
Bigg Boss 5 Telugu, Anchor Ravi Supports To Sreerama Chandra: బిగ్‌బాస్ జర్నీ.. 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు. అదెలాగంటారా? మరేం లేదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్ రవి సింగర్ శ్రీరామ్ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురూ డిజర్వింగ్ అంటూనే ఆ టైటిల్ మాత్రం శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు.
అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. 'అన్నపూర్ణ స్టూడియో హౌస్, బిగ్‌బాస్ హౌస్.. బిగ్‌బాస్ హౌస్..' అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. 'బిగ్‌బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి' అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్ కూడా ఉంది. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి అభిమానులు యాంకర్ రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా' అన్న మాటను రవి నిజం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: షణ్ముఖ్‌లో ఆ విషయం నచ్చేది కాదు, అతడే పక్కా గెలుస్తాడు.. కాజల్)
Comments
Please login to add a commentAdd a comment