బిగ్‌బాస్‌: దమ్ముంటే రా అంటూ రెచ్చగొడుతున్న లేడీ కంటెస్టెంట్లు | Bigg Boss 5 Telugu Promo: Captaincy Task Just Went Up to Next Level | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: యాంకర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన సింగర్‌!

Published Wed, Sep 15 2021 4:25 PM | Last Updated on Wed, Sep 15 2021 6:33 PM

Bigg Boss 5 Telugu Promo: Captaincy Task Just Went Up to Next Level - Sakshi

అసలే నామినేషన్స్‌తో రగిలిపోతున్నారు ఇంటిసభ్యులు. దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాల్సిన బిగ్‌బాస్‌ కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌తో ఇంట్లో మరింత అగ్గి రాజేశాడు. ఈ టాస్క్‌లో నువ్వా?నేనా? అన్న రీతిలో కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. అబ్బాయిలు శారీరక దాడి చేయకుండా ఆడుతున్నారు కానీ అమ్మాయిలు మాత్రం తోసేసుకుంటూ, కొట్టుకుంటూ, దెబ్బలు తగిలించుకుంటూ ఆటలో విశ్వరూపం చూపిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ టాస్క్‌ వల్ల శ్రీరామచంద్ర, యాంకర్‌ రవి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించాడు రవి. కానీ అప్పటికే బాగా హర్ట్‌ అయిన శ్రీరామచంద్ర అతడి మాటలు వినడానికి కూడా ఇష్టం చూపలేదు. సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటే ఆడు, కానీ తనతో మైండ్‌ గేమ్స్‌ ఆడొద్దని వార్నింగ్‌ ఇచ్చాడు. అటు మానస్‌తో కూడా కయ్యానికి కాలు దువ్వినట్లు తెలుస్తోంది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పు, నువ్వింకా చిన్నపిల్లాడిలాగే ప్రవర్తిస్తున్నావు అని సెటైర్‌ వేశాడు.

సాగరా సోదరా టాస్కులో దమ్ముంటే రా అని సిరి రెచ్చగొట్టడంతో శ్వేత ఆమె మీదకు దూసుకెళ్లింది. కానీ అక్కడున్న ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఆపేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే కూల్‌గా కనిపించే శ్వేత ఇలా మారడంతో ఆశ్చర్యపోయిన నటి ప్రియ సాయంత్రం అయితే ఆమెకు దెయ్యం పూనుతుంది అని కౌంటర్‌ వేసింది. ఇక సన్నీని కూడా మగాడివైతే రా అంటూ సవాలు విసిరింది. మొత్తాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఎపిసోడ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement