Bigg Boss Telugu 5: Nagarjuna Announce Sunny Is 2nd Finalist - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో హిట్‌ స్టార్‌, ఫ్లాప్‌ స్టార్‌ ఎవరో తెలుసా?

Published Sun, Dec 12 2021 12:32 AM | Last Updated on Sun, Dec 12 2021 3:44 PM

Bigg Boss Telugu 5: Nagarjuna Announce Sunny Is 2nd Finalist - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 98: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు ఓ ప్రమోషన్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టీవీఎస్‌ అపాచీ గేమ్‌లో కాజల్‌ సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే గేమ్‌లో సన్నీకి గైడెన్స్‌ ఇవ్వడాన్ని తప్పుపట్టింది సిరి. పైగా సన్నీ చిన్నచిన్న పొరపాట్లు చేసినప్పటికీ కాజల్‌ అతడినే విజేతగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. సంచాలకురాలిగా కాజల్‌ ఫెయిలయిందని చెప్పిందే చెప్తూ ఆమెను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రెండ్‌ అని సన్నీని విన్నర్‌గా ప్రకటించిందని మండిపడింది. ఈ క్రమంలో వీళ్లిద్దరూ చాలాసేపు గొడపడ్డారు.

ఇక స్టేజీపైకి వచ్చిన నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఓ ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు. ఈ పద్నాలుగో వారాల్లో సంతోషపెట్టిన క్షణాలతో పాటు, బాధపడ్డ రోజులు, రిగ్రెట్‌గా ఫీలైన సంఘటనలు ప్రతి ఒక్కరికీ ఉండే ఉంటాయని, ఈ జర్నీలో ఏ వారంలో మీకు రిగ్రెట్‌ ఉందో చెప్పాలన్నాడు నాగ్‌. మొదటగా కాజల్‌ మాట్లాడుతూ.. '9 వారంలో జైలు నామినేషన్‌ జరిగింది. అప్పుడు సన్నీ, మానస్‌ను సేవ్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లను చేయలేదు. శ్రీరామచంద్రతో మాట్లాడాక షణ్నును సేవ్‌ చేయాలనుకున్నా. అంటే ఎవరో గుర్తు చేస్తే నన్ను సేవ్‌ చేశావని అతడూ హ్యాపీగా లేడు' అని చెప్పుకొచ్చింది.

షణ్ను మాట్లాడుతూ.. 'ఎమోషనల్‌ కనెక్ట్‌ పెద్ద రిగ్రెట్‌. 11వ వారంలో నా వల్ల సిరి తలబాదుకోవడం నచ్చలేదు. 14వ వారం టాప్‌ 5 గురించి మరీ ఎక్కువగా ఆలోచించాను. హౌస్‌మేట్స్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా గేమ్‌ గురించేనేమో అని అనుమానపడి సిరిని కొన్ని విషయాల్లో ఆపాను. అయితే ఆమెకు సాయం చేద్దామనేదే నా ఉద్దేశ్యం. కానీ ఆమె గేమే బాగుందేమో, అనవసరంగా సాయం చేస్తున్నానేమో అని కొంత రిగ్రెట్‌గా ఫీలయ్యా. ఒకవేళ ఆమె టాప్‌ 5లో లేకపోతే అది నా తప్పు అవుతుందేమో అనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు.

సన్నీ వంతురాగా.. '12వ వారంలో నేను అగ్రెసివ్‌ అయి గేమ్‌ ఆడాను. దీనివల్ల సిరి ఐస్‌బకెట్‌లో నుంచి కాళ్లు తీయకుండా ఆడింది. దీంతో వారమంతా సఫర్‌ అయింది. అది నా వల్లే అనిపించింది. మరొకటి గిల్టీబోర్డు వేసుకున్నది కూడా మర్చిపోలేను' అని తెలిపాడు. మానస్‌.. '4వ వారంలో కెప్టెన్సీ కోసం బరువు తగ్గాం, చాలా కష్టపడ్డాం. అప్పుడు సన్నీ,నేను ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి పోటీపడాలా అని ఆలోచించుకున్నాక సన్నీకి అవకాశమిచ్చాను. అయితే హౌస్‌లో ఎక్కువ కత్తిపోట్లు సన్నీకే పడ్డాయి. ఏ కారణం లేకుండానే అందరూ కత్తితో పొడిచేస్తున్నారు. ఆరోజు నేనే పోటీకి వెళ్లుంటే వాడు అలాంటి స్థితి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండేది అనిపించింది' అన్నాడు.

శ్రీరామ్‌.. '4వ వారంలో ఎవరి వంట వాళ్లు వండుకోవాలి అన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నేను చాలా డల్‌ అయ్యాను. ఎక్కువ తప్పు జరిగిపోయిందా? నావల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయా? అని తెగ ఆలోచించి డిస్టర్బ్‌ అయ్యాను' అని పేర్కొన్నాడు. సిరి.. 11వ వారంలో షణ్నుతో గొడవపడి తల బాదుకోవడం తప్పనిపించిందని చెప్పుకొచ్చింది. అనంతరం నాగ్‌ మరో గేమ్‌ ఆడించాడు. ఈ పద్నాలుగువారాలను పరిగణనలోకి తీసుకుని ఎవరు హిట్‌ స్టార్‌? ఎవరు ఫ్లాప్‌ స్టార్‌? చెప్పాలన్నాడు.

ముందుగా కాజల్‌.. సన్నీకి హిట్‌ స్టార్‌, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌నిచ్చింది. శ్రీరామ్‌.. సన్నికీ హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ బిరుదునిచ్చాడు. సన్నీ.. మానస్‌కు హిట్‌, షణ్నుకి ఫ్లాప్‌ స్టార్‌ అన్న ట్యాగ్‌నిచ్చాడు. కానీ పద్నాలుగు వారాలను పరిగణనలోకి తీసుకోవాలని నాగ్‌ గుర్తు చేయగానే ఆ ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌ను షణ్నుకి కాకుండా సిరికిచ్చాడు. తర్వాత సిరి.. షణ్నును హిట్‌, సన్నీని ఫ్లాప్‌ స్టార్‌గా పేర్కొంది. మానస్‌.. సన్నీకి హిట్‌, షణ్నుకు ఫ్లాప్‌ స్టార్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. షణ్ముఖ్‌.. సిరికి హిట్‌, కాజల్‌కు ఫ్లాప్‌ స్టార్‌ బిరుదునిచ్చాడు.

అనంతరం సన్నీని సెకండ్‌ ఫైనలిస్టుగా ప్రకటించారు. తర్వాత హౌస్‌మేట్స్‌ను మరోసారి 1 నుంచి 6 ర్యాంకుల వరకు నిల్చోమన్నాడు నాగ్‌. కాజల్‌, సిరి తప్ప మిగతా మేల్‌ కంటెస్టెంట్స్‌ అంతా మొదటి స్థానం తమదే అన్నారు. దీంతో నాగ్‌.. అమ్మాయిలిద్దరు మాత్రమే రెండో స్థానానితో సరిపెట్టుకుంటున్నారని పెదవి విరిచారు. షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్న సిరి తన మాటను వెనక్కు తీసుకుంటూ వెళ్లి ఫస్ట్‌ ర్యాంక్‌పై నిలబడింది. శ్రీరామ్‌, కాజల్‌, షణ్ముఖ్‌, సన్నీ, మానస్‌ వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల వరకు నిలబడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement