Anee Master
-
యానీ మాస్టర్‌కు కరోనా: నీకిలా జరగాల్సిందేనంటూ నెటిజన్ శాపనార్థాలు
కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'గతేడాది కూడా నాకు కోవిడ్ వచ్చింది. 24 రోజుల తర్వాత అంటే జనవరి 23న నాకు కరోనా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు జనవరి 24న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా ఏమైనా టైం మెయింటెన్ చేస్తుందా? క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది' అని యానీ మాస్టర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. రెండోసారి ఈ మహమ్మారి బారిన పడిన ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఒక నెటిజన్ మాత్రం తగిన శాస్తి జరిగిందని విమర్శించింది. 'సన్నీకి సపోర్ట్ చేయలేదు కదా, నీకు కరోనా రావాల్సిందే'నని శాపనార్థాలు పెట్టింది. ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన యానీ.. 'నువ్వింకా ఎదగాలి' అంటూ కౌంటరిస్తూనే.. 'సన్నీ బాబా నాకు కోవిడ్ పోయేలా ఏదైనా చెయ్యొచ్చుగా' అని సరదాగా కామెంట్ చేసింది. -
గుడ్ న్యూస్ చెప్పిన యానీ మాస్టర్, మెగాస్టార్ సినిమాలో ఛాన్స్
Bigg Boss Telugu 5 Contestant Anee Master: టాలీవుడ్లో టాప్ లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న ఆమె 11వ వారంలోనే ఎలిమినేట్ అయింది. షోలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకున్న ఆమె తనపై ట్రోలింగ్‌ను చూసి విస్తుపోయింది. షో ముగిసిందని, ఇంకా తన గురించి తిట్టుకుంటూ టైంపాస్ చేయడం ఆపేయండని చెప్పుకొచ్చింది. తాజాగా తన అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది యానీ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. ఈ అవకాశం బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ముందే వచ్చిందని, ఈ సినిమాలో చిరంజీవి, వెన్నెల కిషోర్ల పక్కనే ఉంటానంటూ తన పాత్ర గురించి చెప్పింది. ఇక ఈ మూవీ కొరియోగ్రఫీ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తనకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే! -
ఇక చాలు స్టార్ మా: యానీ మాస్టర్ ఫైర్
Bigg Boss 5 Telugu, Anee Master On Trolling: నచ్చినవారిని ఆకాశానికెత్తేయడం, నచ్చనివారిని పాతాళానికి తొక్కేయాలనుకోవడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. కొందరు సెలబ్రిటీలు నెగెటివిటీని పట్టించుకోకపోవడమే నయం అని ఊరుకుంటున్నప్పటికీ మరికొందరు సెలబ్రిటీలు మాత్రం ట్రోలర్స్‌ను వదిలిపెట్టేది లేదంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు. బుల్లితెర బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన చాలామంది కంటెస్టెంట్లు నెట్టింట తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొందరు నెటిజన్లు వారిని పరుష పదజాలంతో విమర్శించడమే కాక వారి కుటుంబంపై కూడా మాటలతో దాడి చేస్తున్నారు. దీన్ని సహించడం తన వల్ల కాదనుకున్న యాంకర్ రవి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నవారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పాడు. రవి తీసుకున్న నిర్ణయాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్ అభినందించింది. అంతేకాదు నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్‌గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసింది చాలు అంటూ ఫైర్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. -
యానీ మాస్టర్‌కు బాధ్యత అప్పజెప్పిన రామ్‌చరణ్!
Bigg Boss Telugu 5, Anee Master: మెగా కోడలు ఉపాసన కామినేని ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి అనుష్ పాల పెళ్లివేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో హీరో రామ్‌చరణ్ కూడా తళుక్కున మెరుస్తున్నాడు. మరదలి వివాహ వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే చెర్రీ.. మరదలి సంగీత్ సెలబ్రేషన్స్ బాధ్యతను బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఈవెంట్‌ను తనకు అప్పగించడంతో యానీ మాస్టర్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. ఈ పెళ్లి కోసం మొన్నటినుంచే తన టీమ్‌తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న యానీ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే! తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పిన రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది యానీ. 15 ఏళ్లుగా మీరు నాపై నమ్మకం ఉంచుతూ వస్తున్నారంటూ చెర్రీతో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ సంగీత్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం దోమకొండ కోటలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ షో బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆమెకు నిర్వాహకులు మంచి పారితోషికమే ముట్టజెప్పారు. అటు హౌస్ నుంచి బయటకు రాగానే రామ్‌చరణ్ పిలిచి మరీ ఈవెంట్ అప్పజెప్పడంతో యానీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
యానీ మాస్టర్‌తో సితార స్టెప్పులు.. వీడియో వైరల్
Mahesh Babu Daughter Sitara Dance With Anee Master Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్5 కంటెస్టెంట్ యానీ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. డీజే స్నేక్ చార్ట్ బస్టర్ ‘టకీ టకీ’అనే పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. 'యానీ మ్యామ్ స్టెప్పులతో రీచ్ అవ్వడానికి ప్రయత్నించాను. ఇంకా రావాల్సి ఉంది' అంటూ సితార ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సితార డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్న వయసులోనే సితర డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతుందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
అమ్మేస్తానంటే ఏం కాదు? నేను డ్యాన్స్ చేస్తే మాత్రం తప్పా?
బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన యానీ మాస్టర్ కోపంతో ఊగిపోతోంది. కాజల్ విషయంలో తనను నోటికొచ్చినట్లు విమర్శిస్తుండటంతో తట్టుకోలేకపోతోంది. అలాగే తను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే రవి భార్య నిత్యకు సైతం వేధింపులు తప్పట్లేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలమైంది. దీంతో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇస్తూ వీడియోలు పోస్ట్ చేసింది. 'బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగే గొడవలను చూస్తున్నా. మీరు మొదటి నుంచి 11 వారాల వరకు చూడటం లేదా? మీరు ఒకరికి ఫాలోవరే కావచ్చు, అభిమానే కావచ్చు. కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తానంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు. అదే నేను డ్యాన్స్ చేస్తే మాత్రం చులకన చేస్తున్నానని, అగౌరవపరుస్తున్నానంటూ దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే.. ఒకరిని అమ్మేస్తానంటూ అగౌరవపర్చడం కాదా? అది మీరు లైట్ తీసుకున్నప్పుడు నా డ్యాన్స్ మాత్రం ఎందుకింత హైలైట్ చేస్తున్నారు? మరో ముఖ్య విషయమేంటంటే నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను. ఆమె కూతురు వియూ వీడియోల కింద బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారంట! ఐదేళ్ల చిన్న పాపండీ.. ఇది కరెక్ట్ కాదు. మేమంటే భరిస్తాం, కానీ చిన్నపిల్లల వీడియోల మీద ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత ద్వేషం? అసలు నాకు బుద్ధి లేదా? మీకు బుద్ధి లేదా? వియు వీడియోలకు చెడ్డ కామెంట్లు చేయడం ఆపండి' అని హెచ్చరించింది యానీ. -
ఒకరు చచ్చిపోతుంటే కూడా కాజల్‌కు అదే కావాలి: యానీ
Bigg Boss Telugu 5, Anee Master Bigg Boss Buzz Video: బిగ్‌బాస్ హౌస్‌లో 11 వారాల జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది యానీ మాస్టర్. ఆమెను మరికొద్ది రోజులు హౌస్‌లో ఉంచేందుకు ప్రేక్షకులు విముఖత చూపించడంతో షో నుంచి ఎలిమినేట్ అయింది. భారంగా బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలికింది. బయటకు వచ్చిన వెంటనే అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. అరియానాకిచ్చిన ఇంటర్వ్యూలో హౌస్మేట్స్ గురించి యానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ. కాజల్ గురించి చెప్తూ.. ఒకరు చచ్చిపోతుంటే కూడా ముందు నీ స్ట్రాటజీ ఏంటో చెప్పంటూ గుచ్చిగుచ్చి అడుగుతుందని కామెంట్ చేసింది. హౌస్‌లో ఇప్పటికీ నటిస్తున్నవాళ్లు ఉన్నారని, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పనని దాగుడు మూతలు ఆడింది. శ్రీరామ్ నాలుగో వారం నుంచే తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, కానీ ఆ విషయం తనకు తెలియలేదంటూ ఎమోషనల్ అయింది. యానీ మాస్టర్ కన్నింగ్, ఫాల్తూ గేమ్ ఆడుతుందంటూ ఉమాదేవి మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బజ్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
యానీ మాస్టర్‌కు కళ్లు చెదిరే పారితోషికం!
Bigg Boss Telugu 5, Eliminated Contestant Anee Master Remuneraion: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వచ్చేసింది. కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ 11వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ట్రోఫీతో ఇల్లు చేరాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన యానీ మాస్టర్‌కు ఎంత ముట్టింది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీల పాపులారిటీని బట్టి బిగ్‌బాస్ టీమ్ ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కో రకంగా రెమ్యునరేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న యానీకి షో నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట! ఈ లెక్కన 11 వారాలకు గానూ ఆమె రూ.30 లక్షల పైచిలుకు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె హౌస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఆధారంగా ఈ రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోనాల్ చెప్పినట్లుగా ఈ డబ్బుతో యానీ సొంతింటి కల నెరవేరుతుందేమో చూడాలి! -
యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా! అదే ఆమె కొంపముంచిదా?
Reasons Behind Anne Master Eliminations From Bigg Boss Telugu 5 Show: తాజా బిగ్‌బాస్ 5 నుంచి యానీ మాస్టర్ బయటకు వచ్చింది. 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా యానీ మాస్టర్ హౌజ్‌ను వీడక తప్పలేదు. చివరి వరకు ప్రియాంక, యానీ మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ప్రియాంక సేవ్ అయిపోవడంతో యానీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. చెప్పాలంటే వీరిద్దరిలో యానీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. సొంతంగా తన కోసం ఆట ఆడింది. ప్రియాంక సింగ్ మాత్రం తనకంటే ఎక్కువగా మానస్‌పై ఫోకస్ పెడుతూ తన గేమ్‌ను పక్కన పెట్టింది. ఎమన్నా అంటే మానస మానస్ అంటూ జపం చేస్తూ తనకోసం గేమ్ ఆడటమే మరిచిపోయింది.ఈ విషయంలో ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినా కూడా తన ఆటతీరు మార్చుకోవడం లేదు. ఏ విషయంలో చూసిన ప్రియాంక కంటే యానీయే స్ట్రాంగ్. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కాగా దీనికి ప్రధాన కారణం ఆమె నోటి దురుసు. ఏ విషయంలోనైనా తను చాలా పర్ఫెక్ట్ అనే అతి నమ్మకంతో ఉండటం కూడా ఒక కారణం. హౌజ్‌లో తనకు ఏమైన అవసరం ఉంటే చాలా నెమ్మదిగా మాట్లాడే యానీ.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారితే మాత్రం నోరు చించుకుంటు అందరి మీద అరుస్తుంది.‘గేమ్‌లో తేడా వస్తే చాలు హౌజ్‌లో నేను ఒక్కదానినే నిజాయితిగా ఆడాను అందరూ గ్రూపులుగా ఆడుతున్నారు’ ఏడుపు మొదలు పెడుతుంది. అదే యానీ కొంప ముంచింది అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన ఆమె నామినేషన్ నుంచి తప్పుకోవడం వల్లే ఇంతకాలం హౌజ్‌లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వారం యానీ నామినేషన్లో రావడం, ఎప్పుటి కంటే కూడా ఈవారం ఆమె కాస్తా ఎక్కువగా నోటి దురుసు ప్రదర్శించడంతో ప్రేక్షకుల్లో ఆమెపై నెగిటివిటి పెరిగిందంటున్నారు. ఇక అంతకంటే సహా కంటెస్టెంట్ కాజల్‌ను ఎప్పుడ తప్పుబట్టడం, తన గురించి మిగతా కంటెస్టెంట్స్ వద్ద తప్పుగా మాట్లాడటం కూడా ప్రధాన కారణం అంటున్నారు. అప్పటి వరకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఫైర్ టాస్క్‌లో అనీ మాస్టర్ చేసిన రచ్చతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంటెస్టెంట్స్ అందరిపై ఆనీ మాస్టర్ నోరు పారేసుకోవడం.. చాలా ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుండటంతో ప్రేక్షకులు ఇంటి నుంచి ఈమెను బయటికి పంపించేశారు. కచ్చితంగా వచ్చేవారం ప్రియాంక బయటికి రావడం ఖాయం అనే ప్రచారం ఇప్పటి నుంచే మొదలైంది. -
Bigg Boss Telugu 5: రవిలో మస్తు షేడ్స్ ఉన్నయ్: యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 78: వారాలు గడిచేకొద్దీ హౌస్‌లో జనాలు పలుచబడుతున్నారు. జనాలు పలుచబడేకొద్దీ హౌస్మేట్స్ మధ్య పోటీ పెరుగుతోంది. పోటీ పెరిగేకొద్దీ వారిలో టెన్షన్ కూడా పెరుగుతోంది. ఎలాగైనా టాప్ 5కి చేరుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే కప్పు కొట్టి తీరాల్సిందేనని మరికొందరు బలంగా ఫిక్సయ్యారు. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న యానీ మాస్టర్ కల కలగానే మిగిలిపోయింది. 11వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా ఆమె హౌస్‌మేట్స్‌కు ఏమని సందేశాన్నిచ్చింది? నాగ్ కంటెస్టెంట్లతో ఏమేం గేమ్స్ ఆడించాడు? అనేది తెలియాలంటే నేటి(నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కంటెస్టెంట్లు ఒకరి గురించి మరొకరు రాసుకున్న ప్రశ్నలను నాగ్ అడిగాడు. ఈ క్రమంలో శ్రీరామ్ నటిస్తున్నాడని, అతడికి పలు ఫేస్‌లు ఉన్నాయని నాగ్ చెప్పగా హౌస్మేట్స్ మాత్రం అలాంటిదేం లేదని అతడు మంచోడని కితాబిచ్చారు. షణ్ముఖ్ వల్ల సిరి గేమ్‌లో వెనకబడుతుందా? సిరి-షణ్ను ముందుగా అనుకుని బిగ్‌బాస్‌కు వచ్చారా? అన్న ప్రశ్నలకు సైతం కాదని బదులిస్తూ కంటెస్టెంట్లు సిరికే సపోర్ట్ చేశారు. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటన్న ప్రశ్నకు మానస్ ఒక్కముక్కలో ఫ్రెండ్షిప్ అని తేల్చేశాడు. నువ్వు మానస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావని నాగ్ ప్రియాంకను సూటిగా అడగ్గా.. ఆమె మంచి ఫ్రెండ్షిప్ ఆశిస్తున్నానని చెప్పింది. ఎందుకు సిరి వెనకాల ఆమెపై జోక్స్ వేస్తావని ప్రియాంకను అడగ్గా ముందు వేసే జోక్సే వెనకాల కూడా వేస్తానని ఆన్సరిచ్చింది పింకీ. నువ్వు బీబీ టైటిల్ గెలవడానికి వచ్చావా? గెలిపించడానికి వచ్చావా? నీ బ్రెయిన్ ఎప్పుడు వాడతావు? అన్న ప్రశ్నకు తాను టైటిల్ గెలవడానికే వచ్చానని సన్నీ. శ్రీరామ్‌ను ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అన్న ప్రశ్నకు రవి లేదని చెప్పాడు. చుట్టూ ఉన్నవాళ్లను ఎందుకు వాడుకుంటున్నావన్న ప్రశ్నకు కంటెస్టెంట్లు ఉన్నదే వాడుకోవడానికి అని తెలివిగా ఆన్సరిచ్చాడు. తర్వాత నాగ్ కాజల్‌ను సేవ్ చేశాడు. అనంతరం 'అనుభవించు రాజా' హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ బిగ్‌బాస్ స్టేజీపై సందడి చేశారు. కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. తర్వాత ఒక్కో డైలాగ్‌ను ఒక్కొక్కరికి అంకితమివ్వాలంటూ ఓ సరదా గేమ్ ఆడించాడు నాగ్. 'నన్ను రెచ్చగొట్టకు' అన్న డైలాగ్‌ను మానస్.. సన్నీకిచ్చాడు. 'నమ్మకం లేదు దొర' డైలాగ్‌ను షణ్ను.. రవికిచ్చాడు. 'సరె సర్లే చాలా చూశాం' అన్న బోర్డును షణ్నుకిచ్చాడు రవి. 'మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా నీలో.. కమల్ హాసన్' అన్న డైలాగ్ బోర్డును యానీ రవికి అంకితమిచ్చింది. 'ఓన్లీ వన్స్ ఫసక్' బోర్డును ప్రియాంక.. మానస్‌కు ఇచ్చింది. 'ఏమో సర్, నాకు కనబడదు' డైలాగ్ షణ్నుకు సరిగ్గా సెట్టవుతుందన్నాడు శ్రీరామ్. 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. 'నీ బొందరా నీ బొంద' డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది కాజల్. 'అయిపాయే' అనేది రవికి సెట్టవుతుందన్నాడు సన్నీ. అనంతరం సిరి, ప్రియాంక సేఫ్ అవగా యానీ ఎలిమినేట్ అయింది. అనంతరం యానీ హౌస్‌మేట్స్‌తో మాట్లాడింది. మంచి తమ్ముడిగా ఉన్నందుకు రవికి థ్యాంక్స్ చెప్పింది. శ్రీరామ్ మంచి ఫ్రెండ్ అంది. షణ్ముఖ్ ఎప్పుడూ ఉన్నదున్నట్లు మాట్లాడతాడంది. సిరి పటాకలా ఆడుతుందని పొగిడింది. ప్రియాంక.. సీతాకోక చిలుక అని కాంప్లిమెంట్ ఇచ్చింది. బయటకొచ్చాక మానస్‌తో మంచి ఫ్రెండ్ అవుతానంది. సన్నీ తన ఫ్రెండ్ అని, అతడిని మిస్ అవుతానంది. కాజల్ గురించి చెప్పడానికి ఏమీ లేదని పెదవి విరించింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. తర్వాత మానస్‌కు ఒక ప్రేక్షకుడు పంపిన వాయిస్ మెసేజ్‌ను వినిపించారు. మొన్నటివరకు బాగా ఆడారు. కానీ ఈ మధ్య పింకీతో కలిసి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు? అని అతడు ప్రశ్నించాడు. దీనికి మొదట షాకైన మానస్ కాసేపటికే తేరుకుని పింకీతో తనకు బాండ్ ఏర్పడిందన్నాడు. ఇది కంటెంట్ ఇవ్వడం కాదని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. -
యానీ ఎలిమినేటెడ్! స్టేజీపై నాగిని డ్యాన్స్!
Bigg Boss 5 Telugu, 11th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంటోంది. 19 మందితో మొదలైన ఈ గేమ్ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సన్నీ, కాజల్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, యానీ మాస్టర్, రవి, శ్రీరామ్, మానస్ మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు ఫైనల్ వరకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం రవి మినహా.. మిగతా 8 మంది నామినేషన్లో ఉన్నారు. నామినేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే యానీ వెళ్లిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అనధికారిక పోల్స్‌లోనూ యానీ చివరి స్థానంలో ఉంటూ ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తాజాగా లీకువీరులు మాస్టర్ ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవన్నీ నిజమయ్యాయి. పైగా మొదటి నుంచీ ఓటింగ్‌లో వెనకబడింది కాబట్టి యానీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిందన్న వార్త నిజమే అయి ఉండొచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. కాజల్‌ను నాగిని అంటూ ఆమె ముందు కుప్పిగంతులు వేసిన యానీ రేపు నాగిని డ్యాన్స్ చేస్తూనే వెళ్లిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. -
'ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు!'
Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక సింగ్, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి విజేతగా అవతరించాడు. కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' టాస్క్‌లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు. తర్వాత టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు. షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్‌తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్‌తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్యూ చెప్పింది. ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు. తర్వాత అలారమ్ మోగినప్పుడు ట్రక్‌లో కూర్చున్న మానస్, కాజల్‌లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్‌లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. తన ఫొటోను కాల్చేస్తారని భయపడిపోయిన యానీకి కోపం కట్టలు తెంచుకుంది. తనకు పాస్ దక్కుండా చేస్తున్నారని మండిపడిపోయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి దక్కినట్లు సమాచారం! -
లవర్స్‌ను తలుచుకుంటూనే హగ్గుల్లో మునిగిపోయిన సిరి-షణ్ను
Bigg Boss 5 Telugu, Episode 75: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవికి సూపర్ పవర్ తీసుకునే ఛాన్స్ రాగా అతడు మాత్రం ఈ అవకాశాన్ని సన్నీకిస్తానన్నాడు. 25 బంగారు ముత్యాలు చెల్లించి ఈ పవర్‌ను పొందాలని సన్నీకి చెప్పాడు. అయితే సన్నీ మాత్రం తనకు ఏ పవర్ వద్దని మొండికేశాడు. రంగంలోకి దిగిన ఇంటిసభ్యులు అతడిని ఎలాగోలా ఒప్పించారు. ఇంతకీ పవరేంటంటే.. మైన్‌లోకి వెళ్లే హౌస్‌మేట్స్‌లో నుంచి ఒకరిని తొలగించి వారి స్థానంలో వెళ్లి ఆడాలి. ఎదుటివాళ్లను గ్రూప్ గేమ్ అని మందలించే రవి, శ్రీరామ్, యానీ కుమ్మక్కై గేమ్ ఆడారు. శ్రీరామ్ తన దగ్గరున్న ముత్యాలను యానీకి ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే దాన్నో దొంగతనంలా సీన్ క్రియేట్ చేశారు. అప్పటిదాకా దొంగతనం చేస్తే తప్పన్న రవి.. ఎందుకాలస్యం, వెంటనే వెళ్లి దొబ్బేయండి అని సూచించడం గమనార్హం. దీంతో యానీ... అందరిముందూ ఏదో దొంగతనం చేసినట్లుగా కవరింగ్ ఇస్త శ్రీరామ్ ముత్యాలు తీసేసుకుంది. సన్నీ ఏదో ఫ్రస్టేషన్లో ఉన్నాడని అర్థమైన కాజల్ అతడి వెంటే నడిచింది. నా తోకలాగా వెనకే వస్తున్నావేంటి? అని చిరాకుపడ్డాడు సన్నీ. దీంతో మిగతా హౌస్మేట్స్ ఆమెకిలా జరగాల్సిందే అన్నట్లుగా ఓ లుక్కిచ్చారు. అందరి ముందు తనను అవమానించాడని కాజల్ ఏడ్చేయగా సన్నీ సారీ చెప్పి ఆమెను ఓదార్చాడు. తనకిచ్చిన పవర్‌ను కూడా ఆమెకు ఇవ్వడానికి ప్రయత్నించాడు కానీ అది కుదరదని తేల్చాడు సంచాలకుడైన రవి. దీంతో అతడు తన పవర్నుపయోగించి శ్రీరామ్ స్థానంలో మైన్‌లోకి వెళ్లి అయిష్టంగా గేమ్ ఆడాడు. మొత్తంగా గేమ్ ముగిసేసరికి మానస్, ప్రియాంక, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కాజల్ బాధపడితేనే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి, అలాంటిది ఆమె డిస్కనెక్టెడ్ అని ముఖం మీదే చెప్తే ఎలా ఉంటుందన్నాడు మానస్. అందుకే కాజల్‌తో మాట్లాడట్లేదని సన్నీతో చెప్పాడు. అటు ప్రియాంకతోనూ మాటలు బంద్ చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. పదేపదే దీప్తి సునయనను గుర్తు చేసుకున్నాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ను గుర్తు చేసుకుంది. తర్వాత సిరి ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసిచ్చింది. ఫీలైన షణ్ను సారీ చెప్పి హగ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అతడికి హగ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరోపక్క పింకీ.. తనను ఫ్రెండ్‌గా కాకపోయినా కనీసం మనిషిలా ట్రీట్ చేస్తే చాలంటూ మానస్‌ను వేడుకుంది. ఇదిలా వుటే ఈ వారం ప్రెస్టేజ్ 25 వేల గిఫ్ట్ వోచర్ యానీ సొంతమవగా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది. తర్వాత ఇంటిసభ్యులతో కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అనే సరదా టాస్క్ ఆడించాడు బిగ్‌బాస్. ఇందులో జంటలుగా విడిపోయిన హౌస్మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూతద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. ఫైనల్‌గా మాత్రం ఎక్కువ పాయింట్లతో యానీ మాస్టర్- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచర్ గెలుపొందింది. -
యానీ మాస్టర్ బిగ్‌బాస్‌కు వెళ్లిందే అందుకు: మోనాల్ గజ్జర్
Bigg Boss Telugu 5, Monal Gajjar Supports Anee Master: యానీ మాస్టర్.. కొంతకాలంగా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆమె నామినేషన్స్‌లోకి రావాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తుందో వర్గం. ఎట్టకేలకు ఈ వారం యానీ నామినేషన్లోకి రావడంతో ఆమె ఎలిమినేట్ అవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి. కొందరైతే అడ్వాన్స్‌గా గుడ్‌బై కూడా చెప్పేస్తున్నారు. ఈ వ్యవహారం బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్‌కు బొత్తిగా నచ్చినట్లు లేదు. ఏంటీ, అప్పుడే యానీకి గుడ్‌బై చెప్తున్నారని అయోమయానికి లోనైంది. యానీకి ఓటేసి ఆమెను సేవ్ చేయండంటూ అభిమానులను వేడుకుంది. ఈమేరకు ఆమెకు సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసింది. 'కొన్ని అనధికారిక పోల్స్ అప్పుడే యానీ మాస్టర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమెకు ఓటేయమని మోనాలియన్స్ను వేడుకుంటున్నా.. యానీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆమె ఎంతో స్ట్రాంగ్, జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పైకి వచ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాలన్న ఆశతో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె కల నెరవాలని కోరుకుందాం. దయచేసి ఆమెకు ఓటేయండి' అని అభిమానులను అభ్యర్థించింది మోనాల్. -
ఆ రోజు నేను కాజల్ కాళ్లు మొక్కుతాను: యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 72, 11th Week Nominations List: బుల్లితెర ప్రియుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ చూస్తుండగానే 11వ వారంలోకి ప్రవేశించింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది అన్న వివరాలు నేటి(నవంబర్ 15) ఎపిసోడ్లో చదివేద్దాం.. జెస్సీ వెళ్లిపోయినప్పుడు నాకే ఏడుపు రాలేదు, వీళ్లకెలా వస్తుంది? ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని హౌస్‌మేట్స్‌ను విమర్శించాడు షణ్ముఖ్. అసలు వీళ్లు నిజంగానే ఏడ్చారా? అని అనుమానం వ్యక్తం చేశాడు. మరోపక్క కాజల్.. జెస్సీ వార్నింగ్‌తో అయోమయంలో పడిపోయింది. నీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నారని, వారు నిన్ను నమ్మడం లేదని జెస్సీ చేసిన వ్యాఖ్యల్లో ఎంత మేర నిజం ఉందో తెలుసుకోవాలనుకుంది. గత వారం నామినేషన్స్‌లో మిమ్మల్ని సేవ్ చేయనందుకు నాపై నమ్మకం సన్నగిల్లిందా? అని సన్నీ, మానస్‌లను నిలదీసింది. అందుకు మానస్.. గేమ్‌లో నిన్ను నమ్మం కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం నిన్ను ఎన్నడూ తక్కువ చేసి చూడమని క్లారిటీ ఇచ్చాడు. ఇక రవి.. సన్నీ ఇంతవరకు సిరి, షణ్నుకు సారీ చెప్పలేదని యానీతో గుసగుసలాడాడు. గిల్టీ బోర్డును మెడలో వేసుకున్న సన్నీ హౌస్మేట్స్ గురించి మానస్, కాజల్‌తో మాట్లాడాడు. యానీ మాస్టర్ అనకొండ, సిరి కట్లపాము, షణ్ముఖ్ నల్లతాచు అని పేర్లు పెట్టాడు. రవికి మాత్రం నటరాజ్ మాస్టర్ ఇచ్చిన గుంటనక్కే సరిగ్గా సరిపోతుందన్నాడు. తాను మంకీ లేదా చింపాంజీనని చెప్పుకొచ్చాడు. తర్వాత 11వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల తలపై బాటిల్లోని ద్రవాన్ని పోయాలని ఆదేశించాడు. సన్నీ మెడలో గిల్టీ ట్యాగ్‌ను తొలగించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. మొదటగా కెప్టెన్ రవి.. తనను ఫేక్ అనడం నచ్చలేదంటూ సన్నీని, సన్నీని రెచ్చగొట్టిందంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. షణ్ముఖ్.. కాజల్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయని ఆశిస్తున్నానంటూ ఆమెను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక సింగ్‌పై బాటిల్లోని ద్రవాన్ని పోశాడు. మానస్.. షణ్ను, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. శ్రీరామ్.. మానస్, సన్నీని నామినేట్ చేశాడు. కాజల్ మాట్లాడుతూ.. నేను ఎంత ట్రై చేసినా కనెక్ట్ కావట్లేదని, పైగా వెక్కిరించడం అస్సలు నచ్చలేదంటూ యానీని నామినేట్ చేసింది. దీంతో పిచ్చెక్కిపోయిన యానీ కుప్పిగెంతులేసి ఆమె సహనాన్ని పరీక్షించింది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయనుకోవడం నచ్చలేదని షణ్నును సైతం నామినేషన్లోకి పంపించింది. సిరి.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ప్రియాంక సింగ్ తనకు సపోర్ట్ చేయలేదని, మానస్ గేమ్ కూడా తానే ఆడుతోందంటూ నామినేట్ చేసింది. సిల్లీ రీజన్స్ ఇవ్వకంటూ కాజల్ తలపై బాటిల్లోని ద్రవాన్ని గుమ్మరించింది. తర్వాత ప్రియాంక సింగ్.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది. సన్నీ.. శ్రీరామ్‌ను నామినేట్ చేసే సమయంలో వీళ్లిద్దరూ గొడవపడ్డారు. శ్రీరామ్‌తో పాటు సిరిని నామినేట్ చేశాడు. అనంతరం యానీ వంతు రాగా.. నేను మా ఫ్యామిలీని మిస్ అవుతున్నానని హగ్ చేశాను. కానీ హగ్ పాయింట్‌ను ఇలా బయటకు తీసుకువచ్చి నామినేట్ చేయడం నచ్చలేదంటూ మానస్ తలపై బాటిల్ గుమ్మరించింది. ఆ తర్వాత కాజల్‌ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది. ఇలా వెక్కిరించడాన్నే అగౌరవపర్చడం అంటారని కాజల్ అంది. దీంతో యానీ.. వెక్కిరించడం అంటే అవమానించడం అని ఏ ఒక్కరితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్లు మొక్కుతాను, అది కూడా సాష్టాంగ నమస్కారం చేస్తానని శపథం చేసింది. మొత్తంగా 11 వారం కెప్టెన్ రవి మినహా మిగతా 8 మంది నామినేషన్లో ఉన్నారు. -
బిగ్‌బాస్: నామినేషన్స్ రచ్చ.. యానీ వెకిలి నవ్వులు.. కాజల్ ఫైర్
బిగ్‌బాస్ ఐదో సీజన్ పదివారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. ఇక నుంచి గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతి చిన్న అంశం.. ఎలిమినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇంటి సభ్యులు ఆచి, తూచి ఆటను ఆడుతున్నారు. ఇంట్లో ఉన్న తొమ్మిది మందికి 11వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ‘అందరికీ మనసులో ఉన్న నిజాలు బయటపెట్టే ధైర్యం ఉండదు. నిజాలను నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈరోజు జరిగే నామినేషన్’అంటూ ఇంటి సభ్యులను రెచ్చగొట్టాడు బిగ్‌బాస్. ఏ వ్యక్తినైనా నామినేట్ చేస్తే.. అందుకు గల కారణాలను ధైర్యంగా చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో.. ఇంటి సభ్యులు తమలో దాగిఉన్న కోపాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా సన్నీని టార్గెట్ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో తనకు ఫేక్ ట్యాగ్ ఇచ్చిన సన్నీని నామినేట్ చేశాడు రవి. ‘నీ తప్పు నీకు చెబితే.. నేను ఎలా ఫేక్ అనిపించానో నాకు అర్థం కాలేదు’అని రవి అడగ్గా.. ‘అందరి ముందు నాది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడాన్ని తీసుకోలేకపోయాను. నా గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే ఫేక్ అన్నాను. అయినా అది నా అభిప్రాయం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు’అని సన్నీ బదులు ఇచ్చాడు. షణ్ముఖ్.. కాజల్‌ని నామినేట్ చేస్తూ... తన వల్లే ఇంటి సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయని, ఆమె బయటకు వెళ్లే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కాజల్ తిప్పికొట్టింది.తన వల్ల ఇంట్లో ఒక్క గొడవ కూడా కాలేదని బదులు ఇస్తుండగా , యానీ మాస్టర్ వెకిలి నవ్వులు నవ్వింది. మరి ఈ వారం నామినేషన్లో ఎవరు ఉన్నారు? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నామినేషన్ రచ్చ ఎలా ఉందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్‌ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
'టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లీ' యానీ నాగిణి డ్యాన్స్
Bigg Boss 5 Telugu Promo, Anee Vs Kajal: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బీబీ హోటల్లో సరదాగా ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్ టవర్‌లో ఉంది పవర్లో మాత్రం కొట్లాటలకు దిగారు. సిరి, సన్నీ, కాజల్, రవి కెప్టెన్సీకి పోటీ పడగా మిగతా ఇంటిసభ్యులు వారికి మద్దతిచ్చారు. ఈ క్రమంలో కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీ మాస్టర్‌కు కితకితలు పెట్టి ఆమె ఆటను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఎప్పటిలాగే యానీ దీన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంది. ఇలా చేశావంటే ఈ టాస్క్‌లో నీపై అనర్హత వేటు వేస్తానని కాజల్‌ను హెచ్చరించింది. నువ్వు ఈ గేమ్‌లో ఓడిపోయాక ఎవరికి సపోర్ట్ చేస్తున్నావని అడిగింది. అందుకామె రవికి అని సమాధానమివ్వడంతో షాకైన యానీ.. రవికి సపోర్ట్ అంటూనే అతడికి మద్దతుగా నిలబడ్డవాళ్లకు గిలిగింతలు పెడతావా? అని నిలదీసింది. ఇందుకు కాజల్ నా గేమ్ అదే అని చెప్పింది. ఈ సమాధానంతో షాకైన యానీ.. 'నన్ను టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లి' అంటూ ఆవేశపడుతూ నాగిని డ్యాన్స్ చేసింది. 'నా పైసలు దొంగిలించావు, ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదు' అని విమర్శించింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు యానీ విశ్వరూపాన్ని చూసి మహానటి సాంగ్ ఆమెకు డెడికేట్ చేస్తున్నారు. ఆమె ఎందుకిలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని కామెంట్లు చేస్తున్నారు. -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్‌బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్‌కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్‌ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్‌మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్‌ల క్యాండిల్ లైట్ డిన్నర్‌ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కండీషన్! పైసలిస్తేనే ఫుడ్!
Bigg Boss 5 Telugu Promo: బీబీ హోటల్ స్టాఫ్‌ను అతిథులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకల సేవలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ప్రవర్తనతో స్టాఫ్ సిబ్బంది విసిగి వేసారినట్లు కనిపిస్తోంది. ఎంత పని చేసినా ఒక్కరూ పైసా ఇవ్వడం లేదని యానీ మాస్టర్ ఏడ్చేసింది. అయినప్పటికీ అతిథులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బతిమాలితే పనులు జరగవని అర్థం అయిన హోటల్ సిబ్బంది షణ్ముఖ్, శ్రీరామ్, రవి, యానీ ఓ నిర్ణయానికి వచ్చారు. అతిథులకు తిండి పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. 10 వేల రూపాయలు ఇస్తేనే ఫుడ్ పెడతామని వెల్లడించారు. ఇదెక్కడి కండీషన్ అని సిరి, మానస్, సన్నీ, ప్రియాంక, కాజల్ నోరెళ్లబెట్టారు. మరి వీరికి ఫుడ్ దొరుకుతుందా? లేదా? లేదంటే హోటల్లో ఫుడ్ దొంగిలించారా? అసలేం జరిగిందనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
విశ్వ ఎలిమినేటెడ్, శోకసంద్రంలో యానీ మాస్టర్
Bigg Boss Telugu 5, Vishwa Eliminated: సండేను ఫండేగా మార్చడానికి రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. హౌస్‌మేట్స్‌తో 'బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?' అనే గేమ్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. A టీమ్‌లో సన్నీ, విశ్వ, షణ్ముఖ్, కాజల్, ప్రియాంక ఉండగా మిగిలినవారంతా B టీమ్‌లో ఉంటారు. ఇక ఈ గేమ్‌లో విజువల్స్ చూసి సాంగ్ గెస్ చేయాలి. ఈ గేమ్‌లో రవి టీమ్(B టీమ్) గెలిచింది. తర్వాత శ్రీరామ్ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో 'నేను ఎవరిని?' గేమ్ ఆడించారు. ఇందులోని చీటీలలో కంటెస్టెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. టీమ్ నుంచి ఒక్కొక్కరు వస్తూ తము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్ చేయాలి. సదరు టీమ్ వాళ్లు గెస్ చేయాలి. ఇందులో ఒకరినొకరు బాగా ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. ఫైనల్‌గా ఈ గేమ్‌లో సన్నీ( A) టీమ్ గెలిచింది. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని నాగ్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో సన్నీ, మానస్.. షణ్ముఖ్‌ను, షణ్ముఖ్.. ప్రియాంక సిరిపై దాడి చేసిందంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియాంక.. విశ్వను; విశ్వ.. జెస్సీని; జెస్సీ, సిరి, శ్రీరామ్.. కాజల్; కాజల్.. సిరి; రవి.. మానస్‌ను; యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైంది. తర్వాత ప్రియాంక సింగ్ సేఫ్, కాజల్ సేఫ్ అవగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్గా గేమ్ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ కంటతడి పెట్టుకుంది. -
బిగ్‌బాస్: తొమ్మిదో వారం కెప్టెన్‌గా ఊహించని కంటెస్టెంట్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఓ కొలిక్కి చేరినట్లే కనిపిస్తోంది. 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' టాస్క్‌లో విలన్లు గెలిచినట్లు సమాచారం. దీంతో ఆ టీమ్‌లో ఉన్న రవి, యానీ, సన్నీ విశ్వ, సిరి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. అయితే కెప్టెన్సీ పోటీలో యానీ విజయం సాధించి హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఆమె కష్టానికి ఇంటిసభ్యుల సహకారం తోడవడంతోనే యానీ కెప్టెన్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఎవరిని రేషన్ మేనేజర్‌గా ఎంచుకుంటారో చూడాలి! కాగా ప్రస్తుతం హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో విశ్వ, సిరి, జెస్సీ, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ ఇదివరకే కెప్టెన్సీని అనుభవించారు. కానీ కాజల్, రవి, ప్రియాంక, మానస్ మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ కాలేకపోయారు. ప్రతిసారి ఎలాగైనా గెలుద్దామని కెప్టెన్సీ కోసం గట్టిగా పోటీపడినప్పటికీ చివరి క్షణంలో ఓటమిపాలవుతున్నారు కెప్టెన్ కోసం పోటీపడుతూ చివరిదాకా వచ్చి ఆగిపోతున్నారు. మరి రానున్నరోజుల్లో వీరు కెప్టెన్ అవుతారో, లేదో చూడాలి! -
లోదుస్తుల చిచ్చు.. ఇది నీ క్యారెక్టర్: సిరిపై నోరు జారిన షణ్ను
Bigg Boss Telugu 5, Episode 61: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోల టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే ఛాన్స్ విలన్స్‌కు వచ్చింది. దీంతో వారు అవతలి టీమ్‌లో ప్రియాంక సింగ్‌ను సెలక్ట్ చేసుకున్నారు. ఆమెతో ఐ క్విట్ అని చెప్పించడానికి ముప్పు తిప్పలు పెట్టారు. గుడ్డు అంటే పడని పింకీ పచ్చి గుడ్డు రసాన్ని గటగటా తాగేసింది. పేడనీటితో స్నానం చేసింది. వాసన చూస్తేనే వాంతింగ్ వచ్చే మరో జ్యూస్‌ను తాగింది. ఉల్లిపాయ అంటేనే నచ్చకపోయినా టాస్క్ కోసం దాన్ని కరకరా నమిలేసింది. ఇక హెయిర్ కట్ చేసుకోమని సిరి కత్తెర ఇవ్వగా.. పింకీ ఓ క్షణమాగింది. క్యాన్సర్ పేషెంట్ల కోసం తాను జుట్టు పెంచుతున్నానని, కానీ ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పడంతో సిరి వెనకడుగు వేసింది. అనంతరం ఎగ్, పెయింట్ కలగలిపిన ద్రవాన్ని ముఖానికి పూసుకుంది. మరెన్నో టాస్కులివ్వగా ఆమె వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసి తను కూడా గేమ్‌లో ఉన్నానని నిరూపించింది. నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా చెప్పమని షణ్నుని అడిగింది సిరి. దానికతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతానని బదులివ్వగా అప్పుడు నువ్వు మాట్లాడినా నాకవసరం లేదని తేల్చేసింది సిరి. మరోపక్క షణ్ను.. ఓ వైపు జెస్సీని తన టీమ్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తూనే, టాస్క్‌లో గొడవలవుతాయని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సిరికి సూచించాడు. తర్వాత ఎప్పటిలాగే సారీ చెప్పడమే కాక 10 గుంజీలు తీశాడు. తర్వాత అందరికీ వినబడేలా సారీ అని గట్టిగా చెప్పడంతో ఆమె అలక మాయమైపోగా వెళ్లి షణ్నుని గట్టిగా హత్తుకుంది. ఇక కాజల్ గార్డెన్ ఏరియాలో పెట్టిన బాక్స్‌కు ఉన్న తాళాలు ఓపెన్ చేయడానికి వీల్లేకుండా అందులో గోధుమపిండి నింపింది. ఈ దిక్కుమాలిన ఆలోచనలు మాకు రావా? అంటూ ఫైర్ అయింది అవతలి టీమ్‌లోని సిరి. ఇరు టీమ్‌లకు బిగ్‌బాస్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. ఒకరి టీమ్‌లోని వ్యక్తిని అవతలి టీమ్ మెంబర్‌తో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. స్వాప్ అనేది ఒక అవకాశం మాత్రమేనని, ఆదేశం కాదన్నారు విలన్స్. లేదు, చేసి తీరాల్సిందేనన్నాడు షణ్ను. ఈ క్రమంలో షణ్ను, సన్నీకి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత హీరోలు.. విలన్స్ టీమ్‌లో నుంచి యానీని టార్గెట్ చేసి ఆమెకు వరుసగా మూడు డ్రింకులు ఇచ్చారు. ఘాటు మిర్చిని తినిపించారు. పెయింట్ పూసుకునేలా చేయడమే కాక పేడ కలిపిన ఐస్ వాటర్‌తో స్నానం చేయించారు. అన్నింటినీ కంప్లీట్ చేసి యానీ అదుర్స్ అనిపించింది. అందరి ముందూ సిరిపై అరుస్తున్నావని జెస్సీ షణ్నును హెచ్చరిస్తాడు. దానికతడు.. సంచాలకుడిగా అందరి మీదా అరుస్తానని, కావాలంటే నామినేట్ చేయండి, వరస్ట్ పర్ఫామర్ ఇవ్వండని చెప్తాడు. అందరి ముందూ సిరికి సారీ చెప్పాను, గుంజీలు తీశాను, అది లెక్కలోకి రాదు కదా అని ఫైర్ అయ్యాడు. నువ్వెన్ని మాటలు అన్నా పడాలి, జెన్యున్‌గా ఆడట్లేదంటే నాకెలా ఉంటుంది? ముందు నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడు అంటూ నిప్పులు చెరిగింది సిరి. తర్వాత విలన్లు రాక్షసావతారం ఎత్తి ఇల్లంతా చిందరవందర చేశారు. సిరి బట్టలన్నీ విసిరిపారేసింది. దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని ప్రశ్నించడంతో ఆమె ఇన్నర్స్ సర్దేయడానికి ఒప్పుకుంది. కాకపోతే తన వేళ్లు పని చేయడం లేదని, 2 నిమిషాలు ఆగమని చెప్పింది. అందుకు అంగీకరించని షణ్ను.. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు. అతడి ఆజ్ఞతో చిర్రెత్తిపోయిన సిరి.. తీయనని తేల్చి చెప్పగా ఇది నీ క్యారెక్టర్.. అని నోరు జారాడు షణ్ను. బట్టలు తీయడానికి, క్యారెక్టర్‌కు సంబంధం లేదని మండిపడుతూనే ఏడ్చేసింది సిరి. ఈ దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది. ఇది చూసిన పింకీ.. ఎవడు పెట్టుకోమన్నాడు అంత గ్రీజు అని సిరిపై సెటైర్లు వేసింది. దెబ్బకు షాకైన మానస్.. పింకీ, నీకు నోటిదూల ఎక్కువగా ఉంది, నిన్న నువ్వు ఏడ్చినప్పుడు కూడా అందరూ అలాగే అనుకుంటారు. నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు అని చెప్పుకొచ్చాడు. నీకేవరైనా హాని చేయాలనుకుంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచనా విధానం అని చెప్పడంతో పింకీ నోరెళ్ల బెట్టింది. ఎవరి బాధను కూడా జోక్ చేయొద్దని హితవు పలికాడు మానస్. -
బిగ్‌బాస్: తొమ్మిదో వారం బయటకు వెళ్లేది ఎవరు?
Bigg Boss 5 9th Week Elimination: బిగ్‌బాస్ ఐదో సీజన్ ఎనిమిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 8 మంది హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా ఇంటి సభ్యులంతా ఉన్నారు. ఇంట్లో ఉన్న 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేషన్లోకి వచ్చారు. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు. తాజాగా ఇంటి సభ్యులకుబిగ్బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చేలా చేశాడు. దీని కోసం ‘జీవితమే ఒక ఆట’అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో యానీ మాస్టర్ విజయం సాధించింది ఇమ్యూనిటీ పొందింది. అలాగే ఆమెకు గతంలో లభించిన స్పెషల్ పవర్ ద్వారా మానస్‌ని కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించింది. దీంతో ఈ వారం నామినేషన్లో సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని తెలపండి. -
బిగ్‌బాస్ ట్విస్ట్‌కు ఇంటి సభ్యులు షాక్.. ఆ ఇద్దరు సేఫ్
Bigg Boss 5 Telugu Episode 59 బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నామినేషన్లో ఉన్నవాళ్లు సేవ్ కావొచ్చు. సేఫ్‌గా ఉన్నవాళ్లు నామినేషన్లోకి రావొచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లను ఎవరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా తొమ్మిదో వారం మొదటి రోజు నుంచే ఇంటి సభ్యులకు ట్విస్టుల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. నామినేషన్లోకి కెప్టెన్ మినహా.. మిగిలిన 10 మంది రావడం ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఇంటి సభ్యులకుబిగ్బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యునిటీ వచ్చేలా చేశాడు. దాని కోసం బిగ్‌బాస్ ఏం చేశాడు? ఇమ్యునిటి పొందిన ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరు? వారు ఎలా సేవ్ అయ్యారో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. ఇంటి సభ్యులు గుంపులు, గుంపులుగా విడిపోయి నిన్నటి నామినేషన్ గురించి చర్చించారు. సన్నీ గట్టిగా అరిచినప్పటికీ..మంచి వ్యక్తే అని యానీ మాస్టర్ చెప్పొకొచ్చింది. ఆయన అంతలా అరుస్తుంటే.. స్నేహితులైన కాజన్, మానస్ సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదన్నారు. అలాగే సన్నీ అలా ప్రతిసారి అరవడం మంచిది కాదన్నారు. మరోవైపు సన్నీ, మానస్, కాజల్ కలిసి త్రిమూర్తుల గురించి, జెస్సీ ఆరోగ్యం గురించి చర్చించారు. తన స్నేహితుడు వాంతులు చేసుకుంటే.. ఇద్దరు ముందుకు రాకపోవడం నచ్చలేదని సన్నీ చెప్పగా.. అది వాళ్ల మ్యాటర్..వదిలేయ్ అన్నాడు. ఇమ్యూనిటీ టాస్క్.. జీవితమే ఒక ఆట నామినేషన్లో ఉన్న 10 మందికి ‘జీవితమే ఒక ఆట’అనే ఇమ్యూనిటీ టాస్క్ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ద్వారా నామినేషన్లో 10 మందిలో ఒకరు సేఫ్ కావొచ్చు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియా మూడు జోన్లుగా విభజించబడింది. బ్యాగేజ్ జోన్: ఇక్కడ నామినేట్ అయిన ప్రతి ఒక్కరి సభుల ముఖంతో ఒక బ్యాగ్ ఉంది సేఫ్ జోన్: ఇక్కడ ఇమ్యూనిటీ కోసం పోటీ పడుతున్న సభ్యులుంటారు డేంజర్ జోన్: ఇక్కడ ఇమ్యూనిటీ కోల్పోయే డేంజర్లో ఉన్నసభ్యులు ఉంటారు. బజర్ మోగగానే సభ్యులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న బ్యాగేజ్ జోన్లో నుంచి ఎవరైనా ఇతర సభ్యుల ముఖంతో ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని సేఫ్ జోన్లోకి వెళ్లాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారితో పాటు వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో వాళ్లు కూడా డేంజర్ జోన్లోకి వస్తారు. డేంజర్ ఉన్న ఇద్దరిలో నుంచి ఎవరిని సేఫ్ జోన్లోకి తీసుకురావలో సేఫ్ జోన్లో ఉన్న సభ్యులు నిర్ణయించాలి. అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో మిగులుతారు. వారికే ఇమ్యూనిటీ లభిస్తుంది. ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్లోనే డేంజర్లోకి వెళ్లారు. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లలేదు.దీంతో మొదటి రౌండ్లో శ్రీరామ్, కాజల్ డేంజర్ జోన్లోకి వచ్చారు. సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల మెజార్టీ అభిప్రాయంతో శ్రీరామ్‌కు రెండో రౌండ్‌కు వెళ్లాడు. కాజల్ అవుట్ అయింది. రెండో రౌండ్లో జెస్సీ.. సన్నీ ఫోటో బ్యాగ్‌తో చివరగా వెళ్లడంతో.. ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లారు. వీరిలో జెస్సీ సేఫ్ అయ్యాడు. మూడో రౌండ్లో జెస్సీ చివరగా రావడం, అతని చేతిలో సిరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండటంతో ఆఇద్దరూ కూడా డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల సిరిని సేవ్ చేసి.. సన్నీని డేంజర్ జోన్‌కి పంపారు.నాల్గో రౌండ్లో విశ్వ ఫోటోతో శ్రీరామ్ చివరగా వచ్చాడు.దీంతో ఆ ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లగా.. శ్రీరామ్‌ని సేవ్ చేశారు. దీంతో విశ్వ బయటకు వెళ్లాడు. ఐదో రౌండ్లో సిరి లేట్‌గా రావడం.. తన చేతిలో రవి ఫోటో ఉన్నబ్యాగు ఉండడంతో ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లారు. వీరిలో సిరి ఔట్ అయింది. ఆరో రౌండ్లో ప్రియాంక, ఏడో రౌండ్లో రవి ఔటయ్యారు. ఎనిమిదో రౌండ్లో మానస్, యానీ మాస్టర్ డేంజర్ జోన్లోకి వెళ్లగా.. శ్రీరామ్ నిర్ణయంతో యానీ మాస్టర్ నెక్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయింది. అలా చివరకు శ్రీరామచంద్ర, యానీ మాస్టర్ ఉండటంతో.. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో యానీ మాస్టర్‌కు ఇమ్యూనిటీ లభించింది. బిగ్‌బాస్ బిగ్ ట్విస్.. మానస్ సేఫ్ ఇక నామినేషన్లో చివరకు 9మంది మిగిలారుకుంటున్న క్రమంలో.. ఇంటి సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్.గతంలో యానీ మాస్టర్‌కు హోస్ట్ ద్వారా లభించిన స్పెషల్ పవర్‌తో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చనే అవకాశం ఇచ్చాడు. దీంతో యానీ మాస్టర్ మానస్‌ని సేవ్ చేసింది. గతంలో మానస్ తన కోసం లెటర్ త్యాగం చేశాడు.. డైరెక్ట్ నామినేట్ అయ్యాడు.. అందుకే మానస్‌కు ఇచ్చేస్తున్నాను అని యానీ చెప్పింది. దీంతో యానీ, మానస్ తప్పా మిగిలిన అందరూ నామినేషన్లోనే ఉన్నారు. -
బిగ్‌బాస్: యానీ మాస్టర్‌కు స్పెషల్ పవర్.. సేఫ్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ ఇంట్లో తొమ్మిదోవారంలో 10 మంది నామినేషన్లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. ఇంటి సభ్యులంతా నామినేషన్లోకి వచ్చేశారు. అయితే ఆ 10 మంది నుంచి కొంతమందిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఏ సభ్యుడైతే తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని గార్డెన్ ఏరియాలోని సేఫ్ జోన్ డోర్‌లోకి ముందుగా వెళతారో వారు సేఫ్ అవుతారు... చివరగా వెళ్లేవారితో పాటు.. వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. దీంతో పాటు ఇంటి సభ్యులకు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్ పవర్ ద్వారా ఒక కంటెస్టెంట్‌ను సేఫ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ స్పెషల్ పవర్ ద్వారా సేఫ్ అయ్యేది ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో కాటు వేసే నాగిణి ఎవరో తెలుసా?
Bigg Boss Telugu 5, Episode 56: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. యానీ మాస్టర్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీమ్ కాగా మిగిలినవారంతా మరో టీమ్. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ సంచాలకుడు షణ్ను యానీ టీమ్‌ను విజేతగా ప్రకటించాడు. దీంతో గెలిచిన టీమ్ సభ్యులందరికీ ఏడాది పాటు వంటనూనె ఉచితంగా లభించే ఆఫర్ అందుకున్నారు. అయితే కాజల్ వాళ్లు కష్టపడి త్వరగా పూరీలు చేశారని సన్నీ జైల్లో నుంచి తన ఒపీనియన్ చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. 'బుద్ధుండాలి, మధ్యలో నీ జడ్జిమెంట్ ఏంటి? న్యూట్రల్‌గా మాట్లాడు' అని వేలెత్తి చూపుతూ రెచ్చిపోయింది. సౌతిండియన్, నార్తిండియన్ అంటూ వీళ్లిద్దరూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారగా విసిగిపోయిన సన్నీ చెంపలేసుకున్నాడు. వీళ్లిద్దరికీ గొడవ జరుగుతుంటే షణ్ను నవ్వాపుకోలేకపోయాడు. ఒకపక్క హౌస్ అంతా ఆవేశంతో ఊగిపోతుంటే కెప్టెన్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వడమేంటని ఫైర్ అయ్యాడు సన్నీ. 'హౌస్‌లో కొందరు బాధపడుతుంటే నీకు నవ్వొస్తుంది, అది తప్పు' అని నొక్కి చెప్పాడు. ఆ మాటలను పెద్దగా పట్టించుకోని షణ్ను తన నవ్వును కంటిన్యూ చేస్తూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు.నువ్వు కొడతానంటే కొట్టు, వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవలతో హౌస్ అంతా హీటెక్కిపోగా వారికి కూల్ చేసేందుకు స్టేజీపై ఎంటరయ్యాడు నాగార్జున. రవి.. డబ్బుల గురించి రాలేదని, నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారో చెప్పండని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపించివేయండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు నాగ్. నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేయిస్తానని హెచ్చరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మధ్యలో వదిలేసిన యానీ మాస్టర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్రశ్నించాడు. ఇకపై డల్‌గా ఉండొద్దని సూచించాడు. కాజల్‌ను తొండాట వద్దని, పద్ధతిగా ఆడమని హితవు పలికాడు. తర్వాత సన్నీ ఫొటోను చేతులతో చింపేశిన నాగ్.. వరస్ట్ పర్ఫామర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? అని నిలదీశాడు. ఒక వ్యక్తి పట్టుకున్న బ్యాగును తన్నడం సరైనదా? అని తిట్టిపోశాడు. బాగా ఆడుతున్నావ్ అంటూనే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోమని సూచించాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో వైకుంఠపాళి గేమ్ ఆడించాడు నాగ్. ఈ ఇంట్లో పైకి వెళ్లకుండా కాటేసేది, ముందుకు వెళ్లడానికి నిచ్చెనలా సాయం చేసేది ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ముందుగా కాజల్.. తను ముందుకు వెళ్లడానికి సాయపడే నిచ్చెన మానస్ అని, పాములా అడ్డుకునేది శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. రవి.. తనను పైకి ఎక్కించేది షణ్ను అని, కాజల్‌తో కనెక్షన్ అవడం లేదంటూ ఆమెను పాముగా పేర్కొన్నాడు. జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, తనకు గొడవలు నచ్చవంటూ సన్నీని పాముగా తెలిపాడు. ప్రియాంక.. అందరూ ఊహించినట్లుగానే మానస్ తనను ముందుకు తీసుకెళ్లే నిచ్చెనగా, లోబోను పాముగా పేర్కొంది. సన్నీ.. మానస్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే షణ్ముఖ్ పాము అని అభిప్రాయపడ్డాడు. యానీ.. రవిని నిచ్చెనగా, కాజల్‌ను పాముగా; విశ్వ.. లోబోను నిచ్చెనగా, కాజల్‌ను పాముగా తెలిపారు. లోబో.. రవి నిచ్చెన అని, సన్నీ పాము అని చెప్పుకొచ్చాడు. సొంత నీడను కూడా నమ్మొద్దని, ఇప్పటికైనా కళ్లు తెరువు అని లోబో సన్నీకి క్లాస్ పీకాడు. శ్రీరామచంద్ర.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన లక్షణాలన్నీ కాజల్‌కు ఉన్నాయని తెలిపాడు. మానస్.. సన్నీని నిచ్చెనగా, రవిని పాముగా అభిప్రాయపడ్డాడు. రవి కరెక్ట్ టైంలో సపోర్ట్ చేయలేదని ఫీలయ్యాడు. ఇక షణ్ముఖ్.. సిరిని నిచ్చెనగా, రవిని పాముగా చెప్పుకొచ్చాడు. రవి నా మైండ్ ఎక్కడ చదివేస్తాడో అని భయమేస్తుందంటూనే తన వల్లే గేమ్‌లో ముందుకెళ్తున్నానన్నాడు. సిరి మోటివేట్ చేస్తుందని చెప్తూ వాళ్లిద్దరూ హౌస్‌లో ఉండాలన్నాడు. తర్వాత సిరి.. షణ్నును నిచ్చెనగా, సన్నీని పాముగా చెప్పుకొచ్చింది. మొత్తంగా కాజల్‌ను నాగిణిగా, సన్నీని పాముగా ప్రకటించాడు నాగ్. అనంతరం 'మెడలో మోత- సరిపోయే సామెత' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ సామెతలు చెప్తే దానికి సంబంధించిన ప్లేట్‌ను ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు. సన్నీ.. కుక్క తోక వంకర సామెతను జెస్సీకి అంకితమిచ్చాడు. మానస్.. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలని రవికి సూచించాడు. కాజల్.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్టవుతుందని చెప్పింది. యానీ.. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్నదాన్ని కాజల్‌కు ఇచ్చింది. ప్రియాంక.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్న సామెతను సిరికి అంకితమిచ్చింది. తర్వాత శ్రీరామ్.. అంతంత కోడికి అద్దసేరు మసాలా సామెత కాజల్‌కు సూటవుతుందన్నాడు. విశ్వ.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు సామెత లోబోకు సెట్టవుతుందన్నాడు. జెస్సీ.. పైన పటారం, లోన లొటారం అన్న ప్లేటును సన్నీకిచ్చాడు. సిరి.. అందని ద్రాక్ష పళ్లు పుల్లన అన్న ప్లేటును షణ్ను మెడలో వేసింది. షణ్ను.. ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడని రవి గురించి అభిప్రాయపడ్డాడు. రవి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనేది మానస్‌కు సరిపోతుందన్నాడు. లోబో.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్న సామెతను యానీకి అంకితమిచ్చాడు. ఈ రోజు నాగ్ ఎవరినీ సేవ్ చేయలేదు. ఇదిలా వుంటే రేపటి దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో శ్రియ, సుమ, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు స్పెషల్ గెస్ట్స్‌గా రాబోతున్నారు. ఆ హంగామా చూడాలంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు రెడీగా ఉండాల్సిందే! -
రా, వచ్చి కొట్టు.. వెయిట్ చేస్తున్నా: సన్నీని రెచ్చగొట్టిన షణ్ను
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీని ఆపడం ఎవరివల్లా కావట్లేదు. అతడి ఆవేశాన్ని చల్లార్చడం ఒక్క నాగార్జున వల్లే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇంటిసభ్యులను రెండుగా విభజించిన బిగ్‌బాస్ వారికి పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. దీనికి షణ్ముఖ్ సంచాకుడిగా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ 50 పూరీలు ముందుగా రెడీ చేసినప్పటికీ షణ్ను.. యానీ మాస్టర్ టీమ్ చేసిన పూరీలే పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ వారిని గెలిపించాడు. అయితే జైల్లో ఈ టాస్క్‌ను మొదటి నుంచీ గమనిస్తోన్న సన్నీ.. పాపం వాళ్లు కష్టపడి చేశారని పేర్కొన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? మాట్లాడేందుకైనా బుద్ధి ఉండాలి అని మండిపడింది. సన్నీ మీదకు ఫైర్ అవడంతో శ్రీరామ్, షణ్ముఖ్ నవ్వాపుకోలేకపోయారు. హౌస్‌లో కొంతమంది బాధపడుతుంటే నవ్వుతున్నావు, అది కరెక్ట్ కాదు, బయటకొస్తా ఆగు అని సూచించాడు. దీంతో షణ్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షణ్ను.. అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సవాల్ చేశాడు. మరి సన్నీ జైలు నుంచి బయటకొచ్చాక ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! -
షణ్ముఖ్ నా మీదకొస్తున్నాడు, మొగోడు ఆడే ఆటేనా: యానీ ఉగ్రరూపం
Bigg Boss 5 Telugu, Episode 54: యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన మొదటిరోజునుంచే గేమ్ ఆడటం మొదలు పెట్టాడని పింకీతో చెప్పుకొచ్చాడు మానస్. ఈ హౌస్‌లో అతడితో ఫ్రెండ్షిప్ చేయాలని, అతడిని దగ్గర చేసుకోవాలని ఎవరికీ లేదన్నాడు. మరోవైపు రవి అర్ధరాత్రి త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ఇంకా మెలకువతోనే ఉన్న షణ్ను, సిరి కాలికి దండం పెట్టాడు. ముద్దు పెట్టి సైలెంట్‌గా వెళ్లిపోయిన సిరి, ఉక్కిరిబిక్కిరైన షణ్ను తర్వాతి రోజు ఏమైందో ఏమో కానీ సిరి సడన్‌గా షణ్నుకు ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా? నాకు ఉంటదిపుడు అని తనలో తానే సణుక్కున్నాడు. కాసేపటికే మళ్లీ వచ్చిన సిరి.. నీ వల్లే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పింది. నేను నీతో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అని షణ్నుని అడిగింది. వీటికి షణ్ను బదులిస్తూ.. నా వల్ల చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని సింగిల్ డైలాగ్‌లో తేల్చేశాడు. నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది. ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ సన్నీని రెచ్చగొట్టిన శ్రీరామ్ తర్వాత 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇందులో భాగంగా థర్మాకోల్ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. గేమ్ ముగిసేసరికి ఎవరి బ్యాగులో ఎక్కువ థర్మాకోల్ ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో శ్రీరామ్, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్ పోటీపడ్డారు. ఫస్ట్ బజర్ మోమగానే శ్రీరామ్, సన్నీ ఒకరినొకరు తోసుకుని కిందపడ్డారు. అయితే సన్నీ అవుట్ అయ్యాడని సంచాలకుడు జెస్సీ ప్రకటించాడు. కానీ అతడు గేమ్ నుంచి వెళ్లిపోతూ తన ఫ్రెండ్ మానస్‌ను గెలిపించాడంటూ చురకలంటించాడు శ్రీరామ్. ప్రియగారు కరెక్ట్ ఆడారంటూ అతడిని రెచ్చగొట్టాడు. నోరు అదుపులో పెట్టుకో: శ్రీరామ్ వార్నింగ్ 'సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా.. ఓడిపోయినవ్, అందుకే బయటున్నవ్..' అని పదేపదే చెప్తూ అతడు మండిపోయేలా చేశాడు. గాల్లో ముద్దులు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. తర్వాతి రౌండ్లో శ్రీరామ్, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్ అని ప్రకటించాడు. అతడి నిర్ణయంతో ఏకీభవించని సన్నీ.. జెస్సీ ముందున్న బ్యాగును తంతూ రెచ్చిపోయాడు. మానస్ అవుట్ కాదంటూ వాదించాడు. కొరికిన యానీ! కత్తి అందుకున్న సిరి! తర్వాతి రౌండ్లో ముగ్గురు మిగలగా షణ్ను, సిరి యానీని టార్గెట్ చేశారు. దీంతో యానీ.. 'ఇండివిడ్యువల్ గేమ్ లేదు, నిజాయితీ లేదు' అంటూ సిరిని నెట్టేసింది. అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన ఇంటిసభ్యులు అది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. అయితే అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని, అలాంటప్పుడు తాను ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్ అవ్వగలనంటూ ఆవేదన చెందింది యానీ. దీంతో స్వచ్ఛందంగా గేమ్‌లో నుంచి తప్పుకుంది. నా ముందుకు రాకు: యానీ వార్నింగ్ ఈ ఇంట్లో ఉన్నంతవరకు తాను కెప్టెన్ అవ్వను అంటూ ఏడ్చేసింది. ఆమెను ఓదార్చేందుకు సన్నీ వెళ్లగా అతడిపై కూడా ఫైర్ అయింది. నా కళ్ల ముందుకు రాకంటూ వార్నింగ్ ఇచ్చింది. 'పందులే గుంపులుగా ఆడతాయి, సింహం సింగిల్‌గా ఆడుతుంది' అంటూ డైలాగులు వదిలింది. 'గేమ్‌లో షణ్ముఖ్ నా దగ్గరకు వస్తున్నాడు, మొగోడు ఆడే ఆట ఇదేనా' అని మండిపడిపోయింది. చివరి రౌండ్లో సిరిపై షణ్ముఖ్ విజయం సాధించి కెప్టెన్‌గా అవతరించాడు. దీంతో అతడికి హగ్గుల మీద హగ్గులిచ్చింది సిరి. మరోవైపు మానస్.. ఎవరెవరిని టార్గెట్ చేయాలో ఫిక్సయ్యానని సన్నీతో చెప్పుకొచ్చాడు. కానీ పేర్లు మాత్రం వెల్లడించలేదు. చేతులు కట్టుకుని కూచున్నా అంటున్నారు కదా! అటాక్ అంటే ఏంటో చూపిస్తానని ఫిక్సయ్యాడు మానస్. -
షణ్ముఖ్‌కు ముద్దు పెట్టిన సిరి, కోపంతో ఊగిపోయిన యానీ మాస్టర్..
Bigg Boss 5 Telugu 5 Latest Promo: Siri Kiss To Shanmukh Jaswanth: తెలుగు బిగ్‌బాస్ 5 సీజన్ ప్రారంభమై 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంతకాలం గొడవలు, వివాదాలు, అలకలతో సాగిన బిగ్‌బాస్ హౌజ్‌లో నేడు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ప్రోమో షణ్ను మాట్లాడుతూ.. ‘మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం’ అని అనగానే సిరి ‘నేను బాగానే ఉన్నా రా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా’ అని అంటుంది. వెంటనే ‘అయితే దూరం పెట్టుకో..’ అని షణ్ను అంటాడు. అలా వారి మధ్య సంభాషణ జరిగిన కాసేపటికి షణ్ముఖ్ ‘అరె.. ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్’ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు ముద్దుపెట్టి వెళుతుంది. ఆ తర్వాత షణ్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’ అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడతాడు. అలాగే ‘అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది’ అంటూ ఫన్నీగా అంటాడు. దీంతో సిరి-షణ్ముఖ్‌ల స్నేహం కాస్తా కొత్త బంధానికి తెరలెపనుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, అనీ, సన్నీ, మానస్లు పోటీలో విజయం సాధించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు బిగ్‌బాస్ ‘వెంటాడు వేటాడు’ అనే టాస్క్ ఇచ్చాడు. థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్.. బజర్ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్ అవుతారని సూచించాడు. టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. ఇక యానీ మాస్టర్.. సిరి-షణ్ముఖ్‌లపై రగిలి పోవడంతో ఈ టాస్క్‌లో కాస్తా ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. -
డబ్బుల కోసం రాలేదు, నన్ను బయటకు పంపండి: రవి ఆవేదన
Bigg Boss Telugu, Episode 53: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు డ్రాప్ అవుతారన్న దానిపై హౌస్మేట్స్ చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సన్నీ మాట్లాడుతూ.. టాస్క్‌లో డ్రాప్ అవుతానన్న జెస్సీ.. మళ్లీ వచ్చి ఆడతానన్నాడంటూ ఇంటిసభ్యుల దగ్గర ప్రస్తావించాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్‌లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ సిద్ధమయ్యారు. కానీ జెస్సీ మాత్రం తను అన్‌ఫిట్ అని, తనే డ్రాప్ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు. ఆమె గేమ్ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్ అయితే మరిన్నివారాలు ఆమె హౌస్‌లో ఉన్నవాళ్లకు వంట చేస్తుందని చెప్పుకొచ్చాడు. రంగు పడుద్ది.. 'అభయహస్తం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో 'రంగు పడుద్ది' అనే నాలుగో ఛాలెంజ్ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో కాన్వాస్‌పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్క్‌లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందింది. మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో చికాకుపడ్డ షణ్ను.. 'హమీదా కూడా ఇంతే.. వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను' అని అసహనం ప్రదర్శించాడు. దీంతో హర్ట్ అయిన సిరి 'నీతో సాంగ్ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?' అని చిర్రుబుర్రులాడింది. ఆమె అలకబూనిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్న సిరి.. 'ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది' అని ఫైర్ అయింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి మామూలైపోయారు. నేను డబ్బుల కోసం రాలేదు: రవి బిగ్‌బాస్ ఇచ్చిన 5వ చాలెంజ్ 'కారులో హుషారుగా' టాస్క్‌లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కాజల్‌పై సన్నీ విజయం సాధించాడు. అయితే కాజల్ గేమ్ లైట్ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి. ఈ క్రమంలో హౌస్‌లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను వారిముందుంచాడు. 'నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు' అని వాపోయాడు. మరోపక్క మానస్.. రవి గేమర్ అని అభిప్రాయపడ్డాడు. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. మానస్ అడుగుపెట్టాక వార్ వన్‌సైడ్ 'బంతిలో ఉంది భాగ్యం' అనే స్పెషల్ టాస్క్‌తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో బజర్ మోగినప్పుడు సర్కిల్లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు. -
అమ్మ క్యాన్సర్‌తో పోరాడింది, నేనూ ఈ బాధను తట్టుకుంటాను
Bigg Boss 5 Telugu, 8th week Nominations: నామినేషన్స్ అంటే చాలు ఉగ్రావతారమెత్తే కంటెస్టెంట్లు ఈసారి మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆగ్రహావేశాలకు పోకుండా చిరునవ్వుతో, పుట్టెడు దుఃఖంతో ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కారణం.. బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్‌గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని ఊరిస్తూనే అందరూ వాటిని అందుకునేందుకు వీల్లేదని తెగేసి చెప్పాడు. ఎవరికి లెటర్స్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనేది మీలో మీరే నిర్ణయించుకోండంటూ హౌస్మేట్స్ ఇష్టానికి వదిలేశాడు. కానీ ఎవరికైతే లెటర్ దక్కదో వారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. ప్రియాంకకు తల్లిదండ్రుల నుంచి లెటర్ రాగా దాన్ని చించేయొద్దని కోరింది. ఇక రవి, లోబోలలో ఒకరికే లెటర్ అందుకునే అవకాశం వచ్చింది. దీంతో లోబో... రవితో నీ పాపను గుర్తుగా ఒక బొమ్మ, లేఖ ఉంది, కానీ నాకు అది కూడా లేదంటూ తాను లెటర్ తీసుకుంటానన్నాడు. ఇక విశ్వ-సిరికి కూడా ఇదే సంకటం ఎదురైంది. అయితే గుండె రాయి చేసుకున్న సిరి.. విశ్వ కోసం తన లెటర్‌ను త్యాగం చేసింది. దీంతో విశ్వ కృతజ్ఞతతో ఆమెకు చేతులెత్తి దండం పెట్టాడు. లెటర్ దక్కించుకునే ఆరాటంలో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు. కళ్లముందే లెటర్స్ చినిగిపోతుంటే తట్టుకోలేకపోయారు. యానీ మాస్టర్ అయితే తన ఫ్యామిలీని తలుచుకుని ఏడ్చేసింది. నాకు నువ్వు లేకుంటే జీవితంలో ఏదీ లేదని బాధపడింది. ఇక షణ్ముఖ్ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించాడు. 'అమ్మా... క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకుని ధైర్యాన్ని కూడదీసుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్. నేనూ ఈ బాధను జయిస్తాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. -
ప్రియ అవుట్, కన్నీరుమున్నీరుగా విలపించిన ప్రియాంక
Bigg Boss 5 Telugu, Priya Eliminated: బిగ్‌బాస్ షోలో స్టేజీమీదకు వచ్చీరావడంతోనే నాగార్జున ఇంటిసభ్యులతో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి కాస్త డిఫరెంట్‌గా గేమ్‌లో గెలిచినవారికి బిగ్‌బాస్ షీల్డ్‌తో పాటు ఓ స్పెషల్ పవర్ దక్కుతుందన్నాడు. ఇక ఈ గేమ్‌లో కొన్ని లెవల్స్ ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ రౌండ్లో 'పట్టుకోండి చూద్దాం' గేమ్ ఆడించాడు. ఇందులో గుండ్రటి వలయంలో ఉన్న పిల్లోస్‌ను ఇంటిసభ్యులు దక్కించుకుని కాపాడుకోవాలి. ఈ గేమ్‌లో పిల్లో సాధించలేకపోయిన సిరి.. షణ్ను దగ్గరున్న దిండు ఇవ్వమని బతిమాలుకుంది. దొరికిందే ఛాన్స్ అనుకున్న షణ్ను.. ఆమెతో 10 సార్లు సారీ చెప్పించుకుని పిల్లో త్యాగం చేసేశాడు. చివరగా ఈ ఆటలో షణ్ను, కాజల్ ఓడిపోయారు. నీళ్లు-కన్నీళ్లు.. ఓడిపోయిన రవి, లోబో రెండో రౌండ్లో 'చలనచిత్ర వీర' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ అడిగే సినిమా ప్రశ్నలకు ముందుగా బెల్ కొట్టి సమాధానాలు చెప్పిన వారు తర్వాతి రౌండ్‌కు అర్హులవుతారు. ఇందులో తప్పు సమాధానాలు చెప్పి జెస్సీ, ప్రియాంక, మానస్ అనర్హులవగా మిగిలినవారు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. మూడో రౌండ్లో నాగ్ 'నీళ్లు-కన్నీళ్లు' గేమ్ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లు జగ్గులు పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లను వారి క్యాన్‌లో నింపాలి. ఈ రౌండ్లో రవి, లోబో ఎలిమినేట్ అయ్యారు. అనంతరం నాగ్.. లోబో సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ నాలుగో రౌండ్లో యానీ, విశ్వ, శ్రీరామ్, సన్నీ, సిరి మ్యూజికల్ చెయిర్ ఆడారు. ఇందులో సిరి, సన్నీ అవుట్ అయ్యారు. ఐదో రౌండ్ 'పట్టుపట్టు రంగే పట్టు' గేమ్‌లో నాగ్ ఏ కలర్ చెప్తే ఆ కలర్లో ఉన్న వస్తువులను హౌస్‌లో నుంచి తీసుకురావాలి. ఈ గేమ్‌లో శ్రీరామ్ అవుట్ అయ్యాడు. ఆటల పోటీలో మిగిలిన ఇద్దరిలో విశ్వకు రవి, లోబో, కాజల్, శ్రీరామ్ సపోర్ట్ చేయగా యానీకి మిగిలినవారంతా మద్దతు తెలిపారు. ఇందులో అవతలి టీమ్ విశ్వ టోపీని ముందుగా పడగొట్టడంతో అతడు ఓడిపోగా యానీ గెలిచింది. దీంతో ఆమెకు పవర్ ఉన్న బిగ్‌బాస్ షీల్డ్ దక్కింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు నాగ్. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మిమ్మల్ని అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ అయ్యాడని తెలిపాడు. అందరికీ గుడ్‌బై చెప్పిన యానీ, ప్రియ నామినేషన్స్‌లో మిగిలిన ఇద్దరు ప్రియ, యానీలను హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్. దీంతో ఎవరికి వారు తమ ఎలిమినేషన్ ఖాయం అనుకుంటూ అందరికీ భారంగా వీడ్కోలు చెప్పారు. అనంతరం ఇద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సు తెరిచి చూడొచ్చని నాగ్ చెప్పగా ఇంటిసభ్యులు ఎంతో ఆతృతగా వాటిని ఓపెన్ చేశారు. కానీ రెండు బాక్సుల్లోని ఇద్దరూ మాయం అవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్ అవుతారేమోనని నాగ్ అనడంతో మరింత ఆందోళన చెందారు. గుక్క పెట్టి ఏడ్చిన పింకీ, ఓదార్చిన మానస్ ప్రియ వెళ్లిపోతుందేమోనని గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడ్చేయగా మానస్ ఆమెను ఓదారచ్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ పింకీ అతడి భుజంపై వాలిపోయి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మరోవైపు యానీ హౌస్‌లోకి రావడంతో సన్నీ ఆమెను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. కానీ పింకీ మాత్రం రోదిస్తూనే ఉండగా ఆమెను ఓదార్చడం మానస్ వల్ల కూడా కాలేదు. ఇక స్టేజీ మీదకు వచ్చిన ప్రియ బిగ్‌బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానంది. -
హౌస్‌లో నుంచి మాయమైన ప్రియ, యానీ! డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్
Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: సండే అనగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలవుతుంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్‌లో ఉన్నవారు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామోనని భయంతో వణికిపోతుంటారు. ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, కాజల్‌ను నాగ్ శనివారం ఎపిసోడ్లో సేవ్ చేశారు. సిరి, రవి, యానీ, ప్రియ, జెస్సీ, లోబో ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో యానీ, ప్రియ తప్ప అందరూ సేవ్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవనున్నట్లు కనిపిస్తోంది. వీళ్లిద్దరినీ హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్. అనంతరం వారిని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, యానీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సులపై ఉన్న లైట్స్ ఆఫ్ అవగా ఇంటిసభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని తెరిచి చూశారు. కానీ వాటిలో ఉన్న ప్రియ, యానీ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో షాకైన ఇంటిసభ్యులు ఎవరూ లేరేంటని అయోమయానికి లోనయ్యారు. వారిని మరింత టెన్షన్‌కు గురి చేస్తూ నాగ్.. ఇద్దరూ స్టేజీ మీదకు వస్తారేమో అంటూ డబుల్ ఎలిమినేషన్ ఉందన్నట్లుగా మాట్లాడారు. కానీ ఇప్పటికే లీకువీరులు ప్రియ ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో దండోరా వేసేశారు కాబట్టి నాగ్ మాటలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. 'డబుల్ ఎలిమినేషన్ అనగానే నమ్మేస్తాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు, ప్రియ తట్టాబుట్టా సర్దేసుకుందని మాకు తెలిసిపోయిందిలే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఎలిమినేషన్లో ట్విస్ట్: బ్యాగు సర్దేసుకున్న కంటెస్టెంట్ ఎవరు?
Bigg Boss 5 Telugu, 7th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఏడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని లీకువీరులు మరోసారి సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. ముందుగా కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశారట! యానీ తన సొంత కూతురుగా భావించే శ్వేత వర్మను గతవారం హౌస్ నుంచి పంపించేయగా ఈసారి యానీనే ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ షోలో ఈ తల్లీకూతుళ్ల బంధానికి ముగింపు పలికారంటూ ప్రచారం చేశారు. కానీ కాసేపటికే మళ్లీ ఎలిమినేట్ అయింది యానీ కాదు ప్రియ అంటూ కొత్త పేరు తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి నామినేషన్స్ జరిగిన రోజు యానీ వెళ్లిపోయే సూచనలున్నాయని బలంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే ఐదుగురు ఆడవాళ్లు.. సరయు, ఉమాదేవి, లహరి షారి, హమీదా, శ్వేత వర్మ షో నుంచి నిష్క్రమించడంతో ఈసారి మేల్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే ఆస్కారం కూడా ఉండొచ్చని భావించారు. కానీ బిగ్‌బాస్ ఈ అంశాన్ని పెద్దగా లెక్క చేయనట్లు తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ప్రియ, సన్నీ మధ్య పెద్ద ఫైట్ జరిగింది. చెంప పగలగొడతానంటూ ఏకంగా పూల కుండీతో సన్నీని కొట్టబోయింది ప్రియ. ఆమె ప్రవర్తన చాలామందికి విస్మయం కలిగించగా ఈ గొడవ వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో ఓటింగ్‌లోనూ మార్పులు వచ్చాయి, ప్రియకు ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో ఫైనల్‌గా ప్రియ, యానీలలో ఎవరు వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. అయితేక కొందరు యానీ బయటకు వెళ్తారని అంటుంటే మెజారిటీ నెటిజన్లు ప్రియ ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే నాగార్జున అధికారికంగా వెల్లడించేవరకు వెయిట్ చేయాల్సిందే! -
మొన్న కూతురు, ఇప్పుడు తల్లి బిగ్‌బాస్‌ను వీడక తప్పదా!
Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: బిగ్‌బాస్ గేమ్ ఎప్పుడు ఎటు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఊహించని ట్విస్టులతో, ఊహకందని ఎలిమినేషన్లతో ప్రేక్షకులకు తరచూ షాకుల మీద షాకులిస్తుంటాడు బిగ్‌బాస్. ఈసారి ఆయన నిర్వహించిన వెరైటీ నామినేషన్స్ ద్వారా శ్రీరామ్, సిరి, రవి, కాజల్, జెస్సీ, ప్రియ, యానీ.. ఏడుగురు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చారు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో నేరుగా నామినేట్ అవడంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు బిగ్‌బాస్ షో నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఐదుగురు ఆడవాళ్లే కాగా ఒక మేల్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ ఉన్నారు. దీంతో ఈసారి ఎవరిని పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రవి, శ్రీరామ్ స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్స్, కాబట్టి బిగ్‌బాస్ వాళ్లను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయడు. ఇక వరుస పెట్టి అమ్మాయిలను పంపించేసి గ్లామర్‌ను షోకు దూరం చేసిన బిగ్‌బాస్ సిరి ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. పైగా షణ్ముఖ్‌తో దోస్తీ వల్ల అతడి ఫ్యాన్స్ కూడా సిరికే ఓట్లేస్తున్నారు. ఫలితంగా సిరి బయటకు వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రియకు బుల్లితెర సెలబ్రిటీల మద్దతు గట్టిగా ఉంది. ఎవరేంటో పసిగడుతూ ఆచితూచి అడుగు ముందుకు వేస్తూ గేమ్ ఆడుతోందీ నటి. ఈమె కంటే వీక్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి తను ఈ వారం నిశ్చింతగా ఉండొచ్చని తెలుస్తోంది. మిగిలిందల్లా జెస్సీ, యానీ, లోబో. మొదట్లో జెస్సీని అందరూ చిన్నపిల్లాడని తీసిపారేశారు. కానీ రానురాను ఆటలోనే కాకుండా మాటల్లోనూ పదును తేలాడు. అయితే అందరితో కలవకుండా కేవలం షణ్ముఖ్, సిరిలతో మాత్రమే ఉంటున్నాడు. దీంతో అతడు సొంతంగా గేమ్ ఆడలేకపోతున్నాడని, సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. కానీ షణ్ముఖ్ నామినేషన్స్‌లో లేకపోవడంతో అతడి ఓట్లు జెస్సీకి పడి సేవ్ అయ్యే అవకాశాలున్నాయి. లోబోను ఫేక్ ఎలిమినేషన్‌తో సీక్రెట్ రూమ్‌కు పంపించారు. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపించి గేమ్‌ను రసవత్తరంగా మార్చేందుకు ఏదైనా డ్రామా ప్లాన్ చేసి ఉంటారు బిగ్‌బాస్ నిర్వాహకులు. లేదంటే సీక్రెట్ రూమ్ గడువు పూర్తయిన వెంటనే అతడు ఎలిమినేట్ అయ్యాడంటే ఫేక్ ఎలిమినేషన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లేనని బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తారు జనాలు. కాబట్టి లోబో ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్సులున్నాయి. మిగిలింది యానీ మాస్టర్.. ఫ్యాన్‌బేస్ పెద్దగా లేని యానీ మాస్టర్ ఈవారం గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. తనను ఎవరైనా నామినేట్ చేస్తే సహించలేకపోయే స్వభావం, ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం, నోరు జారడం.. ఇలా పలు అంశాలు ఆమెకు నెగెటివ్‌గా మారాయి. శ్వేతను కూతురు కూతురు అంటూ అల్లుకుపోయిన యానీ.. ఓ టాస్క్‌లో మాత్రం తొక్కలో రిలేషన్స్ నాకొద్దు అని ఆవేశంతో ఊగిపోయి తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసుకుంది. ఎక్కువగా కిచెన్‌కే పరిమితమైన ఆమె గేమ్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ వారం యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత వారమే కూతుర్ని(శ్వేత) పంపించేసిన బిగ్‌బాస్ ఈ వారం తల్లిని(యానీ మాస్టర్) కూడా బయటకు పంపిస్తాడేమో చూడాలి! లేదంటే ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలను పంపించాం కాబట్టి, ఈసారి అబ్బాయిలనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం జెస్సీ ఎలిమినేట్ అవొచ్చు. -
తొక్కలో రిలేషన్షిప్ నాకొద్దన్న యానీ.. కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత
బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం గొడవల వారంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో మొదలైన గొడవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అనే నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. అందులో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతలకు స్పెషల్ ఫవర్ లభించింది. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ స్పెషల్ ఆఫరే బిగ్‌బాస్ ఇంట్లో పెద్ద గొడవకు దారి తీసినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. రవి టీమ్ సభ్యులు తమ స్పెషల్ పవర్‌ను ఉపయోగించి యానీ మాస్టర్ టీమ్ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది. మరి యానీ అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్: యానీ ఉగ్రరూపం.. అలా బ్లేమ్ చేయలేవంటూ సిరిపై ఫైర్
సోమవారం జరిరిగిన నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ ఇళ్లంతా గంభీరంగా మారింది. ఆరోవారంలో అత్యధికంగా 10 మంది( షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ )నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే..నామినేషన్ ప్రక్రియతో బాగా హర్ట్ అయిన ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బొమ్మల కోసం హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ఇక జెస్సీ మాత్రం శ్వేతాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. టాస్క్‌లో భాగంగా.. యానీ మాస్టర్ 'నేను యాక్సెప్ట్ చేయను.. నేను గొడవ చేస్తా' అంటూ కాజల్-సిరిలతో చెప్పగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను' అంటూ సిరి చెప్పకొచ్చింది. 'నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు' అంటూ యానీ మాస్టర్ సిరికి వార్నింగ్ ఇచ్చింది. మరి యానీ-సిరిల గొడవ ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
నామినేషన్స్ లీక్: ఈసారి ఏకంగా 10 మంది, ఎవరెవరంటే?
Bigg Boss 5 Telugu, 6th Week Nominations: మండే.. అనగానే బిగ్‌బాస్ ప్రేక్షకులకు చటుక్కున గుర్తొచ్చేది నామినేషన్స్. అప్పటిదాకా చిరునవ్వుతో విప్పారిన ముఖాలు కాస్తా ఈ నామినేషన్స్ రాగానే కోపంతో ఎర్రబడిపోతాయి. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరి మీద ఒకరు తెగ అరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నేడు ఆరోవారం నామినేషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు. ఈ క్రమంలో మానస్ తనకు టాస్కులో సపోర్ట్ చేసిన జెస్సీని నామినేట్ చేశాడు. నీకు సపోర్ట్ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్. రేషన్ మేనేజర్ అంటే అందరికీ సమానంగా ఫుడ్ పంచాలే తప్ప ఫస్ట్ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని ఆన్సరిచ్చాడు. ఇక సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కెప్టెన్ ప్రియ, షణ్ముఖ్, యానీ మాస్టర్, కాజల్ మినహా మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారట! అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు భోగట్టా! ఒకవేళ ఇదే నిజమైతే లోబో, శ్వేత, సిరి, విశ్వ డేంజర్ జోన్లో ఉన్నట్లేనని గుసగుసలు పెడుతున్నారు నెటిజన్లు. -
బిగ్‌బాస్: జెస్సీతో పోటీకి సై అన్న యానీ మాస్టర్
బిగ్‌బాస్ షోలో ఆడామగా అనే తేడా ఉండకూడదని నాగార్జున చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే రూల్‌ను పాటిస్తున్నారు హౌస్మేట్స్. కుస్తీపోటీకి ఇద్దరు మగవాళ్లు కాకుండా, ఒక లేడీ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ పోటీపడ్డారు. సన్నీ రాజ్యంలో నుంచి జెస్సీ, యాంకర్ రవి రాజ్యంలో నుంచి యానీ మాస్టర్ ముఖాముఖిగా తలపడనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. మరీ వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే అబ్బాయిలు, అమ్మాయిలకు మధ్య ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు బాయ్స్కే ఎక్కువ మైనస్ అంటున్నారు నెటిజన్లు. ఆడవాళ్లతో కలిసి వారు కంఫర్టబుల్‌గా గేమ్ ఆడలేరని, పూర్తి శక్తిని వినియోగించలేరని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఎదురుగా ఉంది ఆడ, మగ అని కాకుండా కేవలం పోటీదారులుగా మాత్రమే చూడాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా జెస్సీ, యానీ మాస్టర్ల మధ్య ఫైటు మంచి రసపట్టుగా మారనున్నట్లు తెలుస్తోంది. -
కెప్టెన్‌తో కొట్లాట.. సిగ్గు, శరం ఉండాలంటూ యానీ మాస్టర్ ఫైర్
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: నామినేషన్స్ వచ్చాయంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోతుంటాయి. అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నవారు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోవచ్చు. ఆల్రెడీ శత్రువులైన వారి మధ్య మరింత దూరాన్ని పెంచవచ్చు. మొత్తంగా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టే నామినేషన్ పర్వం నేడు స్టార్ట్ అయింది. దీంతో ఎవరెవర్ని నామినేట్ చేయాలా? అని హౌస్మేట్స్ పరిపరివిధాలుగా ఆలోచించారు. మరి నేటి గేమ్‌లో ఎవరు నామినేట్ అయ్యాడు? ఏమేం గొడవలు జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే.. గేమ్‌లో గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఒకరిని తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిడివాళ్లు ఎవరూ ఉండరు అని జెస్సీ యాంకర్ రవి మీద పరోక్షంగా మండిపడ్డాడు. ఇక్కడ హౌస్‌లో విశ్వ, రవి, లోబో, సన్నీ, మానస్ ఒక గ్రూప్ అయ్యారని షణ్నుతో చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే కిచెన్‌లో పనులు పంచుకోండని కెప్టెన్ శ్రీరామ్ సన్నీకి సలహా ఇచ్చాడు. అయితే ఇంతలో సిరి వచ్చి.. కిచెన్‌లో ఆల్రెడీ మనం పనులు పంచేసుకున్నాం కదా అని చిర్రుబుర్రులాడింది. అయినా ఇక్కడ కెప్టెన్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడంటూ తన గ్యాంగ్‌తో కూర్చున్నప్పుడు శ్రీరామ్ మీద జోకులు పేల్చింది. లోబో వల్లే నాకా శిక్ష, అందుకే నామినేట్: జెస్సీ తర్వాత ఐదోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఇంటిసభ్యులు ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన జెస్సీ... తన మాటలే వినాలి, తను చెప్పినట్లే ఆడాలని రవి మానిప్యులేట్ చేస్తున్నాడంటూ అతడిని నామినేట్ చేశాడు. లోబో వల్లే కెప్టెన్సీ టాస్క్‌లో శిక్ష పడిందని అతడిని నామినేట్ చేశాడు. తర్వాత సన్నీ.. షణ్ముఖ్, సిరితో కనెక్ట్ కాలేకపోయానంటూ వారిద్దరినీ నామినేట్ చేశాడు. ఆమె ఏది మాట్లాడినా సీరియస్‌గా తీసుకుంటుంది..: పింకీ విశ్వ.. జెస్సీ చాలాసార్లు నోరు జారాడని, షణ్ముఖ్ రేషన్ మేనేజర్ అయ్యాక అతడి ప్రవర్తన మారిపోయిందంటూ వారిని నామినేట్ చేశాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన రవి, సన్నీని నామిట్ చేస్తున్నానని తెలిపింది. అనంతరం లోబో.. 'గతవారం ప్రియ మీద అరిచినప్పుడు మానస్, షణ్ముఖ్ సడన్‌గా నా మీద పడి నామినేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నా'నని వెల్లడించాడు. ప్రియాంక సింగ్.. సరదాగా మాట్లాడినా హమీదా సీరియస్‌గా తీసుకుంటుందని, లోబో టాస్కుల్లోనూ స్ట్రాంగ్‌గా అవ్వాలని నామినేట్ చేస్తున్నానని తెలిపింది. షణ్ముఖ్ నన్ను ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడు: రవి సిరి మాట్లాడుతూ.. పక్కవాళ్ల గేమ్‌లో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్న రవిని, రేషన్ మేనేజర్ అయ్యాక హమీదా ప్రవర్తనలో తేడా వచ్చిందంటూ ఆమెను నామినేట్ చేసింది. రవి.. జెస్సీది ఇమ్మెచ్యూర్ బిహేవియర్డ్ అనిపిస్తుందన్నాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని తన పేరు ట్యాగ్చేయడం చాలా నెగెటివిటీగా అనిపించిందని పేర్కొన్నాడు. గతవారం అకారణంగా తనను నామినేట్ చేసిన షణ్ముఖ్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. అతడు వేరేవాళ్ల గురించి తన దగ్గర చెప్తూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడనిపించిందని అభిప్రాయపడ్డాడు. విశ్వ సొంతంగా గేమ్ ఆడట్లేదు: షణ్ను యానీ మాస్టర్.. తనకు టఫ్ కాంపిటీటర్స్ అయిన రవి, విశ్వను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అనంతరం షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ చూసిన విశ్వ వేరు, ఇప్పుడు చూస్తున్న విశ్వ వేరు.. పక్కవాళ్ల ఇన్ఫ్లూయెన్స్ వల్లో, మరింకేదైనా కారణమో తెలీదు కానీ ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపిస్తోందని తెలిపాడు. తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. హమీదా వంతు రాగా.. ప్రియ తనతో సరిగా ఉండదని, షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండనుకున్నా, కానీ అతడు వేరే జోన్లో ఉంటున్నాడంటూ వారిద్దరినీ నామినేట్ చేసింది. జెస్సీ హైపర్ అయిపోతుంటే, షణ్ను వేరే ప్రపంచంలో ఉంటున్నాడు.. శ్వేత.. తనకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని కాజల్, మానస్‌ను నామినేట్ చేసింది. ప్రియ.. ఎవరి గేమ్ వారు ఆడాలని చెప్పే షణ్ముఖ్ అతడిదాకా వచ్చేసరికి మాత్రం పాటించడం లేదంది. ఇక సన్నీ తనను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తోందంటూ అతడిని నామినేషన్లోకి పంపింది. మానస్.. జెస్సీ, షణ్ముఖ్‌ను నామినేట్ చేశాడు. కెప్టెన్ శ్రీరామ్.. జెస్సీ హైపర్ అవుతున్నాడని, షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉండిపోతున్నాడంటూ వాళ్లిద్దరినీ నామినేట్ చేశాడు. ఆ ఒక్కరు తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌కు వ్యతిరేకమే! తర్వాత ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారన్న విషయాన్ని బిగ్‌బాస్ పేర్లతో సహా వెల్లడించాడు. అత్యధికంగా షణ్ముఖ్‌ను ఎక్కువమంది నామినేట్ చేశారు. మరీ ముఖ్యంగా జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. మొత్తంగా ఈ ఐదోవారంలో షణ్ముఖ్, రవి, హమీదా, లోబో, మానస్, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా హార్ష్‌గా మాట్లాడకురా.. : షణ్నును అభ్యర్థించిన రవి ఈ ప్రక్రియ అనంతరం కిచెన్‌లో మరోసారి చిచ్చు చెలరేగింది. మానస్‌ను నామినేట్ చేసినందుకు అతడు ఇంత యాటిట్యూడ్ చూపించాలా అని శ్వేత మండిపడింది. అతడితో మాట్లాడటమే అనవసరం అని ఫీలైంది. మరో పక్క శ్రీరామ్.. షణ్ముఖ్, జెస్సీ, సిరి రెండు రోజుల నుంచి డిఫరెంట్‌గా ఉంటున్నారని అభిప్రాయపడ్డాడు. మరోవైపు షణ్ముఖ్-రవిల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. నీతో దూరంగా ఉంటున్నంత మాత్రాన నేను సరిగా పర్ఫామ్ చేయనట్లు కాదని ముఖం పట్టకుని మాట్లాడాడు షణ్ను. దీంతో రవి.. అంత హార్ష్‌గా మాట్లాడకురా అని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జెస్సీ ఫుడ్ తనే వండుకుని తినాలి: కెప్టెన్ కొత్త రూల్ ఇక కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్ అయిన జెస్సీ.. నాకు ఫుడ్ పెట్టరంట, నా ఫుడ్ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్ అయిపోయారు. 'ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కెప్టెన్ మీద విరుచుకుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్. ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్ కెప్టెన్‌వి అంతే! అని అగ్గి మీద గుగ్గిలమైంది సిరి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్. వాళ్లు తినకపోతే నేనూ తినను: కెప్టెన్ ఇక ఈ గొడవతో చిర్రెత్తిపోయిన యానీ మాస్టర్ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌ను వేసుకుని రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్ అయినట్లు కనిపించింది. కానీ కొద్ది సేపటికే సిరి, షణ్ను, జెస్సీ తినకుండా కూర్చోవడంతో యానీ వారి దగ్గరకు వెళ్లి తినమని బుజ్జగించింది. ఆకలేస్తే తింటారు, లేకపోతే వదిలేయండి అంటూ కెప్టెన్ శ్రీరామ్ ఓపక్క చిరాకు పడుతూనే వాళ్లు తినకపోతే తాను కూడా తిననని శపథం చేశాడు. వెంటనే జెస్సీ, షణ్ముఖ్‌లకు ప్లేటులో భోజనం పట్టుకెళ్లి తినిపించడం విశేషం. -
ఎలిమినేషన్: డేంజర్ జోన్లో ఇద్దరు కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, 4th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సెప్టెంబర్ 5న ఈ షోను ప్రారంభించాడు. షో మొదలైన తొలి రోజే 18 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రారంభమైంది బిగ్‌బాస్. అయితే ఎక్కువ మంది హౌస్మేట్స్ ఉండటంతో ప్రతివారం నామినేషన్ లెక్కలు మారుతూ వస్తున్నాయి.. ఫస్ట్ వీక్‌లో ఏడుగురు నామినేషన్లోకి రాగా కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయింది. రెండోవారంలో ఆరుగురు నామినేట్ అవగా బూతులతో బెంబేలెత్తించే సరయూ హౌస్ నుంచి వెళ్లిపోయింది. తర్వాత మూడో వారం ఐదుగురు మాత్రమే నామినేషన్లోకి వచ్చారు. వీరిలో నుంచి లేడీ అర్జున్ రెడ్డి లహరి షారి ఎలిమినేట్ అయింది. అలా ఇప్పటివరకు ముగ్గురు ఆడవాళ్లే హౌస్ నుంచి నిష్క్రమించారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. లోబో, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, యానీ మాస్టర్, ప్రియ. యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, వీజే సన్నీ నామినేషన్లో ఉన్నారు. అయితే అనధికారిక పోల్స్‌లో వీజే సన్నీ ఎక్కువ ఓట్లు సాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్రియకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ అందుతున్నట్లు తెలుస్తోంది. యాంకర్ రవి మాత్రం మూడో స్థానానికే పరిమితం అయ్యాడు. తర్వాతి స్థానాల్లో సిరి హన్మంత్, ఆర్జే కాజల్ ఉన్నారు. మిగిలిందల్లా లోబో, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్. నిన్నటివరకూ డేంజర్ జోన్లో ఉన్న లోబోకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ తర్వాత ఒక్కసారిగా ఓట్లు పెరిగినట్లు సమాచారం. దీంతో అతడు కూడా సేఫ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన యానీ, నటరాజ్ మాస్టర్లలో ఎవరో ఒకరు ఎలిమినేషన్‌ను ఎదుర్కోబోతున్నారు. సోషల్ మీడియాలో తక్కువ ఫాలోయింగ్ ఉన్న వీళ్లిద్దరికీ మిగిలిన అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆడవాళ్లనే పంపించారు కాబట్టి ఈసారి మేల్ కంటెస్టెంట్‌ను పంపించేందుకు ఆస్కారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మొత్తంగా ఈ వారం ఒక కొరియోగ్రాఫర్ బిగ్‌బాస్‌ను వీడి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. -
బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
బిగ్‌బాస్ ఐదో సీజన్ రోజు రోజుకి రసవత్తరంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల అసలు రంగు బయటపడుతోంది. నాలుగో వారంలో హౌస్మేట్స్ ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు. ఈ వారం హయ్యెస్ట్‌గా 8 మంది(నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ) ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వారం నామినేషన్ ఉన్న వారిలో రవి. సన్నీ, ప్రియ, సిరి, కాజల్‌లకు ఎలాంటి ఢోకాలేదు. ఎందుకంటే వారికి బయట ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. గేమ్ పరంగా కూడా బాగానే ఆడుతున్నారు. ఎటోచ్చి ఈ వారం రిస్క్‌లో పడేది ఎవరంటే నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలు మాత్రమే. వీరిలో ఎక్కువగా నటరాజ్ మాస్టర్‌కే రిస్కు ఎక్కువ. ఆయన టాస్కుల్లో చక్కగా ఆడుతున్నప్పటికీ.. ప్రవర్తన మాత్రం అటు కంటెస్టెంట్స్‌ని, ఇటు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుంది. (చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ) ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఆయన దారుణంగా ప్రవర్తించాడు. పులితో వేట.. నాతో ఆట ప్రమాదం అంటూ మీసం తీప్పడం లాంటివి ఓవరాక్షన్‌గా అనిపించాయి. ఎవరైనా తనను నామినేషన్ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్ చేశారని ఆరోపించడం, హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకోవడం లాంటివి నటరాజ్ మాస్టర్‌పై నెగెటివ్ ఇంప్రెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటాడు.. వారెవరో చెప్పడం. ఇవన్ని ఇంటి సభ్యులతో పాటు ఆడియెన్స్‌కు కూడా మింగుడుపట్టడం లేదు. ఈ వారం కనుక అతని ప్రవర్తలో మార్పు లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక లోబో విషయానికి వస్తే.. ఇంట్లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ అతనే. టాస్కులు సరిగా ఆడకపోవడం అతని మైనస్. అలాగే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ప్రియపై గట్టిగా అరవడం, మీదమీదకు వెళ్లడం లోబో చేసిన అతిపెద్ద మిస్టేక్. అయితే ఆయన చేసే జోకులే అతన్ని కాపాడే చాన్స్ ఉంది. ఒకవేళ ఈ సారి లోబో ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ షో బోరింగ్ ఉంటే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన లోబో కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్లే తెలుస్తోంది. ఇక యానీ మాస్టర్ విషయానికొస్తే.. ఆమె అందరితో చక్కగా కనెక్ట్ అయినప్పటికీ..నామినేషన్‌కి ఆమె చెప్పే రీజన్ కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు. ప్రతిసారి నా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక నామినేట్ చేస్తున్న అని యానీ చెప్పడం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన ఆమె కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ వారం ఏదైన అద్భుతాలు జరిగితే తప్ప ఈ ముగ్గురిలో ఒక్కరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. -
బిగ్‌బాస్: నాలుగోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది!
'బిగ్‌బాస్‌లో అన్ని టాస్కుల యందు నామినేషన్ టాస్కు వేరయా!' అంటారు బుల్లితెర అభిమానులు. ఎందుకంటే అప్పుడే కదా కంటెస్టెంట్లు కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది.. ఆ సమయంలోనే కదా వారి నిజస్వరూపాలేంటో తెలుసుకునేది! అందుకనే బిగ్‌బాస్ వీక్షకులకు మండే వచ్చిందంటే చాలు పండగే! టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్‌ను బయటకు పంపిచేందుకు నామినేషన్స్ జరగనున్నాయి. అయితే ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో సిరి హన్మంత్, ప్రియ, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, వీజే సన్నీ, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. మరి నాలుగోవారం నామినేషన్లో ఉన్నది ఈ 8 మందేనా? అన్నదానిపై స్పష్టత రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ఆమె బిగ్‌బాస్ షోకు పనికి రాదు: ఉమా దేవి
ప్రతి సీజన్లో అందరి మీదా నోరు పారేసుకునే కంటెస్టెంట్ ఒకరుంటారు. చీటికీమాటికీ గొడవ పడుతూ, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ నానా రభస చేస్తుంటారు. అయితే ఇలా ఆవేశం స్టార్లను బిగ్‌బాస్ త్వరగానే బయటకు పంపించివేస్తుంటాడు. అలా ఈ సీజన్లో పెద్ద గొంతేసుకుని అందరినీ ఓ ఆటాడేసుకుంది ఉమాదేవి. అంతేకాదు, నోటికొచ్చినట్లు చెడామడా తిట్టేసి తనకు బూతులు కూడా వచ్చని నిరూపించుకుంది. ఈ బూతులే ఆమె కొంప ముంచాయి. ఆమెను తన ఇంటికి చేర్చాయి. బిగ్‌బాస్ బజ్‌లో రెచ్చిపోయిన ఉమాదేవి అయితే ఇలా బూతులు మాట్లాడటం తప్పని తెలుసుకుని తన ప్రవర్తన మార్చుకుని మంచి దారిలో నడవాలనుకుంది ఉమాదేవి. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం! అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన తప్పులు సరిదిద్దుకున్నా, అందరితో కలిసి ఉన్నా, కామెడీ చేసి జనాలను నవ్వించినా రెండోవారంలో ఎలిమినేట్ కాక తప్పలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల నిజస్వరూపాలను బయటపెట్టింది. యాంకర్ రవి నాకు ఆ ఛాన్స్ఇవ్వలేదు ముందుగా సిరి, షణ్ముఖ్‌ల గురించి మాట్లాడుతూ.. 'వాళ్లిద్దరూ ఫ్రెండ్సేంటి? నాకర్థం కాదు. ఫ్రెండ్షిప్ కోసమే ఆడటానికి వచ్చారా? అదేదో వాళ్లింట్లో ఆడుకోవచ్చు కదా! సిరి ఉంటే షణ్ను ఉండాలి. మంచాలు కూడా పక్కపక్కనే వేసుకుంటారా ఎవరైనా? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా? బయటకొచ్చాక కూడా వాళ్లిద్దరి మధ్య ఇదే ప్రేమ ఉంటుందా? ఆమె పనులు ఆమెకు, ఇతడి పనులు ఇతడికి ఉంటాయి. షణ్ముఖ్.. సిరి మాటలు వింటే కనుక ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తాడు. యానీ మాస్టర్ చాలా కన్నింగ్. ఫాల్తూ గేమ్ ఆడుతోంది. యాంకర్ రవితో గట్టిగా గొడవపడాలి అనుకున్నా, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియ బిగ్‌బాస్ షోకు పనికిరాదు' అంటూ ఉమాదేవి సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. -
ఎలిమినేషన్లో ఝలక్! ఎలిమినేట్ అయ్యేది ఆమె? అతడు?
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక్కడ టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ లభించును అన్న నాగార్జున మాటను నిజం చేసేందుకు కంటెస్టెంట్లు కూడా బాగానే శ్రమిస్తున్నారు. కామెడీ అయినా కొట్లాట అయినా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ కొన్నిసార్లు వీరి ఆగడాలు శృతి మించుతూ నానా హింసాత్మకంగా మారుతున్నాయి. అంతేకాకుండా విచ్చలవిడిగా బూతులు కూడా మాట్లాడేస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతోంది. మారుతున్న స్థానాలు ఇదిలా వుంటే రెండో వారం ఎలిమినేషన్ దగ్గరపడుతోంది. ఈసారి కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లోబో, ప్రియాంక సింగ్, యానీ మాస్టర్, ప్రియ నామినేషన్లో ఉన్నారు. విచిత్రమేంటంటే రోజుకొక విధంగా ఓటింగ్ ప్రక్రియలో మార్పులు కనిపిస్తున్నాయి. హౌస్‌లో గేమ్ మారుతున్న కొద్దీ కంటెస్టెంట్లకు వచ్చే ఓట్లలోనూ భారీ తేడాలు కనిపిస్తున్నాయి. అసలు గండం ఆమెకు కాదు! ఈ వారం ఉమాదేవికి గండం ఉందని అంతా అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆమెకు ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆవేశం ఎక్కువే అయినా వినోదాన్ని అందించడంలో ఉమాదేవి రూటే సెపరేటు అంటూ చాలామంది నెటిజన్లు ఆమెకు ఓట్లేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేని నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవుతారని, ఉమాదేవి మాత్రం పక్కా సేఫ్ అవుతుందని అంటున్నారు. మరి నిజంగానే ఆ కొరియోగ్రాఫర్లలో ఒకరు వెళ్లిపోతారా? లేదా ఉమాదేవినే బయటకు పంపించివేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఉమా కొట్టింది.. నా జోలికొస్తే తంతా: లేడీ కంటెస్టెంట్ల అరాచకం
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో కొట్లాటలు జరుగుతున్నాయి. తొలివారం నుంచే నోటికి పని చెప్పిన కంటెస్టెంట్లు రెండోవారానికి వచ్చేసరికి చేతికి పని చెప్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ, ఎత్తిపడేస్తూ, కొడుతూ నానా అరాచకం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో ఫైట్ చేస్తున్నారు. కొట్టుకుందాం రా అంటూ కోట్లాది మంది ప్రేక్షకుల ముందే సవాలు విసురుతూ కుస్తీలు పడుతున్నారు. నాగార్జున 5 రెట్ల ఎంటర్టైన్మెంట్ అంటే ఏమో అనుకున్నాం గానీ మరీ ఇంత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఉంటుందనుకోలేదంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం టాస్క్ నడుస్తోంది. ఇందులో ఇంటిసభ్యులు రెండు గద్ద, నక్క టీములుగా విడిపోయారు. నిన్న వీరి మధ్య నడిచిన మొదటి లెవల్ టాస్క్ పంతం నీదా నాదాలో ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. గాయాలపాలవుతున్నా ఏ ఒక్కరూ వెనకడుగు వేయకుండా ఆడారు. నేడు సాగరా సోదరా అనే రెండో లెవల్ టాస్క్ మొదలు కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్‌లోనూ కంటెస్టెంట్ల మధ్య మరోసారి చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. ఉమాదేవి కొట్టిందని ఆరోపించిన సిరి ఏడ్చేయగా... ఆవేశంతో రగిలిపోయిన యానీ మాస్టర్ ఒసేయ్ ఉమా, సిగ్గు లేదా? థూ.. అంటూ నిప్పులు చెరిగింది. ఇక నటి ప్రియ.. తన మీదకొస్తే కాలితో తంతానని హెచ్చరించడం గమనార్హం. అయితే ఇలా తన్నించుకోవడానికి బిగ్‌బాస్ షోకు రాలేదని ఫైర్ అయింది శ్వేత. రసాభాసగా మారనున్న ఈ గేమ్‌లో ఏ టీమ్ గెలుస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. -
హమీదాను కొట్టిన శ్వేత! కళ్లలో రంగు పడుతున్నా డోంట్ కేర్!
Bigg Boss Telugu 5, Episode 09: రెండో వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాలు విసిరిన ఉమాదేవి నానాబూతులు కూడా మాట్లాడింది. ఆమె మాటలకు షణ్ముఖ్ బిత్తరపోగా యానీ మాస్టర్ ఏడ్చేసింది. ఇన్నాళ్లూ ఎంతో కూల్‌గా ఉన్న శ్వేత తనలోని ఉగ్రరూపం చూపించింది. ఆమె కోపానికి కారణమేంటి? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే... శ్వేతతో ఫ్లర్ట్ చేస్తా, కానీ ఆ పిల్లకు అర్థం కావట్లే.. కాజల్ మరోసారి తన నోటికి పని చెప్పింది. సన్నీలో మన్మథుడు యాంగిల్ కనిపించట్లేదని, మానస్ ఫ్లర్టింగ్ చేస్తాడని, శ్రీరామచంద్ర అయితే అందులో నెక్స్ట్ లెవల్ అని జెస్సీతో చెప్పుకొచ్చింది. తనకు ఫ్లర్టింగ్ రాదన్న జెస్సీ తర్వాత ఓపెన్ అయిపోతూ.. శ్వేతతో ఫ్లర్ట్ చేస్తాను కానీ ఆ పిల్లకు అర్థం కావట్లేదన్నాడు. ఎలాగో కాజల్ చెవిన పడేశాడు కాబట్టి ఆమె త్వరలోనే శ్వేతకు ఈ విషయం చెప్పడం ఖాయం. నక్క వర్సెస్ గద్ద టీమ్ మండే రోజు నామినేషన్ ప్రక్రియతో మళ్లీ అగ్గి రాజేశాడు బిగ్‌బాస్. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుందన్నాడు. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక ఉన్నారు. హౌస్మేట్స్ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్ పూయాల్సి ఉంటుందన్నాడు. అయితే ఇంటిసభ్యులు వాళ్ల టీమ్ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. సిరి కెప్టెన్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. కిచెన్‌లోకి కాదు, ఆటలోకి రా..: సలహా ఇచ్చిన సన్నీ మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియ.. మీరు ముందు ఇన్ఫ్లూయెన్స్ చేయడం ఆపేయండని కౌంటరిచ్చింది. తర్వాత ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. ఉమాదేవి, కాజల్‌ను; సన్నీ.. టాస్కుల్లో ఇంకా యాక్టివ్ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడతారు: లోబో సెల్ఫ్ డబ్బా ప్రియాంక.. నటరాజ్ మాస్టర్‌ను, 'వంట చేస్తే అందరూ తృప్తిగా తింటారనే వండుతాను, అలా అని కిచెన్‌లో ఉండిపోయి గేమ్ ఆడటం లేదంటే ఒప్పుకోను' అంటూ సన్నీని నామినేట్ చేసింది. మానస్.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేకపోయిన లోబో.. LOBO నాటే నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తనకు తాను డప్పు కొట్టుకున్నాడు. సపోర్ట్ చేయాలని పోతే తనకే నామం పెడుతున్నారని అసహనానికి లోనయ్యాడు. మరి ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేదని మానస్ అడగ్గా.. 'మీరు హీరో కదా! విననీకి రెడీ లేరు, నా ముందు యాటిట్యూడ్ చూపిస్తున్నవ్, కానీ నా ముందు చిన్నపిల్లోడివి' అని ఆవేశపడ్డాడు. తర్వాత మానస్.. ప్రియకు రంగు పూసి నామినేట్ చేశాడు. ఉమాదేవి, కాజల్‌ను నామినేట్ చేసిన విశ్వ అనంతరం విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్ చేశాడు. అయితే నాగ్.. ఆ కూరను ఎవరికీ షేర్ చేయొద్దన్నాడని, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఉమ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె బూతులు కూడా మాట్లాడటంతో ప్రియాంక సింగ్ పడీపడీ నవ్వింది. అనంతరం విశ్వ కాజల్‌ను నామినేట్ చేశాడు. లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, సెట్ శ్వేత కనబడట్లేదని శ్వేతను నామినేట్ చేశారు. ఇక ఉమాదేవి తనవంతు రాగానే ఓ రేంజ్లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్ చేసింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంకసింగ్, యానీ మాస్టర్ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. నాకు రెస్పెక్ట్ అవసరం లేదు అని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ.. పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్లిద్దరూ ఫేక్: శ్వేత లోబో.. టాస్క్ ఆడగా, పని చేయగా చూడలేదంటూ శ్వేతను నామినేట్ చేశాడు. రవి తనకు టఫ్ కాంపిటీషన్ అని, అతడితో దోస్తానా వద్దని దండం పెట్టేసి యాంకర్‌కు రంగు పూశాడు. తర్వాత వచ్చిన శ్వేత ఒక్కొక్కరికీ బొమ్మ చూపించింది. అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను పడేసింది. నా లైఫ్‌లో నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్ అని తిట్టిపోసింది. ఉమాదేవి మీద ఉగ్రరూపం, చప్పట్లు కొట్టిన హౌస్మేట్స్ ఆడవాళ్లకు ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడటంతో ఇంటిసభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని సపోర్ట్ చేసిన యానీ మాస్టర్‌ను అన్ని మాటలు ఎలా అనగలిగావు? అని నిలదీయడంతో మాస్టర్ కన్నీటిపర్యంతమైంది. అయితే ఉమా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక హమీదాను ఫేక్ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది. కళ్లలో పడుతుందని వారిస్తున్నా తనకు అనవసరం అంటూ దురుసుగా ప్రవర్తించింది. అయితే శ్వేత తను నన్ను కొట్టిందంటూ ఏడ్చేసింది హమీదా. మీ బూతులు వినలేకపోతున్నా: షణ్ముఖ్ అది అక్కడున్నవాళ్లందరికీ అర్థం కాగా.. మానవత్వం గురించి మాట్లాడిన నువ్వు చేసిందేంటి? అని శ్వేతను ప్రశ్నించింది ప్రియ. దీంతో తన తప్పు అంగీకరించిన శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదాకు సారీ చెప్పింది. అమ్మాయికి క్షమాపణలు చెప్పింది కానీ తనకు మాత్రం సారీ చెప్పలేదని హర్ట్ అయ్యాడు లోబో. అనంతరం షణ్ముఖ్.. మీరు కరెక్ట్ కావచ్చేమోగానీ హౌస్‌కు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. పైగా మీరు మాట్లాడుతున్న బూతులు వినలేకపోతున్నానంటూ ఉమాదేవిని, ఒరిజినల్ క్యారెక్టర్‌ను చూడాలనుకుంటున్నానని జెస్సీని నామినేట్ చేశాడు. నామినేషన్లో ఏడుగురు కాజల్.. యానీ మాస్టర్, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్ మాస్టర్, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్ చేశారు. దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్. ప్రియ.. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. రవి.. ప్రియాంక సింగ్, శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్, కాజల్, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. -
బిగ్‌బాస్: లీకైన రెండో వారం నామినేషన్ లిస్ట్!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్‌తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్‌గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్‌లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్‌లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బిగ్‌బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా షురూ అయింది. ఇలా పరిచయాలు అయ్యాయో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. షో ఆరంభంలోనే ఈ రేంజ్లో గొడవలు ఉంటే రానురానూ ఇది ఏ స్థాయిలో ఉండబోతుందో అంటున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. మరి నేటి(మంగళవారం) ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. మానస్‌ను అన్నయ్య అని పిలవలేను మగవాళ్లు జిమ్ములో కూర్చుంటున్నారు తప్ప ఏ పనీ చేయట్లేదని ఉమాదేవి చిరాకుపడింది. ఇంట్లో ఉన్న అందరూ పని చేయాల్సిందేని అభిప్రాయపడింది. మరోపక్క లహరితో దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది కాజల్. కానీ అది ఫ్లోలో జరగాలి తప్ప ఇలా మాట్లాడుకుంటే కుదరదు అని లహరి అనడంతో ఊరకుండిపోయింది. ఇక రవి, విశ్వను అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంక సింగ్.. మానస్‌ను మాత్రం అలా పిలవలేనని చెప్తూ తెగ సిగ్గుపడింది. దీంతో అందరూ మానస్‌ను లవర్ బాయ్ అంటూ ఆటపట్టించారు. ఈ సీజన్లో కొత్తగా పవర్ రూమ్‌ను పరిచయం చేశాడు బిగ్‌బాస్. ఈ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించిన సభ్యులకు పవర్ యాక్సెస్ దొరుకుతుందని, తద్వారా వారికి ఆటను మార్చగలిగే శక్తి దొరుకుతుందని చెప్పాడు. అందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ 'శక్తి చూపరా డింభకా!'ను ప్రవేశపెట్టాడు. ఒంటి మీదున్న దుస్తులను పంపించేసిన రవి, ప్రియ ఈ టాస్క్‌లో ఉరుముల శబ్ధం వినిపించగానే పవర్ స్కాన్‌పై ఎవరు మొదట చేయి పెడతారో వారికి ఆ రూమ్‌లోకి వెళ్లేందుకు అర్హత సాధించినట్లు లెక్క. ఈ టాస్క్‌లో మొదట గెలిచిన విశ్వ పవర్ రూమ్‌లో అడుగు పెట్టాడు. ఇద్దరు ఇంటిసభ్యులు వారి ఒంటి మీదున్న దుస్తులతో సహా అన్ని బట్టలు, వస్తువులను స్టోర్‌రూమ్‌కు పంపించాలని, అయితే ఆ ఇద్దరూ వారి స్వంత బట్టలు కాకుండా ఒకరి దుస్తులను మరొకరు ధరించవచ్చని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ కోసం విశ్వ.. ప్రియ, రవి పేర్లను సూచించాడు. దీంతో ఆ ఇద్దరూ తమ సామానంతా పంపించేసి.. ప్రియ బట్టలను రవి, రవి బట్టలను ప్రియ వేసుకున్నారు. నాలో తమ్ముడిని చూసుకో.. లేడీ గెటప్‌లో ఉన్న రవిని కాసేపు ఎత్తుకుని తిప్పిన విశ్వ తన తమ్ముడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. గతేడాది తమ్ముడిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యాడు. రవి తనను అన్న అని పిలుస్తాడని, నా కోసం ఈ టాస్క్‌కు ఒప్పుకున్నాడంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో రవి.. నాలో తమ్ముడిని చూసుకో అంటూ అతడిని హత్తుకుని ఓదార్చాడు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో తర్వాత మానస్ గెలుపొంది పవర్‌ను సాధించాడు. అతడు ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లోని ఇంటి సభ్యులందరూ పడుకున్నాకే నిద్రించాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. లేదంటే పెద్ద సౌండ్‌తో అలారమ్ మోగుతుందని చెప్పాడు. ఈ టాస్క్‌కు మానస్.. ఆర్జే కాజల్ పేరును ఎంచుకున్నాడు. గొడవపడ్డట్లు డ్రామా.. చివర్లో అంతా ఉట్టిదే ఇంతలో లోబో.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అను, మోతెబరిలా మాట్లాడకు అని సిరిని నిందించాడు. ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ నానామాటలు అన్నాడు. ఇవన్నీ చెవిన పడటంతో ఆవేశంతో అట్టుడికిపోయిన సిరి ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది. వీళ్లిద్దరికీ సడన్‌గా ఏమైంది? ఇంత గొడవపడుతున్నారు? అని కంటెస్టెంట్లంతా టెన్షన్ పడుతుండగా ఇదంతా వుట్టి డ్రామా అని ఇద్దరూ పెద్దగా నవ్వేసి అందరినీ పిచ్చోళ్లను చేశారు. హైడ్రామా చేస్తున్నావంటూ కాజల్‌కు చురకలు కిచెన్‌లో పనులను షేర్ చేసుకుందామని కాజల్ అందరినీ పిలిచి హడావుడి చేస్తుండగా.. ఎందుకంత హైపర్ అవుతున్నారని లహరి ప్రశ్నించింది. నార్మల్‌గా మాట్లాడండి, అంతే తప్ప కంటెంట్ క్రియేట్ చేయాలని చూడొద్దని కాజల్‌కు సూచించింది. చాలా హైడ్రామా చేస్తున్నారని చురకలంటించింది. దీంతో కాజల్ ఆమెకు క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి ఏడ్చేసింది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ ఇక రాత్రి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండగా సిరి ప్లేస్‌లో హమీదా కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి లేవమన్నాడు జెస్సీ. ఆమె కుదరదనడంతో సిరిని తన స్థానంలో కూర్చోమన్నాడు. ఆ తర్వాత మరో ఖాళీ కుర్చీ దొరికితే దాని మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ తనకు చెయిర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ అంటున్నా అతడు నిరాకరించడంతో యానీకి బుర్ర వేడెక్కిపోయింది. నాటకాలు చేయకు, నీ గొంతే కాదు నా వాయిస్ కూడా లేస్తుంది, అక్కడ కాళ్లెందుకు పెట్టినవ్ అని జెస్సీ మీద పూనకంతో ఊగిపోయింది. ఇంతలా ఆవేశపడ్డ యానీ మాస్టర్ తన బెడ్ దగ్గరకు వెళ్లి ఏడ్చేయడం గమనార్హం. ఈరోజు ఎపిసోడ్లో ఇంత రభస ఉంటే మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి! -
యానీ మాస్టర్ అంటే రెస్పెక్ట్ అంటూనే జెస్సీ కొట్లాట
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్లో గొడవలు జరుగుతున్నాయి. చాలామంది కంటెస్టెంట్లు ఇక్కడ బంధాల ఎమోషన్స్‌లో చిక్కుకోవద్దని ముందుగానే బలంగా నిర్ణయించుకుని వచ్చారు. ఎవరు ఎదురు మాట్లాడినా ఇచ్చిపడేయాలని ఫిక్సయ్యారు. అందుకే చిన్నపాటి విషయాలను కూడా రచ్చకీడుస్తూ కొట్లాటకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన విషయం తెలిసిందే! మొత్తానికి ఈ వారం రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా జెస్సీ ఎలిమినేషన్ గండంలో ఉన్నారు. ఇదిలా వుంటే నేటి ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో జెస్సీ మరోసారి తగాదా పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకుని కూర్చోగా అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీసేయమంటే అందుకతను ఒప్పుకోనట్లున్నాడు. దీంతో శివాలెత్తిన యానీ మాస్టర్ నీది నీ దగ్గర పెట్టుకో, నాటకాలు చేయకు అని తిట్టిపోసింది. నీ వాయిస్ లేస్తే నా గొంతు లేవదా? అని నిందిస్తుండగా జెస్సీ దానికి రియాక్షన్‌గా చప్పట్లు కొట్టాడు. అయితే అక్కడికి సిరి వస్తే మాత్రం కుర్చీపై నుంచి కాలు చటుక్కున తీసేయడం గమనార్హం. నామినేషన్ ప్రక్రియలో యానీ మాస్టర్ అంటే రెస్పెక్ట్ అని, అందుకే నామినేట్ చేయడం లేదన్న జెస్సీ ఇప్పుడు మాత్రం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. జెస్సీ అమాయకుడనుకుంటే ఇంత వైల్డ్‌గా ఉన్నాడేంటి? జెస్సీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రోమో అర్జున్‌రెడ్డి రేంజ్లో ఉన్నా ఎపిసోడ్ గీతా గోవిందంలా సాగుతుందంటూ సెటైర్ వేస్తున్నారు. -
బిగ్‌బాస్ 5: అబ్బాయిని కొట్టానన్న యానీ మాస్టర్
Anee Master In Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోకి రావట్లేదంటూనే షోలో అడుగు పెట్టి అభిమానులకు స్వీట్ షాకిచ్చింది యానీ మాస్టర్. చూడటానికి డిఫరెంట్‌గా కనిపించే యానీ మాస్టర్ ఇక్కడే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో పుట్టింది. 10వ తరగతిలో ఒక అబ్బాయిని కొట్టేశానన్న యానీ హౌస్‌లో తన జోలికి వచ్చినవారిని కొట్టిపడేస్తుందా? లేదా సహనంతో భరిస్తుందా? అనేది చూడాలి! మాస్ అయినా క్లాస్ అయినా డ్యాన్స్‌తో ఇరగదీసే ఆమె బిగ్‌బాస్ షోలో తన ఎనర్జీతో అందరికీ చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తన బాబును ఘోరంగా మిస్ అవుతానంటున్న యానీ మాస్టర్ ఈసారి కప్పు కొడతానని చెప్తోంది. మరి ఆమె కల నెరవేరుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.