Bigg Boss Telugu 5, Episode 54: Shanmukh Jaswanth Is New Captain Of This Week In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: యానీపై కత్తిదాడికి సిరి ప్లాన్‌, రగిలిపోతున్న సన్నీ, మానస్‌

Published Thu, Oct 28 2021 11:39 PM | Last Updated on Fri, Oct 29 2021 8:40 AM

Bigg Boss Telugu 5: Shanmukh New Captain, Anee Master Fire - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 54: యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టిన మొదటిరోజునుంచే గేమ్‌ ఆడటం మొదలు పెట్టాడని పింకీతో చెప్పుకొచ్చాడు మానస్‌. ఈ హౌస్‌లో అతడితో ఫ్రెండ్‌షిప్‌ చేయాలని, అతడిని దగ్గర చేసుకోవాలని ఎవరికీ లేదన్నాడు. మరోవైపు రవి అర్ధరాత్రి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ఇంకా మెలకువతోనే ఉన్న షణ్ను, సిరి కాలికి దండం పెట్టాడు.

ముద్దు పెట్టి సైలెంట్‌గా వెళ్లిపోయిన సిరి, ఉక్కిరిబిక్కిరైన షణ్ను
తర్వాతి రోజు ఏమైందో ఏమో కానీ సిరి సడన్‌గా షణ్నుకు ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్‌ చేశారా? నాకు ఉంటదిపుడు అని తనలో తానే సణుక్కున్నాడు. కాసేపటికే మళ్లీ వచ్చిన సిరి.. నీ వల్లే మెంటల్‌గా డిస్టర్బ్‌ అవుతున్నానని చెప్పింది. నేను నీతో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అని షణ్నుని అడిగింది. వీటికి షణ్ను బదులిస్తూ.. నా వల్ల చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని సింగిల్‌ డైలాగ్‌లో తేల్చేశాడు. నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్‌ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది.

ప్రియగారు కరెక్ట్‌ ఆడారంటూ సన్నీని రెచ్చగొట్టిన శ్రీరామ్‌
తర్వాత 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ఇందులో భాగంగా థర్మాకోల్‌ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్‌ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్‌ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్‌ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో శ్రీరామ్‌, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్‌ పోటీపడ్డారు. ఫస్ట్‌ బజర్‌ మోమగానే శ్రీరామ్‌, సన్నీ ఒకరినొకరు తోసుకుని కిందపడ్డారు. అయితే సన్నీ అవుట్‌ అయ్యాడని సంచాలకుడు జెస్సీ ప్రకటించాడు. కానీ అతడు గేమ్‌ నుంచి వెళ్లిపోతూ తన ఫ్రెండ్‌ మానస్‌ను గెలిపించాడంటూ చురకలంటించాడు శ్రీరామ్‌. ప్రియగారు కరెక్ట్‌ ఆడారంటూ అతడిని రెచ్చగొట్టాడు.

నోరు అదుపులో పెట్టుకో: శ్రీరామ్‌ వార్నింగ్‌
'సన్నీ ఇండిపెండెంట్‌ ప్లేయర్‌ అనుకున్నా.. ఓడిపోయినవ్‌, అందుకే బయటున్నవ్‌..' అని పదేపదే చెప్తూ అతడు మండిపోయేలా చేశాడు. గాల్లో ముద్దులు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకో అని వార్నింగ్‌ ఇచ్చాడు శ్రీరామ్‌. తర్వాతి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్‌ అని ప్రకటించాడు. అతడి నిర్ణయంతో ఏకీభవించని సన్నీ.. జెస్సీ ముందున్న బ్యాగును తంతూ రెచ్చిపోయాడు. మానస్‌ అవుట్‌ కాదంటూ వాదించాడు.

కొరికిన యానీ! కత్తి అందుకున్న సిరి!
తర్వాతి రౌండ్‌లో ముగ్గురు మిగలగా షణ్ను, సిరి యానీని టార్గెట్‌ చేశారు. దీంతో యానీ.. 'ఇండివిడ్యువల్‌ గేమ్‌ లేదు, నిజాయితీ లేదు' అంటూ సిరిని నెట్టేసింది. అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన ఇంటిసభ్యులు అది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. అయితే అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని, అలాంటప్పుడు తాను ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్‌ అవ్వగలనంటూ ఆవేదన చెందింది యానీ. దీంతో స్వచ్ఛందంగా గేమ్‌లో నుంచి తప్పుకుంది.

నా ముందుకు రాకు: యానీ వార్నింగ్‌
ఈ ఇంట్లో ఉన్నంతవరకు తాను కెప్టెన్‌ అవ్వను అంటూ ఏడ్చేసింది. ఆమెను ఓదార్చేందుకు సన్నీ వెళ్లగా అతడిపై కూడా ఫైర్‌ అయింది. నా కళ్ల ముందుకు రాకంటూ వార్నింగ్‌ ఇచ్చింది. 'పందులే గుంపులుగా ఆడతాయి, సింహం సింగిల్‌గా ఆడుతుంది' అంటూ డైలాగులు వదిలింది. 'గేమ్‌లో షణ్ముఖ్‌ నా దగ్గరకు వస్తున్నాడు, మొగోడు ఆడే ఆట ఇదేనా' అని మండిపడిపోయింది. చివరి రౌండ్‌లో సిరిపై షణ్ముఖ్‌ విజయం సాధించి కెప్టెన్‌గా అవతరించాడు. దీంతో అతడికి హగ్గుల మీద హగ్గులిచ్చింది సిరి. మరోవైపు మానస్‌.. ఎవరెవరిని టార్గెట్‌ చేయాలో ఫిక్సయ్యానని సన్నీతో చెప్పుకొచ్చాడు. కానీ పేర్లు మాత్రం వెల్లడించలేదు. చేతులు కట్టుకుని కూచున్నా అంటున్నారు కదా! అటాక్‌ అంటే ఏంటో చూపిస్తానని ఫిక్సయ్యాడు మానస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement