ని పంపించాలా? అని తెగ చర్చించారు. ఈ క్రమంలో కెప్టెన్ తర్వాత ముఖ్యమైన పోస్ట్ ఏంటని శ్రీరామ్ ప్రశ్నించగా హమీదా రేషన్ మేనేజర్ అని ఆన్సరిచ్చింది. తనకు రేషన్ మేనేజర్ ఇష్టం లేదన్న శ్రీరామ్ తను గెలిస్తే హమీదాకు ఆ పోస్ట్ ఇప్పిస్తానన్నాడు. ఏ కారణం లేకపోయినా తనను నామినేట్ చేస్తున్నారని, కెప్టెన్ అయితే ఒకవారం ఇమ్యూనిటీ వస్తుందని ఆశపడ్డాడు. ఎలాగో సన్నీ పోటీలో నిలబడ్డా అతడికి ఎవరూ సపోర్ట్ చేయరని చెప్పాడు. అనంతరం శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీ 'కత్తులతో సావాసం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో హౌస్మేట్స్ కెప్టెన్‌కు అర్హులు కారు అనుకున్నవారి బెల్ట్‌ను కత్తితో పొడవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ డ్రెస్ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా గెలిపించండి నేను కెప్టెన్ డ్రెస్ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా నన్ను గెలిపించండని సన్నీ పేరుపేరునా అభ్యర్థించాడు. శ్రీరామ్ మాత్రం.. మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వారికే ఓటేయండని ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారం ముగియగానే అసలు టాస్క్ మొదలైంది. ముందుగా శ్వేత మాట్లాడుతూ.. తను కెప్టెన్ అయితే హౌస్ స్ట్రిక్ట్‌గా మారుతుందని హెచ్చరిక వదిలింది. ఇక శ్రీరామ్.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను సాల్వ్ చేస్తానని చెప్పాడు. సన్నీ.. అందరూ తనకు సమానమే అని, హౌస్‌లో పక్షపాతంగా వ్యవహరించనని ప్రామిస్ చేశాడు. నీకింకా కెప్టెన్ అయ్యే సమయం రాలేదు తర్వాత హౌస్మేట్స్ ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ పోటీదారుల్లో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వారికి కత్తి గుచ్చారు. మొదటగా వచ్చిన విశ్వ.. సన్నీ బెల్ట్‌కు కత్తి గుచ్చాడు. తర్వాత షణ్ను.. మన మధ్య అంత ర్యాపో లేదంటూ మళ్లీ సన్నీకే కత్తి గుచ్చాడు. అయితే ఈ రెండు కత్తిపోట్లను సన్నీ ముందే ఊహించాడు. విశ్వ సింపథీ గేమ్ ఆడుతున్నాడని, అతడిక్కడ ఫేక్ గేమ్ ఆడుతున్నాడని శ్రీరామ్‌తో చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి.. సన్నీకే గుచ్చాలని లేదంటూనే అతడినే కత్తితో పొడిచింది. నీకింకా కెప్టెన్ అయ్యే టైం రాలేదంటూ లోబో కూడా సన్నీని ఒక్క పోటు పొడిచాడు. అయితే లోబో పొడుస్తాడని ఊహించని సన్నీ కంటతడి పెట్టుకోవడంతో మానస్ ఓదార్చాడు. హమీదా.. శ్వేతను; ప్రియ, నటరాజ్ మాస్టర్.. సన్నీని; యానీ మాస్టర్.. శ్రీరామ్‌ను కత్తితో పొడిచారు. కెప్టెన్‌గా నువ్వేదైనా చెప్తే జనాలు అంత సీరియస్‌గా తీసుకోలేరేమోనని రవి, త్వరగా ఆవేశపడతావంటూ ప్రియాంక సింగ్.. మరోసారి సన్నీకి కత్తిపోట్ల రుచి చూపించారు. ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కత్తితో పొడవలేను: కాజల్ తర్వాత సన్నీ రవి దగ్గరకు వెళ్లి ఇక్కడ హౌస్‌లో ఏ కెప్టెన్ కూడా కమాండింగ్ చేయట్లేదని కౌంటరిచ్చాడు. తర్వాత వచ్చిన మానస్.. సన్నీని పొడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మిగిలిన ఇద్దరిలో ఎవరు తనను ఇంప్రెస్ చేస్తే వారిని పొడవనని మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ.. కెప్టెన్ అయితే అలా ఉంటాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఉపన్యాసాలివ్వగా మానస్ శ్వేతను కత్తితో గుచ్చి శ్రీరామ్‌కు సపోర్ట్ చేశాడు. నిజానికి సన్నీని కసాకసా వేద్దాం అనుకున్నా, కానీ నాకు ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కాబట్టి అతడిని కత్తితో గుచ్చి బాధపెట్టలేను అంటూ శ్వేతను కత్తితో పొడిచింది కాజల్. తర్వాత వచ్చిన జెస్సీ.. సన్నీ, శ్వేత తన మనసులో కెప్టెన్లంటూ శ్రీరామ్‌ను కత్తితో గుచ్చాడు. తక్కువ కత్తిపోట్లు పడ్డ శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగో కెప్టెన్‌గా అవతరించాడు. శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్ చేశాడు?: సన్నీ అయితే కెప్టెన్సీకి అవకాశం ఉన్న శ్వేతకు మానస్ కత్తి గుచ్చడంతో అయోమయానికి లోనయ్యాడు సన్నీ. నిజానికి తన మాటలతో ఇంప్రెస్ చేసింది శ్వేత అయితే శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్ చేశాడో అర్థం కావడం లేదని, ఇదే విషయాన్ని వాడినే అడిగి కడిగిపారేస్తానని ఆవేశపడ్డాడు. మరోపక్క మానస్ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని వదులుకున్నందుకు తెగ ఫీలైంది పింకీ. నువ్వే కెప్టెన్ అవుతావనుకున్నా, ఇంకోసారి అస్సలు కాంప్రమైజ్ అవ్వకు అని అతడి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చింది. -
సన్నీకి సపోర్ట్ చేయరు, హమీదాకు చేస్తారు!: శ్రీరామ్
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లను వెంటాడే భయం నామినేషన్స్. దీని నుంచి తప్పించుకోవడానికి బిగ్‌బాస్ ఓ ఆయుధమిచ్చాడు. అదే కెప్టెన్సీ! కెప్టెన్ అయిన వ్యక్తి ఒక వారం పాటు నామినేషన్స్‌లోకి రాలేడు. అందుకే ప్రతి కంటెస్టెంట్ ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని కలలు కంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఈవారం కెప్టెన్సీకి పోటీపడేవారిని ఎంచుకునేందుకు బిగ్‌బాస్ నెగ్గాలంటే తగ్గాల్సిందే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో సన్నీ- మానస్, శ్రీరామ్-హమీదా, శ్వేత- యానీ మాస్టర్ జోడీలు బరువు తగ్గి ముందంజలో ఉన్నాయి. అయితే ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీ కోసం పోటీపడేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆయాజోడీలు ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదు అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎలాగో నువ్వు నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈసారి నేనే కెప్టెన్సీ కోసం పోటీ పడతాను అని హమీదాతో చెప్పుకొచ్చాడు శ్రీరామ్. హమీదా, శ్వేత, సన్నీ నిలుచుంటే.. హమీదాకు లేదా శ్వేతకు మాత్రమే సపోర్ట్ చేస్తారు, సన్నీకి చేయరు అని చెప్పాడు. అతడు చెప్పిందే కాస్త అటూఇటుగా నిజమైనట్లు తెలుస్తోంది. కాకపోతే హమీదా స్థానంలో శ్రీరామ్ బరిలో నిలిచినట్లు భోగట్టా! వీరిలో చాలామంది సన్నీకి సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేయగా శ్రీరామచంద్ర కెప్టెన్‌గా అవతరించాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి హమీదా తను కెప్టెన్ అయ్యి శ్రీరామ్‌ను రేషన్ మేనేజర్‌గా పెడతాననుకుంది. కానీ శ్రీరామ్ కెప్టెన్‌గా ఎన్నికై హమీదా రేషన్ మేనేజర్‌గా నియమించాడని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్ హౌస్‌లో మటన్ బిర్యానీ, వీళ్లు ముక్క కూడా ముట్టలేదట!
Bigg Boss Telugu 5 Promo: 'తిండి కలిగితే కండ కలదోయ్' అంటారు! కానీ తిండిని కంట్రోల్లో పెట్టి బరువు తగ్గితే గెలుపు మీదేనోయ్ అంటున్నాడు బిగ్‌బాస్. ఓస్ అంతేనా అనేయకండి.. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల నోరూరించేలా టేస్టీ వంటకాలను హౌస్‌లోకి పంపిస్తూనే ఉన్నాడు. నోరు కట్టేసుకోలేక ఎవరో ఒకరు దాన్ని తింటూనే ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ అన్నం, ముద్ద పప్పు పంపించాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ విశ్వ ఆ ఫుడ్ అందుకుని ఆరగించాడు. తాజాగా నేటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ మటన్ బిర్యానీ పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిర్యానీని చూడగానే ఎన్నో గంటలుగా తిండీనిద్రా మాని ఉన్న కంటెస్టెంట్లలో నూతనోత్తేజం పొంగిపొర్లింది. ఇంకా కడుపు మాడ్చుకోవడం మా వల్ల కాదంటూ చాలామంది బిర్యానీని ఓ పట్టు పట్టారు. అయితే వీజే సన్నీ, శ్రీరామ్, హమీదా మాత్రం బిర్యానీని కనీసం ముట్టుకోలేదంటున్నారు లీకువీరులు. మరి ఇది నిజమేనా? కళ్ల ముందు బిర్యానీ కనిపిస్తున్నా ఆకలిని చంపుకుని నిలబడ్డారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు విశ్వ, పింకీ ఇద్దరూ కట్టెలు నరకడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. ఇందులో ఎవరు గెలిచారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
శ్రీరామ్-హమీదా రొమాన్స్, మాది ఫ్రెండ్షిప్ కాదంటూ.
Sreerama Chandra- Hamida: బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకునే సాధారణ ముచ్చట్లను కూడా లవ్ యాంగిల్లో చూపించడం బిగ్‌బాస్‌కే చెల్లుతుంది. అయితే బిగ్‌బాస్ అలా చూపించాడంటే దానికో అర్థం, పరమార్థం ఉంటుంది. త్వరలోనే ఆ ఇద్దరి మధ్య లవ్ యాంగిల్ స్టార్ట్ కాబోతుందని ముందుగానే జనాలకు హింట్ ఇస్తాడన్నమాట! తాజా సీజన్లో సింగర్ శ్రీరామచంద్ర, నటి హమీదా లవ్ బర్డ్స్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. శ్రీరామ్ ఎక్కువగా హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఆమెకు స్పెషల్‌గా మసాజ్‌లు కూడా చేశాడు. ఈ మధ్యే రొమాంటిక్ డ్యాన్స్‌తో అందరినీ అలరించిందీ జంట. లేటెస్ట్ ఎపిసోడ్లో శ్రీరామ్ గురించి హమీదా.. కాజల్‌తో చెప్పుకుంటూ సిగ్గుపడిపోయింది. 'శ్రీరామ్ రాత్రి కప్ కడుగుతున్నాడు. ఆ సమయంలో నేను నా కప్ అక్కడ పెట్టి వెళ్లాను. వచ్చేసరికి నా కప్ కూడా కడుగుతున్నాడు. ఎందుకిలా చేశావంటే పర్లేదన్నాడు. తర్వాత నన్ను హగ్ చేసుకుని భుజంపై ముద్దు పెట్టాడు. వెంటనే మరో భుజం చూపించి అక్కడ కూడా కిస్ చేయమన్నాడు' అని నవ్వేసింది. రాత్రిపూట శ్రీరామ్, హమీదా మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హమీదా మాట్లాడుతూ.. నేను సన్నీతో, మానస్‌తో, నీతో మాట్లాడే తీరులో తేడా కనిపించడం లేదా? అంతా ఒకేలాగా అనిపిస్తుందా? అని మనసులోని మాటను బయటపెట్టే ప్రయత్నం చేసింది. దానికి శ్రీరామ్.. నాకు తెలియదు, అంతలా గమనించను అని ఆన్సరివ్వడంతో హర్ట్ అయిన హమీదా కొన్నిసార్లు అర్థం అవుతావు, కొన్నిసార్లు కావు అని బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. నీకు మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. కానీ మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలియట్లేదు. మనం బ్రదర్ అండ్ సిస్టరా? ఫ్రెండ్సా? అంతకు మించా? అనేది అర్థం కావట్లేదు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందన్నాడు. కానీ వీళ్లిద్దరి వ్యవహారం చూసిన నెటిజన్లు వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందంటున్నారు. -
హమీదాకు గోరుముద్దలు: భరించలేకపోయిన ప్రియాంక సింగ్
Bigg Boss Telugu 5, Episode 20: బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నానన్నాడు షణ్ముఖ్. సిరి తనతో మాట్లాడమని ఎంత బతిమిలాడినా అతడు మాత్రం పట్టించుకోలేదు. బెడ్డు దగ్గరకొచ్చి బుజ్జగించినా అతడు చలించలేదు. తర్వాత బిగ్‌బాస్ అతికిందంటే అదృష్టమే అనే లగ్జరీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫోయిలవగా సన్నీ, రవి, శ్రీరామ్ కిందామీదా పడి పూర్తి చేశారు. కాళ్లు విరగ్గొట్టేసేవాడిని.. ఆవేశంతో ఊగిపోయిన మాస్టర్ మానస్ హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఇంటి ముచ్చట్లు మాట్లాడాడు. ఈ మధ్య లహరి పొసెసివ్‌గా ప్రవర్తిస్తోందన్నాడు. మొన్న అమ్ముకు రోటీ తినిపిస్తుండగా నువ్వు కూడా తినిపించమన్నావు.. సరే, ఇద్దరికీ కలిసి తినిపిద్దాం అని అక్కడకు వెళ్లి కూర్చుందాం అంటే కుదరదు అని చెప్పేసింది, ఇక్కడే ఇంకో రోటీ తినిపించమని అని మొండిగా ప్రవర్తించిందన్నాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ దేనికో బాగా ఉడుక్కున్నాడు. 'ఎలా ఆడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషనల్ డైలాగులు.. బయటైతే కాళ్లు విరగ్గొట్టేసేవాడిని..' అంటూ ఏవేవో మాట్లాడాడు. దీంతో అక్కడున్న సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో ఎవరి గురించి అంటున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చెప్తానన్నాడు. అయితే ఆయన అంటోంది తననే అని అటు యాంకర్ రవి, ఇటు జెస్సీ ఎవరికి వారే తెగ ఫీలయ్యారు. మాస్టర్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడని రవి అభిప్రాయపడ్డాడు. మానస్ జైలుకు వెళ్లడం కూడా స్ట్రాటజీనే! తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా అభివర్ణిస్తూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ అభిప్రాయపడింది. ఆ కోతిముఖానికి తినిపించడం అవసరమా?: పింకీ మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది. తప్పు హౌస్మేట్స్ది, శిక్ష కెప్టెన్‌కు! తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా కానీ తాను నిద్రపోలేదని బుకాయించాడు. కెప్టెన్‌గా తన మాట ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా వస్తున్నారా అని ఆతృతగా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భార్యను చూసి బోరుమని ఏడ్చిన నటరాజ్ ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని ఆయన భోరుమని ఏడ్చేశాడు. సిరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షణ్నూ మాత్రం ఆమెను దూరం పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కాజల్‌తో చెప్పుకుంటూ బాధపడింది సిరి. షణ్ముఖ్ తనతో ఫేక్‌గా ఉంటున్నాడని, మనస్ఫూర్తిగా లేడని వాపోయింది. జెస్సీతో డిస్కనెక్ట్ అయ్యానని తెలిపింది. మన మధ్య రిలేషన్ ఏంటి?: శ్రీరామ్ ఇక హమీదా, శ్రీరామ్ రాత్రిపూట కబుర్లాడారు. హమీదా ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. నీ మైండ్‌లో ఏముందో చెప్పేసెయ్ అన్నాడు శ్రీరామ్. నేను సన్నీని, మానస్‌ను, నిన్ను ఒకేలా చూడట్లేదని నొక్కి చెప్పింది. కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. హమీదాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీకు, మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మనిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా కావచ్చు అని చెప్పాడు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. మరి వీళ్ల మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి! -
బిగ్‌బాస్ 5: నోయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా?
సింగర్, యాక్టర్ నోయల్ సేన్.. గత బిగ్‌బాస్ సీజన్లో పాల్గొని హల్చల్ చేశాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు చాలా కూల్‌గా ఉంటూ అందరికీ హితబోధ చేస్తూ బాబాలా మారిపోయాడు. కానీ తనకు ఆరోగ్యం సహకరించలేక కుంటుకుంటూ నడిచి, చివరకు షోలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడంతో అర్ధాంతరంగా షో నుంచి తప్పుకున్నాడు. అయితే వెళ్లిపోయేటప్పుడు మాత్రం తన మీద, తన హెల్త్ మీద కుళ్లు జోకులేసిన ఒక్కొక్కరికీ వాయించేసి వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పటికీ నోయల్ అనగానే బిగ్‌బాస్ వీక్షకులకు ఇదే సీన్ గుర్తొస్తుంది. షో నుంచి నిష్క్రమించాక అతడు దేత్తడి హారిక, లాస్యకు సపోర్ట్ చేసి వారికి అండగా నిలబడ్డాడు. ఇదిలా వుంటే ఈ మధ్యే ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లోనూ అతడు ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. సింగర్ శ్రీరామచంద్రకు ఓటేయమని అభిమానులను కోరుతున్నాడు. ఈవారం అతడు నామినేషన్స్‌లో ఉండటంతో శ్రీరామ్‌ను ఎలాగైనా గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అనధికారిక పోల్స్‌లో అయితే శ్రీరామ్‌కు ఈవారం ఈజీగా సేఫ్ అవుతాడని తెలుస్తోంది. ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అఫీషియల్ ఓటింగ్‌లోనూ శ్రీరామ్ టాప్ 3లో ఉన్నాడా? అన్నది తెలియరాలేదు. ఏదేమైనా శ్రీరామ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడికి నోయల్ అండదండలు గట్టిగానే ఉండేటట్లు కనిపిస్తోంది. -
బిగ్‌బాస్ 5 విజేత అతడే అంటున్న గూగుల్!
తెలుగులో బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. బిగ్‌బాస్ ఏ చిన్న టాస్క్ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్ చేస్తున్నారు. టైటిల్ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. అయితే గూగుల్ మాత్రం అప్పుడే ఈ సీజన్ విజేతను ప్రకటించేసింది. షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్ శ్రీరామచంద్ర విన్నర్ అని డిక్లేర్ చేసింది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. శ్రీరామ్ అభిమానులు మాత్రం గూగుల్ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గూగుల్‌లో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరని టైప్ చేయగా అది శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్ ప్లేబ్యాక్ సింగర్, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది. ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరని టైప్ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది. ఈ గూగుల్ తప్పిదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కాగా శ్రీరామచంద్రకు ప్రస్తుతం షోలో మంచి ఫుటేజీ దక్కుతోంది. హమీదాతో లవ్ ట్రాక్ నడుపుతుండటంతో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరుకుతోంది. అటు టాస్క్‌ల్లోనూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి గూగుల్ చెప్పినట్లుగా రానున్న రోజుల్లో శ్రీరామ్ లేదా ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ విజేతగా అవతరిస్తారో? లేదో? చూడాలి! View this post on Instagram A post shared by Bigg Boss Trollers 🔘 ➤(𝒴𝒶𝓈𝒽) (@biggboss.trollers) -
బిగ్‌బాస్ హౌస్‌లో పెళ్లి, అంతలోనే బ్యాడ్ న్యూస్ అంటూ బాంబ్!
Bigg Boss Telugu 5 Promo: నామినేషన్స్‌తో ఫైర్ మీదున్న కంటెస్టెంట్లను కూల్ చేసేందుకు బిగ్‌బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఇచ్చిన హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్‌ను అటు హౌస్మేట్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా అబ్బాయి పాత్రలో జీవిస్తున్న శ్రీరామ్ అటు హమీదాతో, ఇటు సిరితో లవ్ ట్రాక్ నడుపుతూనే లహరితో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు లహరి కూడా మానస్‌ను ప్రేమిస్తూనే ఇటు శ్రీరామ్‌తో పెళ్లికి సై అంది. దీంతో మ్యారేజ్ బ్రోకర్ షణ్ముఖ్ సహాయంతో ఎంతగానో కష్టపడి శ్రీరామ్, లహరికి పెళ్లి జరిపించినట్లు ప్రోమోలో చూపించారు. ఇద్దరూ ఉంగరాలతోపాటు దండలు కూడా మార్చుకున్నారు. ఈ పెళ్లికి కంటెస్టెంట్లే పెద్దలు, అతిథులు అన్నీనూ! మొత్తానికి ఈ టాస్క్ అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఫోన్ రింగైంది. వెంటనే హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియకు.. మీకో బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ అవతలి వ్యక్తి టెన్షన్ పెట్టేశాడు. మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? అది హౌస్ మొత్తానికా? లేదా ప్రియకు మాత్రమే బ్యాడ్ న్యూసా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
బిగ్‌బాస్: మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు!
Bigg Boss Telugu 5, 3rd Week Nominations: బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్‌ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్‌లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్‌లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్‌కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
గెలవడానికి రాలే, రూ.50 లక్షలిస్తే వాళ్ల ముఖాన కొడ్తా: శ్రీరామ్
Bigg Boss Telugu 5, Episode 11: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏమో కానీ బిగ్‌బాస్ కుస్తీల ప్రోగ్రామ్‌లా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వారి ఆటతో ప్రేక్షకులకు చెమట్లు పట్టించారు. అప్పటిదాకా స్నేహగీతం పాడుకున్నవాళ్లు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. సైలెంట్‌గా కనిపించే శ్రీరామ్ శివాలెత్తిపోగా శ్వేత అందర్నీ ఓ ఆటాడించింది. కంటిచూపుతో గడగడలాడించే ఉమాదేవిపై దాడి చేయడంతో ఆమె కాళికా అవతారమెత్తింది. దీంతో మరోసారి యానీ మాస్టర్, ఉమాల మధ్య అగ్గి రాజుకుంది. మరి దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో ఇచ్చిన మూడు లెవల్స్‌లో ఏ టీమ్ గెలిచింది? అనేది చూసేద్దాం.. సిగ్గుతో తల దించుకోవాలి.. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్ 'సాగరా సోదరా' టాస్క్‌లో నక్క(ఎల్లో) టీమ్ సభ్యులు ఎక్కువగా సాగదీసి నిలబడ్డారు. ఎల్లో టీం 33.3 మీటర్స్.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. అయితే ఇరువైపులా లెక్కలు తీసుకున్నాక మానస్ డన్ అనడంతో చివరి క్షణంలో శ్వేత కిందపడిపోయింది. అయితే అప్పటికే టాస్క్ అయిపోయింది కాబట్టి అది పరిగణనలోకి తీసుకోరని మానస్ టీమ్ ఎంత వారించినా అవతలి టీమ్ ఒప్పుకోలేదు. సంచాలకులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో టాస్క్ రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీరామచంద్ర ఓవర్ ఎగ్జయిట్మెంట్లో డ్యాన్స్ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు. సిగ్గు మీకు, కానీ మాకవసరం లేదు అని కౌంటరిచ్చింది ప్రియ. నాతో మైండ్ గేమ్ ఆడకు: రవికి వార్నింగ్ ఇచ్చిన సింగర్ ఆ తర్వాత మళ్లీ 'పంతం నీదా నాదా' టాస్క్ మొదలు కాగా ఎల్లో టీమ్ రెచ్చిపోయి ఆడింది. ఈ క్రమంలో శ్వేత కొట్టిందని సిరి ఆరోపించింది. దీంతో తిక్క లేచిన ప్రియ.. సాయంత్రం కాగానే ఆమెకు దెయ్యం పూనుతుందని మండిపడింది. టాస్క్‌కు బ్రేక్ ఇచ్చిన తర్వాత యాంకర్ రవి.. శ్రీరామచంద్రతో ఉన్న గొడవను పరిష్కరించుకుందామని చూశాడు. కానీ అతడితో మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడని శ్రీరామ్.. సేఫ్ గేమ్ ఆడుకో, నాతో మైండ్ గేమ్ ఆడకు అని సలహా ఇచ్చాడు. తాను తెలుగువాళ్లకు చేరువయ్యేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నానే తప్ప గెలవడానికి రాలేదని, రూ.50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖాన కొడ్తానని చెప్పాడు. ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చేసిన లోబో ఇక తర్వాతి రోజు శ్రీరామ్- మానస్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. మానస్‌ను పిలిచి వయసెంత అని అడిగాడు శ్రీరామ్. అతడు 28 అని చెప్పాడు. అందుకే నీ ఏజ్ అడిగా, ఇప్పటికీ చిన్నపిల్లోడివే, నీకు మెచ్చురిటీ లేదని సింగర్ వ్యాఖ్యానించగా.. మీకు ఏజ్ పెరిగినా మెచ్యురెటీ లేదని రివర్స్ కౌంటరిచ్చాడు మానస్. మరోవైపు లోబో తన ఇంటిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. తనకేమైనా ఐతే తన వాళ్లను చూసుకునే వాళ్లెవరూ లేరని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? టాస్క్ మొదలైంది. ఇందులో లోబో లేకుండానే గద్ద టీమ్ ఆడి గెలిచింది. దీంతో వారికి ఒక ఫ్లాగ్ వచ్చింది. ఉమాదేవిపై దాడి, ఆమె ఊరుకుంటుందా! అనంతరం 'పంతం నీదా నాదా' టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. అది చూసిన శ్రీరామ్.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు. తన మీద నోరు జారినందుకు సన్నీ ఆవేశపడుతుండగా.. మగాడివైతే ఆడుదువు రా అంటూ అతడిని మరింత రెచ్చగొట్టింది ప్రియ. పర్పుల్ టీమ్ మీద పడి పిల్లోస్ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్ రెచ్చిపోయింది. ఒసేయ్ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. మరోపక్క పర్పుల్ టీమ్ దగ్గరకు వచ్చిన శ్వేతను తన్నేందుకు ప్రయత్నించింది ప్రియ. రక్తాలు వచ్చేలా కొట్టుకు చస్తున్నా పట్టించుకోని బిగ్‌బాస్ అంతా అయిపోయాక మాత్రం హౌస్‌లో హింసకు తావు లేదంటూ హెచ్చరిక చేయడం గమనార్హం. శ్రీరామ్‌తో మసాజ్ చేయించుకున్న హమీదా ఈ టాస్క్ పూర్తయ్యే సమయానికి రెండు టీమ్స్ దగ్గరా 11 బెటాన్స్ ఉండటంతో ఇరు టీమ్స్‌కు ఐదు జెండాలు పంపించాడు బిగ్‌బాస్. ఇక రాత్రిపూట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న శ్రీరామ్ హమీదాకు మసాజ్ చేశాడు. ఈ సందర్భంగా హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, కానీ అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనిపిస్తుంది అని మనసులోని మాట చెప్పింది. ఈ మాటతో గాల్లో తేలిపోయిన శ్రీరామ్.. ఇంకెవరైనా గుర్తొస్తే మాత్రం ఎవరి దగ్గరా ఉండకూడదు అని పంచ్ ఇవ్వడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. వీరి మధ్య ఏమైనా మొదలువుతుందా? లేదా ఈ ఇద్దరిదీ స్నేహమేనా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
హమీదాకు మసాజ్ చేసిన శ్రీరామ్, లవ్ మొదలైందా!
Bigg Boss 5 Telugu Promo: అరుపులు, కొట్లాటలు, బూతులతో బిగ్‌బాస్ హౌస్ అట్టుడికిపోతోంది. మామూలుగానే మాటలతో విరుచుకుపడే కంటెస్టెంట్లు టాస్క్‌ల్లో తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అయితే మరీ ఈ రేంజ్లో కొట్టుకోవడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. కుళాయి దగ్గర నీళ్ల కోసం మహిళలు పెట్టుకునే కొట్లాటల కంటే దారుణంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి అరాచకాన్ని చూడలేకపోతున్నాం, వాళ్లకు అప్పుడప్పుడూ కాస్త పువ్వులను చూపించండ్రా, మరీ వయొలెంట్‌గా ఉన్నారు అని సలహా ఇస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా నడుస్తోందంటూ ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఈ ప్రోమోలో ఒకే టీములో ఉన్న శ్రీరామచంద్ర, హమీదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కబుర్లాడుతూ కనిపించారు. అంతేకాదు, హమీదాకు మసాజ్ చేస్తున్నాడు శ్రీరామ్. ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనుకుంటాను అని మనసులో మాట బయట పెట్టింది. దీనికి ఏదోలా ఉందీ వేళ నాలో.. ఈ వింత ఏమిటో.. గిలిగింత ఏమిటో అని బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సాంగ్ ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. అక్కడ అంత గొడవ జరుగుతుంటే వీళ్లు ఈ గ్యాప్‌లో పులిహోర కలుపుతున్నారు అని కొందరు సెటైర్లు వేస్తుండగా అక్కడ అంత సీనేమీ ఉండదు కానీ దాన్ని ఓ పాటేసి ఓవర్‌గా చూపిస్తున్నారంతే అని తేలికగా తీసిపారేస్తున్నారు. మరి నిజంగానే వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందా? లేదా మామూలు ఫ్రెండ్సా? అన్నది తెలియాల్సిందే! -
బిగ్‌బాస్: దమ్ముంటే రా అంటూ రెచ్చగొడుతున్న లేడీ కంటెస్టెంట్లు
అసలే నామినేషన్స్‌తో రగిలిపోతున్నారు ఇంటిసభ్యులు. దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాల్సిన బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌తో ఇంట్లో మరింత అగ్గి రాజేశాడు. ఈ టాస్క్‌లో నువ్వా?నేనా? అన్న రీతిలో కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. అబ్బాయిలు శారీరక దాడి చేయకుండా ఆడుతున్నారు కానీ అమ్మాయిలు మాత్రం తోసేసుకుంటూ, కొట్టుకుంటూ, దెబ్బలు తగిలించుకుంటూ ఆటలో విశ్వరూపం చూపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ టాస్క్ వల్ల శ్రీరామచంద్ర, యాంకర్ రవి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించాడు రవి. కానీ అప్పటికే బాగా హర్ట్ అయిన శ్రీరామచంద్ర అతడి మాటలు వినడానికి కూడా ఇష్టం చూపలేదు. సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు, కానీ తనతో మైండ్ గేమ్స్ ఆడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అటు మానస్‌తో కూడా కయ్యానికి కాలు దువ్వినట్లు తెలుస్తోంది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పు, నువ్వింకా చిన్నపిల్లాడిలాగే ప్రవర్తిస్తున్నావు అని సెటైర్ వేశాడు. సాగరా సోదరా టాస్కులో దమ్ముంటే రా అని సిరి రెచ్చగొట్టడంతో శ్వేత ఆమె మీదకు దూసుకెళ్లింది. కానీ అక్కడున్న ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఆపేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే కూల్‌గా కనిపించే శ్వేత ఇలా మారడంతో ఆశ్చర్యపోయిన నటి ప్రియ సాయంత్రం అయితే ఆమెకు దెయ్యం పూనుతుంది అని కౌంటర్ వేసింది. ఇక సన్నీని కూడా మగాడివైతే రా అంటూ సవాలు విసిరింది. మొత్తాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్! అలాంటి అమ్మాయే ఇష్టమంటున్న సింగర్!
Sreerama Chandra and Hamida: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఆది నుంచే రంజుగా మారింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా కంటెస్టెంట్లు ఓ రేంజ్లో పోట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని వాటికి కూడా అతిగా ఆవేశపడుతున్నారు. దీంతో వీరిది నటనా? లేక నిజమా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా వుంటే అందరి పర్సనల్ విషయాలు కూపీ లాగుతున్న కాజల్ ఈసారి సింగర్ శ్రీరామచంద్ర దగ్గర వాలిపోయింది. సేమ్ నీలాంటి అమ్మాయి ఉంటే నచ్చుతుందా? అపోజిట్ ఉంటే నచ్చుతుందా? అని అడిగింది. దీనికి శ్రీరామచంద్ర.. సరదాగా, బబ్లీగా ఉండేవాళ్లు నచ్చుతారు అని బదులివ్వగానే హమీదా మీద ఫోకస్ చేస్తూ హౌస్‌లో ఓ కొత్త లవ్ ట్రాక్ మొదలైందన్నట్లుగా చూపించారు. 'నీకు ఫీలింగ్స్ లేవా? ఏడ్వవా? అని బయట నాఫ్రెండ్స్ అంటుండే వాళ్లు' అని హమీదా చెప్పుకురాగా ఇక్కడ అవన్నీ బయటకు తన్నుకొచ్చేస్తున్నాయని బదులిచ్చాడు సింగర్. ఇద్దరూ ముచ్చట్లలో పడి సరదాగా నవ్వుకున్నారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. ఎడిటర్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. సాధారణ కబుర్లను కూడా లవ్ యాంగిల్లో చూపించడం మీకే చెల్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి అన్నీ కయ్యాలే చూపిస్తున్నారు అనుకునేలోగా పులిహోర విషయాల మీద ఫోకస్ పెట్టాడుగా అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
బిగ్‌బాస్ 5: కొండంత ఆశతో హౌస్‌లో అడుగుపెట్టిన సింగర్
Sreerama Chandra In Bigg Boss 5 Telugu: సింగర్ శ్రీరామచంద్ర.. 2010లో 'ఇండియన్ ఐడల్ షో' విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యాడు. ఆయన ఇప్పటివరకు 9 భాషల్లో కలిపి 500కు పైగా పాటలు పాడాడు. అందులో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. అయితే తాను తెలుగు పాటలు ఎక్కువగా పాడాలనుకుంటున్నానని చెప్తున్నాడు. తాజాగా అతడు బిగ్‌బాస్ ఐదో సీజన్లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తను నిజంగా శ్రీరామచంద్రుడినే అంటున్న అతడు తన గాత్రంతో అందరినీ ఎంటర్టైన్ చేస్తానంటున్నాడు. ఆ మధ్య 'శ్రీ జగద్గురు ఆది శంకర' సినిమాలోనూ నటించాడు. బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతానని కొండంత ఆశతో హౌస్‌లో అడుగుపెట్టాడు శ్రీరామచంద్ర. చూడటానికి సున్నితంగా కనిపించే అతడు టాస్క్‌ల్లో ఎలా ఆడతాడు? తోటి కంటెస్టెంట్లను ఎలా డీల్ చేస్తాడన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్ 5: ఆ స్టార్ సింగర్ ఎంట్రీ ఫిక్స్!
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే హౌస్ సెట్టింగ్ పూర్తవగా ప్రేక్షకులను అలర్ట్ చేస్తూ ప్రోమో కూడా రిలీజైన విషయం తెలిసిందే. మరోపక్క కంటెస్టెంట్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ మేరకు కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో యాంకర్ రవి, విశ్వ, సరయూ, కొరియోగ్రాఫర్ నటరాజ్, యానీ మాస్టర్, లోబో, మానస్, ఉమా దేవి, జశ్వంత్, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, వీజే సన్నీ, ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్, ప్రియ, వర్షిణి, లహరి శ్రీ ఉన్నారు. ఈ లిస్టులో మార్పుచేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఇక ప్రతి సీజన్లో ఒక సింగర్ ఉన్నట్లే ఈసారి కూడా హౌస్‌లో ఒక సింగర్ ఉండాలని బిగ్‌బాస్ నిర్వాహకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టార్ సింగర్ శ్రీరామచంద్రను షోలోకి రప్పిస్తున్నారని సమాచారం. 2010లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న శ్రీరామచంద్ర పాటలు పాడటంతో పాటు, పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అతడు గనక షోలోకి వస్తే పాట, నటనతో పాటు ఆటతోనూ మనసులు గెలుచుకుంటాడని అంటున్నారు ఆయన అభిమానులు. గత సీజన్లలో సింగర్లు గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ అభిమానులను ఎంతగా అలరించారో రామచంద్ర కూడా అదేస్థాయిలో ఆకట్టుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఈ గాయకుడు షోలో అడుగు పెట్టబోతున్నాడా? ఒకవేళ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే తన గాత్రంతో బిగ్‌బాస్ వీక్షకుల మనసు దోచుకోనున్నాడా? అనేది తెలియాలంటే మరో కొద్దిరోజులు కాగాల్సిందే! -
మూడు కోకిలలు.. ఆరు పాటలు
ప్రతిరోజూ పండగలానే... ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్‌లో నా కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్’ అనే షో ప్రసారమౌతుంది. నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్‌కి చాలా స్కోప్ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా. – శ్రీరామచంద్ర బాలీవుడ్లో ఎంటరవుతా 2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్ ఐడల్’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది. ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్‌తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. – రేవంత్ అప్పుడే తీపి విలువ తెలుస్తుంది ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ను కూడా మేం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. ఎందుకు ఫుడ్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్ ఐడల్ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్‌కే మైల్స్టోన్ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే. నేను గతేడాది నా సొంత యూట్యూబ్ చానల్ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్ చానల్ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారు సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి. – కారుణ్య -
ప్రేమా లేదు.. గీమా లేదు..!
‘‘ఇండియన్ ఐడల్‌గా నన్ను నిలబెట్టడానికి తెలుగువారు ఎంతో కృషి చేశారు. నన్ను గాయకునిగానే అంతగా ఆదరించిన ప్రజలు కథానాయకునిగా కూడా తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అని శ్రీరామచంద్ర అన్నారు. సుబ్బు ఆర్వీ దర్శకత్వంలో శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా మద్దాల భాస్కర్(భాను) నిర్మించిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్తానయ్’. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్‌కి అందించారు. వారితో పాటు సుమన్, నరేష్, భానుచందర్, సాయికుమార్, శ్రీకాంత్ అడ్డాల, వీరు పోట్ల, జె.కె.భారవి, కె.ఎం.రాధాకృష్ణన్, సురేష్‌కొండేటి, ఐఏఎస్ అధికారి చక్రవర్తి అతిథులుగా పాల్గొని చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు ముందే నాకు హీరోగా చాలా అవకాశాలొచ్చాయి. కానీ... మంచి అవకాశం కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాను. దర్శకుడు అద్భుతమైన కథను తయారు చేశారు. చాలా కష్టపడి ఈ పాత్ర చేశాను. కేవలం ఈ కేరక్టర్ కోసమే 15 కిలోలు బరువు తగ్గాను. నటన, నాట్యం, పోరాటాల విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. రషెస్ చూసినవాళ్లందరూ నా పెర్ఫార్మెన్స్ బాగుందన్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికే హీరోగా మారాను’’అన్నారు. ఆరు నుంచి అరవై ఏళ్ల వారి వరకూ అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. పదికాలాల పాటు గుర్తుంచుకోదగ్గ సినిమాగా దర్శకుడు ఈ సినిమాను మలిచాడని నిర్మాత పేర్కొన్నారు.