Bigg Boss Telugu 5, Sixth Week Nominations: వారమంతా కలిసే ఉంటారు. కానీ సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడలేని కోపాలు ప్రదర్శిస్తుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ నానారభస చేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య వైరం పెరిగేది, మిత్రువులు కూడా శత్రువులుగా మారేది ఈ 'మండే' రోజే. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్స్‌తో భగభగ మండిపోతోంది బిగ్‌బాస్ హౌస్. ప్రతిసారి ఎధవ రీజన్లతో నామినేట్ చేస్తారంటూ తెగ చిరాకు పడింది ప్రియాంక సింగ్. టాస్క్‌లో నా జేబులో నుంచి కాయిన్లు దొంగతనం చేశాడంటూ లోబో జెస్సీని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణం విన్న జెస్సీ వెటకారంగా నవ్వుతూ తాను గేమ ఆడటానికి వచ్చానని, నమ్మకంతో పని లేదంటూ కౌంటరిచ్చాడు.
అవసరానికి తగ్గట్టు రిలేషన్‌షిప్ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్ చేశాడు శ్రీరామ్. అలాగే షణ్ముఖ్‌ను సైతం నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే నామినేషన్‌ను జీర్ణించుకోలేకపోయిన షణ్ను... బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వో దేవుడివి, నువ్వేది చెప్తే అదే మేం పాటించాలి! అంతేనా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వీరిద్దమరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ప్రియ ఉన్నన్ని రోజులు తప్పకుండా ఆమెనే నామినేట్ చేస్తానన్నాడు సన్నీ. అతడి మాట విని అవాక్కైన ప్రియ.. వార్నింగ్ ఇస్తున్నావా? అంటూనే అతడి ఫొటోను మంటల్లో వేసింది. మొత్తానికి వాడివేడిగా సాగనున్న ఈ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment