
మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో స్థానంలో...
Bigg Boss 5 Telugu Promo: అసలు ఆట ఇప్పుడే మొదలవుతుందంటూ బిగ్‌బాస్ ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఆరు వరకు ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉండాలో నిర్ణయించుకుని వాటి వెనకాల నిల్చుండాలని ఆదేశించాడు. దీంతో షణ్ముఖ్, సన్నీ, కాజల్, సిరి ఫస్ట్ ర్యాంకు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడ్డారు. మరీ ముఖ్యంగా కాజల్ మాత్రం మొదటి స్థానంలో నిల్చుండాలని తహతహలాడింది. అయితే సన్నీ అందుకు ఒప్పుకోలేదు. అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదంటూ డైలాగులు వల్లించాడు.
అయితే మొత్తానికి సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిల్చున్నట్లు సమాచారం. రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాలుగో ప్లేస్‌లో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో ర్యాంక్ వద్ద సిరి నిలబడ్డారట! అంటే హౌస్‌మేట్స్ అభిప్రాయం మేరకు సిరి వచ్చే వారం వెళ్లిపోతే మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెడతారన్నమాట! ఇంటిసభ్యులు సన్నీని విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నర్‌గా తేల్చారు. కానీ వీళ్లమధ్య గట్టి పోటీ నడుస్తుండటంతో ఈ ఇద్దరిలో ఎవరు విజేత అని ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది.