
Bigg Boss 5 Telugu, 6th Week Nominations: మండే.. అనగానే బిగ్‌బాస్ ప్రేక్షకులకు చటుక్కున గుర్తొచ్చేది నామినేషన్స్. అప్పటిదాకా చిరునవ్వుతో విప్పారిన ముఖాలు కాస్తా ఈ నామినేషన్స్ రాగానే కోపంతో ఎర్రబడిపోతాయి. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు ఒకరి మీద ఒకరు తెగ అరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో నేడు ఆరోవారం నామినేషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు.
ఈ క్రమంలో మానస్ తనకు టాస్కులో సపోర్ట్ చేసిన జెస్సీని నామినేట్ చేశాడు. నీకు సపోర్ట్ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్. రేషన్ మేనేజర్ అంటే అందరికీ సమానంగా ఫుడ్ పంచాలే తప్ప ఫస్ట్ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని ఆన్సరిచ్చాడు.
ఇక సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కెప్టెన్ ప్రియ, షణ్ముఖ్, యానీ మాస్టర్, కాజల్ మినహా మిగిలిన 10 మంది నామినేట్ అయ్యారట! అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు భోగట్టా! ఒకవేళ ఇదే నిజమైతే లోబో, శ్వేత, సిరి, విశ్వ డేంజర్ జోన్‌లో ఉన్నట్లేనని గుసగుసలు పెడుతున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment