
Bigg Boss 5 Telugu, Anee Master On Trolling: నచ్చినవారిని ఆకాశానికెత్తేయడం, నచ్చనివారిని పాతాళానికి తొక్కేయాలనుకోవడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. కొందరు సెలబ్రిటీలు నెగెటివిటీని పట్టించుకోకపోవడమే నయం అని ఊరుకుంటున్నప్పటికీ మరికొందరు సెలబ్రిటీలు మాత్రం ట్రోలర్స్‌ను వదిలిపెట్టేది లేదంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు. బుల్లితెర బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన చాలామంది కంటెస్టెంట్లు నెట్టింట తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొందరు నెటిజన్లు వారిని పరుష పదజాలంతో విమర్శించడమే కాక వారి కుటుంబంపై కూడా మాటలతో దాడి చేస్తున్నారు.
దీన్ని సహించడం తన వల్ల కాదనుకున్న యాంకర్ రవి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నవారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పాడు. రవి తీసుకున్న నిర్ణయాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్టర్ అభినందించింది. అంతేకాదు నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్‌గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసింది చాలు అంటూ ఫైర్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment