Bigg Boss 5 Telugu: Friendship With Sreeram Reason For Ravi Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: శ్రీరామ్‌కు దగ్గరైతే ఎలిమినేట్‌ అవాల్సిందేనా?!

Published Sun, Nov 28 2021 5:51 PM | Last Updated on Sun, Nov 28 2021 9:38 PM

Bigg Boss 5 Telugu: Is Sreeram Friendship Reason For Ravi Elimination - Sakshi

Bigg Boss Telugu 5: తన గాత్రంతో ఇండియన్‌ ఐడల్‌ షోనే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులనూ గెలిచాడు సింగర్‌ శ్రీరామచంద్ర. అయితే ఆయనకు టాలీవుడ్‌లో కన్నా బాలీవుడ్‌లో ఎక్కువ పాపులారిటీ ఉంది. తను పుట్టిపెరిగింది తెలుగు నేలపైనే కాబట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని బిగ్‌బాస్‌ షోను ఎంచుకున్నాడు. ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అయితే ఎలిమినేషన్‌ వస్తుందంటే చాలు తను నామినేషన్స్‌లో ఉన్నా లేకపోయినా శ్రీరామ్‌ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

శ్రీరామ్‌ సరదా మనిషి. కానీ అందరితో అంత ఈజీగా కలిసిపోలేడు. మనసు విప్పి మాట్లాడటానికి అతడికి కొంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి క్లోజ్‌ అయితే మాత్రం వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు. విచిత్రంగా శ్రీరామ్‌కు దగ్గరవుతున్న వాళ్లందరూ ఎలిమినేట్‌ అవుతున్నారు. దీంతో తనకంటూ ఒకరున్నారనుకులోపే వాళ్లు హౌస్‌ను వీడటంతో ఒంటరివాడవుతున్నాడు.

మొదట్లో హమీదాతో శ్రీరామ్‌ ఎక్కువ టైం స్పెండ్‌ చేసేవాడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా చిటికెలో ఆమె ముందుండేవాడు. కన్నీళ్లు పెట్టుకుంటే చేరదీసి ఓదార్చేవాడు. ఆమెను ఫ్రెండ్‌ కన్నా ఎక్కువ అనుకున్న అతడికి బిగ్‌బాగ్‌ షాకిస్తూ హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్‌ చేశారు. అప్పటి నుంచి శ్రీరామ్‌ బాగా డల్‌ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత యానీ మాస్టర్‌కు సపోర్ట్‌ చేస్తూ ఆమెతో అప్పుడప్పుడే క్లోజ్‌ అవుతుండగా తనను కూడా ఎలిమినేట్‌ చేశారు. నాకు దగ్గరవుతున్నారనుకునేలోపు దూరమవుతున్నారంటూ ఎంతగానో బాధపడిపోయాడు శ్రీరామ్‌.

ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్లలో శ్రీరామ్‌కు నచ్చిన వ్యక్తి, మనసుకు దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యాంకర్‌ రవియే! మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్‌ చేయకపోయినా శ్రీరామ్‌ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్‌కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్‌ అయిపోతే హౌస్‌లో శ్రీరామ్‌ నిజంగానే ఒంటరివాడవడం ఖాయం. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సన్నీ, మానస్‌, కాజల్‌, ప్రియాంక ఒక గ్రూపు కాగా షణ్ముఖ్‌, సిరి మరో గ్రూపు. మరి శ్రీరామ్‌ ఈ రెండింటిలో ఏదో ఒక గ్రూపులో చేరతాడా? లేదా ఒంటరిగా గేమ్‌ ఆడతాడా? అన్నది చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement