
బిగ్‌బాస్ హౌస్‌లో సన్నీని ఆపడం ఎవరివల్లా కావట్లేదు. అతడి ఆవేశాన్ని చల్లార్చడం ఒక్క నాగార్జున వల్లే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇంటిసభ్యులను రెండుగా విభజించిన బిగ్‌బాస్ వారికి పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. దీనికి షణ్ముఖ్ సంచాకుడిగా వ్యవహరించాడు. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ 50 పూరీలు ముందుగా రెడీ చేసినప్పటికీ షణ్ను.. యానీ మాస్టర్ టీమ్ చేసిన పూరీలే పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటూ వారిని గెలిపించాడు.
అయితే జైల్లో ఈ టాస్క్‌ను మొదటి నుంచీ గమనిస్తోన్న సన్నీ.. పాపం వాళ్లు కష్టపడి చేశారని పేర్కొన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తది, వేరేవాళ్ల కష్టం కనిపించదా? మాట్లాడేందుకైనా బుద్ధి ఉండాలి అని మండిపడింది. సన్నీ మీదకు ఫైర్ అవడంతో శ్రీరామ్, షణ్ముఖ్ నవ్వాపుకోలేకపోయారు. హౌస్‌లో కొంతమంది బాధపడుతుంటే నవ్వుతున్నావు, అది కరెక్ట్ కాదు, బయటకొస్తా ఆగు అని సూచించాడు. దీంతో షణ్ను నాకిప్పటి నుంచే భయమేస్తుంది అని నవ్వాడు. భయపడ్డావు, కాబట్టే నన్ను లోపలేశావు అని కౌంటరిచ్చాడు సన్నీ. దీంతో అతడిని మరింత రెచ్చగొడుతూ షణ్ను.. అయితే కొట్టు మరి వెయిట్ చేస్తున్నా అని సవాల్ చేశాడు. మరి సన్నీ జైలు నుంచి బయటకొచ్చాక ఏం జరిగింది? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment