
Bigg Boss 5 Telugu Promo, Shannu New Captain Of BB House: బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్సీ కోసం ఫైట్ నడుస్తోంది. 'అభయహస్తం' టాస్క్‌లో పెట్టిన పలు ఛాలెంజ్‌లను సమర్థవంతంగా పూర్తి చేసిన షణ్ను, మానస్, సన్నీ, సిరి, యానీ, శ్రీరామ్ 'వెంటాడు- వేటాడు' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పోరాడనున్నారు. ఈ గేమ్‌లో పోటీదారులు ఇతరుల థర్మాకోల్ బస్తాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆటలో భాగంగా శ్రీరామ్ సన్నీని నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు. నన్నే నెట్టేస్తాడా? అని ఆవేశపడ్డ సన్నీ.. శ్రీరామ్ బస్తాను ఖాళీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
కానీ ఈ గేమ్‌లో మొదటగా సన్నీ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఒక పక్క కోపం, మరోపక్క ఓటమి బాధతో రగిలిపోయిన ఈ కెప్టెన్ 'అటాక్ చేయండి' అని ఆదేశాలిచ్చాడు. దీంతో శ్రీరామ్ అతడిని మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. 'సన్నీ ఇండింపెండెంట్ ప్లేయర్ అనుకున్నా, ఆడి ఓడిపోయినవ్.. గొంతు అదుపులో పెట్టుకో' అని వార్నింగ్ ఇస్తూనే గాల్లో ముద్దులు పంపాడు. ఈ గేమ్‌కు జెస్సీ సంచాలకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ గేమ్‌లో షణ్ముఖ్ విజయం సాధించి బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు షణ్ను కెప్టెన్ అయ్యాడోచ్ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. షణ్ను.. రేషన్ మేనేజర్ పోస్టును యానీకి ఇచ్చినట్లు సమాచారం! మరి కెప్టెన్‌గా షణ్ను బిగ్‌బాస్ హౌస్‌ను ఎలా చక్కబెడతాడు? తన కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment