డబ్బుల కోసం రాలేదు, నన్ను బయటకు పంపండి: రవి ఆవేదన | Bigg Boss 5 Telugu: Anchor Ravi Ready To Step Out From Bigg Boss House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు, బయటకు పంపండి.. రవి ఆవేదన

Published Wed, Oct 27 2021 11:32 PM | Last Updated on Thu, Oct 28 2021 9:10 AM

Bigg Boss 5 Telugu: Anchor Ravi Ready To Step Out From Bigg Boss House - Sakshi

Bigg Boss Telugu, Episode 53: కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు డ్రాప్‌ అవుతారన్న దానిపై హౌస్‌మేట్స్‌ చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ సన్నీ మాట్లాడుతూ.. టాస్క్‌లో డ్రాప్‌ అవుతానన్న జెస్సీ.. మళ్లీ వచ్చి ఆడతానన్నాడంటూ ఇంటిసభ్యుల దగ్గర ప్రస్తావించాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్‌లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ సిద్ధమయ్యారు. కానీ జెస్సీ మాత్రం తను అన్‌ఫిట్‌ అని, తనే డ్రాప్‌ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్‌ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు. ఆమె గేమ్‌ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్‌ అయితే మరిన్నివారాలు ఆమె హౌస్‌లో ఉన్నవాళ్లకు వంట చేస్తుందని చెప్పుకొచ్చాడు.

రంగు పడుద్ది..
'అభయహస్తం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో 'రంగు పడుద్ది' అనే నాలుగో ఛాలెంజ్‌ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ ఛాలెంజ్‌లో కాన్వాస్‌పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్క్‌లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందింది. మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్‌ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో చికాకుపడ్డ షణ్ను.. 'హమీదా కూడా ఇంతే.. వర్క్‌ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను' అని అసహనం ప్రదర్శించాడు. దీంతో హర్ట్‌ అయిన సిరి 'నీతో సాంగ్‌ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?' అని చిర్రుబుర్రులాడింది. ఆమె అలకబూనిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్న సిరి.. 'ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది' అని ఫైర్‌ అయింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి మామూలైపోయారు.

నేను డబ్బుల కోసం రాలేదు: రవి
బిగ్‌బాస్‌ ఇచ్చిన 5వ చాలెంజ్‌ 'కారులో హుషారుగా' టాస్క్‌లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో కాజల్‌పై సన్నీ విజయం సాధించాడు. అయితే కాజల్‌ గేమ్‌ లైట్‌ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి. ఈ క్రమంలో హౌస్‌లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను వారిముందుంచాడు. 'నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు' అని వాపోయాడు. మరోపక్క మానస్‌.. రవి గేమర్‌ అని అభిప్రాయపడ్డాడు. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్‌ చేయాలి? అని ప్లాన్‌ చేస్తుంటాడని కాజల్‌తో చెప్పుకొచ్చాడు.

మానస్‌ అడుగుపెట్టాక వార్‌ వన్‌సైడ్‌
'బంతిలో ఉంది భాగ్యం' అనే స్పెషల్‌ టాస్క్‌తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు మరో ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌లో బజర్‌ మోగినప్పుడు సర్కిల్‌లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేయవచ్చు. ఈ గేమ్‌లో వరుసగా బంతి సాధించిన మానస్‌.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్‌, పింకీలను ఎలిమినేట్‌ చేసి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, యానీ, సన్నీ, మానస్‌ పోటీపడుతున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement