Bigg Boss 5 Telugu, 89 Episode Highlights: Sunny, Sreeram, Maanas, Siri Fight For Ticket To Finale - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: 'బాగా చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందిలే.. సిరి

Published Thu, Dec 2 2021 11:35 PM | Last Updated on Thu, Dec 9 2021 6:48 PM

Bigg Boss 5 Telugu: Sunny, Sreeram, Maanas, Siri Fight For Ticket To Finale - Sakshi

Bigg Boss Telugu 5, Episode 89: టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్‌ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ప్రియాంక, కాజల్‌, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్‌ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్‌మేట్స్‌ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది.

దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్‌షిప్‌హగ్‌ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్‌షిప్‌ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు.

అనంతరం షణ్ను, కాజల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్‌ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్‌ అయింది కాజల్‌. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్‌సెన్స్‌ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు.

తర్వాతరం హౌస్‌మేట్స్‌ స్కిల్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్‌ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్‌ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్‌ టాస్క్‌ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్‌, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్‌, శ్రీరామ్‌, సిరి, ప్రియాంక, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు.

మొత్తంగా టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్‌, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్‌లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్‌ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్‌లో మానస్‌, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement