ఎమోషనల్‌ కనెక్షన్‌, లైట్‌ తీస్కోమన్న శ్రీరామ్‌.. ఏడ్చేసిన కాజల్‌ | Bigg Boss 5 Telugu: Maanas Won Vote Appeal Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: మానస్‌కు బంపరాఫర్‌, కాజల్‌కు ఝలక్‌ ఇచ్చిన శ్రీరామ్‌

Published Thu, Dec 9 2021 11:57 PM | Last Updated on Fri, Dec 10 2021 11:32 AM

Bigg Boss 5 Telugu: Maanas Won Vote Appeal Task - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 96: కంటెస్టెంట్లు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగేందుకు బిగ్‌బాస్‌ అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్‌ ఇస్తారు. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో కొన్ని ముఖ్యమైన సంఘటనలను రీక్రియేట్‌ చేసే టాస్కులో షణ్ను గెలిచి ఓట్లు వేయమని అభ్యర్థించే అవకాశాన్ని గెలుపొందాడు. అలాగే నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్‌, మానస్‌ ఇద్దరూ గెలిచినట్లు నేటి(డిసెంబర్‌ 9) ఎపిసోడ్‌లో వెల్లడైంది. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్‌ మానస్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. అలా మానస్‌ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్‌ కాజల్‌, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు.

హౌస్‌లో శ్రీరామ్‌, కాజల్‌కు మరోసారి గొడవ జరిగింది. తిట్టుకుంటున్న క్రమంలోనే కాజల్‌ అతడిని బ్రో అనేసింది. అది నచ్చని శ్రీరామ్‌.. నువ్వు నాకు సిస్టర్‌ కాదు, బ్రో అని పిలవకు అని ముఖం మీదే చెప్పాడు. దీంతో హర్టైన కాజల్‌ బోరుమని ఏడ్చేసింది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను, అతడు అలా పిలవద్దనేసరికి తట్టుకోలేకపోయానంటూ తన బాధను సన్నీ, మానస్‌లకు చెప్పింది. అటు నుంచి కనెక్షన్‌ లేనప్పుడు నిన్ను లైట్‌ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవద్దంటూ హితవు పలికాడు సన్నీ.

ఇక వోట్‌ అప్పీల్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్‌ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్‌.. చిరంజీవి, కాజల్‌.. శ్రీదేవి, మానస్‌.. పవన్‌ కల్యాణ్‌, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్‌, మాస్‌ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు. ఈ టాస్క్‌ వల్ల హౌస్‌మేట్స్‌ అంతా కలిసిపోయారు.

ఇంతలో షణ్ను సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్‌ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్‌షిప్‌ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది. అలా వీళ్ల గొడవ చప్పున చల్లారిపోయింది. కానీ రేపటి ఎపిసోడ్‌లో కూడా వీళ్లు మళ్లీ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement