
Bigg Boss 5 Telugu, 8th week Nominations: నామినేషన్స్ అంటే చాలు ఉగ్రావతారమెత్తే కంటెస్టెంట్లు ఈసారి మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆగ్రహావేశాలకు పోకుండా చిరునవ్వుతో, పుట్టెడు దుఃఖంతో ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కారణం.. బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్‌గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని ఊరిస్తూనే అందరూ వాటిని అందుకునేందుకు వీల్లేదని తెగేసి చెప్పాడు. ఎవరికి లెటర్స్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు? అనేది మీలో మీరే నిర్ణయించుకోండంటూ హౌస్‌మేట్స్ ఇష్టానికి వదిలేశాడు. కానీ ఎవరికైతే లెటర్ దక్కదో వారు నామినేట్ అవుతారని ప్రకటించాడు.
ప్రియాంకకు తల్లిదండ్రుల నుంచి లెటర్ రాగా దాన్ని చించేయొద్దని కోరింది. ఇక రవి, లోబోలలో ఒకరికే లెటర్ అందుకునే అవకాశం వచ్చింది. దీంతో లోబో... రవితో నీ పాపను గుర్తుగా ఒక బొమ్మ, లేఖ ఉంది, కానీ నాకు అది కూడా లేదంటూ తాను లెటర్ తీసుకుంటానన్నాడు. ఇక విశ్వ-సిరికి కూడా ఇదే సంకటం ఎదురైంది. అయితే గుండె రాయి చేసుకున్న సిరి.. విశ్వ కోసం తన లెటర్‌ను త్యాగం చేసింది. దీంతో విశ్వ కృతజ్ఞతతో ఆమెకు చేతులెత్తి దండం పెట్టాడు.
లెటర్ దక్కించుకునే ఆరాటంలో కంటెస్టెంట్లు అందరూ ఎమోషనల్ అయ్యారు. కళ్లముందే లెటర్స్ చినిగిపోతుంటే తట్టుకోలేకపోయారు. యానీ మాస్టర్ అయితే తన ఫ్యామిలీని తలుచుకుని ఏడ్చేసింది. నాకు నువ్వు లేకుంటే జీవితంలో ఏదీ లేదని బాధపడింది. ఇక షణ్ముఖ్ తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించాడు. 'అమ్మా... క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకుని ధైర్యాన్ని కూడదీసుకున్నావు, నువ్వే నా ఇన్‌స్పిరేషన్. నేనూ ఈ బాధను జయిస్తాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment