
Bigg Boss Telugu 5, Vishwa Eliminated: సండేను ఫండేగా మార్చడానికి రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. హౌస్‌మేట్స్‌తో 'బొమ్మ ఇక్కడ, పాట ఎక్కడ?' అనే గేమ్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. A టీమ్‌లో సన్నీ, విశ్వ, షణ్ముఖ్, కాజల్, ప్రియాంక ఉండగా మిగిలినవారంతా B టీమ్‌లో ఉంటారు. ఇక ఈ గేమ్‌లో విజువల్స్ చూసి సాంగ్ గెస్ చేయాలి. ఈ గేమ్‌లో రవి టీమ్(B టీమ్) గెలిచింది. తర్వాత శ్రీరామ్ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్.
అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో 'నేను ఎవరిని?' గేమ్ ఆడించారు. ఇందులోని చీటీలలో కంటెస్టెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. టీమ్ నుంచి ఒక్కొక్కరు వస్తూ తము తీసుకున్న చీటీలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని ఇమిటేట్ చేయాలి. సదరు టీమ్ వాళ్లు గెస్ చేయాలి. ఇందులో ఒకరినొకరు బాగా ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. ఫైనల్‌గా ఈ గేమ్‌లో సన్నీ( A) టీమ్ గెలిచింది. తర్వాత జెస్సీ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్.
వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని నాగ్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో సన్నీ, మానస్.. షణ్ముఖ్‌ను, షణ్ముఖ్.. ప్రియాంక సిరిపై దాడి చేసిందంటూ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియాంక.. విశ్వను; విశ్వ.. జెస్సీని; జెస్సీ, సిరి, శ్రీరామ్.. కాజల్; కాజల్.. సిరి; రవి.. మానస్‌ను; యానీ.. సన్నీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు పడ్డ కాజల్ వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైంది. తర్వాత ప్రియాంక సింగ్ సేఫ్, కాజల్ సేఫ్ అవగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు షాకయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ యానీ కంటతడి పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment