
బతిమాలితే పనులు జరగవని అర్థం అయిన హోటల్ సిబ్బంది షణ్ముఖ్, శ్రీరామ్, రవి, యానీ ఓ నిర్ణయానికి వచ్చారు. అతిథులకు తిండి పెట్టకూడదని నిర్ణయించుకున్నారు..
Bigg Boss 5 Telugu Promo: బీబీ హోటల్ స్టాఫ్‌ను అతిథులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకల సేవలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ ప్రవర్తనతో స్టాఫ్ సిబ్బంది విసిగి వేసారినట్లు కనిపిస్తోంది. ఎంత పని చేసినా ఒక్కరూ పైసా ఇవ్వడం లేదని యానీ మాస్టర్ ఏడ్చేసింది. అయినప్పటికీ అతిథులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
బతిమాలితే పనులు జరగవని అర్థం అయిన హోటల్ సిబ్బంది షణ్ముఖ్, శ్రీరామ్, రవి, యానీ ఓ నిర్ణయానికి వచ్చారు. అతిథులకు తిండి పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. 10 వేల రూపాయలు ఇస్తేనే ఫుడ్ పెడతామని వెల్లడించారు. ఇదెక్కడి కండీషన్ అని సిరి, మానస్, సన్నీ, ప్రియాంక, కాజల్ నోరెళ్లబెట్టారు. మరి వీరికి ఫుడ్ దొరుకుతుందా? లేదా? లేదంటే హోటల్‌లో ఫుడ్ దొంగిలించారా? అసలేం జరిగిందనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!