
బిగ్‌బాస్ ఇంట్లో తొమ్మిదోవారంలో 10 మంది నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. ఇంటి సభ్యులంతా నామినేషన్‌లోకి వచ్చేశారు. అయితే ఆ 10 మంది నుంచి కొంతమందిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఏ సభ్యుడైతే తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని గార్డెన్ ఏరియాలోని సేఫ్ జోన్ డోర్‌లోకి ముందుగా వెళతారో వారు సేఫ్ అవుతారు... చివరగా వెళ్లేవారితో పాటు.. వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్‌లోకి వెళ్తారు.
దీంతో పాటు ఇంటి సభ్యులకు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్ పవర్ ద్వారా ఒక కంటెస్టెంట్‌ను సేఫ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ స్పెషల్ పవర్ ద్వారా సేఫ్ అయ్యేది ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment