
Bigg Boss 5 9th Week Elimination: బిగ్‌బాస్ ఐదో సీజన్ ఎనిమిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 8 మంది హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా ఇంటి సభ్యులంతా ఉన్నారు. ఇంట్లో ఉన్న 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేషన్‌లోకి వచ్చారు. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు.
తాజాగా ఇంటి సభ్యులకుబిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చేలా చేశాడు. దీని కోసం ‘జీవితమే ఒక ఆట’అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో యానీ మాస్టర్ విజయం సాధించింది ఇమ్యూనిటీ పొందింది. అలాగే ఆమెకు గతంలో లభించిన స్పెషల్ పవర్ ద్వారా మానస్‌ని కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించింది. దీంతో ఈ వారం నామినేషన్‌లో సన్నీ, శ్రీరామచంద్ర, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, విశ్వ ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని తెలపండి.
Comments
Please login to add a commentAdd a comment