Bigg Boss Telugu 5: Anee Master In Upasana Sister Sangeeth Event - Sakshi
Sakshi News home page

Ram Charan: రామ్‌చరణ్‌ మరదలి పెళ్లిలో యానీ మాస్టర్‌ సందడి

Published Sun, Dec 5 2021 9:07 PM | Last Updated on Tue, Dec 7 2021 12:45 AM

Bigg Boss Telugu 5: Anee Master In Upasana Sister Sangeeth Event - Sakshi

Bigg Boss Telugu 5, Anee Master: మెగా కోడలు ఉపాసన కామినేని ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఉపాసన సోదరి అనుష్‌ పాల పెళ్లివేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో హీరో రామ్‌చరణ్‌ కూడా తళుక్కున మెరుస్తున్నాడు. మరదలి వివాహ వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే చెర్రీ.. మరదలి సంగీత్‌ సెలబ్రేషన్స్‌ బాధ్యతను బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ యానీ మాస్టర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఈవెంట్‌ను తనకు అప్పగించడంతో యానీ మాస్టర్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. ఈ పెళ్లి కోసం మొన్నటినుంచే తన టీమ్‌తో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న యానీ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే!

తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పిన రామ్‌చరణ్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పింది యానీ. 15 ఏళ్లుగా మీరు నాపై నమ్మకం ఉంచుతూ వస్తున్నారంటూ చెర్రీతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఈ సంగీత్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం దోమకొండ కోటలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్‌ షో బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన ఆమెకు నిర్వాహకులు మంచి పారితోషికమే ముట్టజెప్పారు. అటు హౌస్‌ నుంచి బయటకు రాగానే రామ్‌చరణ్‌ పిలిచి మరీ ఈవెంట్‌ అప్పజెప్పడంతో యానీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement