విన్నర్‌, టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పేసిన విశ్వ | Bigg Boss 5 Telugu: Eliminated Contestant Vishwa Give Ranks To Housemates | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: విన్నర్‌, టాప్‌ 5 కంటెస్టెంట్ల లిస్టును బయటపెట్టిన విశ్వ

Published Sun, Nov 7 2021 11:01 PM | Last Updated on Tue, Nov 9 2021 5:47 PM

Bigg Boss 5 Telugu: Eliminated Contestant Vishwa Give Ranks To Housemates - Sakshi

Bigg Boss 5 Telugu, 9th Week Vishwa Eliminated: విశ్వ ఎలిమినేషన్‌తో ఇంటిసభ్యులు డల్‌ అయిపోయారు. బెస్ట్‌ సంచాలకుడు, బెస్ట్‌ రేషన్‌ మేనేజర్‌, బెస్ట్‌ కెప్టెన్‌, బిగ్‌బాస్‌ హౌస్‌కు సూపర్‌ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్‌ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు.

ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్‌ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్‌ ఇచ్చాడు. కాజల్‌ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు. నువ్వు స్ట్రాంగ్‌, కానీ గేమ్‌లో గివప్‌ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. యానీ ఫైటర్‌ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్‌కు సూచిస్తూ 6వ ర్యాంక్‌ ఇచ్చాడు.

తర్వాత టాప్‌ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్‌ 5లో ఉండాలన్నాడు. సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్‌ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్‌ అయ్యే షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement